వీరభద్రుడి విగ్రహాన్ని పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కాలానికి చెందిన అరుదైన వీరభద్రుడి విగ్రహం ఇది. నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో ఇలా ఎన్నో విగ్రహాలు మట్టిపాలై ఉన్నాయి. వీటిని చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు.
ఉమామహేశ్వర దేవాలయంలో 1320లో వేయించిన ప్రతాపరుద్రుని శాసనం, 14వ శతాబ్దినాటి శిల్ప సోదరులు పెద శరభయ్య, చిన శరభయ్యలు దేవాలయంలోని పార్వతి, చెన్నకేశవ, మహిషాసుర మర్ధిని, వీరభద్ర, నందికేశ్వరుల విగ్రహాలను చెక్కారని, వాటిని సదానంద స్వామి అనే వ్యక్తి ప్రతిష్టించారని రాసి ఉందన్నారు. కొన్ని విగ్రహాలు ఆలయ మండపంలో ఉండగా, గల్లంతైన వీరభద్ర, నంది విగ్రహాలు ఈ ముళ్లపొదల్లో కనిపించాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment