nagarkurnool district
-
మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం
బల్మూర్: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్‌కు చెందిన రాఘవేందర్ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్.. పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్‌పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.పరిహారంగా రెండెకరాల భూమి బాలిక మృతిపై బల్మూర్‌లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్ కూడా మంగళవారం బుక్ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లా డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ నుంచి రీలొకేషన్‌కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మల్లాపూర్ పెంటలోని చెంచుల ఆవాసాలు ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలకు దూరం.. నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం. –చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా మమ్మల్ని ఆగం చేయొద్దు.. అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. – కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ జిల్లా -
11మందిని పొట్టన పెట్టుకుని?
సాక్షి, నాగర్‌కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం.. ఎవరైనా ఎదురుతిరిగితే మట్టుబెట్టడం.. ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని∙పొట్టన పెట్టుకున్నాడని భావిస్తున్న ఓ నరహంతకుడిని నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ యాదవ్ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు, మాయలు తెలుసునంటూ అమాయక మహిళలు, వ్యక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.' తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని, కుటుంబ కలహాలు, సమస్యలను పరిష్కరిస్తానంటూ మొదట తనకు పరిచయం అయిన వారిని నమ్మిస్తాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా పథకం ప్రకారం హత్యకు తెగబడతాడని బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 11 మంది అమాయకులను బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. కాగా మంగళవారం నిందితుడి పూర్తి వివరాలను వెల్లడిస్తామని నాగర్‌కర్నూల్ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. కందనూలులో కలకలం! 'మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను నమ్మిస్తాడు.. మాటలతో పూర్తిగా మభ్యపెట్టి ఆస్తులు రాయించుకుంటాడు.. ఎవరైనా తన దారిలోకి రాలేదని అనుమానం వస్తే మట్టుబెట్టేందుకు సైతం వెనకాడడు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 11 మందిని హతమార్చాడు.. ఇలా మాయమాటలతో మొదలుపెట్టి.. హత్యలతో ముగింపు పలుకుతున్న సదరు మాయగాడి పాపం పండింది.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతుండటంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..' కందనూలులో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా.. మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న మాయగాడు రామెట్టి సత్యనారాయణయాదవ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తన దారికి రానందుకు ఏకంగా 11 మందిని హత్య చేసి పొట్టనబెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం, ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వదకొండు మంది అమాయకుల హత్యలో సత్యనారాయణకు ప్రమేయం ఉందని, పూర్తిస్థాయి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మాయగాడు సత్యనారాయణయాదవ్ కు సంబంధించి పూర్తి వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది. ► తనకు మంత్రాలు తెలుసంటూ అమాయకులను మచ్చిక చేసుకోవడం, గుప్తనిధులను వెలికితీస్తానంటూ నమ్మిస్తూ సత్యనారాయణయాదవ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన రామస్వామి(50) 2022 నవంబర్ 17న వనపట్ల శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. లింగస్వామి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రతిఫలంగా ఆయనకు ఉన్న 130 గజాల ప్లాటును మార్టిగేజ్ చేయాలని నమ్మించాడని బాధిత కుటుంయిం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాటును మార్టిగేజ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే రామస్వామి హత్యకు గురయ్యాడని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి మరణంతో పాటు వీపనగండ్ల మండలానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసుతోనూ సత్యనారాయణ యాదవ్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ► ఇప్పటికే 11 మందిని హత్య చేసినట్లు అనుమానాలు ► హైదరాబాద్‌లో జరిగిన ఓఘటనతో కదులుతున్న డొంక ► పోలీసుల అదుపులో మాయగాడు సత్యనారాయణ ► మూడేళ్ల క్రితం నాగాపూర్‌లో సంచలనం రేపిన నలుగురి మృతి ► ఈ ఘటన వెనుక కూడా ఇతడి హస్తమే ఉన్నట్లు సమాచారం ► గతంలోనే నిందితుడి బాగోతాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ మహిళలపై లైంగిక వేధింపులు.. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలను నమ్మిస్తూ వారిపై సత్యనారాయణయాదవ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటుండగా.. వారి కుటుంబ సమస్యను మంత్రశక్తితో పరిష్కరిస్తానంటూ ఆమెకు చెందిన భూమిని సత్యనారాయణయాదవ్ తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సత్యనారాయణయాదవ్ బాగోతాలపై ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’ శీర్షికన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు కొనసాగిన హత్యోదంతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. సంచలనం రేపిన నాగాపూర్ ఘటన! 'జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న ఘటనలపై బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తన మంత్రశక్తితో దూరమైన భార్యాభర్తలను కలుపుతానంటూ మహిళను నమ్మించి రూ.లక్షలు విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ మనోహర్ని కలసి ఫిర్యాదు చేసింది.' ► జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న సెటిల్మెంట్ రాయుళ్లదందా ► మంత్రాలు, మాయలతో అమాయకులకు బురిడి ► వరస ఘటనలు చోటుచేసుకుంటున్నా పట్టని పోలీసు అధికారులు ► చోద్యం చూస్తూ నేరస్తులకే సహకరిస్తున్నారన్న ఆరోపణలు మంత్రాలు, మాయలు అంటూ అడ్డగోలు దందా.. జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ నమ్మబలుకుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్న మాయగాళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మాయగాళ్ల చేతుల్లో నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.. జిల్లాలోని వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆమె భర్తతో కొన్నాళ్లుగా గౌడవలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ తాను మంత్రాలు చేసి భార్యభర్తలను కలుపుతానని నమ్మబలికాడు. ఇందుకోసం మహిళ పేరిట భూమి, ఆస్తులు ఉంటే పని జరగదని చెప్పి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సదరు మహిళకు ఉన్న రెండు ప్లాట్లను సత్యనారాయణ పేరిట, అతని బందువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం భర్తకు చెప్పిన తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న భార్యభర్తలు ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన.. నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన లింగస్వామి (50)కి రామెట్టి సత్యనారాయణ 2013లో 130 గణాల ప్లాటును విక్రయించాడు. తర్వాత లింగస్వామితో పరిచయం పెంచుకున్న సత్యనారాయణ.. లింగస్వామి చిన్న కుమారుడు శివశంకర్‌కు బ్యాంకులో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్లాటును మార్టిగేజ్ చేయాలని ఒప్పించారు. 2022 నవంబర్ 7న తన బందువు మహేశ్ పేరిట భూమిని మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత పది రోజులకే 2022 నవంబర్ 17న లింగస్వామి వనపట్ల శివారులో దారుణహత్యకు గురయ్యాడు. లింగస్వామి హత్యకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన మహ్మద్ పాషా శ్రీపురం రోడ్డులో డబ్బాను ఏర్పాటుచేసుకుని చిన్నపిల్లలకు తాయత్తులు కడుతుండేవాడు. తన వద్దకు వచ్చే మహిళకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు సంబందించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశాడు. అతని వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచినా స్పందన లేదు! జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణ నాకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, భూమిని మార్టిగేజ్ చేయించాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత పదిరోజులకే మా నాన్న హత్యకు గురయ్యాడు. మాకు వేరే ఎవరితో గొడవలు లేవు. నిందితులను పట్టుకోవాలని ఇప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను బయటపెట్టాలి. -శివశంకర్,గన్యాగుల విచారణ చేపట్టాం.. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రతి కేసును లోతుగా విచారణ చేపడుతున్నాం. త్వరలోనే విచారణ పూర్తిచేస్తాం.- మోహన్ కుమార్, డీఎస్పీ, నాగర్ కర్నూల్ -
నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ సత్యం
-
రేవంత్ స్వగ్రామంలో సంబరాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వంగూరు: కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించగానే ఆయన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం గ్రామ ప్రజలు రోడ్లమీదకు వచ్చి టపాకాయలు కాల్చి డీజే పాటలకు డ్యాన్సులు చేశారు. మా మధ్యలో పెరిగిన మా రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే తెలివైనవాడు రేవంత్‌రెడ్డి తాండ్ర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివినప్పుడు నేను టీచర్‌గా పనిచేశాను. అప్పుడే తరగతిగదిలో రేవంత్ మ క్కువను నేను గమనించేవాడిని. భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతాడ ని అనుకున్నాను. నేను చదువు చెప్పిన విద్యార్థి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉంది. – జగన్మోహన్రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం, తాండ్ర చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి రేవంత్‌రెడ్డి నాకు క్లాస్మేట్, బంధువు కూడా. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయా లపై ఆసక్తి ఎక్కువ. చదువులోనే కాకుండా ఆటల్లోనూఉత్సాహం కనబరిచేవాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో, 6వ తరగతి తాండ్ర గ్రామంలో చదువుకున్నాం. నా స్నేహితుడు రాష్ట్రానికి సీఎం కావడం ఎంతో గర్వంగా ఉంది. – కేవీఎన్ రెడ్డి, వంగూరు జెడ్పీటీసీ, రేవంత్‌రెడ్డి స్నేహితుడు నా సంతోషానికి అవధుల్లేవు రాజకీయ నేపథ్యం లేకున్నా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. నా స్నేహితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాతో పాటు మా గ్రామస్తులంతా గర్వపడుతున్నాం. ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో ఒకే పాఠశాలలో చదువుకున్నాం. – ధర్మారెడ్డి, రేవంత్‌రెడ్డి స్నేహితుడు -
నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ
-
నాగర్ కర్నూల్: అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దోమలపెంట వద్ద అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు ఐదు హెక్టార్ల మేర అడవి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖాతాలు, మనుషులే.. పరాన్నజీవులు! -
టెన్త్ విద్యార్థి బలవన్మరణం
బల్మూర్: పదో తరగతి విద్యారి్థ.. చదువుతున్న స్కూళ్లోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని పొలిశెట్టిపల్లి జేఎంజే ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యం కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన మణెమ్మ కుమా రుడు ఆకాశ్(15) పదో తరగతి చదువుతూ.. పాఠశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటున్నాడు. మంగళవారం అతను తరగతి గదిలో లేకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిసరాల్లో వెతకగా.. పాఠశాల వెనక ఆవరణలో ఉన్న చెట్టుకు బోరుమోటార్ వైరుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి రక్షించడానికి ప్రయతి్నంచగా అప్పటికే మృతిచెందాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన ఆకాశ్ మరణ వార్తను తెలుసుకున్న తల్లి మణెమ్మ, బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పదేళ్ల కితం తన భర్త కరెంటు షాక్‌తో చనిపోయాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుమా రుడు ఇప్పుడు ఇలా మృతి చెందడం తట్టుకోలేని విషాదమని ఆమె బోరున విలపించారు. కాగా, పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని, భోజనం నాణ్యతగా లేదని తమతో ఆకాశ్ చెప్పేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రార్థన సమయంలో టై పెట్టుకుని రాకపోవడంతో తోటి విద్యార్థుల ముందు టీచర్లు మందలించి గంటపాటు నిల్చోబెట్టారని, ఆ అవమానంతోనే తమ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయా లని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్– అచ్చంపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే విద్యార్థి చెడు వ్యసనాలకు (సిగరెట్ తాగడం) అలవాటుపడుతున్నాడని తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చామని.. ఆమె ఫోన్ చేసి కొడుకును మందలించడంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని స్కూలు హెచ్ఎం సిస్టర్ అమూల్య తెలిపారు. రాస్తారోకోకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఏబీవీపీ, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్‌ప్రసాద్‌ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్‌ప్రసాద్‌ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్‌ప్రసాద్‌తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్‌నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్‌కు చెక్‌పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
అవమానంతో ఒకరు.. భయంతో మరొకరు
వంగూరు: గ్రామంలో పదిమంది సమక్షంలో తనకు అవమానం జరిగిందని.. ఆ అవమానభారాన్ని భరించలేక బావమరిది పురుగు మందు తాగితే, తన మీద కేసు అవుతుందేమోనన్న భయాందోళనతో బావ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మల్లయ్య, రాములు అన్నదమ్ములు. వీరి తల్లి ముత్తమ్మ కొంతకాలం కిందట అనారోగ్యంతో మృతిచెందింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ. లక్ష నగదు, రెండు తులాల బంగారం, కొంత వెండిని రాములు, మల్లయ్య పంచుకోవడంలో విభేదాలు వచ్చి మేన బావ అయిన అంజయ్య వద్ద ఉంచారు. ఇందుకు సంబంధించి గురువారం ఉదయం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ సమయంలో మల్లయ్యపై అన్న రాములు, వదిన జంగమ్మ దాడిచేశారు. దీంతో మల్లయ్య దాడి ఘటనతోపాటు తన వాటాకు రావాల్సిన బంగారం, నగదు ఇప్పించాలని వంగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్తుండగా.. బావ అంజయ్య తనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఉదయం గ్రామంలో జరిగిన దాడి, సాయంత్రం బావ తిట్టిన మాటలను అవమానంగా భావించి మల్లయ్య(50) అదేరోజు రాత్రి తన పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చెన్నమ్మ పొలంలో పడి ఉన్న భర్తను బంధువుల సాయంతో కల్వకుర్తి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న బావ అంజయ్య (55) బామ్మర్ది మల్లయ్య చావుకు తనపై కేసు పెడతారన్న భయంతో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. ఈ విషయాన్ని ఫోన్‌చేసి బంధువులకు చెప్పడంతో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజయ్య కూడా మృతి చెందాడు. ఈ ఘటనలపై మల్లయ్య కొడుకు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాములు, జంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. గ్రామంలో విషాదం.. రూ.లక్ష నగదు, బంగారం కోసం వచ్చిన విభేదాలతో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేరోజు చనిపోవడంతో ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఇద్దరు బావబామ్మర్దులు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. -
తండ్రి నీట మునుగుతుంటే వీడియో తీసి..
పెంట్లవెల్లి: కళ్ల ముందే కన్నతండ్రి నీటమునుగుతుంటే ఒడ్డునే ఉన్న కుమారులు కాపాడాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. తండ్రి మరణ దృశ్యాన్ని ఏకంగా వీడియో తీసి పైశాచికానందం పొందారు. ఆపై ఏమీ ఎరగనట్లు ఇంటికి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెంట్లవెల్లికి చెందిన కేశంపోగుల కృష్ణయ్య, గోవిందమ్మ దంపతులకు రవితేజ, ఉదయ్‌కుమార్ అనే కుమారులతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మంగళవారం గ్రామంలో పెద్ద దేవర్ల పండగ జరగ్గా ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణయ్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ సాయంత్రం వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చౌవుట చెరువు వద్ద కుమారులకు తండ్రి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని ఇంటికి రావాలని కోరినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో మరోసారి తండ్రికి, కుమారులకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మద్యం వాలని తండ్రి అడగడంతో.. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి వరకు ఈదుకుంటూ వెళ్తే మద్యం ఇప్పిస్తామని కుమారులు పందెం కాశారు. మత్తులో ఉన్న కృష్ణయ్య అందుకు ఒప్పుకొని చెరువులోకి దిగి.. ఈదడం మొదలుపెట్టాడు. సగ దూరం వెళ్లాక.. ఈదలేక నీటిలో మునిగిపోయాడు. చెరువు ఒడ్డున ఉండి ఇదంతా సెల్ఫోన్లో వీడియో తీసున్న కుమారులు.. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వెళ్లి అందరితో కలిసి పండుగలో సందడి చేశారు. బుధవారం సాయంత్రం వరకు కృష్ణయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య గోవిందమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆయన కోసం ఆరా తీశారు. గ్రామస్తుల సమక్షంలో కుమారులు రవితేజ, ఉదయ్‌కుమార్‌ను గట్టిగా నిలదీయగా వారు తండ్రి నీటిలో మునిగిపోతున్న వీడియోను గ్రామస్తులకు చూపించారు. గోవిందమ్మ గురువారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం చెరువులో తేలిన మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రామేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
నాగర్‌కర్నూల్: ర్యాగింగ్ భూతానికి మైనా బలి!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఓ ప్రభుత్వకాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హనుమాన్ తండాకి చెందిన మైనా(19).. జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదవుతోంది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆపై ఇంటికి వచ్చి బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాయంత్రానికి కన్నుమూసింది. తొలుత సూసైడ్‌కి గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాంగింగ్కు సంబంధించిన వీడియోగా ఒకటి వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఒకరు.. మైనాను కొడుతున్నట్లుగా ప్రచారం అవుతోంది. కౌన్సెలింగ్.. బెదిరింపులు? మైనాపై జరిగిన ర్యాగింగ్ బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు లెక్చరర్లు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్ సైతం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
అధికార పార్టీ నాయకుడు వినూత్న నిరసన
-
బిర్యానీ ఏదని అడిగాడని..
అచ్చంపేట రూరల్: తన బిర్యానీ ప్యాకెట్ కని పించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు మరో విద్యార్థి వసతి గృహం టెర్రస్ పైనుంచి కిందికి దూకేయడంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహంలో ఆదివారం జరిగింది. అమ్రాబాద్ మండలం ఎలమపల్లికి చెందిన రామస్వామి, సువ ర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేశ్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా డు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూ సేందుకు తల్లిదండ్రులు వచ్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థి రాజేశ్ అదే తరగ తికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు బిర్యానీ ప్యాకెట్ తీసుకువచ్చారు. మధ్యాహ్నం అరుణ్ బిర్యానీ తిని మిగిలింది రాత్రికి తినేందుకు బాక్సులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా బిర్యానీ ప్యాకెట్ కనిపించకపోవడంతో తోటి స్నేహితులను అడిగాడు. ఈ క్రమంలో రాజేష్‌ను ప్రశ్నించగా.. అతనేమీ మాట్లాడకుండా వసతిగృహం టెర్రస్‌పైకి ఎక్కి దూకేశాడు. వెంటనే పాఠశాల సిబ్బంది రాజేశ్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. ఎడమ కాలు విరిగిందనే అనుమా నంతో మహబూబ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. -
మాటేసి.. కాటేసి..
చౌటుప్పల్ రూరల్: ఓ మృగాడి కర్కశత్వానికి మరో మహిళ బలైంది. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి పొట్టచేత పట్టుకొని వచ్చిన గిరిజన వివాహిత ఉసురు తీశాడు. లైంగికదాడి చేసి కొట్టి చంపాడు. హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దులో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త, పోలీసుల నుంచి విశ్వనీయంగా తెలిసిన వివరాల మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడూరు మండలం కర్రెన్నబండ తండాకు చెందిన ముఢావత్ కృష్ణ, లావణ్య అలియాస్ శ్రావ్య(28)కు ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. అక్కడే కూలీ పని చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. సంతానం కలగకపోవడంతో హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ, ఆస్పత్రుల్లో చూపించుకోవచ్చని 2 నెలల క్రితం వలస వచ్చారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని గోడౌన్లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరారు. గోదాం వెనకాల గదుల్లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే పని చేస్తే పూటగడవదని, లావణ్యను గోదాం వద్ద ఉంచి, అశోకా ఇంజనీరింగ్ కళాశాలలో కృష్ణ వాచ్‌మన్‌గా ఏప్రిల్ 12న చేరాడు. లావణ్య ఒంటరిగా ఉండటం చూసి.. గోదాంలో లావణ్య పొద్దంతా ఒంటరిగా ఉంటోంది. కృష్ణ ఉదయం 7.40గం.కు కాలేజీకి వెళ్లి రాత్రి 8.40గం.కు వచ్చేవాడు. గోదాం వెనుక సిమెంట్ పలకలు తయారు చేసే కంపెనీ ఉంది. ఇందులో ఉన్న గదుల్లో వర్కర్లతో పాటు ఇతరులూ అద్దెకు ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన హరీశ్ ఇక్కడ ఉంటూ సుతారి పనిచేస్తున్నాడు. గోదాంలో లావణ్య ఒంటరిగా ఉండటం చూసి కన్నేశాడు. ఈ క్రమంలో సోమవారం పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. ఆమె బాత్రూంకు రావడం గమనించి లైంగికదాడికి యత్నించాడు. ఆమె తిరస్కరించినా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇటుకలు, కర్రతో తలపై దారుణంగా కొట్టి చంపేశాడు. ఆమె మెడలో ఉన్న పుస్తెలను, 8 తులాల వెండి పట్టాగొలుసులను ఎత్తుకెళ్లాడు. పోలీసుల అదుపులో నిందితుడు?.. కృష్ణ సోమవారం రాత్రి డ్యూటీ దిగి 8.40గం.కు ఇంటికొచ్చాడు. లావణ్య కోసం వెతకగా.. బూత్ రూం పక్కనే గడ్డివాము వద్ద అనుమానాస్పద స్థితి లో మృతిచెంది ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాత్రి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చెప్పులు మినహా ఆధారాలేవీ లభ్యంకాలేదు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. మంగళవారం చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి రంగంలో కి దిగారు. దొరికిన ఆధారంతో, సుతారీ మేస్త్రీల సాయంతో, తుఫ్రాన్‌పేట శివారులో సుతారీ పనిచేస్తున్న హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడి గది నుంచి లావణ్య పుస్తెలను, వెండి పట్టాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. -
