janasena meeting
-
పవన్‌లో స్పష్టంగా అభద్రతా భావం.. సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు
సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యువశక్తి సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు అన్నట్టుగానే సాగింది. తిట్టడానికి ఈ యువశక్తి సభ కాదంటూనే సభ చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిను తిడుతూనే ప్ర సంగం సాగించారు. నోటికొచ్చినట్టు దూషణ చేశా రు. తాను తిట్టొచ్చు.. ఎదుటోళ్లు తిట్టకూడదు.. తా ను విమర్శలు చేయవచ్చు.. ప్రత్యర్థులు మాట కూడా ఆడకూడదు... అన్నట్టుగానే మాట్లాడారు. తనను ఎవరైనా ఏమైనా అంటే చెప్పుతో కొట్టండని యువకులను ఉసిగొల్పారు. లావేరు మండలం తాళ్లపాలెంలో యువశక్తి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర నలు మూలల నుంచి సినిమా అభిమానంతో యువత వచ్చారు. ఉదయం 11గంటలకు సభ ప్రారంభమవుతుందని పిలుపునివ్వడంతో జనం అక్కడికొచ్చేశారు. కానీ సాయంత్రం 5.30 గంటల వరకు పవన్ కల్యాణ్ వేదికపైకి రాలేదు. అంతవరకు తరలివచ్చిన యువత అంతా వేచి చూడక తప్పలేదు. ఇక 100 మంది యువకుల వాయిస్ వింటామని, వారంతా మాట్లాడుతారని చెప్పినా కేవలం 20మందితో మమ అనిపించేశారు. ఆ మాట్లాడిన వారంతా ఆయా రంగాలపై అవగాహన ఉన్న వారు కాదు. జనసైనికుల మాదిరిగానే మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించాక యువశక్తి కార్యక్రమంలో భాగంగా ఏం చెబుతారో అని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన తిట్లనే వినాల్సి వచ్చింది. సింగిల్ లైన్లో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తీసేస్తా, వలసలు ఆపుతా, పరిశ్రమలు వచ్చేలా చేస్తా, మత్స్యకారులకు జెట్టీలు నిర్మిస్తా అని చెప్పి మిగతా సమయమంతా అధికార పార్టీ నేతలను తి ట్టడమే పనిగా పెట్టుకున్నారు. అవసరమైతే గొడవ పడాలంటూ యువతను రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ప్రసంగాన్ని సాగించారు. తనపై మాట్లాడే వారిపైన దాడులు చేయాలన్నట్లు సంకేతాలిచ్చారు. ఇక జిల్లా మంత్రులు ధర్మా న ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులను హేళన చేస్తూ మాట్లాడారు. జిల్లాలో చేస్తున్న అభివృద్ధి పనులను ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ జిల్లాకు ఏదైనా జరిగిందంటే అదంతా తన చలవే అన్నట్టుగా ప్రసంగించారు. చివరిగా తనకు జనలొస్తారు గానీ, ఓట్లేయరంటూ తన అభిమానులపై అక్కసును వెళ్లగక్కారు. నమ్మకం లేకనే తాను పొత్తుకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు. మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? మీ తల్లిదండ్రులతో మాట్లాడి చెప్పండని మాట్లాడారంటే ఎంత అభద్రతా భావంతో ఉన్నారో స్పష్టంగా కనిపించింది. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని దానికి జన సైనికులు సిద్ధమవ్వాలనే సంకేతాన్ని చెప్పకనే చెప్పారు. పవన్ ప్రసంగించిన తీరు నచ్చక చాలా మంది ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోవడం కనిపించింది. జెట్టీలు నిర్మిస్తాం.. ఎచ్చెర్ల క్యాంపస్, రణస్థలం, లావేరు, జి.సిగడాం: తాము పొత్తులతో వెళ్లి మిశ్రమ ప్రభు త్వం అధికారంలోకి వస్తే జిల్లాలో మత్స్యకారుల కోసం జెట్టీలు నిర్మిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. లావేరు మండలంలోని తాళ్లవలసలో గురువారం యు వశక్తి పేరుతో పార్టీ నాయకులు, అభిమానుల తో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగం కార్యకర్తలను ఉద్రేకపరిచేలా సాగింది. జిల్లా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుపై విమర్శలు చేశారు. తనకు 175 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసే సత్తా లేదని, టీడీపీతో పొత్తు తప్పదని కార్యకర్తలకు నేరుగా చెప్పేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రలో మత్స్యకారుల వలసల నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. జిల్లాకు చెందిన గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమం తనకు స్ఫూర్తినిచ్చిందని, వీర గున్నమ్మ పోరాటాన్ని అంతా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు) -
అభిమాని అత్యుత్సాహం: పవన్ కళ్యాణ్‌కు తప్పిన పెను ప్రమాదం
-
జారిపోయిన ‘జనసేన’
విజయనగరం మున్సిపాలిటీ/డెంకాడ: జనసేన, మిత్రపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్ని కల ప్రచారం జావగారిపోయింది. విజయనగరం పట్టణంలోని అయోధ్యమైదానంలోనూ, డెంకాడ మండలంలోని నాతవలస–సింగవరం మధ్యలో శుక్రవారం సభల్లో పవన్ పాల్గొన్నారు. పక్కపక్కనే ఉన్న ప్రాంతాల్లో పవన్ రెండు సభలు నిర్వహించడానికి ఆ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలే కారణమయ్యాయి. ఉదయం పదిగంటలకు విజయనగరం పట్టణంలో సభకు వస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. మధ్యాహ్నం వంటిగంటకు గానీ పవన్ రాలేదు. అప్పటి వరకూ ఆయన కోసం వచ్చిన కొద్దిపాటి అభిమానులు కూడా ఎండను తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. వేదికపైకి వస్తుండగా ఓ అభిమాని పవన్ రెండు కాళ్లూ గట్టిగా పట్టుకోవడంతో ఆయన కిందపడిపోయారు. అతనిని పవన్ భద్రతా సిబ్బంది పక్కకు తీసుకువెళ్లి దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రసంగించిన పవన్ తన ప్రసంగాన్ని ఎక్కడ మొదలుపెట్టారో, ఎక్కడ ముగించారో ఎవరికీ అర్ధం కాలేదు. టీడీపీని విమర్శించడానికి అన్యమనస్కంగా ఉన్నట్టు ప్రసంగంలో కనిపించింది. పవన్ వల్ల తమకు కొన్ని ఓట్లు అయినా పడతాయని ఆశపడిన ఆ పార్టీ అభ్యర్థులు పవన్ ప్రసంగంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. విజయనగరం, నెల్లిమర్ల అభ్యర్థుల మధ్య సయోధ్య లేకపోవడం కారణంగానే రెండు చోట్లా పవన్ సభలు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పవన్ రాకకు ముందు జనసేన, మిత్ర పక్షాల నేతలు ప్రసంగించారు. పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు పాల్గొన్నారు. -
జనసేన సభలో తీవ్ర గందరగోళం
సాక్షి, గుంటూరు : నగరంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు తరలివచ్చిన అభిమానులు కొందరు బారికేడ్లు తోసేసి మరీ సభా ప్రాంగణం ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన బౌన్సర్లు కర్రలతో కార్యకర్తలపై దాడులు చేశారు. అయినా కార్యకర్తలు వెనుకకు తగ్గలేదు. వారు కుర్చీలతో ప్రతి దాడులకు దిగారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని.. తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులసు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అదుపు తప్పిన పరిస్థితి.. సభా ప్రాంగణం దగ్గరకు రావాలని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను దగ్గరగా చూడాలని అభిమానులు ప్రయత్నించడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది. కొందరు కార్యకర్తలు దురుసుగా ముందుకు తోసుకురావడంతో మొదటవారిపై బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ కర్రలతో దాడి చేశారు. పోలీసులు కూడా పవన్ అభిమానుల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బౌన్సర్లు, పోలీసులపై అభిమానులు దాడులకు దిగారు. అంతేకాకుండా కార్యకర్తలు, కార్యకర్తల మధ్య కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో సభాప్రాంగణంలో ఒక దశలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో దాదాపు 12మంది కార్యకర్తలు గాయపడారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్టు సమాచారం. -
మద్దతుపై హర్షం
అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా సాగుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బహిరంగ సభకు పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల వారు మద్దతునివ్వడం ఆనందంగా ఉందని జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అధ్యక్షులు జంగటి అమర్నాథ్ అన్నారు. బుధవారం ఆయన జనసేన నాయకులు టీసీ వరుణ్, భవానీ రవికుమార్, ఇతర ప్రజా సంఘాల నేతలతో కలిసి బాలాజీ రెసిడెన్సీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి హోదా కావాలని ఎవరు పోరాడినా తాము మద్దతునిస్తామన్నారు. ఆ నేపథ్యంలో అనంతకు వస్తున్న పవన్‌కల్యాణ్ జిల్లా సమస్యలపైన మాట్లాడాలని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ఇదివరకే కోరామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గల్లా హర్ష, సాగర్ తదితరులతో పాటు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జనసేన బహిరంగ సభ వేదికకు భూమిపూజ
అనంతపురం కల్చరల్ : ప్రత్యేక హోదా ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ఈ నెల 10న అనంతలో నిర్వహించనున్న జనసేన బహిరంగ సభ వేదికకు గురువారం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు భూమి పూజ చేశారు. సభ నిర్వహించనున్న జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన భూమి పూజ అనంతరం అభిమాన సంఘం నాయకులు హర్ష, వరుణ్, జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అధ్యక్షులు జంగటి అమర్నాథ్ తదితరులు మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సభా ప్రాంగణానికి స్వాతంత్య్ర సమర యోధులు తరిమెల నాగిరెడ్డి పేరును, వేదికకు కల్లూరు సుబ్బారావు పేరును నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ అభిమాన సంఘం సభ్యులు డిస్కోబాబు, ప్రసాద్, భవానీ రవికుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు చలపతి తదితరులు పాల్గొన్నారు.