బెజవాడ నడిబొడ్డున అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల చీకటి దాడి
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి తరలివచ్చిన ఎల్లోగ్యాంగ్
పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి..లైట్లు ఆర్పేసి బరితెగింపు
ప్రజలు, మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు రావడంతో పరార్
అధికారుల సమక్షంలోనే ఉన్మాదం
సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి
సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ధ్వంసం
మీడియా సమాచారమిచ్చినా స్పందించని సీపీ
ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ప్రజాస్వామ్యవాదుల మండిపాటు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది.
స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు.
వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. గత సీఎం వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రూ.404.35 కోట్లతో అంబేడ్కర్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చేతుల మీదుగా ఈ ఏడాది జనవరి 19న జాతికి అంకితం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు ‘పచ్చ’మూకలు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగానే పై నుంచి వచ్చిన ఆదేశాలతో గురువారం రాత్రి 9 గంటల తర్వాత పచ్చబ్యాచ్ రంగప్రవేశం చేసింది.
అక్కడున్న వారందరినీ బలవంతంగా బయటకు పంపేశారు. అందులో పనిచేసే కొందరి సిబ్బంది ఫోన్లను లాకున్నారు. మరికొందరిని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోమని బెదిరించారు. ఈ తతంగానికి పోలీసులే కాపాలా కాశారు. విగ్రహం నలుమూలలా పహారా కాసి, చుట్టూ గేట్లు వేసి అనుకున్న పని మొదలుపెట్టారు. ఇంతలో ఈ సమాచారం బయటకు పొక్కింది. ప్రజలు, మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు రావడంతో వారంతా పరారయ్యారు. అధికారుల పర్యవేక్షణలోనే ఈ దారుణానికి తెగబడడం గమనార్హం.
పట్టించుకోని సీపీ..
ఈ విషయాన్ని సీపీకి తెలిపేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఘటనా స్థలికి ఆయన హుటాహుటిన చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేయడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మంచివి కాదన్నారు.
అలాగే, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో మండిపడుతున్నారు. మరోవైపు.. పచ్చమూకల దాడిలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు గుర్తుగా అక్కడ ఏర్పాటుచేసిన బోర్డులో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఉన్న స్టీల్ మెటల్ అక్షరాలు ధ్వంసమయ్యాయి. వీటిని సుత్తులతో కొట్టి మరీ ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది.
స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి ... తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి.
ఆ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్న దళితజనబాంధవుడు జగన్‌మోహన్‌రెడ్డి పేరును మహాశిల్పం శిలాఫలకంనుంచి తొలగించడం ప్రజాస్వామ్య వాదులందరినీ తీవ్రంగా కలచివేసింది. సామాజిక, ఆరి్థక, రాజకీయ స్థాయుల్లో దారుణంగా విస్తరించిన అంటరానితనంపై ముఖ్యమంత్రిగా యుద్ధభేరి మోగించిన జగన్మోహన్ రెడ్డి పేరును మహనీయుడి పాదాల చెంత ఏర్పాటైన శిలాఫలకంనుంచి తుడిచివేయడం ద్వారా పచ్చమూకలు తాత్కాలిక పైశాచికానందాన్ని పొంది ఉండవచ్చు గాక... కానీ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అని పరితపించిన జగనన్నను అణగారిన వర్గాల హృదయ ఫలకాలనుంచి తొలగించడం ఈ ఉగ్రవాద తండాలకు సాధ్యమయ్యే పనేనా?
Comments
Please login to add a commentAdd a comment