సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: బల్మూర్ మండలం మైలారం(Mylaram) గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ వెలికితీతను నిలిపివేయాలంటూ గత మూడు నెలలుగా ఆ గ్రామ రైతులు(Farmers), ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో మహిళలను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని.. గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ళ కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమంటూ మందు డబ్బులతో రైతులు, మహిళలు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
Comments
Please login to add a commentAdd a comment