సలేశ్వరంలో విరిగిపడిన కొండచరియలు
లింగాల/అచ్చంపేట/అచ్చంపేట రూరల్/మన్ననూర్: నల్లమలలో కురుస్తున్న అకాల వర్షాలతో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని సలేశ్వరం లోయలో ఉన్న భక్తులు శివ(నాగర్‌కర్నూల్), సూర్యనారా యణ(నల్లగొండ), విజయలక్ష్మి (లింగో టం, అచ్చంపేట మండలం), కొత్తపల్లి ప్రతాప్‌రెడ్డి, పాండయ్య(షాబాద్, రంగా రెడ్డి జిల్లా), జిందమ్మ(శక్తినగర్, రాయచూర్, కర్ణాటక)లకు గాయాల య్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. ఇదిలా ఉండగా... మూడు రోజుల పాటు సాగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అక్కడి కొండలు, గుట్టలు ఎక్కుతూ ‘వస్తున్నాం.. లింగమయ్యా, వెళ్లొస్తాం లింగమయ్య..’ అంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. అమ్రాబా ద్ అభయారణ్యం శివనామ స్మరణతో మార్మోగింది. -
నల్లమలలో వైభవంగా చెంచుల జాతర
నాగర్‌కర్నూలు: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం భౌరాపూర్‌పెంటలో చెంచుల ఆరాధ్య దైవం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణాన్ని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించింది. చెంచులు భౌరమ్మను ఆడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు స్వామివారి తరపున, కలెక్టర్ ఉదయ్‌కుమార్ దంపతులు అమ్మవారి తరపున పెళ్లిపెద్దలుగా వ్యవహరించి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. చెంచుల గురువు గురువయ్య శివపార్వతుల కల్యాణం జరిపించారు. కాగా, సిద్ది పేటజిల్లా కొమురవెల్లిలో మంగళవారం రాత్రి పెద్దపట్నం వేశారు. -
కేసీఆర్, చినజీయర్ దళిత వ్యతిరేకులు
జడ్చర్ల/ నాగర్‌కర్నూల్ రూరల్: సీఎం కేసీఆర్, చినజీయర్‌స్వామి దళిత వ్యతిరేకులని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ సాధ్యమైందని ఒకప్పుడు పొగిడిన కేసీఆర్ ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొదటి నుంచి అంబేడ్కర్‌పై వివక్ష చూపిస్తూ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలని కుట్ర చేస్తున్నారన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు. రామానుజాచార్యుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చినజీయర్‌స్వామి వ్యవహరిస్తున్నారని, ఆధ్యాత్మికత ముసుగులో ‘రియల్’వ్యాపారవేత్తగా మారారని విమర్శించారు. -
అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
అచ్చంపేట: రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరా జు సమర్థించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాయి. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల కళ్లు కప్పి పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయ గా టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు వంశీకృష్ణను అరెస్టు చేయగా, రెండు వర్గాల కార్యకర్తలు బాహాబహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ముట్టడికి వచ్చిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముట్టడి సమయంలో ఎమ్మెల్యే గువ్వల అక్కడ లేరు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ముందుగానే చెప్పడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముట్టడికి ముందుగానే టీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో సమావేశం కావడం వల్ల ఘర్షణకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడి ఉందని ముందుగానే తెలిసినా.. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు క్యాంపు కార్యాలయంలోకి అనుమతించడంపై విమర్శలు వస్తున్నా యి. టీఆర్ఎస్ శ్రేణులు క్యాంప్ కార్యాలయం లో లేకపోతే ఘర్షణ జరిగేది కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. డీఎస్పీలు నర్సింహులు, గిరిబాబు, సీఐలు అనుదీప్, రామకృష్ణ, గాంధీనాయక్, ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా ఆస్పత్రికి వెళ్లినా అంతే..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లికి చెందిన గర్భిణికి కాళ్లు, ఒంటినొప్పులు ఎక్కువగా ఉండటంతో గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో గర్భిణికి పీపీఈ కిట్ వేసి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన గర్భిణులకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో సహా ఎక్కడికక్కడే కాన్పులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. ఈనెల 25న అచ్చంపేట ఆస్పత్రిలో ఘటన నేపథ్యంలో.. జిల్లా ఆస్పత్రి నుంచి గర్భిణి తరలింపు విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం వివరణ కోరగా.. ఆస్పత్రి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌తో పాటు రక్తం తక్కువగా ఉండటంతో హైరిస్కు కేసుగా భావించి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి సురక్షితంగా తరలించామని చెప్పారు. -
కొత్తగా మరో జాతీయ రహదారి.. హైదరాబాద్–తిరుపతి.. మరింత దగ్గర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా మరో జాతీయ రహదారి ఏర్పాటుకానుంది. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి మధ్యదూరం దాదాపు 70 కిలోమీటర్ల మేర తగ్గనుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి (కొల్లాపూర్ ఎన్‌హెచ్ –167కే) నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ రహదారిలో భాగంగా కృష్ణా నదిపై సోమశిలవద్ద వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఎన్‌హెచ్–167ఎన్ విస్తరణకు కూడా గ్రహణం వీడింది. దీని అలైన్మైంట్ ఖరారు కావడంతో పాటు నిర్మాణానికి రూ.703.68 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణంతో వివిధ ప్రాంతాలకు దూరం తగ్గనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొల్లాపూర్ ఎన్‌హెచ్‌కు టెండర్లే తరువాయి.. కొల్లాపూర్ జాతీయ రహదారి–167కే నిర్మాణానికి కేంద్రం గతేడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న ఈ రహదారి పనులకు రూ.600 కోట్లు, మార్గ మధ్యలో కొల్లాపూర్ వద్ద సోమశిల సమీపంలోని కృష్ణానదిపై 2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, రాంపూర్.. ఆంధ్రప్రదేశ్‌లోని మందుగుల, శివాపురం, కరివెన మీదుగా నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గంలో పది ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. కల్వకుర్తి కొట్రా జంక్షన్ టు నంద్యాల బైపాస్ తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని కొట్రా జంక్షన్ నుంచి కొల్లాపూర్ ఎన్‌హెచ్–167కే ప్రారంభమవుతుండగా.. కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణా నదిపై రీ–అలైన్మెంట్ బ్రిడ్జి, ఆ తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్ రోడ్డు వరకు రహదారి నిర్మిస్తారు. చివరగా అక్కడ జాతీయ రహదారి–40 జంక్షన్‌కు అనుసంధానించనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాలనుంచి హైదరాబాద్ రావాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తయితే నంద్యాలనుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. అలైన్మెంట్ ఖరారు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ ఫ్లైఓవర్, పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ మీదుగా ఎన్‌హెచ్–167ఎన్ అలైన్మెంట్ ఖరారైంది. ఆ తర్వాత వీరన్నపేట, డంప్ యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ.. నారాయణపేట జిల్లాలోని కోస్గి, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ.లు, కొడంగల్‌లో 5 కి.మీ.లు, తాండూర్‌లో 6 కి.మీ.ల మేర బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్‌హెచ్–167ఎన్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది ఎన్‌హెచ్–167ఎన్.. రూ.703 కోట్లు మంజూరు మహబూబ్‌నగర్–చించోలి అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది ప్రకటించారు. ఈ మేరకు సర్వే పూర్తి కాగా.. అలైన్‌మెంట్‌పై కూడా స్పష్టత వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌హెచ్–44పై ఉన్న భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి–167ఎన్ను విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. దీంతో ఇటీవల రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గడ్కరీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ రహదారి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉండగా.. మహబూబ్‌నగర్ నుంచి వికారాబాద్‌లోని కర్ణాటక సరిహద్దు వరకు 126కి.మీ.లు, కర్ణాటక రాష్ట్రం పరిధిలో 64కి.మీ.లు విస్తరించనున్నారు. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. -
ముళ్లపొదల్లో కాకతీయ శిల్పాలు
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కాలానికి చెందిన అరుదైన వీరభద్రుడి విగ్రహం ఇది. నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో ఇలా ఎన్నో విగ్రహాలు మట్టిపాలై ఉన్నాయి. వీటిని చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఉమామహేశ్వర దేవాలయంలో 1320లో వేయించిన ప్రతాపరుద్రుని శాసనం, 14వ శతాబ్దినాటి శిల్ప సోదరులు పెద శరభయ్య, చిన శరభయ్యలు దేవాలయంలోని పార్వతి, చెన్నకేశవ, మహిషాసుర మర్ధిని, వీరభద్ర, నందికేశ్వరుల విగ్రహాలను చెక్కారని, వాటిని సదానంద స్వామి అనే వ్యక్తి ప్రతిష్టించారని రాసి ఉందన్నారు. కొన్ని విగ్రహాలు ఆలయ మండపంలో ఉండగా, గల్లంతైన వీరభద్ర, నంది విగ్రహాలు ఈ ముళ్లపొదల్లో కనిపించాయన్నారు. -
Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు
సాక్షి, మహబూబ్‌నగర్(అచ్చంపేట రూరల్): ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గుట్టలో నిర్వహిస్తున్న జంతు ఎముకలతో తయారుచేసే పౌడర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై సోమవారం అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో పులిజాల గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ పాండునాయక్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి తహసీల్దార్ కృష్ణయ్య, ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ మేఘనాథ్, సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అక్కడి మూడు షెడ్లలో జంతువుల ఎముకలను చూర్ణం చేసే యంత్రాలు, కుప్పలుగా ఉన్న వాటి వ్యర్థాలను పరిశీలించారు. చదవండి: (సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించడం, స్థానికంగా ఏ శాఖ అనుమతి పత్రాలు లేనందున ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అలాగే విద్యుత్ సరఫరా కాకుండా జంపర్లను తీయించారు. కాగా, నిర్వాహకులు మాత్రం ఈ పౌడర్‌ను ఆర్గానిక్ ఎరువులలో ఉపయోగిస్తారని, దీనిని చెట్లకు వాడతారని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా గతంలోనూ అచ్చంపేట మండలంలోని చౌటపల్లి, సిద్దాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా జంతు కళేబరాలతో తయారుచేసే నూనె ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య) -
పాలన చేతకాకపోతే తప్పుకోండి!
కొల్లాపూర్ రూరల్: ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే తప్పుకోవా లని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్ర భుత్వంపై సీఎం కేసీఆర్ అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులనుంచి ధాన్యం కొనుగోలుకు రూ.500 కోట్లు కూడా వెచ్చించలేరా? అని ప్రశ్నించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన పా ల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ శాంతిభద్రతలు కాపాడటంలో సీఎం విఫ లమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు కాల్చడం, చావుడ ప్పులు కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరుపుతూనే తమ తప్పు లు కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం సిగ్గుచేట న్నారు. రైతులు ప్రగతిభవన్ ఎదుట కేసీఆర్ బొమ్మను తగులబెట్టి చావుడప్పు కొట్టాలన్నా రు. దళితులకు మూడెకరాల భూమి, సబ్సిడీ రుణాలు ఇవ్వనందుకు చావుడప్పు కొట్టాల న్నారు. ప్రగతిభవన్‌కు ఇనుప కంచెలు వేసుకు న్నారని, మంత్రులకు అధికారాలు లేకుండా చేశారని ఈటల విమర్శించారు. సమావేశంలో బీజేపీ నేతలు బంగారు శృతి, సుధాకర్‌రావు, దిలీప్‌చారి తదితరులు పాల్గొన్నారు.