‘బోథ్‌’ ఎవరిదో? | Who Will Win At Bodh Constituency | Sakshi
Sakshi News home page

‘బోథ్‌’ ఎవరిదో?

Published Sun, Nov 18 2018 11:30 AM | Last Updated on Sun, Nov 18 2018 12:35 PM

Who Will Win At Bodh Constituency - Sakshi

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌) : పోరాటాల పురిటి గడ్డ బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు ఈ సారి ఎవరిని ఆదరిస్తారు? ఏ పార్టీకి ఓటేస్తారు.. అనేది ఆసక్తిగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థిని తీవ్ర ఉత్కంఠ మధ్య శనివారం ప్రకటించడంతో బరిలో నిలిచే వారెవరనేది తేలిపోయింది. నామినేషన్ల గడువు కూడా సమీపిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో బోథ్‌ నియోజకవర్గ అభ్యర్థుల అనుకూల, ప్రతికూలతలపై కథనం. 
 

కొత్తగా బరిలో కమలం
బోథ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మాడవి రాజు బరిలో ఉండనున్నారు. గతంలో 2009లో బీజేపీ నుంచి పోటీ చేసిన అడే మానాజీకి టికెట్‌ ఇవ్వకుండా మాడవి రాజుకు టికెట్‌ ఇచ్చారు. ఇతను గోండు సామాజిక వర్గానికి చెందిన వారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పథకాలు, హిందుత్వం కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. గోండు సామాజిక వర్గం అభ్యర్థి కావడంతో కొంత ఓటర్లను ఆకర్శించే అవకాశం ఉంది.
 
ప్రతికూలతలు..

  •  నియోజకవర్గంలో గ్రామీణ స్థాయిలో బీజేపీ పార్టీకి సరైన కేడర్‌ లేకపోవడం.  – బలమైన నాయకత్వం లేకపోవడం. 
  •  బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి మాడవి రాజు స్థానికేతరుడు కావడం.
      ​​​​​​

చాలా కాలం తర్వాత బీఎస్పీ అభ్యర్థి:  చాలా కాలం తర్వాత బోథ్‌ నియోజకవర్గంలో బీస్పీ అభ్యర్థి బరిలో దిగుతున్నారు. 1999లో బోథ్‌ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి రాములునాయక్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి బీఎస్పీ నుంచి బోథ్‌ బరిలో ఎవరూ లేరు. నేరడిగొండ మండలానికి చెందిన లంబాడా సామాజిక వర్గానికి చెందిన అడే గజేందర్‌ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు. గజేందర్‌ రాజకీయాలకు కొత్త. బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సరిపోవనే భావన ఉంది.
 
పథకాలే అధికార పార్టీకి అండ.. 

అనుకూలతలు
టీఆర్‌ఎస్‌ నుంచి రెండోసారి పోటీ చేస్తున్న రాథోడ్‌ బాపురావు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 ఎన్నికల్లో అనుహ్యంగా బోథ్‌ బరిలో దిగిన రాథోడ్‌ బాపూరావు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి మొదటి సారికే విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. బీటీ రోడ్ల నిర్మాణం, మిషన్‌ కాకతీయ ద్వారా నిర్మించిన చెరువులు, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం, గొముత్రి వద్ద బ్యారెజీ, కుప్టి ప్రాజెక్టు మంజూరు, తదితర అభివృద్ధి పనులు చేయడంతో ఆశలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చే హామీలు ఓటర్లను ఆకర్షించనున్నాయి.
 

ప్రతికూలతలు

  • బోథ్‌ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రాథోడ్‌ బాపూరావు మరోసారి గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ రెండోసారి గెలుపు కోసం రాథోడ్‌ బాపురావు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు నెలకొననున్నాయి. గత రెండేళ్ల నుంచి సొంత పార్టీలోనే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్రూపులు ఉండడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. 
  • నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ పథకంలో చెరువులు నిర్మించినా కాలువలు లేక సాగునీరు అందడం లేదు. దీంతో రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. జలయజ్ఞంలో నిర్మించిన చెరువులకు ఇప్పటి వరకు కాల్వలు నిర్మించపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. 
  • నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు మండలాల్లో దళితులకు అధికంగా మూడెకరాల భూ పంపిణీ జరిగింది. కానీ ఇతర మండలాల్లో రెండు, మూడు గ్రామాల్లో మాత్రమే భూమి పంపిణీ చేయడంతో దళితులు అసంతృప్తితో ఉన్నారు.
  • తాంసి మండలంలోని బండలనాగపూర్‌లో మాత్రమే డబూల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేశారు. ఇతర మండలాల్లో వీటి నిర్మాణం లేకపోవడంతో లబ్ధిదారులు నిరాశతో ఉన్నారు.  
  • ఇచ్చోడ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, సిరికొండ, భీంపూర్‌ మండలాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు, వంతెనలు మంజూరు చేయలేదు.
  • ఇచ్చోడ మండల కేంద్రంలో నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ హయాంలో రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, తాగునీటి సమస్యలు తీరలేదు. 
  • నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో డిగ్రీ చదువుల కోసం విద్యార్థులు నిర్మల్, ఆదిలాబాద్‌ పట్టణాలకు వెళ్లడం కూడా సమస్యగా మారింది. 
  • ఆదివాసీ ఉద్యమ ప్రభావం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement