Gangula Kamalakar Inspected Bhumi Puja Works Of TTD Temple In Karimnagar - Sakshi
Sakshi News home page

టీటీడీ ఆలయ నిర్మాణ పనులు పరిశీలన..మే 31న భూమి పూజ..

Published Sat, May 20 2023 4:13 PM | Last Updated on Sat, May 20 2023 4:36 PM

Gangula Kamalakar Inspected Bhumi Puja Works Of TTD Temple In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని పద్మానగర్‌లో పది ఎకరాలో స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి తరహాలో ఆలయం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి భూమి పనులను టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, స్తపతులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ..ఆలయ నిర్మాణ పనుల విషయమై టీటీడీ ఈవో, చైర్మన్‌ సుబ్బారెడ్డితో సమావేశమయ్యాం.

మే 22న ఆలయ ప్రధానార్చకులు ఇక్కడకు వచ్చి భూమి పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మే 31న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తోపాటు టీటీడీ అధికారుల సమక్షంలో భూమి పూజ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఏ రాష్ట్రంలోనైనా ఒకటే ఆలయం నిర్మిస్తుంది.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో ఇప్పటికే హైదరాబాద్‌ హిమయత్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌లో ఉన్నపటికీ, కరీంనగర్‌లోనూ తిరుపతి ఆలయం నిర్మించడానికి టీటీడీ కూడా ముందుకు రావడం విశేషం. కాగా పది ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని పూర్తి రాతితో తిరుమల తిరుపతి తరహాలో నిర్మిచనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. 

(చదవండి: మా పాప.. కాదు మా పాప!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement