పనులను పరిశీలిస్తున్న మంత్రులు
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులు ఏప్రిల్ 14కు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఈ విగ్రహ నిర్మాణ పనుల్ని గురువారం మంత్రులు నాగార్జున, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. చేతల మనిషిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి చూపిస్తున్నారన్నారు.
దేశచరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన బూట్లు వచ్చాయని, మిగిలిన భాగాలు దశలవారీగా వస్తాయని ఆయన తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో కాకుండా ఇరుకుసందుల్లోను, ఇబ్బందికరమైన రోడ్లపైన ఇష్టానుసారం సభలు జరపడంతో నిండుప్రాణాలు బలిగొన్న ఘటనలు ఆందోళన కలిగించాయని చెప్పారు. ప్రతిపక్షంలోను ప్రచారయావను ఆపుకోలేక 11 నిండుప్రాణాలు పోవడానికి చంద్రబాబు నిర్వహించిన సభలే కారణమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment