రాజమండ్రి రూరల్ (తూర్పుగోదావరి): దళితులను సాంఘీక బహిష్కరణకు గురిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో ఆదివారం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు.
మండలంలోని పిడంగొయి గ్రామానికి చెందిన దళితులకు, ఇతర వర్గీయులకు బీఆర్ అంబేద్కర్ విగ్రహం విషయంలో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి దళితులను వ్యవసాయ పనులకు రైతులు పిలవడం లేదు. దీంతో సాంఘీక బహిష్కరణకు గురిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ మాలమహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు.