
భూమిపూజ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాపూరావ్
బోథ్ : బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో 25 బిర్లాగొంది గ్రామంలో 20 ఇళ్లకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ భూమిపూజ నిర్వహించారు. గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అధికారంకోసం కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. అనంతరం బోథ్ మండలకేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ పాషా సోదరుడు రహమాన్, కుచులాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సంటెన్నల కుటుంబాలను పరామర్శించారు. వారి వెంట ఐసీడీఎస్ జిల్లా సమన్వయకర్త కస్తాల ప్రేమల, ఎంపీపీ గంగుల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శారద, టీఆర్‌ఎస్ కన్వీనర్ రుక్మణ్ సింగ్, ఎంపీటీసీలు రాయల్, వెంకటరమణ, గ్రంథాలయ డైరెక్టర్ రమణగౌడ్, జగన్మోహన్‌రెడ్డి, గంగుల మల్లేశ్, దేవన్న, గంగారెడ్డి, సత్యనారాయణ, సాయిరెడ్డి, సదానందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment