విజయవాడలో కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన మాజీ సీఎం వైఎస్ జగన్
12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పు లేకుండా చర్యలు
గతంలో బ్యారేజీ నుంచి 3 లక్షల క్యూసెక్కులు వదిలితేనే ముంపు
ఇప్పుడు 10.26 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా నిశి్చంతగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు. మోయగలిగినన్ని సామాన్లు సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.
గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు. గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భూపే‹Ùగుప్తానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటమునిగేవి.
వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిరి్మంచారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కలి్పంచడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment