jalayagnam
-
‘చంద్రబాబు.. మీరు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా?’
తాడేపల్లి : తన హయాంలో ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu).ఈరోజు(మంగళవారం) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైఎస్సార్ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఝాన్ని(Jalayagnam) ప్రారంభించారన్నారు. అటువంటింది ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్లాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. కృష్ణా నదిలో నీరు సరిపడా రాకపోయినా గోదావరి నీటితో పల్నాడు, రాయలసీమకి ఉపయోగపడుతుందని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. దీనికి డీపిఅర్ కూడా జగన్ ప్రభుత్వమే తయారు చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ చంద్రబాబు తానే చేసినట్టుగా ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పుకుంటున్నారని, చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రయివేటు పరం చేయబోతున్నారని విమర్శించారు అంబటి.చివరికి సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రయివేటు పరం చేయటాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఇది జల హారతి కాదని, చంద్రబాబు హారతి అని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికే పోర్టులు మెడికల్ కాలేజీలు, రోడ్లను ప్రయివేటు పరం చేశారన్నారు. రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారురాష్ట్రంలో రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు కూడా రౌడీయిజం చేస్తున్నారన్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదనే గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ధనిక ముఖ్యమంత్రి అని, రెండు ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాలు త్వరలో రావడం తథ్యమన్నారు. -
ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఉన్నా చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో అధిక శాతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలే. ఆయన అకాల మరణం తర్వాత మూడో దఫా అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి చూపించలేదు. మొక్కుబడిగా నిధులు కేటాయించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాల మేరకు జలయజ్ఞం పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి సారించారు. అయితే, కరోనాతో రెండేళ్లు వృధా అయ్యాయి. ఇక భూసేకరణలో ఇబ్బందులు, న్యాయవివాదాలు తలెత్తినా వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ విస్మరించి ‘ఈనాడు’లో రామోజీరావు ఎప్పటిలాగే విషంకక్కారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఈ దుస్థితిలో చిక్కుకుపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్య పాలనే కారణమన్న విషయాన్ని మరుగునపరచడానికి ఆయన నానాపాట్లు పడ్డారు. ‘ఉత్తరాంధ్రంటే ఉత్తదనుకుంటివా?’ శీర్షికతో శుక్రవారం అవాస్తవాలను వండివార్చారు. ఇష్టారాజ్యంగా దగాకోరు రాతలు రాశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఈనాడు క్షుద్ర రాతలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. మడ్డువలస విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ప్యాకేజీ–1 పనులను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.130.60 కోట్ల వ్యయంతో పూర్తిచేయించారు. తద్వారా 24,877 ఎకరాల మేర భూములు సస్యశ్యామలంగా మారాయి. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్యాకేజీ పనుల కోసం రూ.26.90 కోట్లను మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. వంశధార శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల పూర్తికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 2,407.79 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రానున్న జూన్‌కల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 2004 నుంచి 2019 వరకూ అంటే 15 ఏళ్లలో రూ.1,614.82 కోట్లు ఖర్చుచేయగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి నేటివరకూ అంటే నాలుగేళ్ల 10 నెలల కాలంలో రూ.400.40 కోట్లు ఖర్చుచేసింది. అయినప్పటికీ ఒడిశా అభ్యంతరాలతో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం తప్పట్లేదు. ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గొట్టా బ్యారేజీ కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించి హిరమండలం రిజర్వాయరులో 12 టీఎంసీల వరకూ నీటిని నింపాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభుత్వం నడుంబిగించింది. 2022 సెప్టెంబర్ 14న రూ.176.35 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే అక్టోబరు నాటికి ఇవి పూర్తికానున్నాయి. మహేంద్రతనయ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టు నిర్మాణానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాంది పలికారు. తర్వాత వచ్చిన చంద్రబాబు దీన్ని పూర్తిచేయడంపై చిత్తశుద్ధి చూపించలేదు. విపరీతమైన జాప్యంతో ఆ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి, సవరించిన అంచనాలతో రూ.852.45 కోట్లతో 2022 సెప్టెంబరు 14న పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. జంఝావతి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో నిర్మాణ పనులను ప్రారంభించినా అంతర్రాష్ట్ర సమస్యతో జంఝావతి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు తన పాలనలో ఏరోజు కూడా దాన్ని పూర్తిచేయడంపై దృష్టి పెట్టలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యాంను అక్కడ నిర్మించి జాతికి అంకితం చేశారు. రెండో ప్యాకేజీ కింద కాలువ అభివృద్ధి పనులను ప్రస్తుతం రూ.3.26 కోట్లతో చేపడుతున్నారు. తారకరామతీర్థ సాగర్ ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే విజయనగరం జిల్లాలోని కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట గ్రామాల వారికి పునరావాస పనులు ప్రస్తుతం పురోగతి సాధించాయి. కొన్నేళ్లుగా సారిపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రూ.77 కోట్ల పునరావాస ప్యాకేజీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2006 నుంచి 2019 వరకూ రూ.166.80 కోట్లు.. భూసేకరణకు రూ.57.06 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకూ రూ.56.56 కోట్లను నిర్మాణ పనులకు, భూసేకరణకు రూ.25.33 కోట్లను ఖర్చుచేసింది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విజయనగరం పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేయిస్తోంది. తోటపల్లి ఉత్తరాంధ్రలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 11,221 ఎకరాలను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చారు. ఆయన మరణానంతరం చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవం చేశారు. కనీసం పిల్ల కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. ఆ మిగులు పనులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. రూ.123.21 కోట్లు మంజూరు చేసి పరిపాలనామోదాన్ని ఇచ్చింది. నేటి వరకూ 64.59 కోట్లను వెచ్చించారు. 2025 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల చిన్నచూపు ఫలితంగా పనులు పడకేశాయి. వీటిన్నింటినీ రద్దుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22న తాజా అంచనాలతో రూ.137.80 కోట్లతో మిగులు పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. ప్రసుత్తం భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్‌కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
జలయజ్ఞం చేసిన అపర భగీరథుడు
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పలు రకాలుగా వారి సేవలను తెలుగు ప్రజలు స్మరించుకుంటు న్నారు. ఒక వ్యక్తి గొప్పదనం వారి తదనంతరం వారిని గుర్తు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే ప్రజానేత అయితే వారు తీసుకునే నిర్ణయాల సార్వజనీనతను బట్టి ఉంటుంది. ఆ కోణంలో చూసినప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా చేసిన పోరాటాలూ, తీసుకున్న నిర్ణయాలూ ఆంధ్రప్రదేశ్ రాజకీ యాలలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రస్థానంలో వారిని చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేశాయి. ఎందరో మహానుభావులు రాయలసీమ ఉద్యమాన్ని నడి పారు. దాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో వైఎస్ విజయం సాధించారు. జాతీయ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వైఎస్ ఒక ప్రాంత సమస్యపై పోరాటంలో పాల్గొనడం సాహసం. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అంటారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే 294 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే 52 నియో జక వర్గాలు ఉన్న రాయలసీమ అంశాలపై ఎందుకు మాట్లాడ తారు? రాయలసీమ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన కారణంగా... కేవలం చెన్నై నగరానికి త్రాగు నీరు కోసం రూపొందించిన ‘తెలుగు గంగ’ తిరుపతి వరకూ రాగలిగింది. కీలకమైన పోతిరెడ్డిపాడు సమస్య సమాజం ముందుకువచ్చింది. రాయలసీమ ఉద్యమంలో వైఎస్ ప్రస్థాన ఫలితమే ‘జల యజ్ఞ’ రూపకల్పన. వెనుకబడిన ప్రాంత అస్తిత్వ ఉద్యమంలో కీలక అంశంగా నీటి సమస్య ఉంటుంది. వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నది జలయజ్ఞం. ఏపీలోని అన్ని ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం రూపొందించారు. పోలవరం, దుమ్ముగూడెం టేల్ పాండ్, పులిచింతల, గాలేరు– నగరి, హంద్రీనీవా, పోతిరెడ్డి పాడు, సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్టులు నేడు ప్రజల ముందు ఉన్నాయి అంటే అది వైఎస్ దూర దృష్టి ఫలితమే. ఆధునిక కాలంలో ఆంగ్లేయుల తర్వాత మొత్తం తెలుగు ప్రజలకు శాశ్వత నీటి పరిష్కారం కోసం దూర దృష్టితో ఆలోచించింది రాజశేఖర రెడ్డి అనే చెప్పాలి. జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాజెక్టుల నిర్మాణం ఒకేసారి చేపట్టడం సరికాదని చాలా మంది వాదించారు. అలాంటి వాదనలకు వైఎస్ చెప్పిన సమాధానం ‘రాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి నేడు రూపొందించిన ప్రాజెక్టులు మన హయాంలో పూర్తి కాకపోయినా ప్రజలు పోరాడి సాధించుకుంటారు.’ అది వైఎస్ ఆలోచన. అలా ఆయన ఆలోచన చేయకుండా ఉంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా మారి ఉంటుందా? వారు ఊహించిన విధంగా నేడు ప్రజలు ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోరాడుతున్నారు. ప్రభుత్వాలు తమ ప్రాధాన్యత అంశంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమ డిమాండ్లకుఅత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడ ల్పునూ, శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టాన్నీ పెంచాలని నిర్ణయించడం వంటివి కొన్ని మాత్రమే. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడల్పు పెంచడం అవసరం. వరద సమయంలో నీటి హక్కు లేని ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడల్పును 12 వేల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 44 వేల క్యూసెక్కుల సామ ర్థ్యానికి పెంచారు. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా జీఓ ఇచ్చినా రాజకీయ కుట్రల కారణంగా దాని అమలు సాధ్యం కాలేదు. దాని ఫలితం నేడు రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. గండికోట ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో బాటు కుందూ నదిపై జోలదరాసికీ, రాజోలుకూ శంకుస్థాపన చేశారు. అలాగే సిద్ధేశ్వరం అలుగు ఆలోచన చేశారు. కానీ వారి మరణాంతర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవి సాకారం కాకపోవడంతో నేటికీ రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కాలేదు. గోదావరిపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చిరకాల వాంఛ. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఓ కొలిక్కి రాలేదు. కానీ నీటి సమస్య గురించి అవగాహన కలిగిన వైఎస్ అత్యంత వ్యయంతో కూడిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూను కున్నారు. కేంద్రాన్ని ఒప్పించి అన్ని అనుమతులూ మంజూరు చేయించుకొని కుడి ఎడమ కాల్వల నిర్మాణం చేపట్టారు. ‘ప్రాజెక్టు పూర్తి కాకుండానే కాల్వల నిర్మాణం’ అంటూ విప క్షాలు చేసే విమర్శలకు వెరవలేదు. విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా లభించింది అంటే అది వైఎస్ కృషి ఫలితమే. అదీ నీటి ప్రాజెక్టులపై వైఎస్‌కున్న నిబద్ధత, దూరదృష్టి. అదే సమయంలో అపార నీటి వనరులు ఉన్న గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగించే ప్రయ త్నంలో భాగంగా దుమ్ముగూడెం పథకాన్ని రూపొందించి 500 కోట్లతో ప్రాథమిక పనులు పూర్తి చేశారు. విభజన సమయంలో పోలవరంలో భాగంగా 165 టీఎమ్సీల సామర్థ్యం కలిగిన దుమ్ముగూడేనికి జాతీయ హోదా వచ్చి ఉంటే తెలంగాణలో కొంత భాగం, కృష్ణా, గోదావరి డెల్టాలకు గోదావరి నీళ్లూ; వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, దక్షిణ తెలంగాణ ప్రాజె క్టులకు కృష్ణ నీటినీ వినియోగించే అవకాశం ఉండేది. వైఎస్ మరణం, విభజన సమయంలో దూరదృష్టి లేని నేతల కార ణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. శంకుస్థాపనకే పరిమితం అయిన గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఫలితంగా నీటి హక్కులు లేకపోయినా మూడు ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన విధంగా నిర్మాణం చేసుకోవచ్చని విభజన చట్టంలో అనుమ తించారు. వైఎస్ ఆశించిన శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెంపు, సిద్దేశ్వరం, గుండ్రేవుల, కుందూపై నిర్మాణాలు... ముఖ్యంగా దుమ్ముగూడెం పథకం పూర్తి అయితే రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విపక్ష నేతగా సీమ హక్కుల కోసం పోరాటం, అధికారంలోకి వచ్చిన తర్వాత సాకారం కోసం ప్రయత్నాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రస్థానంలో ఎప్పటికీ చిరస్మరణీయులు. వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త ‘ 94904 93436 -
రూ.300 కోట్ల ప్రాజెక్టుకు..రూ.3,500 కోట్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జలయజ్ఞంలో భాగంగా నాడు చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్లు చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 20, 21, 22 ప్యాకేజీల కింద చేపట్టిన మంచిప్ప జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 0.84 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండెం చెరువు పనులను రూ.900 కోట్లతో 75 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. తక్కువ ముంపుతోనే 1.84 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు డిజైన్ చేశారని గుర్తు చేశారు. ఇంకా రూ.300 కోట్లు ఖర్చు చేస్తే జలాశయం పనులు పూర్తయి పొలాలకు నీరందుతుందని చెప్పారు. అయితే కేవలం కమీషన్లు దండుకునేందుకే సీఎం కేసీఆర్ 3.5 టీఎంసీలకు సామర్థ్యం పెంచి 10 గ్రామాలను, 10 వేల ఎకరాలను ముంచుతున్నారని నిందించారు. రూ.3,500 కోట్లు వెచ్చించి దోపిడీ చేసేందుకే డిజైన్లు మార్చారని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్ని స్తే, 17 మందిపై హత్యా యత్నం కేసులు నమోదు చేయించారన్నారు. రైతులపై కేసులు బనాయించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామాల్లోకి రావద్దని బోర్డులు పెట్టాలని, అయినా వస్తే కళ్లల్లో కారం కొట్టి, కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం చేస్తామన్నారు. డిచ్పల్లి కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కవిత నిజామాబాద్ కోడలిగా ఉండి జిల్లా పరువు తీసిందని అన్నారు. పేపర్ లీకేజీలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర సిట్టింగ్‌జడ్జితో విచారణ చేయించాలి: రేవంత్ రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. టౌన్‌ప్లానింగ్ అధికారి పోస్టుల పరీక్ష పేపర్ల లీకేజీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు. పేపర్ లీక్ అని, సైట్ హ్యాక్ అయిందని, హనీట్రాప్ అని మూడు రకాలుగా చెప్పడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి మాత్రమే తెలియాల్సిన పాస్వర్డ్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ప్రశ్నపత్రం స్ట్రాంగ్ రూమ్‌లోకి చైర్మన్, కార్యదర్శికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ప్రవీణ్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా ప్రవేశించాడని, అతనికి పాస్వర్డ్ ఎలా తెలిసిందని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ హయాంలో జరిగిన ప్రతి పోటీ పరీక్షపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. -
జలయజ్ఞ ఫలం.. ఉప్పొంగుతున్న పులిచింతల
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. 2004 అక్టోబరులో భూమిపూజ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే. 2019 నుంచి వరుణ కటాక్షం 2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు. ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -
ఈ సీజన్లోనే సంగం బ్యారేజీ సిద్ధం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసి.. ఈ సీజన్లోనే బ్యారేజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా పెన్నా డెల్టాలో 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్టస్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జలయజ్ఞంలో భాగంగా పాత బ్యారేజీకి ఎగువన.. కొత్తగా సంగం బ్యారేజీ నిర్మాణానికి వైఎస్సార్ 2005లో శ్రీకారం చుట్టారు. అటు ఆయకట్టుకు నీళ్లందించేలా, ఇటు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేలా బ్యారేజీ కమ్ బ్రిడ్జిగా కొత్త సంగం బ్యారేజీని డిజైన్ చేశారు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత ఈ బ్యారేజీ పనులు పడకేశాయి. టీడీపీ సర్కార్ బ్యారేజీని పూర్తిచేయడంలో విఫలమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను, అధికారులను ఆదేశించారు. దీంతో ఈ బ్యారేజీ పనులు పరుగులెత్తుతున్నాయి. బ్యారేజీ స్పిల్ వేను 1,195 మీటర్ల పొడవున పూర్తిచేశారు. స్పిల్ వేకు 85 గేట్లకుగాను.. 42 గేట్లను ఇప్పటికే అమర్చారు. మిగిలిన 43 గేట్ల అమరిక పనులు సాగుతున్నాయి. బ్యారేజీకి కుడి, ఎడమ వైపు మట్టికట్టలు (గైడ్ బండ్స్) పనుల్లో 9,15,330 క్యూబిక్ మీటర్ల పనులకుగాను 8,60,200 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. మిగిలిన 55,130 క్యూబిక్ మీటర్ల పనులను నెలాఖరులోగా పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ బ్యారేజీని పూర్తిచేసి.. ఈ సీజన్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
అడగాల్సింది మమ్మల్ని కాదు సీఎంను..
సాక్షి, హైదరాబాద్ : జలయజ్ఞంలో భాగంగా కృష్ణా నదిపై ప్రారంభమైన ప్రాజెక్టుల్లో ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేని టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మంత్రులు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం మానుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాజెక్టులపై నిలదీయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు కేవలం సీఎం దగ్గర పరపతి కోసమే కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని, చేతగానితనంతోనే తమను విమర్శిస్తున్నారని రవి మండిపడ్డారు. -
నాడు కల.. నేడు నిజం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నాలను సాకారం చేయడానికి 2004లో ముందు చూపుతో చేపట్టిన జలయజ్ఞం ఫలాలు నేడు ప్రజలకు చేరువయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు తోటపల్లి, వంశధారతో దన్నుగా నిలిస్తే దుర్భిక్ష రాయలసీమకు హంద్రీ–నీవా, గాలేరు–నగరితో ఊపిరి పోశారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులతో కృష్ణా, గోదావరి డెల్టాలనే కాదు.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళిక రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను పూర్తి చేశారు. మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల హంద్రీ–నీవా, గాలేరు–నగరిలను 2004లో చేపట్టి, 2009 నాటికి తొలి దశ పూర్తి చేశారు. రెండో దశ పనులను కూడా ఓ కొలిక్కి తెచ్చారు. ప్రస్తుతం గాలేరు – నగరి కాలువ ద్వారా గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు ముందు చూపుతోనే నేడు సాగు నీరు కృష్ణా డెల్టా ప్రజల తొమ్మిది దశాబ్దాల కల పులిచింత ప్రాజెక్టును 2009 నాటికే పూర్తి చేశారు. ప్రస్తుతం పులిచింతలో 44 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడటానికి ఆ మహానేత ముందుచూపే కారణం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వంశధార, తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల కింద భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తున్నారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించి.. 2004లో పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువ పనులను సింహభాగం పూర్తి చేశారు. హెడ్ వర్క్స్‌కు అవసరమైన భూమిని అత్యధిక భాగం సేకరించారు. ఆ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత హఠన్మరణం చెందారు. ఆ మహానేత తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. -
జనం గుండె చప్పుళ్లలో రాజన్న జ్ఞాపకం
ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు.. ‘వైఎస్సార్’. పల్లె తలుపు తట్టినా.. పేదవాడి ముంగిటకెళ్లినా.. వైఎస్సార్ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో, బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లయిన నిరుపేదల ఫీజురీయింబర్స్‌మెంట్ అనుభవాల్లో పెద్దాయనే కనిపిస్తారు. ఏ ఊరికెళ్లినా రాజన్న మాటలే. ఏ వాడకెళ్లినా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీపిగుర్తులే. జనం గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహనీయుడి పుట్టిన రోజును ప్రజలు గొప్ప పండుగనే అంటున్నారు. ఎంత చేస్తే ఓ వ్యక్తిని ఇంతగా ఆరాధిస్తారు? ఏం చేసి ఆయన జనం గుండెల్లో దేవుడై నిలిచాడు? పెద్దాయన పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్న ప్రజల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లినప్పుడు మాటలకందని అభిమానం కనిపించింది. అక్షరాలకే అంతుచిక్కని ఆత్మీయత ప్రస్ఫుటమైంది. – ప్రజాక్షేత్రం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు ఆయన పుట్టిన రోజున విత్తనం నాటడం అలవాటు గుడివాడలో విత్తనాల కోసం వచ్చిన రైతులు శ్రీనివాసరావు, యాగ భార్గవ్, చందం గురవయ్య.. షాపు యజమానితో చెప్పే మాటల్లో వైఎస్ ప్రస్తావన విని అటువైపు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ‘నకిలీ విత్తనాలు అమ్మితే వైఎస్ తాట తీసేవారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో వైఎస్సార్ పుట్టిన రోజు నిర్వహిస్తున్న మహిళలు పెద్ద పెద్ద విత్తన కంపెనీలతోనూ ఢీ అని పోరాడి రైతుల పక్షాన నిలబడ్డారు. ఇప్పుడు ఆయన కొడుకే సీఎం. గుర్తుపెట్టుకోండి.. మీరిచ్చే విత్తనంలో తేడా వస్తే రియాక్షన్ మరోలా ఉంటుంది’ రైతు శ్రీనివాస్ ధైర్యంతో ఇచ్చిన వార్నింగ్ ఇది. ‘అవునయ్యా వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే మాకు అభిమానం. మాకు ఆయన పుట్టిన రోజు నాడే విత్తనం నాటడం అలవాటు. ఇంతకాలం నకిలీ విత్తనాలు వచ్చినా అడగలేకపోయాం. ఇప్పుడు వైఎస్ జగన్ పాలన నడుస్తోంది. అదే మా« ధైర్యం’ అన్నాడు చందం గురవయ్య. రైతుకు వైఎస్ చేసిన మేలు గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పారు.. ఆ రైతులు. పేదల గుండెల్లో... పెద్దాయన పటం ‘ఆ మహానుభావుడి పుట్టిన రోజు.. కాలనీ మొత్తం రావాల్సిందే.. పండుగయ్యేక పులిహోర పంచుదాం’.. భీమవరం ఇందిరమ్మ కాలనీ రేషన్ షాపు దగ్గర నిలబడి చర్చించుకుంటున్న మహిళలతో సుశీల అన్న మాటలివి. ‘వాళ్లకు పూట గడవడమే కష్టంగా ఉంది. అయినా వైఎస్సార్ పుట్టిన రోజు ఘనంగా చేయాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూడండి సార్’.. ఆ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థి రామశేషు అన్నాడు. అంత అభిమానం ఏంటని అడిగితే.. ఆ కాలనీ వైఎస్సార్ హయాంలోనే ఏర్పాటు చేశారట. అప్పటివరకూ కూలిపోయిన ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లట. చావు బతుకులతో సంసారం చేసేవాళ్లంట. వారి గోడు విన్న వైఎస్ వాళ్ల కోసం భూమి కొని మరీ ఇళ్లు కట్టించారట. ‘కాలనీకొచ్చి చూడండయ్యా.. మా ఇంట్లో దేవుడి పక్కనే వైఎస్ ఫొటో ఉంటుంది’.. అంది ఈశ్వరమ్మ. ఆయన కన్నుమూశాక వాళ్లకొచ్చిన కష్టాలేంటో చెçప్పుకొచ్చారు. ఆయన కట్టించారని టీడీపీ వాళ్లు కక్షగట్టారని చెప్పారు. డ్రైయిన్లు లేవయ్యా అంది షేక్ అబిదాబీ. కట్టుకున్న ఇళ్లకు లోన్లు క్లియర్ చేయలేదని వెంకటలక్ష్మి బావురుమంది. భర్త చనిపోయినా పింఛన్ ఇవ్వట్లేదని చెప్పిన సుశీల.. ‘ఆయన కొడుకొచ్చాడుగా వస్తాయిలే బాబూ’ అంటూ ధీమా వ్యక్తం చేసింది. మంచంలో కదలలేని స్థితిలో ఉన్న బళ్ల గురువులు దగ్గరకు తీసుకెళ్లారు ఆ కాలనీ వాసులు. ఆయన భార్య కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ స్థితిలోనూ వాళ్లు వైఎస్సార్ గురించి చెప్పుకొచ్చారు. ‘కూడు.. గూడు ఇచ్చిన దేవుడయ్యా’ అని చేతులెత్తి మొక్కారు. పిలిస్తే పలికే దేవుడాయన ‘వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నేను నందివాడ సర్పంచ్‌గా పనిచేశాను. ప్రజాపథం కార్యక్రమానికి సీఎం హోదాలో ఆయన మా ఊరొచ్చారు. మహిళనైన నన్ను ఎంతగానో గౌరవించారు. సీసీ రోడ్లు లేవని ఆయన దృష్టికి తెస్తే అప్పటికప్పుడు రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఊరికి 115 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. పేదవాడికి ఆపదొచ్చిందంటే ఏ పార్టీ అని కూడా చూడని మంచి నేత ఆయన. అందుకే ఈ ఊరంతా ఆయనంటే అభిమానిస్తారు. వైఎస్ జయంతిని ఊరంతా పండుగలా చేసుకుంటాం’ అని కృష్ణా జిల్లా నందివాడకు చెందిన పెయ్యల రాణి ఆనందంతో చెప్పారు. తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డానంటే అది వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ భిక్షేనని మండవల్లి మండలం లింగాలకు చెందిన ఉప్పల కిరణ్ తెలిపారు. ‘నేను ఆయనతో కలిసి గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివాను. అప్పుడే ఆయన గొప్ప లీడర్‌గా ఉండేవారు. సీఎం అయ్యాక కూడా నన్ను మరిచిపోలేదు. గుండెలోతుల్లోంచి మిత్రుడికి వినిపించేలా హ్యాపీ బర్త్‌డే చెప్పాలనుంది’ అని పాలకొల్లులో డాక్టర్ పెన్మత్స శివాజీరాజు చెప్పారు. ‘తలలో రక్తం గడ్డకట్టి చావు బతుకుల మధ్య ఉన్న నన్ను ఆరోగ్యశ్రీ ఆదుకుంది. అప్పటి నుంచి కష్టం తెలియకుండా బతికాను. రోజూ ఆయనకు ప్రార్థన చేశాకే మరే పనైనా’ అని రాజోలు మండలం శివకోడుకు చెందిన వీరవాణి పేర్కొంది. ‘నేను కొబ్బరి కాయల వ్యాపారం చేస్తాను. మాకు వైఎస్సార్ ఇల్లు కట్టించారు. అందుకే రోజూ వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఓ కొబ్బరికాయను ఆయన కోసం తీయడం ఆనవాయితీగా మారింది’ అని శివకోడుకు చెందిన సత్యవతి చెప్పింది. అందరి గుండెల్లో గుడి.. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన సాక్షి బృందానికి దారిపొడవునా ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు కలిశారు. ‘ముసల్మాన్ కా జాన్.. వైఎస్సార్.. ఆయన ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్‌తో నేను మెడికల్ సీటు సంపాదించాను. విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో పైసా కట్టకుండా సీటు వచ్చింది. నాకైతే వైఎస్సార్ ‘అల్లా’ మాదిరిగానే నన్ను ఆదుకున్నట్లు అనిపించింది’ అని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైద్యురాలు షేక్ ఆఫ్రిన్ చెప్పారు. ‘మగ్గంపై నేసిన చీరలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునే నాకు 2008లో గుండెలో రంధ్రం ఉందని తెలిసింది. నా వద్ద ఉన్న తెల్లకార్డుతోనే గుంటూరులోని ఆసుపత్రిలో చేర్చుకుని ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈ భూమిపై నాకు నూకలు ఉన్నాయంటే అది వైఎస్సార్ పెట్టిన భిక్షే’ అని ప్రకాశం జిల్లా ఈపూరుపాలెంకు చెందిన చేనేత కార్మికుడు జొన్నాదుల సుబ్బారావు ఆ మహానేత మేలును గుర్తు చేసుకున్నారు. ‘ఆ మహానుభావుడు కండలేరు ఎడమ కాలువ తవ్వించడం వల్లే ఈ రోజు మా నోట్లోకి నాలుగు వేళ్లు వెళుతున్నాయి’ అని నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన రైతు ఆకుల గంగిరెడ్డి ఆనందంతో చెప్పారు. ‘మహానేత వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ చలువ వల్లే ఈ రోజు నా కూతురు పోలీస్ శాఖలో కమ్యూనికేషన్స్ విభాగంలో రేడియో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అప్పట్లో ఆయన ఇచ్చిన పావలా వడ్డీ రుణం మా కుటుంబానికి బాగా ఉపయోగపడింది’ అని నెల్లూరు జిల్లా బంగారుపేటకు చెందిన కోనేటి రేవతి ఆనందంతో చెప్పింది. వైఎస్ చేపట్టిన రుణమాఫీ పథకం వల్లే అప్పుల ఊబి నుంచి బయట పడ్డామని, ఇందుకు ఆయనకు రుణ పడి ఉంటామని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరుకు చెందిన యామల భాస్కర్ చెప్పారు. మెతుకు ఇచ్చిన దేవుడు.. మొక్కుతాం ఎప్పుడూ.. తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని గోదావరి గట్టు పక్కన వెళ్తునప్పుడు కనిపించిన దృశ్యం.. వైఎస్సార్ ఫొటో, కేక్, చుట్టూ పదుల సంఖ్యలో జనం. ఏంటని అడిగితే చెప్పారు.. వాళ్లు వైఎస్సార్ పుట్టినరోజు చేసుకుంటున్నారట.. ఉపాధి కూలీలట. ఎక్కడ ఉంటే అక్కడ ఏటా అలా వైఎస్ పుట్టిన రోజుకు కేక్ కట్ చేయడం ఆనవాయితీ అన్నారు. అంత అభిమానమేంటన్న ప్రశ్నకు.. జయలక్ష్మి భూలక్ష్మి, అన్నమ్మ, మేరి, లక్ష్మమ్మ, చంద్రకళ, గ్రేసమ్మ పోటీపడి మరీ చెప్పారు. ‘ఆయన దేవుడయ్యా.. ఉపాధి కూలీకి అన్నం పెట్టాలనుకున్నాడు. ఉప్పల కిరణ్ యంత్రాలు రానివ్వకుండా చేశాడు. ముద్ద నోటికెళ్తుందంటే ఆయన చలువే బాబు’. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పేటప్పుడు ప్రతి కళ్లలోనూ ఆనంద భాష్పాలు కన్పించాయి. ‘నా కొడుకు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడయ్యా.. ఫీజురీయింబర్స్‌మెంట్ వల్లే ఇది జరిగింది’ మాణిక్యమ్మ మనసులోంచి తన్నుకొచ్చిన సంతోషమిది. కూలిపోయే ఇంట్లో చావలేక బతుకుతున్న మాకు వైఎస్ ఇల్లిచ్చాడు. పింఛను ఇప్పించాడు. ఆ మహారాజును ఎలా మరిచిపోతాం. వెంకట గోవిందమ్మ అన్న మాటిది. రాజన్నే దేవుడనే అక్కడున్న ఆ జనం మధ్య వైఎస్సార్ పుట్టిన రోజు ఓ పండుగ వాతావరణాన్నే తలపించింది. దారిపొడవునా అభిమానమే.. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని వెంటప్రగడ నుంచి గుడివాడ, ముదినేపల్లి, కైకలూరు, ఆకివీడు మొదలు ఉండి, భీమవరం, పాలకొల్లు, రాజోలు, అమలాపురం, అంబాజీపేట, తణుకు, తాడేపల్లిగూడెం వరకూ సాగిన ‘సాక్షి’ బృందం ప్రత్యేక పర్యటనలో ఎంతోమంది వైఎస్సార్ వీరాభిమానులు కలిశారు. మహానేత తమకు చేసిన మేలును గుర్తు చేసుకున్నారు. ఆయన పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటామని చెప్పారు. నిద్ర లేవగానే వైఎస్ తాతను చూడాల్సిందే.. గుడివాడలో పొన్నంపల్లి కల్పన, శ్రీనివాసరావు దంపతులు నిరుపేదలు. వారి పిల్లలు యోగభావన, యోగ భార్గవి పుట్టుకతోనే చెవుడు, మూగ. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆ చిన్నారులకు కొత్త జీవితాన్నిచ్చింది. మొత్తం రూ.13 లక్షలు మంజూరై చికిత్స అందడంతో ఆ చిన్నారులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిద్ర లేవగానే తాత (వైఎస్సార్) ఫొటోనే చూస్తారని కల్పన చెప్పింది. ఆపరేషన్ అయిన నెల రోజులకు వైఎస్సార్‌ని కలిశారట. ఆయన ముద్దు పెట్టుకున్నారట. రోజూ దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పిల్లలు మురిసిపోతున్నారు. తరాలు మారినా... యువతరానికీ పెద్దే తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలో సైకిళ్లపై ర్యాలీగా వెళ్తున్న యువత ‘జోహార్ వైఎస్సార్...’ అంటూ నినదిస్తోంది. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి రాజన్న ఫోటో పట్టుకున్నాడు. వాళ్ల నినాదాలు ఉద్వేగంగా ఉన్నాయి. గుండె నిండా ప్రేమతో తన్నుకొచ్చే ఆవేశం వాళ్లల్లో కనిపించింది. ఎందుకీ సందడి... ప్రశ్న రాకముందే కుడుపూడి నరేష్ చెప్పడం మొదలుపెట్టాడు. ‘రాజన్న బర్త్‌డే... మా ఊరిలో చాలామంది యువకులు ఆయన వల్లే బాగుపడ్డారు. రేపటి తరాలకు ఆయన గుర్తుండాలి. ప్రతి వ్యక్తికి ఆయన మంచి తెలియాలి. అందుకే ప్రతి పుట్టిన రోజూ గ్రాండ్‌గా చేస్తాం’ అన్నాడు. ‘ఇప్పటికీ ఆయన మాటలను యూట్యూబ్‌లో వింటాం. ఆరోగ్యశ్రీతో ఎంతో మందిని ఆదుకున్న మహా మనిషి అని ఆయన గురించి చెప్పుకుంటాం’ వై.షరీన్ నోటి వెంట వచ్చిన మాటలివి. ‘యూత్‌కు ఆయనే ఫేవరెట్ లీడర్’ ప్రకాశ్, పవన్‌కుమార్, ఉదయ్ చందులో ఉప్పొంగే ఆనందంలోంచి వినిపించిన మాటలివి. అల్లాని మొక్కుదాం... సల్లగుండాలని మామిడికుదురులో ముస్లిం మైనార్టీలు రాజన్నను దేవుడుగానే చూస్తున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకల కోసం చేస్తున్న సన్నాహాలే దీనికి నిదర్శనం. ఆ ఊరి గుండా వెళ్తున్నప్పుడు ఓ ఇంటి ముందు సన్నివేశం ఆపింది. ముజఫర్ అలీ, ఎండీ రఫీ, షబ్బీర్ అలీ, అబిద్ హుస్సేన్, అలీ రజా, సకీర్ హుస్సేన్ గుంపుగా ఓ ఇంటి ముందు ఆగారు. ఆ ఇంటి పెద్దావిడకు వైఎస్సార్ ఫొటో చూపించి చెబుతున్నారు.. ‘మన ముస్లింలకు నిజమైన బతుకునిచ్చిన దేవుడమ్మా.. ఊళ్లో ఆయన పుట్టిన రోజు చేస్తున్నాం.. ఇంటిల్లిపాది రావాలి. ఆయన కుటుంబాన్ని సల్లగా చూడాలని ఇంటిల్లిపాది దువా చేయాలి’ అన్నారు. ‘ఇంత హడావుడా?’ ఈ ప్రశ్న వాళ్లకు ఇబ్బందిగా అనిపించిందేమో.. ‘ఏం సార్.. వైఎస్సార్ మా ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ ఓ వరం. దాంతో ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వెళ్లారు. మా ఊరి నుంచే 20 మంది ఉన్నారు. ప్రతి ముస్లింకూ ఆయన పుట్టిన రోజు రంజాన్ అంత పెద్ద పండుగ’ అంటూ భావోద్వేగంగా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లిలో సైకిళ్లపై ర్యాలీగా వెళ్తున్న యువత మామిడికుదురులో వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి వృద్ధురాలిని ఆహ్వానిస్తున్న వైఎస్ అభిమానులు వైద్యురాలు షేక్ ఆఫ్రిన్ నెల్లూరు జిల్లాకు చెందిన రైతు ఆకుల గంగిరెడ్డి -
సంక్షేమ సంతకం చెరగని జ్ఞాపకం
ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నీ స్థానం పదిలం ఆరోగ్యశ్రీతో ఆయుష్షు నింపావు.. 108తో ఆపద్బాంధవుడవయ్యావు.. జలయజ్ఞంతో భగీరథుడవయ్యావు.. రైతుల కోసం వ్యవ‘సాయం’ చేశావు.. ఇళ్లు ఇచ్చి.. కన్నీళ్లు తుడిచావు.. పింఛన్లతో అవ్వాతాతలకు చేతి ఊతమయ్యావు.. పార్టీలతో పనేంటి?.. ప్రజలంతా నా వాళ్లే అన్నావు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరాగా నిలిచావు... ఇచ్చిన మాట కోసం మరణానికైనా ఎదురెళ్లావు.. రాజకీయ నాయకుడిగా కాదు.. రాముడిలా పాలించావు.. విశ్వసనీయతే నీ ఇంటి పేరుగా మార్చుకున్నావు..మీ విధానాలు నిత్య నూతనం...సదా అనుసరణీయం అందుకే పదేళ్లయినా..ఇంకో వందేళ్లయినా నిను మరువదు ఈ ప్రజ. మనసున్నవాడు పాలకుడు అయితే పాలన ఎంత ప్రజారంజకంగా ఉంటుందో...గుండెలో తడి ఉన్న నేత పాలకుడు అయితే ప్రజల కళ్లల్లో తడి చేరకుండా ఎలా పాలిస్తాడో... ప్రజలను ఓటర్లుగా కాకుండా తనవాళ్లుగా చూసే నేత పాలకుడు అయితే ఎంతటి సంక్షేమం సాధ్యమో... అన్నదాన్ని దేశానికి చూపిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఎందుకంటే ఆయన అమ్మానాన్నల కష్టం తెలిసిన ఓ కొడుకు.. చదువు ‘కొనలేక’పోతున్న విద్యార్థుల మానసిక క్షోభను గుర్తించిన ఓ తండ్రి.. అవ్వాతాతల బాధలు చూసిన ఓ మనవడు.. రైతు రుణం తీర్చుకోవాలనుకునే ఓ రుషి.. పేదోడి గుండె చప్పుడు విన్న మనసున్న రాజు. అందుకే తరతమభేదం లేకుండా మనసుతో పాలించి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచగలిగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేవలం రాజకీయ నేతగా పరిపాలించలేదు... ఓ సామాజికవేత్తగా, అర్థశాస్త్ర నిపుణుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, అన్నింటికీ మించి ప్రతి ఇంటి సభ్యుడిగా తనను తాను భావించి పరిపాలించారు. వైఎస్సార్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందుకే సుభిక్షమైన పాలనకు నిర్వచనంగా అనాదికాలం నుంచి రామరాజ్యం అన్నది ఎంతగా స్థిరపడిపోయిందో.. మన రాష్ట్రంలో నేడు రాజన్న రాజ్యం అన్నది కూడా అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఆ మహానేత దివంగతుడై పదేళ్లు గడిచినప్పటికీ ఆయన పరిపాలన ప్రజల మనసుపొరల్లో సజీవంగా నిక్షిప్తమై ఉంది. ఇంకో వందేళ్లయినా ఆయన ఖ్యాతి నిలిచే ఉంటుంది. – సాక్షి, అమరావతి అజరామరం ఆయన స్ఫూర్తి... వైఎస్ రాజశేఖరరెడ్డి... ఆ పేరే ఓ స్ఫూర్తి. కఠిన కాల పరీక్షకు ఎదురొడ్డి ప్రజల మనసులో దేదీప్యమానంగా వెలుగొందుతున్న దీప్తి. ఎన్నో సిద్ధాంతాలు, పాలనా విధానాలు కాలక్రమంలో కనుమరుగైపోతూ ఉంటాయి. దీనికి వైఎస్సార్ పూర్తిగా మినహాయింపు. ఆయన పరిపాలనా విధానం, ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ, ఎన్నటికీ ఆదర్శనీయం. ఎందుకంటే ఆయన సమాజాన్ని మనసుతో చూసి పాలించారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, సామాజిక పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాలు అత్యంత ఆవశ్యకమైనవిగా సామాజికవేత్తలు గుర్తించారు. వైఎస్ హఠాన్మరణానంతరం ప్రభుత్వాలు ఆయన పథకాలను నీరుగార్చడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆ రాజన్న పాలన మళ్లీ రావాలని ప్రజల గుండెలు తపించాయి. అందుకే ‘ఆనాటి రామరాజ్యం నేను చూడలేదు.. కానీ రాజన్న రాజ్యం చూశాను. నాకు అవకాశం ఇస్తే మళ్లీ ఆనాటి రాజన్న రాజ్యం తీసుకువస్తాను’ అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటను ప్రజలు అంతగా నమ్మారు. తండ్రి పేరును నిలబెట్టే సిసలైన వారసుడిగా గుర్తించి ఆయనకు పట్టాభిషేకం చేశారు. చదివించే బాధ్యత భుజానికెత్తుకున్నారు.. చదవాలనే తపన ఉండి.. కేవలం డబ్బులేక విద్యను మధ్యలోనే ముగించాల్సి రావడం ఆ విద్యార్థిని ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో వర్ణించడం సాధ్యం కాదు. తన బిడ్డను చదివించే స్తోమత లేక నిద్రలేని రాత్రులు గడిపి ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రులు ఎందరో. ఈ పరిస్థితులన్నిటినీ ఒకే ఒక్క పథకం శాశ్వతంగా మార్చేసింది. అదే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఉన్నత విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని వైఎస్సార్ గుర్తించారు. పేద విద్యార్థులను చదివించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు పైసా ఖర్చులేకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఇతర కాలేజీల్లో చదువుకున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన పిల్లలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. మహానేత పాలన ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పేదరికం జబ్బును నయం చేసిన వైద్యుడు పేదరిక నిర్మూలనకు మందు విద్య, ఆరోగ్యమేనని సూత్రీకరించిన సామాజిక వైద్యుడు వైఎస్. అందుకే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి సామాజిక విప్లవం తీసుకువచ్చారు. పేదలు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి వైద్య బీమా పొందేందుకు వైఎస్ ప్రవేశపెట్టిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం’ ఓ సంచలనం. అంతవరకు ప్రీమియం చెల్లించకుండా వైద్య బీమా అందించే పథకం ఏదీ మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఎవరూ ఊహించని రీతిలో లక్షలాదిమంది పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన హయాంలో ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారు. అంతేకాదు 108, 104 వైద్యసేవలతో ఆయన మరో విప్లవం సృష్టించారు. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా, ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి ఆస్పత్రికి సకాలంలో తరలించడం అన్నది దేశంలో అదే మొదటిసారి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న వేలాది గ్రామాలకు 104 వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించేలా చేయడం వైఎస్సార్‌కే చెల్లింది. ఉచిత పథకాలకు పూర్తి వ్యతిరేకం అయిన ప్రపంచ బ్యాంక్ కూడా వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించడం విశేషం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆయన స్ఫూర్తి దేశంలో ఎన్నో రాష్ట్రాలకే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా మార్గనిర్దేశం చేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి నేటికీ అమలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ఆయుష్మాన్ భారత్ ’ పథకం కూడా ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తితో రూపొందించినదే. ఆరోగ్య భారత్ సాధనకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ వైఎస్సారే మార్గనిర్దేశం చేశారు. రాజకీయ సంస్కర్త.. ప్రజలను కేవలం ఓటర్లుగా చూసే గత పాలకుల విధానాలతో భ్రష్టుపట్టిన రాజకీయాలను సంస్కరించిన సంస్కర్త వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజలను సమ దృష్టితో చూడాలన్న విధానాలకు అంతకుముందు ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చేశాయి. తమ పార్టీకి ఓటేశారా?.. ఏ సామాజికవర్గానికి చెందినవారు? మన పార్టీ నేతల సిఫార్సు ఉందా లేదా? అన్నది చూసే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. చివరికి వృద్ధులు, వితంతువుల పింఛన్ల పంపిణీలో కూడా ఇదే నీచ రాజకీయాలు రాజ్యం చేశాయి. మహానేత వైఎస్సార్ తన పాదయాత్రలో ఈ దుస్థితిని చూసి చలించిపోయారు. ప్రజలందర్నీ తనవాళ్లగానే చూడాలన్నది ఆయన సిద్ధాంతం. ఆయన 2004 ఎన్నికల్లో సీఎం కాగానే రాజకీయాలకు అతీతంగా పాలన సాగించారు. శాచ్యురేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను అందించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రయోజనం అందించిన ఘనత ఆయనదే. అందుకే 2009లోనూ ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. వైఎస్ స్ఫూర్తిని ఆయన తదనంతర ప్రభుత్వాలు కొనసాగించలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీల పేరుతో దుష్ట రాజకీయాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ నేతలు పచ్చ ముద్ర వేస్తేనే ప్రభుత్వ పథకాలు అన్న విధానం అమలైంది. దాంతో ప్రజలు వాస్తవాన్ని గుర్తించారు. ‘కులం చూడం.. మతం చూడం.. రాజకీయాలు చూడం.. పార్టీలు చూడం.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం’ అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్ట ప్రకటన పార్టీలకు అతీతంగా ప్రజల మనసును తాకింది. ఆ మహానేత స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ పట్ల ప్రజలు అచంచల విశ్వాసం ప్రకటించారు. వైఎస్సార్సీపీకి అద్వితీయమైన విజయాన్ని అందించి రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చారు. అపర భగీరథుడు.. ప్రపంచీకరణ అనంతర పరిణామాల్లో వ్యవసాయ రంగాన్ని విస్మరించి ఊహాకాశంలో పరుగులు తీస్తున్న పాలకులకు వైఎస్సార్ మట్టి వాసనను మళ్లీ పరిచయం చేశారు. ఆర్థిక సంస్కరణలుగానీ మరే విధానమైనాగానీ వ్యవసాయ రంగమే మూలాధారమని మార్గనిర్దేశం చేశారు. సాగు, నీటిపారుదల రంగాలకు పెద్దపీట వేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అంతకుముందు పాలకులు ‘సాధ్యం కాదు.. కూడదు’ అన్న ఉచిత విద్యుత్‌ను సాకారం చేసి చూపించారు. జలయజ్ఞం పేరుతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం బిగించారు. కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందించేందుకు 86 ప్రాజెక్టులను చేపట్టారు. బీడుబారిన పొలాలను సస్యశ్యామలం చేశారు. రైతులకు బ్యాంకుల నుంచి సకాలంలో నామమాత్రపు వడ్డీకే రుణాలు అందించేలా కృషి చేశారు. మహానేత హఠాన్మరణానంతరం వచ్చిన ప్రభుత్వాల నిర్వాకంతో సాగు, నీటిపారుదల రంగాలకు మళ్లీ గ్రహణం పట్టింది. పంట రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా రైతులను నిండా ముంచారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడ్డారు. జలయజ్ఞం నిలిచిపోయింది. శాశ్వత ప్రయోజనాన్ని అందించే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం తమ అవినీతికి ఏటీఎంగా మార్చుకుంది. పట్టిసీమ వంటి తాత్కాలిక పథకాలతో ప్రజలను కనికట్టు చేసి కోట్లు దోచుకుంది. మరోవైపు సాగునీరు లేక పంటలు దెబ్బతిన్నాయి. రాయలసీమలో పొలాలు బీడువారాయి. రైతులు కూలీలుగా మారి వలస బాట పట్టారు. దాంతో రైతులు మరోసారి రాజన్న రాజ్యం కావాలని కోరుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాసటగా నిలిచి అఖండ విజయాన్ని అందించారు. మహానేత కలను సాకారం చేస్తున్న జననేత ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో పరితపించారు. తనదైన శైలిలో పేదల అభ్యున్నతికి ఒక అడుగు ముందుకు వేసి ఎన్నో వినూత్న పథకాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. అంతలోనే ఆయన మనకెవ్వరికీ అందనంత దూరంగా సుదూర తీరాలకు వెళ్లిపోయారు. ఆయనే కనుక ఉండి ఉంటే అందరి భవిష్యత్ బంగారంలా ఉండేదని అన్ని వర్గాల ప్రజలు అనునిత్యం గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ఆ స్వర్ణ యుగం ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమంటూ మొన్నటి ఎన్నికల్లో పట్టం కట్టారు. ఇది జరిగి నెల రోజులైనా పూర్తవ్వకముందే.. వైఎస్ జగన్ పేదల అభ్యున్నతికి రెండడుగులు ముందుకు వేస్తూ నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్నారు. -
నీరు, నేల సాక్షిగా.. స్వాహా పర్వం
సీఎం చంద్రబాబు తొలుత విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడించిన మేరకు చూస్తే.. పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తయుండాలి. రాష్ట్రం సస్యశ్యామలమై ఉండాలి.. కానీ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లివ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రూ.20 వేల కోట్లు, నీరు–చెట్టు కింద రూ.పది వేల కోట్లు, చెరువులు, వాగులు, వంకల్లో పూడిక తీసిన మట్టి, ఇసుక అమ్మకం ద్వారా రూ.25 వేల కోట్లు.. వెరసి రూ.55 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఎవరైనా ఇంటికి పునాదులు వేసి.. గృహ ప్రవేశానికి రండంటూ అందరినీ పిలిచి భోజనం పెడితే ఏమంటాం? పిచ్చోడంటాం.. లేదా మనందరినీ తప్పుదోవ పట్టించడానికి చెవిలో పూలు పెడుతున్నాడంటాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సరిగ్గా ఇదిగో ఇలానే చేస్తున్నారు. – వైఎస్ జగన్ బాబు పుణ్యమా అని మా బతుకులిలా తగలడ్డాయి.. మాది నిరుపేద కుటుంబం. రెండెకరాల చిన్న రైతును. నాలుగేళ్లుగా చినుకు లేదు. పంటలు పండే పరిస్థితి లేదు. అప్పుడప్పుడు పడ్డ కొద్దిపాటి వర్షానికి కంది, మిరప, పత్తి లాంటి పైర్లు వేసినా ఆ తర్వాత వర్షాల్లేక ఎండిపోవడం మామూలైంది. పంటలు వేయడమే మానుకున్నాం. సేద్యాన్ని పక్కన పెట్టాం. కడుపు నిండాలంటే రెక్కల కష్టం తప్పలేదు. ఇక్కడ పనుల్లేకపోవడంతో వలస వెళ్లక తప్పలేదు. వరి కోతలకు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు.. చెరకు నరకడానికి శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు పోతున్నాం. ఒంట్లో సత్తా ఉన్నన్నాళ్లు నేను వెళ్లే వాడిని. ఇప్పుడు కష్టంగా ఉంది. మా పిల్లలు వెళుతున్నారు. నెల కిందట తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో వరి కోతలకు వెళ్లి.. ఆదివారం తిరిగొస్తుండగా లారీ ప్రమాదంలో మా పిల్లలకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. అలా జరగకుండా ఉన్నట్లయితే గుంటూరు జిల్లాలో వరి కోతలకు వెళ్లేవారు. ఏడేళ్లుగా వలసపోతూనే ఉన్నాం. ఏడాదిలో మూడు నెలలే కూలి ఉంటుంది. దాంతోనే కుటుంబం మొత్తం బతకాల్సి వస్తోంది. బతుకు దుర్భరంగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులను చంద్రబాబు సర్కారు పూర్తి చేయకపోవడంతో ఆయకట్టు రైతులమైన మా బతుకు భారమైంది. పొలాలన్నీ బీళ్లే. తిండి గింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి లేదు. ప్రాణప్రదంగా పెంచుకున్న పశువులను కబేళాలకు తరలించి రైతులందరం ఇతర ప్రాంతాలకు కూలికెళ్లి బతుకీడుస్తున్నాం. మా బతుకులిలా తగలడ్డాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ పనులు వేగంగా జరిగాయి. అప్పుడే పనులు పూర్తయి నీరొచ్చి మా బతుకులు మారతాయన్న ఆశ చిగురించింది. ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండ పనులను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న నమ్మకం ఉంది. – నార్లగడ్డ సుబ్బయ్య, వెంకటరెడ్డి పల్లె, పుల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా ఆయ‘కట్టు’కథలు.. కమీషన్ల పర్వాలు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయి వరుస ఓటములతో కుంగి కుదేలైన టీడీపీని అధికారంలోకి తేవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టుల జపం చేసి, అధికారంలోకొచ్చాక తన అక్రమార్జనకు వాటిని వనరులుగా మార్చుకున్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మినహా మిగతా పెండింగ్ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తానంటూ సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ.. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.63,657.62 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.10,227.92 కోట్లు, నీరు–చెట్టు కింద చేసిన పనులకు రూ.15,806.70 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. మిగతా రూ.37,623 కోట్లను పెండింగ్ ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేశామని చెబుతున్నా ఒక్క ప్రాజెక్టూ పూర్తయింది లేదు. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన రూ.63,657.62 కోట్లను సక్రమంగా వినియోగించుకుని ఉండుంటే.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ దాదాపుగా పూర్తయ్యేవని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జల సంరక్షణ, భూగర్భ జల వనరుల పరిరక్షణ ముసుగులో నీరు–చెట్టు కింద పనులు చేయకుండానే చేసినట్లు చూపి దోపిడీ చేయకుండా ఆ నిధులను పోలవరం ప్రాజెక్టుకు మళ్లించి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చేవని జల వనరులశాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. కమీషన్ల వర్షం కురిపించే కామధేనువులుగా సాగునీటి ప్రాజెక్టులను మార్చేయడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. జలయజ్ఞం కింద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన గుండ్లకమ్మ, పుష్కర, తాడిపూడి, గురురాఘవేంద్ర, భూపతిపాలెం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, తోటపల్లి తదితర 11 ప్రాజెక్టులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులు పూర్తి చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ 11 ప్రాజెక్టులను కేవలం రూ.780 కోట్లతో పూర్తి చేయవచ్చని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనుల్లో పెద్దగా కమీషన్లు రావనే నెపంతో ఆ పనులకు టీడీపీ సర్కార్ ప్రాధాన్యమివ్వలేదు. గాలేరు–నగరి తొలి దశ, హంద్రీ–నీవా తొలి దశ, తెలుగుగంగ ప్రాజెక్టులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. దీనివల్ల 6.45 లక్షల ఎకరాలకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేది. కానీ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన సర్కారు.. పాత కాంట్రాక్టర్లను తొలగించి, కమీషన్లు ఇచ్చిన వారికి పనులు అప్పగించింది. అయినా ఆ పనులను పూర్తి చేయలేకపోయింది. దాంతో నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో.. ఎప్పుడో పూర్తయి, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు మళ్లీ ప్రారంభించి.. అది తన ఘనతగా చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతుండటంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వరకూ ఇదే కథ. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి 199.04 లక్షల ఎకరాలుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోరు బావుల కింద 104.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందేవి. కానీ నాలుగున్నరేళ్లుగా ఆయకట్టు తగ్గిపోతూ వస్తోంది. గరిష్టంగా 76 లక్షల ఎకరాలకే సాగునీరు అందించినట్లు జల వనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. కానీ.. క్షేత్ర స్థాయిలో ఆ మేరకు కూడా సాగునీళ్లు అందిన దాఖలాల్లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పొలం వదిలేసి.. డ్రైవర్‌గా వెళ్తున్నా... నాకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఓ కుమార్తెకు పెళ్లి చేశా. మరో కుమార్తె ఇంటర్, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాకు నాలుగెకరాల మామిడి తోట ఉంది. మూడేళ్లుగా కాపు తగ్గుతూ వస్తోంది. బోరు బావి తవ్వాలంటే రూ.80 వేలవుతోంది. అంత డబ్బు పెట్టలేని పరిస్థితి. పోనీ అప్పు తెద్దామన్నా ఆర్థికంగా చితికిపోయిన నాకు ఎవరిస్తారు? అప్పు దొరికే పరిస్థితి లేదు. తోటలో చెట్లన్నీ ఎండిపోయాయి. కష్టాలన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఒకప్పుడు ఎంతో మంది కూలీలకు పని కల్పించిన నేను.. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్‌ను కూడా అమ్మేశాను. పండ్ల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ కూలీగా పని చేసేందుకు మహారాష్ట్రకు కూలీగా వెళ్లాను. అక్కడ భాష రాక బతుకు భారమై మళ్లీ ఇంటికొచ్చాను. పొట్టకూటి కోసం ఇక్కడే ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నా. చంద్రబాబు సర్కారు అన్నదాతలను ఆదుకోదని తేలిపోయింది. నా గోడు వినేవారు లేరు. వైఎస్ జగన్ వస్తేనే మళ్లీ నాకు మునుపటి బతుకు వస్తుంది. ఆయనే ఉచితంగా బోరు వేయిస్తానన్నారు. పెట్టుబడికి డబ్బులు కూడా ఇస్తానన్నారు. ముఖ్యంగా మా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తవుతాయి. మా పొలాలకు నీరొస్తుంది. – అమ్మనబ్రోలు నాగయ్య, కొల్లూరుపాడు, ఉలవపాడు పంచాయతీ, ప్రకాశం జిల్లా. చంద్రబాబు ఇలా చెప్పారు.. చంద్రబాబు 2014 ఎన్నికప్పుడు.. అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ దశల వారీగా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి గ్రావిటీ ఆయకట్టుకు నీళ్లందిస్తాం. నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తాం. సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను మళ్లించి రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చంద్రబాబు చేసిందిదీ..: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేశారు. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో రూ.37,952.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 23 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మాత్రం రూ.96,060.73 కోట్లకు పెంచేశారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.58,107.86 కోట్లు పెంచేశారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున కమీషన్లు తీసుకున్నారనేది స్పష్టమవుతోంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నారు. ఆ తర్వాత పనులన్నీ నామినేషన్‌పై కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఇంకా నోటిఫై చేయక ముందే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంటున్నా, ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అదనపు నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదు. కృష్ణా నదీ జలాల విషయంలోనే కాదు.. గోదావరి జలాలపై రైతుల హక్కుల పరిరక్షణలోనూ అదే కథ. చివరకు వంశధార జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను కూడా పరిరక్షించలేకపోయారు. అపర భగీరథుడు వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధికెక్కింది. కానీ 1995 నుంచి 2004 వరకు వరుస కరవులతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే రైతులు ఆకలితో అలమటించారు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను మళ్లించి.. బంజరు భూములను సస్యశ్యామలం చేసి, కరవును శాశ్వతంగా తరిమికొట్టేందుకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. తె లుగునేలను కరువనేదే ఎరుగని సీమగా మార్చాలని, దేశ ధాన్యాగారంగా నిలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ నామధేయాన్ని సార్థకం చేసి.. రైతేరాజు అన్న నానుడిని నిజం చేసే దిశగా వేగంగా అడుగులేశారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా, 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయడం ద్వారా 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్.. జలయజ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమరుడయ్యారు. మహానేత స్ఫూర్తి.. అదే ఆర్తి.. తెలుగునేలను సుభిక్షం చేయడానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞాన్ని చేపడితే.. దాన్ని పూర్తి చేసి, ఫలాలను రైతులకు అందించే గురుతర బాధ్యతను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకున్నారు. ఆయన ప్రకటించిన నవరత్నాలలో జలయజ్ఞానికి పెద్దపీట వేశారు. మహానేత చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసే సమర్థత.. ప్రణాళిక ఒక్క వైఎస్ జగన్‌కే ఉన్నాయని సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, రైతులు స్పష్టీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను సమీక్షించి.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తాం. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కడలి పాలవుతున్న గోదావరి జలాలను పొలాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను దేశపు ధాన్యాగారంగా తీర్చిదిద్దుతాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తాం. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తాం. వంశధార, తోటపల్లి, జంజావతి, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తిచేసి ఉత్తరాంధ్రను సుభిక్షం చేస్తాం. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ, గుండ్లకమ్మ, సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించి, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీళ్లందించేలా చూస్తాం. నిర్వాసితులుగా మారిన ప్రజలకు పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. -
‘బోథ్’ ఎవరిదో?
