రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా సాగుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బహిరంగ సభకు పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల వారు మద్దతునివ్వడం ఆనందంగా ఉందని జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అధ్యక్షులు జంగటి అమర్‌నాథ్ అన్నారు.
అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా సాగుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బహిరంగ సభకు పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల వారు మద్దతునివ్వడం ఆనందంగా ఉందని జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అధ్యక్షులు జంగటి అమర్‌నాథ్ అన్నారు. బుధవారం ఆయన జనసేన నాయకులు టీసీ వరుణ్, భవానీ రవికుమార్, ఇతర ప్రజా సంఘాల నేతలతో కలిసి బాలాజీ రెసిడెన్సీలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రానికి హోదా కావాలని ఎవరు పోరాడినా తాము మద్దతునిస్తామన్నారు. ఆ నేపథ్యంలో అనంతకు వస్తున్న పవన్‌కల్యాణ్ జిల్లా సమస్యలపైన మాట్లాడాలని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ఇదివరకే కోరామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గల్లా హర్ష, సాగర్ తదితరులతో పాటు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.