ప్రతి అడుగులోనూ అభివృద్ధి: సీఎం జగన్‌ | CM Jagan Speech Highlights In Retaining Wall Inauguration Programme At Vijayawada, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులోనూ అభివృద్ధి: సీఎం జగన్‌

Published Tue, Mar 12 2024 12:36 PM | Last Updated on Tue, Mar 12 2024 7:30 PM

Cm Jagan Speech In Retaining Wall Inauguration Programme Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నానని, ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు.

సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
ఈ రోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ, మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ రోజు విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం.
ఇందులో 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మంది.. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్.. అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి ఇవన్నీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతోంది.
అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్ జరుగుతోంది. 
దీనికి సంబంధించి అవినాశ్ చెబుతున్నాడు.. భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లో రెగ్యులరైజ్ కాక ఇళ్లు అక్కడే కట్టుకుని, దశాబ్దాలుగా ఉంటున్నపటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బందులు పడే పరిస్థితులను చెప్పాడు. 
అవన్నీ ఈరోజు పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
మొత్తంగా దాదాపు 31866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ ఒకవైపు జరిగిస్తుండగా రూ.239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. 

దీనివల్ల మురికినీళ్లు మన ఇంటి పక్కన రాకుండా వాటిని నీట్‌గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రట్మెంట్ ప్లాన్స్ ను 5 ప్రాంతాల్లో తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్స్ రూ.239 కోట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఈ కరకట్ట వాల్‌ను మీరు చూస్తున్నారు. ఇటువైపున, అటువైపున ఈరెండు కరకట్ట గోడలు దాదాపు రూ.500 కోట్లతో గోడలుకట్టడమే కాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతున్న పరిస్థితులు..
ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పడమే కానీ, కచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నా. 
కరకట్ట గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, తాతలు అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 

ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ల ఎదుటే ఫౌండేషన్ స్టోన్ వేయడం, ప్రారంభించడం కూడా చూశారు
ఇంతకు ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా  పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో కనిపిస్తాయి
కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలుపుకొంటే ఇంకో ఫ్లై ఓవర్
ఇవన్నీ కూడా మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తాయి
ఔటర్ రింగు రోడ్లు, కాజ నుంచి చిన్న ఔట్లపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా అయిపోవచ్చింది. రెండు నెలల్లో ఓపెన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి 
ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నా
ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నాం 
అటువైపున మన వ్యతిరేకులంతా ఏమీ చేయరుగానీ అభివృద్ధి అభివృద్ధి అంటారు 
ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్లు, మీ హాస్పటళ్లు బాగుపడ్డాయి
గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి

వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంటింటికీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం, ఏ ఒక్క రూపాయీ లంచం లేకుండా జరిగిస్తున్న పాలన కేవలం ఈ 58 నెలల పాలనలోనే అని గమనించమని కోరుతున్నా
వీటన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ కాస్త నేను రెండు మూడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను
ఆ తర్వాత మీ ప్రాంతాలకు వచ్చి ఎవరెవరు పట్టాలివ్వాలో శ్రీను ఒక ఏరియాలోకి, అవినాశ్ ఒక ఏరియాలోకి, ఆసిఫ్ భాయ్ తన ఏరియాలోకి వచ్చి సచివాలయ పరిధిలో పంపిణీ చేసే కార్యక్రమం వాళ్లు దగ్గరుండి చేస్తారు
దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా
పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడదాం.. థ్యాంక్యూ

ఇదీ చదవండి: రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని అడుగే ఇది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement