BR ambedkar statue
-
అంబేడ్కర్ విగ్రహంపై దాడా?
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని జాతీయ ఎస్సీ కమిషన్ ౖచైర్మన్ కిషోర్ మక్వానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అసలా ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చి0ది?’ అని పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్సార్సీపీ బృందంతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగుల్ని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘అంబేడ్కర్ విగ్రహం జాతీయ సంపద. దానిపై ఎవరూ దాడి చేయకూడదు. అమానుషంగా ప్రవర్తించకూడదు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. త్వరలోనే ఏపీకి కమిషన్ నుంచి బృందాన్ని పంపి పూర్వాపరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ బృందానికి హామీ ఇచ్చారు. విజయవాడ నడి»ొడ్డున వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహంపై ఆగస్టు 8న దాడి జరిగిన విషయం విదితమే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, మేరుగ నాగార్జున, నందిగం సురేశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌లతో కూడిన బృందం బుధవారం ఎస్సీ కమిషన్ చైర్మన్‌తో భేటీ అయింది. ‘అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి. త్వరగా దుండగుల్ని పట్టుకొని భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలి’ అనే మూడు డిమాండ్లతో వినతిపత్రం అందజేసింది. -
చంద్రబాబు అలక్ష్యం, జగన్ స్ఫూర్తికి నిదర్శనం..
సాక్షి, అమరావతి: అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తానని గతంలో డాంబికాలు పోయిన చంద్రబాబు.. ఎక్కడో మారుమూల శాఖమూరులో స్థలం కేటాయించినట్లు ప్రకటించి ఐదేళ్లు వదిలేయడంతో స్మృతివనం స్ఫూర్తి తుమ్మ చెట్ల తుప్పల్లో చిక్కుకుపోయింది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతంగా ఆలోచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహనీయుని విగ్రహం మారుమూల ప్రాంతంలో కాకుండా విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మించి నిలువెత్తు స్ఫూర్తిని నింపారు. ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’ ప్రాంగణాన్ని అడుగడుగునా అద్భుతాలతో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారు. 18.81 ఎకరాల ప్రాంగణంలో 206 అడుగుల ఎత్తయిన సామాజిక న్యాయ మహాశిల్పంతో పాటు ఇక్కడ ప్రతి నిర్మాణం ఓ అద్భుతమే. రూ.404.35 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహా స్థూపం (కోర్ వాల్)ను తుపాను గాలులు, భూకంపాల తీవ్రతను తట్టుకునేలా డిజైన్ చేశారు. 81 అడుగుల పీఠం (పెడస్టల్)పై 125 అడుగుల ఎత్తు, 510 మెట్రిక్ టన్నుల బరువైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ గార్డెన్స్, నీటి కొలను మధ్యలో కాలచక్ర మహా మండపం డిజైన్‌తో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహ పీఠం ఓ అద్భుతం. పీఠం లోపల మూడు అంతస్తుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే పెద్దదైన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని విహార థియేటర్లో అంబేడ్కర్ జీవిత చరిత్ర, విజ్ఞానం, భౌగోళిక, సంస్కృతి, చరిత్ర వంటి అనేక అంశాలపై సినిమాలు ప్రదర్శిస్తారు. అంబేడ్కర్ మైనపు బొమ్మతో కూడిన స్టడీ రూమ్, విద్యార్థుల కోసం ఇంటరాక్షన్ క్లాస్ రూమ్, అంబేడ్కర్ జీవిత చరిత్రతో కూడిన లైబ్రరీ కూడా ఉన్నాయి. రెండో అంతస్తును ధ్యాన మందిరం (మెడిటేషన్), సందర్శకులు అంబేడ్కర్ జీవిత చరిత్రపై అధ్యయనం చేసేలా తీర్చిదిద్దారు. అంబేడ్కర్ జీవిత చరిత్రతో కూడిన 36 కుడ్య చిత్రాలతో రూపొందించిన కొలనేడ్ మరో పెద్ద ఆకర్షణ. -
అంబేడ్కర్ విగ్రహంపై దాడి.. సర్కారు పనే
సాక్షి ప్రతినిధి విజయవాడ/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని అంబేడ్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘం నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా పెట్టిన విగ్రహం అని చెప్పారు. నగరం నడి»ొడ్డులో అంబేడ్కర్ విగ్రహం ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందన్నారు. రేపోమాపో కూల్చి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణ జరిపించడమే కాక.. బాధ్యులను అరెస్టు చేయాలన్నారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని, అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిõÙకం చేయాలని వారంతా పిలుపునిచ్చారు. ఏపీ చరిత్రలో చీకటి రోజు రాష్ట్ర చరిత్రలో గురువారం ఒక చీకటి రోజు అని, స్వయంగా ప్రభుత్వమే దాడి చేయించడం దారుణం అని మాజీమంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. దేశానికే ఐకానిక్‌గా ఉన్న ఈ విగ్రహ విధ్వంసానికి సర్కారు తెగించడం చూసి.. విగ్రహ కమిటీ చైర్మన్‌గా పని చేసిన తన హృదయం చలించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్ కులానికి, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. చరిత్ర క్షమించదు. అధికార పార్టీ పెద్దల సూచనలు, ఆదేశాలతోనే ఈ దాడి జరిగింది. ఇది దేశం తల దించుకోవాల్సిన ఘటన’ అని ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినా‹Ù, పార్టీ నేత పోతిన మహేష్, దళిత నేత పరిశపోగు శ్రీనివాసరావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీగా సీపీ కార్యాలయానికి వెళ్లి డీసీపీ హరికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తొలగించిన మాజీ సీఎం పేరును తిరిగి ఏర్పాటు చేయాలని, విగ్రహానికి పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. సీఎం ప్రమేయంతోనే విగ్రహంపై దాడి మాజీ మంత్రి మేరుగు నాగార్జున సాక్షి, అమరావతి: భారతరాజ్యంగా నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అంటేనే సీఎం చంద్రబాబుకు గిట్టదనే విషయం పలుమార్లు స్పష్టమైందని, విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి విగ్రహంపై దాడి ఆయన ప్రమేయంతోనే జరిగిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో అంబేడ్కర్ విగ్రహం పెట్టండని అడిగినందుకు కేసులు పెట్టించారని తెలిపారు. ఇవాళ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలాన్ని.. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన వారికి అప్పనంగా అమ్మేయాలని కుట్రలు చేస్తే ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. టీడీపీ నైజం మరోసారి బయటపడింది: మాజీ ఎంపీ సురేష్ అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటన ద్వారా చంద్రబాబు, టీడీపీ నేతల నైజం మరోసారి బయట పడిందని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆక్షేపించారు. హామీలు అమలు చేయకుండా, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు, టీడీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారని.. ఇందులో భాగంగానే అంబేడ్కర్ విగ్రహంపై దాడి అని చెప్పారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో చంద్రబాబు కక్ష పెంచుకుని, ఇలా అక్కసు వెళ్లకక్కుతున్నారని మండిపడ్డారు. -
పెల్లుబికిన ఆగ్రహం
సాక్షి, అమరావతి: విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాంపై టీడీపీ పచ్చమూకలు దాడిచేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది.» చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో.. ఎస్వీయూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు తిరుపతిలో.. వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాకాడులో.. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామినేటి కేశవులు, పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరూరులో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహంపై దాడిపట్ల డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించాలని ఏపీ అంబేడ్కర్ యువజన సంఘం జిలాల్లా కార్యదర్శి వై. శివ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతకే దిక్కులేదంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పుత్తూరులో అన్నారు.» కడపలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్‌కుమార్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. బద్వేలు నెల్లూరు రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు.» అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వే కోడూరులో దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తంచేసి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి సిగ్గుచేటని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు యమలాసుదర్శనం మదనపల్లెలో ఖండించారు.» కర్నూలులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూధన్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఏఎండీ ఇంతియాజ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, సీనియర్ నాయకులు గడ్డం రామక్రిష్ణ తదితరులు నిరసనలో పాల్గొన్నారు» ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండలో.. వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌లు నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. » అంబేడ్కర్ సృతివనంపై దాడి చేయడమంటే దేశ ప్రజలను అవమానించటమేనని పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిశోర్, పార్టీ ఎస్సీ నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనను ఖండించాలని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరులో అంబేడ్కర్ విగ్రహాం ఎదుట మాజీమంత్రి అంబటి రాంబాబు, పార్టీ ఇతర నేతలు నిరసన వ్యక్తంచేసి అంబేడ్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధిచేశారు. తెనాలి, తాడికొండ, తుళ్లూరు, పొన్నూరులోనూ అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. » ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు క్షీరాభిషేకం చేశారు. కమ్యూనిస్టు ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు, జై భీమ్రావ్ భారత పార్టీ జనరల్ సెక్రెటరీ పరసా సురేష్ దాడిని ఖండించారు. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అవనిగడ్డ, నిడమానూరులోనూ పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తంచేశారు. » పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్‌కుమార్, తణుకు బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులు.. పాలకొల్లులో ప్రజాస్వామ్యవాదులు నిరసన తెలిపారు.దుండగులను వెంటనే శిక్షించాలి విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక చారిత్రక ఘట్టానికి ఆద్యుడిగా నిలిచారు. వైఎస్ జగన్ పేరును టీడీపీ దుండగులు ధ్వంసం చేయడం సరికాదు. ఆపేరు తిరిగి ఏర్పాటు చేయాలి. దుండగులు ఎవరైనా సరే పట్టుకొని వెంటనే శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – జూపూడి ప్రభాకరరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మా ఆత్మగౌరవం దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం మేము దేవుడిగా చూసుకునే అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పశి్చమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నారు. అక్కడ విగ్రహం పెట్టాలని తలపెట్టిన వ్యక్తిని కూడా చంపించారు. అండగా నిలిచిన కుల సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మా ఆత్మగౌరవం నిలబెట్టారు. అది చూసి చంద్రబాబు ఓర్వలేక ఇప్పుడు దాడి చేయించారు. –నత్తా యోనారాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడుగవర్నర్ స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలి రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ దాడిపై మౌనం వహించడం సరికాదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై, విగ్రహాలు, శిలాఫలకాలపై దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు. ఈ దాడులపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ దాడులపై జాతీయ స్థాయిలో సంఘాలకు, పార్టీల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. – పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ -
రాజ్యాంగ నిర్మాతపై 'రాజ్యోన్మాదం'
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. గత సీఎం వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రూ.404.35 కోట్లతో అంబేడ్కర్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చేతుల మీదుగా ఈ ఏడాది జనవరి 19న జాతికి అంకితం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు ‘పచ్చ’మూకలు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగానే పై నుంచి వచ్చిన ఆదేశాలతో గురువారం రాత్రి 9 గంటల తర్వాత పచ్చబ్యాచ్ రంగప్రవేశం చేసింది. అక్కడున్న వారందరినీ బలవంతంగా బయటకు పంపేశారు. అందులో పనిచేసే కొందరి సిబ్బంది ఫోన్లను లాకున్నారు. మరికొందరిని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోమని బెదిరించారు. ఈ తతంగానికి పోలీసులే కాపాలా కాశారు. విగ్రహం నలుమూలలా పహారా కాసి, చుట్టూ గేట్లు వేసి అనుకున్న పని మొదలుపెట్టారు. ఇంతలో ఈ సమాచారం బయటకు పొక్కింది. ప్రజలు, మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు రావడంతో వారంతా పరారయ్యారు. అధికారుల పర్యవేక్షణలోనే ఈ దారుణానికి తెగబడడం గమనార్హం. పట్టించుకోని సీపీ.. ఈ విషయాన్ని సీపీకి తెలిపేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఘటనా స్థలికి ఆయన హుటాహుటిన చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేయడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మంచివి కాదన్నారు. అలాగే, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో మండిపడుతున్నారు. మరోవైపు.. పచ్చమూకల దాడిలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు గుర్తుగా అక్కడ ఏర్పాటుచేసిన బోర్డులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరుతో ఉన్న స్టీల్ మెటల్ అక్షరాలు ధ్వంసమయ్యాయి. వీటిని సుత్తులతో కొట్టి మరీ ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి ... తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. ఆ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్న దళితజనబాంధవుడు జగన్మోహన్రెడ్డి పేరును మహాశిల్పం శిలాఫలకంనుంచి తొలగించడం ప్రజాస్వామ్య వాదులందరినీ తీవ్రంగా కలచివేసింది. సామాజిక, ఆరి్థక, రాజకీయ స్థాయుల్లో దారుణంగా విస్తరించిన అంటరానితనంపై ముఖ్యమంత్రిగా యుద్ధభేరి మోగించిన జగన్మోహన్ రెడ్డి పేరును మహనీయుడి పాదాల చెంత ఏర్పాటైన శిలాఫలకంనుంచి తుడిచివేయడం ద్వారా పచ్చమూకలు తాత్కాలిక పైశాచికానందాన్ని పొంది ఉండవచ్చు గాక... కానీ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అని పరితపించిన జగనన్నను అణగారిన వర్గాల హృదయ ఫలకాలనుంచి తొలగించడం ఈ ఉగ్రవాద తండాలకు సాధ్యమయ్యే పనేనా? -
మండపేటలో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ ల విగ్రహావిష్కరణలు
-
Dr BR Ambedkar Statue: ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. కోలాహలంగా విజయవాడ (ఫొటోలు)
-
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
పొన్నూరు:గుంటూరు జిల్లా పొన్నూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ వ్యక్తి అవమానకర చేష్టలకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పట్ల దళిత సంఘాలు, జై భీమ్ సభ్యులు ఆందోళనకు దిగారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రాంతీయ గ్రంథాలయ ఉద్యోగి, టీడీపీ సానుభూతిపరుడు ముప్పవరపు శ్రీనివాసరావు అవమానకరంగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పి.. పక్కన ఉన్న మెట్లపైకి ఎక్కి విగ్రహంపై మూత్ర విసర్జన చేశాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, జై భీమ్ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌ను అవమానించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంఘాల నేతలతో చర్చలు జరిపినా ఫలితం లేదు. కాగా, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. వారణాసిలో ఉన్న ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అంబేడ్కర్ లాంటి విశిష్ట వ్యక్తులను అగౌరవపరిచే చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది టీడీపీ శ్రేణులేనని దళిత మహాసభ వ్యవస్థాపకుడు డాక్టర్ కత్తి పద్మారావు ఆరోపించారు. జనవరిలో విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న తరుణంలో అగ్రకులాలకు చెందిన వారు ఆయనను అగౌరవపరుస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. -
అంబేద్కర్ స్మృతివనం: ‘ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’
సాక్షి, విజయవాడ: విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్మృతివనం నిర్మాణ పనులను మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు, స్మృతివనం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మంత్రి నాగార్జునకు, సజ్జలకు పనుల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం, మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. గత ప్రభుత్వం దళితులను ఎంతో మోసం చేసింది. అంబేద్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. భారతదేశం గర్వించదగ్గ అంబేద్కర్ స్మారకార్ధం స్మృతివనం పనులు 20 ఎకరాలలో శరవేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించాం. భారతదేశం గర్వించదగిన నేత అంబేద్కర్. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా పటిష్టమైనది. అన్ని వర్గాలకి అంబేద్కర్ ఆదర్శం. అంబేద్కర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిపాదించడమే కాదు.. పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌ది. అంబేద్కర్ జ్ఞాపకాలను ఎన్నేళ్లయినా గర్వంగా చెప్పుకుంటాం. రాజకీయపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారు. టీడీపీ హయాంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మూలపడిన ప్రాంతంలో స్థలం పేరుకే కేటాయించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎటువంటి పనులు చేయలేదని అన్నారు. ఇది కూడా చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
125 అడుగుల అంబెడ్కర్ విగ్రహంపై ప్రజా స్పందన
-
విజయవాడలో ముమ్మరంగా అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు
-
హుస్సేన్ సాగర తీరాన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
-
దేశంలో మార్పు కోసం యుద్ధం చేయాలి.. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో, వ్యవస్థలో, దేశంలో మార్పు కోసం భారతీయులు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకా శ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్ర హాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ‘‘చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఏకమై సమాజంలో మా ర్పుకోసం పోరాటం చేయాలని అంబేడ్కర్ ఉద్భో దించారు. దేశంలో ఆర్థిక అంతరాలు, ఆర్థిక దోపిడీ ల గురించి అప్పట్లోనే ‘ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ అనే పుస్తకం రాశారు. దళితబంధు పథకం ద్వారా రూ పాయి రూపాన్ని మార్చేందుకు కేసీఆర్ ప్రయతి్నస్తున్నారు. దేశ ఆర్థిక దుర్భలతపై ఎలా పోరాడాలో చెప్పడంతోపాటు దళిత బంధు ద్వారా పేదరిక ని ర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అని ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం దేశంలో కేవలం మతపరమైన మైనారిటీలే కాకుండా కమ్యూనిటీ మైనారిటీలు కూడా ఉన్నారని అంబేడ్కర్ అప్పట్లోనే స్పష్టం చేశారని ప్రకాశ్ గుర్తు చేశారు. ధర్మం, జాతి పేరిట రాజకీయాలు జరిగే దేశంలో సహజ నాయకులు ఉండరని కూడా చెప్పారని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి తర్వాత అసలైన జాతీయ నాయకుడెవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం వస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందని, దేశానికి మోడల్‌గా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని అంబేడ్కర్ చెప్పారని.. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉందని ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఈ డిమాండ్ నెరవేరాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం ఆతిథ్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచి్చన బాబాసాహెబ్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న ప్రకాశ్ అంబేడ్కర్‌ని కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. శాలువాతో సత్కరించి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్నా ధోంగే, సిద్దోజీరావు తదితరులున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రకాశ్ అంబేడ్కర్ సాక్షి, హైదరాబాద్: తమ తాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుషుల్లో సమానత్వం–ప్రకృతి సమతుల్యత కోసం పరితపించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఆయన జయంతి రోజున ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని బేగంపేటలో మొక్కలు నాటారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఒక మొక్క ను నాటాకే తన వద్దకు రావాలని కోరుకున్నారని ఆయన మనుమడు ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ తాత అంబేడ్కర్‌కు మొక్కలు నాటడం పట్ల అమితమైన ఆసక్తి ఉండేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చూస్తున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు. ‘గ్రీన్ చాలెంజ్’లిమ్కాబుక్‌లో చేరడం తనకు ఆనందాన్ని కలిగించిందని, సంతోష్ కృషికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దళితబంధు’ దేశానికే మార్గదర్శి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం దేశానికే మార్గదర్శి అని, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయాలని అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో దళితబంధు పథకం యూనిట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, విప్ బాల్క సుమన్ ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన హుజూరాబాద్ చేరుకున్న అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. దళితబంధు యూనిట్లను పరిశీలించిన అనంతరం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుంది. ఇది దేశంలోనే సరికొత్త పథకం. ప్రజలకు విద్యతోపాటు ఆర్థిక సాయం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం అభినందనీయం. మొన్నటిదాకా కూలీలుగా బతికిన వారంతా ఈ పథకం వల్ల ఇప్పుడు ఓనర్లుగా మారారు. లబి్ధదారులతో మాట్లాడాను. ఇంత తక్కువ సమయంలో ఈ పథకం లబ్ధిదారులకు అందేలా శ్రమించిన సీఎం కేసీఆర్, జిల్లా అధికారులకు ధన్యవాదాలు. 70 ఏళ్లుగా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును నేను స్వయంగా చూశాను. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలి. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమైన ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. దేశంలో 30 శాతం వరకు ఉన్న అట్టడుగు వర్గాల వారికి సైతం ఈ పథకం వర్తింపజేయాలి. ఈ విషయాన్ని నేను సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తాను’అని అన్నారు. -
రాబోయే రాజ్యం మనదే.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్
నా మాటలు కొందరు శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే. చిన్న మిరుగు (నిప్పురవ్వ) చాలు అంటుకునేందుకు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి నేను కలలో కూడా ఊహించని ఆదరణ లభిస్తోంది. రాబోయే రోజుల్లో యూపీ, బిహార్, పశి్చమ బెంగాల్ సహా ప్రతిచోటా ఇదే ఆదరణ వస్తుంది. కేంద్రంలో కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే.. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఊహించని ఆదరణ వస్తోందని.. రాబోయే రోజుల్లో దేశంలో రాబోయేది తమ రాజ్యమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో తెలంగాణతోపాటు భారత్‌ను సరైన మార్గంలో పెట్టాలని.. దాని కోసం చివరి రక్తపు బొట్టు వరకు రాజీపడకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఏదో ఒరవడిలో, గాలికి కొట్టుకుపోకుండా.. నిజంగా పేదల కోసం పనిచేస్తున్న వారికి అండగా నిలవాలని, మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు యశ్వంత్ ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదు. విశ్వమానవుడి విశ్వరూపాన్ని మూర్తి రూపంలో ప్రతిష్టించుకున్నాం. రాష్ట్ర సెక్రటేరియట్‌కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. సెక్రటేరియట్ ముందు అమరుల స్మారకం, అంబేడ్కర్ నమ్మిన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. సందేశాత్మక అద్భుత చిహా్నలన్నీ ఒకేచోట ఉన్నాయి. ఇది విగ్రహం కాదు.. విప్లవం.. అంబేడ్కర్ సిద్ధాంతంతో మనసు ప్రభావితం కావాలి. ఆయన మార్గాన్ని అనుసరించడంతో పాటు ఆయన సిద్ధాంతాలు, ఆచరణ అందరి కళ్లలో మెదలాలి. తమ జీవితాలను అర్పించి తెలంగాణ సాధించిన అమరులు కూడా ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే ఈ కాంప్లెక్స్‌కు రూపకల్పన చేశాం. ఆర్థికమంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు ఇది విగ్రహం కాదు.. విప్లవం. కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే చైతన్య దీపిక. ఇది దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుంది: కొప్పుల ఈశ్వర్ రాష్ట్రంలో భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేడ్కర్ స్ఫూర్తిని అందించే లక్ష్యంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. ఈ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ విగ్రహం పాలకులు, అధికారుల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని చెప్పారు. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళితబంధు ద్వారా కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. ఆశయ సాధనకు కార్యాచరణ దేశంలో 75 ఏళ్లుగా పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు ఇంకా నిరుపేదలుగానే ఉండటం సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలంటే పార్టీ లుకాకుండా ప్రజలు గెలిచే రాజకీయం రావాలని పదే పదే చెప్తున్నాం. ఈ దిశగా దళిత మేధావులు ఆలోచన చేయాలి. ఎక్కడా పెట్టని విధంగా ఈ నెల 30న బీఆర్ అంబేడ్కర్ పేరిట నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నాం. వీటన్నింటినీ మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తులో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిది, అంబేడ్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ఆచరణాత్మక కృషి ప్రారంభించాలి. అనేక పారీ్టలు గొడవలు, గందరగోళం సృష్టిస్తున్నాయి. అందువల్ల వాస్తవ దృక్పథంతో దళి తులు ముందుకు సాగేలా కార్యాచరణ కావాలి. ఎవరి వైఖరి ఏమిటి? ఎవరి మార్గం ఏమిటో చూడాలి. బీఆర్ఎస్ ఎలా పనిచేస్తుందనేది చూస్తే చాలు. జాతీయ రాజకీయాల్లో మీ ఆశీస్సులు కోరుతున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ పేరిట ఏటా అవార్డులు అంబేడ్కర్ పేరిట ప్రత్యేక అవార్డు ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు పత్రికాముఖంగా సూచన చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఏటా జాతీయ, రాష్ట్రస్థాయిలలో ఉత్తమ సేవలు అందించే వారికి అవార్డులు అందజేస్తాం. దీనికోసం రూ.51 కోట్ల శాశ్వత నిధిని డిపాజిట్ చేయాలని తక్షణమే ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ నిధి ద్వారా ఏటా వచ్చే రూ.3 కోట్ల వడ్డీతో అంబేడ్కర్ పేరు ప్రతిష్టలు శాశ్వతంగా ఉండేలా అవార్డులు ఇస్తాం. ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే.. తెలంగాణ తరహాలో దేశంలో ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింప చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 50వేల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపచేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1.25 లక్షల మందికి దళితబంధు అందుతుంది. బీఆర్ఎస్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ దళిత సంక్షేమానికి రూ.16వేల కోట్లు ఖర్చు చేయగా.. మా ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ రిపోర్టులే వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్‌తో పూలవాన అట్టహాసంగా భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం బౌద్ధ భిక్షువుల ప్రత్యేక ప్రార్థనలు.. విగ్రహం దిగువన పీఠంలో ఫొటో ఎగ్జిబిషన్ హుస్సేన్‌సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 3.15కు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ 3.30 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు అంబేడ్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ కూడా అక్కడికి వచ్చారు. తొలుత బౌద్ధ భిక్షువులు సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేస్తూ వారికి ఆహా్వనం పలికారు. తర్వాత వారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక మీదుగా అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం పీఠం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌తో అంబేడ్కర్ భారీ విగ్రహంపై గులాబీ రేకులు వెదజల్లారు. తర్వాత అంతా విగ్రహం వేదికపైకి చేరుకుని.. బౌద్ధ భిక్షువులు చేసిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్, వీడియోల ప్రదర్శనలు విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం దిగువన పీఠంగా ఏర్పాటు చేసిన భవనంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఆత్మబంధువు అంబేడ్కరుడు’వీడియోను వీక్షించారు. తర్వాత అంతా సభా వేదికకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ‘డిక్కీ’కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాలను కేటాయిస్తూ.. సంబంధిత పత్రాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కలసి డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌కు అందజేశారు. తర్వాత కేసీఆర్ ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలసి ‘దళితబంధు విజయగాథ’సీడీని ఆవిష్కరించారు. కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్, కొప్పుల ఈశ్వర్ ప్రసంగించగా.. ఎమ్మెల్యే రసమయి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రభు త్వ చీఫ్ విప్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా పేరు దక్కించుకుంది. ఈ విగ్రహాన్ని రాష్ట్ర సెక్రటేరియట్ పక్కన, బుద్ధ విగ్రహానికి సమీపంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న (శుక్రవారం) సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం విశేషాలపై ఓ లుక్కేద్దాం! ►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్ విగ్రహాం నిర్మాణాన్ని చేపట్టింది. భారీ ఎత్తున రూపొందిన ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్‌లో అమర్చారు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది. ►విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహం తయారీ కోసం 425 మంది శ్రామికులు పని చేశారు. ఇందులో 2 లిఫ్ల్లను ఏర్పాటు చేశారు. ( ఒక్కోదానిలో 15 మంది సామర్థ్యం) ►విగ్రహం ఏర్పాటు కోసం 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు కోసం 1.35 ఎకరాలు, చుట్టు పచ్చదనం కోసం 2.93 ఎకరాలు, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం కోసం 1.23 ఎకరాలు, కామన్ పార్కింగ్ కొరకు 4.82 ఎకరాలను కేటాయించారు. ►ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు. ►11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ►అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు రెండేళ్లు పట్టింది. ►ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విగ్రహ శిల్పి 98 ఏళ్ల రామ్ వంజీ సుతార్‌ను ఆహ్వానించారు. ►అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35 వేల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ►750 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రజల రావాణా కోసం ఉపయోగించనున్నారు. ►ఈ కార్యక్రమం కోసం హాజరయ్యే ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, 1.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Hyderabad: భారత్‌లోనే అంబేడ్కర్ భారీ విగ్రహాం.. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి (ఫొటోలు)
-
అంబేడ్కర్‌కు తెలంగాణ ఘన నివాళి ఇది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహాన్ని ప్రతిష్టిస్తుండటం రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలోని ఆర్టికల్–3ను పొందుపరిచిన తెలంగాణ బాంధవుడికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి అని ప్రకటించారు. రాష్ట్ర నూతన సచివాలయానికి ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’అని పేరుపెట్టి సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు. శుక్రవారం అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చిన అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయన్నారు. సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధు, గురుకులాలు, ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక నిధి, అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, టీఎస్ ప్రైడ్, మూడెకరాల భూపంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలు, కార్యక్రమాలతో దళితులు ఎంతో ఎదుగుతున్నారని, చేయూతనిస్తే సమాజంలో ఎవరికీ తీసిపోమనే విషయాన్ని రుజువు చేస్తున్నారని పేర్కొన్నారు. -
దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం
‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు..జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. – అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది – సీఎం కేసీఆర్ ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. అవును.. అలా చెప్పడమేకాదు.. జనం కోసమే జీవించి జనంలో నిలిచిపోయిన మహా మనిషి బాబాసాహెబ్ అంబేడ్కర్. ‘నేను, నా దేశం అని చెప్పాల్సి వస్తే.. నా దేశమే నాకు అత్యంత ముఖ్యమైన’దని చాటిన ఆయనను దేశమంతా స్మరించుకునే రోజు ఏప్రిల్ 14. ఆ మహనీయుడి జయంతి. ఈ రోజునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లో కెల్లా ఇదే అతిపెద్దది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ విగ్రహంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు. తర్వాత బౌద్ధ గురువుల ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. దాదాపు 50వేల మంది దీనికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహావిష్కరణ, సభ, ఇతర కార్యక్రమాల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభకు హాజరైనవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీటు ప్యాకె ట్లను పంపిణీ చేయనున్నారు. విగ్రహావిష్కరణ, సభ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌వాదులు, అభిమానులు పాల్గొననున్నారు. రూ.146.50 కోట్ల ఖర్చుతో.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహ నిర్మాణం, డిజైన్, పనులు తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాల్లోని భారీ విగ్రహాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్ ఉంటాయి. విగ్రహంలో గ్రంథాలయం, హాల్స్ విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేడ్కర్ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంటాయి. భవనంలోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేడ్కర్ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు. 36 ఎకరాల్లో స్మృతివనం: అంబేడ్కర్ స్మృతివనం కోసం విగ్రహం పక్కనే 36 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్స్, శాండ్‌స్టోన్ వర్క్ ఉంటాయి. దాదాపు 450 కార్లు పాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. జీవం పోసిన వంజి సుతార్ హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజి సుతార్. మహారాష్ట్రకు చెందిన ఆయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్ రూపొందించినవే. పార్లమెంట్ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్)’కు రూపమిచ్చి నదీ ఆయనే కావడం విశేషం. భారత ప్రభుత్వం సుతార్‌ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది కూడా. -
చరిత్రాత్మక వేడుకగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చరిత్రాత్మక వేడుకగా, కన్నుల పండువగా దేశం గర్వించే రీతిలో జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తెలంగాణ సమాజంతోపాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా శోభాయమానంగా, గొప్పగా మహా విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేడ్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహించతలపెట్టిన విగ్రహావిష్కరణ, అనంతరం నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. బౌద్ధ సంప్రదాయ పద్ధతిలో... ‘ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి. గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి. బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి వారి సంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యద్భుతంగా విగ్రహం ఆవిష్కృతమైంది.. ‘ఊహించినదానికంటే అత్యద్భుతంగా విగ్రహ రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు వొక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు’అని సీఎం కేసీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విగ్రహ రూపశిల్పి, 98 ఏళ్ల పద్మభూషణ్, రామ్వంజీ సుతార్ కృషిని ప్రశంసించారు. ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. ఆశయాల అనుసరణ కోసమే.. ‘సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేడ్కర్ కృషి, త్యాగం అజరామరం. దళితులు, గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలే కాదు... వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేడ్కర్ ఆశయం సాక్షాత్కారమవుతుంది. అంబేడ్కర్ విశ్వమానవుడు. అత్యున్నత స్థాయిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఆయన అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్ఫూర్తి పొందడమే’అని సీఎం అన్నారు. ఆయన ఆశల కోసం ప్రజాప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. నాలుగు దశాబ్దాల కిందే తాను ఎమ్మెల్యేగా దళితుల స్థితిగతులను, ప్రపంచంలోని అణగారిన వర్గాలతో పోల్చుతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్’అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అంటరానితనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతికి, అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్ పడిన శ్రమ, చేసిన కృషిని ఆసియా ఖండంలో మరొకరు చేయలేదని స్పష్టం చేశారు. సమావేశంలో సీఎం తీసుకున్న నిర్ణయాలు ► విగ్రహావిష్కరణకు సచివాలయ అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకావాలి. ► ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది బహిరంగ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. ► అంబేడ్కర్ పాటలు ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. ► అంబేడ్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను ఏకైక ముఖ్యఅతిథిగా ఆహ్వనించాలి. మధ్యాహ్నం 2 గంటలకు సభ.. ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది. సీఎస్ శాంతి కుమారి ప్రారంభోపన్యాసం తర్వాత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ సందేశం ఉంటుంది. -
‘బాబా సాహెబ్’కు తుదిమెరుగులు.. చివరిదశకు చేరుకున్న పనులు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజ్యాంగ నిర్మాత, భావిభారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు దాదాపుగా సిద్ధమైంది. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ విగ్రహానికి కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. దేశ భవిష్యత్తు కోసం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని కుడి చేతిని ముందుకు చాచి గొప్ప ఆత్మవిశ్వాసంతో చూస్తున్న బాబాసాహెబ్ విగ్రహం నెక్లెస్ రోడ్డులో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం మరోవైపు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల కోసం ప్రాణాలొడ్డిన అమరుల స్మారకం.. అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో నెక్లెస్‌రోడ్డు మరింత చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆరేళ్ల యజ్ఞం.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ప్రకటించారు. ఆ ఏడాది అంబేడ్కర్ జయంతి రోజున నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీయార్ పార్కు పక్కన 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించి అదేరోజు భూమి పూజ కూడా చేశారు. నిజానికి ఏడాది వ్యవధిలోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు విగ్రహం రూపుదిద్దుకుంది. సుమారు రూ. 146 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 155 టన్నుల స్టీల్ 111 టన్నుల కంచు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్, పద్మభూషణ్ రాంవంజి సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్లు అంబేడ్కర్ భారీ కళాఖండానికి రూపకర్తలు. బాబాసాహెబ్ గంభీరమైన విగ్రహాన్ని మమ్మూర్తులా రూపొందించడంలో వారి అద్భుతమైన ప్రతిభ కనిపిస్తుంది. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని అయినా తట్టుకొనేవిధంగా విగ్రహం నిర్మాణం చేపట్టారు. విగ్రహం కోసం 155 టన్నుల స్టీల్‌ను, 111 టన్నుల కంచును వినియోగించారు. విగ్రహం బయటి వైపు లేయర్ కోసమే సుమారు 9 టన్నుల కంచును వాడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉంటుంది. కింద పార్లమెంటు ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రీనరీ ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే బేస్మెంట్లోని హాళ్లలో అంబేడ్కర్ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన గ్రంథాలయం, ఆయన జీవితవిశేషాలను, రాజ్యాంగ రచనాకాలం నాటి ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఆడియో, వీడియో ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ పనులు ఇంకా పూర్తి చేయవలసి ఉంది. అలాగే విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలి. అన్ని పనులు పూర్తయితే ఆహ్లాదభరితమైన వాతావరణంలో మహనీయుడి అద్భుతమైన విగ్రహాన్ని వీక్షించవచ్చు. -
Hyderabad: తటాక తీరాన.. మణి మకుటాలు..
అటు చూస్తే తుది దశకు చేరిన నూతన సచివాలయ నిర్మాణం.. ఇటు చూస్తే పూర్తి కావస్తున్న అమర వీరుల స్మారకం. ఆ వంక రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహం. భాగ్యనగరి కీర్తి కిరీటంలో మణిమకుటాలుగా విరాజిల్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరానికి సరికొత్త సొబగులను అద్దనున్నాయి. నగరవాసులకు, పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. -
ఏప్రిల్ 14కు అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులు ఏప్రిల్ 14కు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఈ విగ్రహ నిర్మాణ పనుల్ని గురువారం మంత్రులు నాగార్జున, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. చేతల మనిషిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి చూపిస్తున్నారన్నారు. దేశచరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన బూట్లు వచ్చాయని, మిగిలిన భాగాలు దశలవారీగా వస్తాయని ఆయన తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో కాకుండా ఇరుకుసందుల్లోను, ఇబ్బందికరమైన రోడ్లపైన ఇష్టానుసారం సభలు జరపడంతో నిండుప్రాణాలు బలిగొన్న ఘటనలు ఆందోళన కలిగించాయని చెప్పారు. ప్రతిపక్షంలోను ప్రచారయావను ఆపుకోలేక 11 నిండుప్రాణాలు పోవడానికి చంద్రబాబు నిర్వహించిన సభలే కారణమని చెప్పారు. -
‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగేలా వ్యవహరిస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయన భారీ విగ్రహ ఏర్పాటుతో గౌరవిస్తోందని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేయబోతున్న భారీ విగ్రహ పనులను ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతారని మేం ఊహించలేదు. ఇంత ఖరీదైన స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ తయారీ హర్యానాలో జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణ వ్యయం పెరిగినా.. ముందుకే వెళ్తున్నాం. సీఎం జగన్ నిర్ణయం నభూతో.. నభవిష్యత్. ఇచ్చిన మాటమీద నిలబడే నాయకుడు సీఎం జగన్. 2023 ఏప్రిల్ 14 నాటికి విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం అని ఉద్ఘాటించారు మంత్రి నాగార్జున. గత ప్రభుత్వం అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా వ్యవహరించింది. అంబేద్కర్ ఆలోచనలను అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. దళిత జాతిని అవమాన పరిచిన చరిత్ర చంద్రబాబుది. అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు గురించి మాట్లాడటం కూడా అవమానమే అంటూ పేర్కొన్నారు. టీడీపీపై ఫైర్ టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా?. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తుకు రాలేదు?. మూడు రాజధానుల పై జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాకే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చిందా?. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయ్. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడు. అమరావతి ప్రాంతంలో రైతుల కోసం కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు అని మంత్రి మేరుగ విమర్శించారు. -
ఏప్రిల్ 14న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్ మేరుగు నాగార్జున చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి.. అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని నడుస్తున్నారని తెలిపారు. హరియాణలోని మానేసర్‌లో రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు, మంత్రులు ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. విగ్రహ తయారీదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ విగ్రహం రూపొందుతోందని తెలిపారు. అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. విజయవాడలో రూ.2 వేల కోట్ల విలువైన స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ఈ విగ్రహం ప్రతీకగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి రూ.100 కోట్లు కేటాయించి అరకొర పనులు చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.270 కోట్లు కేటాయించడంతోపాటు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్‌కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనేక పోలికలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి నరేష్ కుమావత్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం తయారు చేసే అవకాశం సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
సాక్షి, అమరావతి: విజయవాడలో చేపట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో జరుగుతోన్న అంబేడ్కర్ ప్రాజెక్ట్ పనులను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విగ్రహం ఏర్పాటు చేయనున్న వేదిక వద్ద జరుగుతోన్న కాంక్రీట్, కన్వెన్షన్ సెంటర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేయడం కోసం రాత్రి పగలు పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు చెప్పిన విధంగానే విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని, పనులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.