అనంతపురం కల్చరల్ : ప్రత్యేక హోదా ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ఈ నెల 10న అనంతలో నిర్వహించనున్న జనసేన బహిరంగ సభ వేదికకు గురువారం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు భూమి పూజ చేశారు. సభ నిర్వహించనున్న జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన భూమి పూజ అనంతరం అభిమాన సంఘం నాయకులు హర్ష, వరుణ్, జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అధ్యక్షులు జంగటి అమర్‌నాథ్ తదితరులు మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ప్రసంగించే సభా ప్రాంగణానికి స్వాతంత్య్ర సమర యోధులు తరిమెల నాగిరెడ్డి పేరును, వేదికకు కల్లూరు సుబ్బారావు పేరును నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ అభిమాన సంఘం సభ్యులు డిస్కోబాబు, ప్రసాద్, భవానీ రవికుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు చలపతి తదితరులు పాల్గొన్నారు.
జనసేన బహిరంగ సభ వేదికకు భూమిపూజ
Published Thu, Nov 3 2016 10:24 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement