Land pooja
-
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
Karimnagar: టీటీడీ ఆలయ నిర్మాణ పనులు పరిశీలన..మే 31న భూమి పూజ..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని పద్మానగర్‌లో పది ఎకరాలో స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి తరహాలో ఆలయం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి భూమి పనులను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్తపతులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..ఆలయ నిర్మాణ పనుల విషయమై టీటీడీ ఈవో, చైర్మన్ సుబ్బారెడ్డితో సమావేశమయ్యాం. మే 22న ఆలయ ప్రధానార్చకులు ఇక్కడకు వచ్చి భూమి పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మే 31న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోపాటు టీటీడీ అధికారుల సమక్షంలో భూమి పూజ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఏ రాష్ట్రంలోనైనా ఒకటే ఆలయం నిర్మిస్తుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇప్పటికే హైదరాబాద్ హిమయత్ నగర్, జూబ్లీహిల్స్‌లో ఉన్నపటికీ, కరీంనగర్లోనూ తిరుపతి ఆలయం నిర్మించడానికి టీటీడీ కూడా ముందుకు రావడం విశేషం. కాగా పది ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని పూర్తి రాతితో తిరుమల తిరుపతి తరహాలో నిర్మిచనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. (చదవండి: మా పాప.. కాదు మా పాప!) -
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ
బోథ్ : బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో 25 బిర్లాగొంది గ్రామంలో 20 ఇళ్లకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ భూమిపూజ నిర్వహించారు. గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అధికారంకోసం కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. అనంతరం బోథ్ మండలకేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ పాషా సోదరుడు రహమాన్, కుచులాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సంటెన్నల కుటుంబాలను పరామర్శించారు. వారి వెంట ఐసీడీఎస్ జిల్లా సమన్వయకర్త కస్తాల ప్రేమల, ఎంపీపీ గంగుల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శారద, టీఆర్ఎస్ కన్వీనర్ రుక్మణ్ సింగ్, ఎంపీటీసీలు రాయల్, వెంకటరమణ, గ్రంథాలయ డైరెక్టర్ రమణగౌడ్, జగన్మోహన్రెడ్డి, గంగుల మల్లేశ్, దేవన్న, గంగారెడ్డి, సత్యనారాయణ, సాయిరెడ్డి, సదానందం పాల్గొన్నారు. -
జనసేన బహిరంగ సభ వేదికకు భూమిపూజ
అనంతపురం కల్చరల్ : ప్రత్యేక హోదా ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ఈ నెల 10న అనంతలో నిర్వహించనున్న జనసేన బహిరంగ సభ వేదికకు గురువారం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు భూమి పూజ చేశారు. సభ నిర్వహించనున్న జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన భూమి పూజ అనంతరం అభిమాన సంఘం నాయకులు హర్ష, వరుణ్, జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అధ్యక్షులు జంగటి అమర్నాథ్ తదితరులు మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సభా ప్రాంగణానికి స్వాతంత్య్ర సమర యోధులు తరిమెల నాగిరెడ్డి పేరును, వేదికకు కల్లూరు సుబ్బారావు పేరును నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ అభిమాన సంఘం సభ్యులు డిస్కోబాబు, ప్రసాద్, భవానీ రవికుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు చలపతి తదితరులు పాల్గొన్నారు. -
'రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు'
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం దీక్షతో యజ్ఞంలా పనిచేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. అలాంటివారు రాక్షసుల్లానే మిగిలి పోతారని చె ప్పారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరైనా విమర్శిస్తే ఎన్టీఆర్ స్ఫూర్తితో బుల్లెట్లా వారిపై దూసుకుపోవాలన్నారు. మహానాడు రెండో రోజు గురువారం ఏడు తీర్మానాలు చేశారు. నూతన రాజధాని నిర్మాణంపై తీర్మానం అందులో ఒకటి. పార్టీ నేతలు తీర్మానం ప్రతిపాదించిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ కొందరు రాజధానికి భూమి పూజ ముహుర్తాన్ని కూడా వివాదస్పదం చేశారని సంకల్పబలానికి మించిన ముహుర్తంలేదని అన్నారు. ఎంతమంది అడ్డం పడినా రాజధాని నిర్మాణం, అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. రాజకీయ నేతలు రెచ్చగొట్టినా, ప్రసార,ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరిగినా, చివరకు సోనియా గాంధీ వ్యతిరేకించినా రాజధాని నిర్మాణానికి రైతులు భూములిచ్చారని, వారికి అన్యాయం జరగనివ్వబోమన్నారు. రాజధాని నిర్మాణానికి జూన్ ఆరో తేదీన భూమి పూజ చేస్తామని, దసరా నాడు శంకుస్థాపన చేస్తామన్నారు. శంకుస్థాపన రోజున ప్రధానితో పాటు ముఖ్య నేతలను ఆహ్వానిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. చారిత్రక నేపధ్యం ఉన్నందునే రాజధానికి అమరావతి అని పేరు పెట్టామని, అమరావతిలో వచ్చి నివాసం ఏర్పరుచుకుంటే చిరాకాలం బతకొచ్చన్నారు. అమరావతి అంటే మృత్యువులేని నగరం అని అర్థమన్నారు.