సాక్షి, ఇచ్చోడ(బోథ్) : పోరాటాల పురిటి గడ్డ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు ఈ సారి ఎవరిని ఆదరిస్తారు? ఏ పార్టీకి ఓటేస్తారు.. అనేది ఆసక్తిగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని తీవ్ర ఉత్కంఠ మధ్య శనివారం ప్రకటించడంతో బరిలో నిలిచే వారెవరనేది తేలిపోయింది. నామినేషన్ల గడువు కూడా సమీపిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో బోథ్ నియోజకవర్గ అభ్యర్థుల అనుకూల, ప్రతికూలతలపై కథనం. కొత్తగా బరిలో కమలం బోథ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మాడవి రాజు బరిలో ఉండనున్నారు. గతంలో 2009లో బీజేపీ నుంచి పోటీ చేసిన అడే మానాజీకి టికెట్ ఇవ్వకుండా మాడవి రాజుకు టికెట్ ఇచ్చారు. ఇతను గోండు సామాజిక వర్గానికి చెందిన వారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పథకాలు, హిందుత్వం కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. గోండు సామాజిక వర్గం అభ్యర్థి కావడంతో కొంత ఓటర్లను ఆకర్శించే అవకాశం ఉంది. ప్రతికూలతలు.. నియోజకవర్గంలో గ్రామీణ స్థాయిలో బీజేపీ పార్టీకి సరైన కేడర్ లేకపోవడం. – బలమైన నాయకత్వం లేకపోవడం. బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి మాడవి రాజు స్థానికేతరుడు కావడం. చాలా కాలం తర్వాత బీఎస్పీ అభ్యర్థి: చాలా కాలం తర్వాత బోథ్ నియోజకవర్గంలో బీస్పీ అభ్యర్థి బరిలో దిగుతున్నారు. 1999లో బోథ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి రాములునాయక్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి బీఎస్పీ నుంచి బోథ్ బరిలో ఎవరూ లేరు. నేరడిగొండ మండలానికి చెందిన లంబాడా సామాజిక వర్గానికి చెందిన అడే గజేందర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు. గజేందర్ రాజకీయాలకు కొత్త. బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సరిపోవనే భావన ఉంది. పథకాలే అధికార పార్టీకి అండ.. అనుకూలతలు టీఆర్ఎస్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్న రాథోడ్ బాపురావు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 ఎన్నికల్లో అనుహ్యంగా బోథ్ బరిలో దిగిన రాథోడ్ బాపూరావు టీఆర్ఎస్ నుంచి పోటీచేసి మొదటి సారికే విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. బీటీ రోడ్ల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా నిర్మించిన చెరువులు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, గొముత్రి వద్ద బ్యారెజీ, కుప్టి ప్రాజెక్టు మంజూరు, తదితర అభివృద్ధి పనులు చేయడంతో ఆశలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చే హామీలు ఓటర్లను ఆకర్షించనున్నాయి. ప్రతికూలతలు బోథ్ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రాథోడ్ బాపూరావు మరోసారి గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ రెండోసారి గెలుపు కోసం రాథోడ్ బాపురావు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు నెలకొననున్నాయి. గత రెండేళ్ల నుంచి సొంత పార్టీలోనే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్రూపులు ఉండడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పథకంలో చెరువులు నిర్మించినా కాలువలు లేక సాగునీరు అందడం లేదు. దీంతో రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. జలయజ్ఞంలో నిర్మించిన చెరువులకు ఇప్పటి వరకు కాల్వలు నిర్మించపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు మండలాల్లో దళితులకు అధికంగా మూడెకరాల భూ పంపిణీ జరిగింది. కానీ ఇతర మండలాల్లో రెండు, మూడు గ్రామాల్లో మాత్రమే భూమి పంపిణీ చేయడంతో దళితులు అసంతృప్తితో ఉన్నారు. తాంసి మండలంలోని బండలనాగపూర్లో మాత్రమే డబూల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేశారు. ఇతర మండలాల్లో వీటి నిర్మాణం లేకపోవడంతో లబ్ధిదారులు నిరాశతో ఉన్నారు. ఇచ్చోడ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, సిరికొండ, భీంపూర్ మండలాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు, వంతెనలు మంజూరు చేయలేదు. ఇచ్చోడ మండల కేంద్రంలో నాలుగేళ్లలో టీఆర్ఎస్ హయాంలో రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, తాగునీటి సమస్యలు తీరలేదు. నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో డిగ్రీ చదువుల కోసం విద్యార్థులు నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాలకు వెళ్లడం కూడా సమస్యగా మారింది. ఆదివాసీ ఉద్యమ ప్రభావం -
‘వైఎస్ఆర్ వల్లే ప్రాజెక్టులకు జలకళ’
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లి మిడ్ మానేరు గండిని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మిడ్ మానేరు గండికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరినట్లు పరిహారం చెల్లించకుంటే మిడ్ మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి, 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
జలయజ్ఞంలో దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత
-
‘తారకరామా’.. ఇది సాధ్యమా..!
‘తారకరామ తీర్థసాగర్’ను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మరోసారి మంత్రి హామీ తొమ్మిదేళ్లలో పూర్తి చేసింది 40 శాతమే.. ఈ కొద్ది కాలంలో ఎలా సాధ్యమో..? విజయనగరం కంటోన్మెంట్ : తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఎప్పటికో పూర్తవుతుందో తెలియదు గానీ.. మన నాయకులకు మాత్రం అది ‘హామీ’లిచ్చేందుకు చాలా ఉపయోగపడుతోంది. పూర్తి కావడం సాధ్యం కాని ఈ పనులకు హామీల మీద హామీలు, గడువుల మీద గడువులు ఇవ్వడం నాయకులకే సాధ్యమైంది. జలయజ్ఞంలో భాగంగా 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన తదనంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పదేళ్ల కాలంలో కేవలం 40 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని ఇటీవల పరిశీలనకు వచ్చిన సందర్భంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రైతాంగం విమర్శిస్తోంది. డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాలకు సాగునీరు ఇచ్చేందుకు నెల్లిమర్ల మండలం కుమిలి వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు బ్యారేజీని గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మించారు. మొత్తం 24,710 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టును ప్రారంభించారు. సాగునీటితోపాటు విజయనగరం పట్టణానికి 0.162 టీఎంసీల తాగునీరు కూడా సరఫరా చేసేందుకు నిర్ణయించారు. తొమ్మిదేళ్లుగా చేపట్టిన పనులు కేవలం 40 శాతంలోపునే ఉన్నాయని స్వయంగా అధికారులే చెబుతున్నారు. రిజర్వాయరు వద్ద, కాలువల తవ్వకాలకు సంబంధించి ఇంకా భూ సేకరణ చేపట్టలేదు. 2.70 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయరు నిర్మాణాన్ని, కాలువల పనులను.. సక్రమంగా పరిహారాలు ఇవ్వలేదని నిర్వాసితులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రారంభంలో రూ.220.11 కోట్లు అంచనా వేశారు. ఇప్పుడు రూ.475 కోట్లకు పెరిగింది. గడువు మీద గడువు ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలైన నెల్లిమర్ల మండలం కోరాడపేట, వీటీ అగ్రహారం, పడాల పేటలకు సంబంధించి ఆర్ఆర్ ప్యాకే జీని ఇంకా అమలు చేయలేదు. ప్రాజెక్టుల నిర్మాణ రంగంలోనే భిన్నమైన దీని ప్లాన్‌పైన చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొలుత రూ.181 కోట్లు విడుదల చేశారు. 2008కి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభంలో భూములు కోల్పోతున్న రైతులు, నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో 2008 వరకూ పనులు మొదలుకాలేదు. అప్పటినుంచి రెండేళ్లకు.. అంటే 2010కి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికావాలి. ఇది రెండో గడువు. ఆ తరువాత 2014, 2015లకు గడువు పెంచారు. మరోసారి చివరగా 2017 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువు విధించారు. ఇప్పుడేమో మరోసారి ఈ ఆగస్టు నాటికే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పడం ఎంత వరకూ సాధ్యమని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల్లో ఎలా సాధ్యం? గుర్ల మండలం ఆనందపురం గ్రామం నుంచి నెల్లిమర్ల మండలం కుమిలి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ మధ్య 13.428 కిలోమీటర్ల పొడవు కాలువను నిర్మిస్తున్నారు. ఈ పనులతోపాటు డెంకాడ, భోగాపురంలలో భూ సేకరణ చేయాల్సి ఉంది. మరో పక్క రామతీర్థం కొండలోనుంచి టన్నెల్‌కు అనుమతులు రావాలి. ఇవన్నీ మూడు నెలల్లో సాధ్యమా? ఇది మంత్రిగారికి తెలియదా? లేక అధికారులు చెప్పలేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మళ్లింపు కాలువ పనులకు గుర్ల గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద అనుమతులు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నుంచి రైల్వే డిపార్ట్మెంట్ అడిగిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రైతులకు పరి హారం ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో బాధిత రైతులు ఎప్పటికప్పుడు పనుల ను అడ్డుకుంటున్నారు. -
‘భారీ’లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యం
జూరాల : వచ్చే ఖరీఫ్‌లో జిల్లాలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టుల నుంచి 3.71లక్షల ఆయకట్టుకు నీళ్లివ్వాలన్న అధికారుల లక్ష్యం నెరవేరేలా లేదు. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు చేపట్టేందుకు 2005లో ప్రభుత్వం రూ.6403కోట్ల అంచనా వ్యయంతో జలయజ్ఞం ద్వారా పరిపాలన అనుమతులు ఇచ్చింది. 2009 వరకు పనులు వేగవంతంగా కొనసాగినప్పటికీ ఆ తరువాత నిధుల కొరత, భూసేకరణ సమస్యలతో నిర్లక్ష్యానికి గురయ్యాయి. 2010నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు రూ.7208కోట్లు ఖర్చుచేశారు. అయినా అధికారికంగా ఏ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లిచ్చిన పరిస్థితి లేదు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీళ్లిచ్చారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలోనూ మొదటి స్టేజ్‌లో నామమాత్రంగా నీటిని విడుదల చేశారు. భీమా ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి. జూలై చివరినాటికి(ఖరీఫ్‌కు) పనులను ఆయకట్టుకు నీళ్లిచ్చేలా సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఎకరా భూమిని కూడా సేకరించలేకపోయారు. దీంతో కీలకమైన పనులు నిలిచిపోయాయి. రాజీవ్ భీమా ఎత్తిపోతల రెండోలిఫ్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు పూర్తిచేశారు. భీమా నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ద్వారా, మక్తల్, దేవరకద్ర, తదితర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ఈ ప్రాజె క్టు సంగంబండ ఎత్తిపోతల ద్వారా, స్టేజీ-2 కొత్తకోట లిఫ్టు ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు కనీసం 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. ఖరీఫ్ వరకు పనులు పూర్తిచేసేందుకు రూ.110కోట్లు కేటాయించాలని కోరగా ప్రభుత్వం రూ.83.50కోట్లు మాత్రమే కేటాయించింది. ఎంజీఎల్‌ఐ పథకం మొదటి పంప్‌హౌస్ ద్వారా 13వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి, ఇప్పటికే ట్రయల్న్‌న్రు విజయవంతం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మొదటి పంపు ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టులో పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించగా రూ.119కోట్లు మాత్రమే కేటాయించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌లో మొదటి పంపు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందేందుకు పనులు పూర్తిచేశారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి అనుబంధ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసే కాల్వలు పూర్తిచేయడంతోపాటు 40వేల ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుత ఖరీఫ్ పంటలకు నీటివిడుదల ప్రారంభించారు. అయితే అన్ని రిజర్వాయర్ల కింద డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్ చానల్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనుల పూర్తికి రూ.100కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా.. రూ.79కోట్లు మాత్రమే ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నాటికి రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించగా పనులు పూర్తికాలేదు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ఖరీఫ్‌లో 25వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే లక్ష్యం నిర్ణయించారు. పనులు పూర్తిచేసేందుకు పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.25కోట్లు కేటాయించారు. లక్ష్యం మేరకు నీళ్లిస్తాం.. నాలుగు ప్రాజెక్టు పరిధిలో ఖరీఫ్‌కు 3.71లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అవసరమైన పనులకు భూసేకరణ సమస్యగా ఉంది. దీనికితోడు కాంట్రాక్టర్లు జీఓనెం.13 ప్రకారం కొత్త రేట్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో పనులు వేగవంతం చేయడం లేదు. ఈ సమస్యలను అధిగమించి వచ్చే సీజన్లో నీళ్లిచ్చేందుకు ముందుకు సాగుతున్నాం. - ఖగేందర్, ప్రాజెక్టుల సీఈ -
వరాలు పారేనా..జలాలు పొంగేనా!
రాళ్ల సీమలో రతనాలు పండించాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల. రెండు టీఎంసీల సామర్థ్యం కలిగిన అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో 4 టీఎంసీలకు పెంచేందుకు జలయజ్ఞం చేపట్టారాయన. కర్నూలు, కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు.. జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు.. 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించే ఉద్దేశంతో రూ.790 కోట్లు కేటాయించారు. 2010 నాటికి ఒక సొరంగం ద్వారా వైఎస్ఆర్ జిల్లా గండికోటకు నీటిని అందించాల్సి ఉంది. వైఎస్ఆర్ అకాల మరణం.. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కొనసాగించిన కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇక టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పనుల్లో పురోగతి లోపించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా అవుకు మండలంలో పర్యటించనుండటంతో అనుకూలమైన ప్రకటన చేస్తారనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. - కోవెలకుంట్ల ► 30వ ప్యాకేజీ కింద సొరంగ నిర్మాణానికి సంబంధించి రూ.332.89 కోట్ల పనులు పూర్తి కాగా.. మరో రూ.69 కోట్లు కేటాయించాల్సి ఉంది. ► వంద మీటర్ల మేర ఆడిట్, ఎగ్జిట్ ప్రాంతాల్లో లైనింగ్ పనులు చేపట్టాలి. ► ఎంట్రెన్స్ నుంచి ఆడిట్ ప్రాంతంలో కొంత భాగం సొరంగ పనులతో పాటు లైనింగ్ పూర్తి చేయాలి. ► ఏడాది క్రితం ఎర్రమల కొండల్లో కురిసిన భారీ వర్షాలతో టన్నెల్లోకి వర్షపు నీరు చేరి బ్రేక్ పడిన పనులను పునరుద్ధరించాలి. ► 29వ ప్యాకేజీ కింద వరద కాల్వ నిర్మాణం పూర్తయినా అటవీ శాఖ అనుమతి రాకపోవడంతో పెండింగ్‌లో అరకిలోమీటరు పనులు. ► 47వ ప్యాకేజీ కింద జీఎన్ఎస్ఎస్ కాల్వ నిర్మాణం పూర్తయినా.. కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల స్ట్రక్చర్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. -
జనసంక్షేమానికి వేగుచుక్క
వ్యవసాయం, సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాకాశంలోకి దూసుకొచ్చిన ధృవతార వైఎస్. సాగునీటి కోసం తను చేపట్టిన జలయజ్ఞం పురాతన కాలంలో మన పూర్వీకులు చేసిన అశ్వమేధ, రాజసూయ యాగాల వంటి పవిత్రమైన పథకం. హామీలు దాటేయటం పాలకులకు అలవాటుగా మారుతున్న కాలంలో ఆయన పథకాలు జనం మరువని జ్ఞాపకాలు. కనుమరుగైనప్పటికీ, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన జననేతే. ఆయన కనుమరుగై నేటికి సరిగ్గా అయిదేళ్లు. కానీ ప్రజా రాజకీయాల్లో ఓ వేగుచుక్క లాగ నేటికీ జన నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. వ్యవసాయం దండగ అంటూ తొమ్మిదేళ్లపాటు రైతుల ఊపిరిని నలిపివేసిన చంద్రబాబు నాయుడి పాలనపై గురిపెడుతూ ఆయన అప్పట్లో మొద లెట్టిన పాదయాత్ర యావత్ దేశాన్నీ ఆకర్షించింది. గెలిచిన తర్వాత కూడా ఏం చెప్పారో దాన్నే చేసి చూపారు. చెయ్య లేమనుకున్నది చెప్పనన్నారు. అధికారంలోకి రాక ముందు, వచ్చాక, ఇప్పుడు కనుమరుగయ్యాక కూడా రాష్ట్ర ప్రజలకు ఆయన విధానాల గొప్పతనం అర్థమవుతూనే ఉంది. ఆయనకు ముందూ, ఆ తర్వాతా అనే కొల మానంతోనే ప్రజలు ఇవ్వాళ పాలకులను బేరీ జు చేస్తున్నారు. గెలుపుకోసం రుణమాఫీలు, గెలిచాక హామీలు దాటేయటాన్ని పాలకులు అలవాటుగా చేసుకుంటున్న కాలంలో ఆయన పథకాలు ప్రజలు ఏనాటికీ మర్చిపోని జ్ఞాపకా లు. ఈ గడ్డమీది రైతులకు సాగునీరందిస్తే జన్మ సార్థకమవుతుందంటూ తాను పదే పదే చేసిన ప్రకటనను జనం నేటికీ మర్చిపోవడంలేదు. ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, అవమానాలైనా దిగమింగి తన లక్ష్యం సాధించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించిన విధానాలు నేటికీ ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. సంక్షేమానికి చిరునామా.. సంక్షేమ పథకాల అమలులో దక్షిణ భారత దేశంలోనే ఆయన సరిజోడులు అన్నాదురై, ఎన్టీఆర్ మాత్రమే. 1960లలో తమిళనాడు శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో రూపాయికు ఒకటిన్నర కేజీల బియ్యం పథకాన్ని డీఎంకే పార్టీ అధినేత అన్నాదురై ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఆ పథకాన్ని చేపట్టి, విజయవంతంగా కొనసాగించారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివగంత ఎన్టీఆర్, ఎన్నికల ప్రచారంలో, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు పరుస్తామని చెప్పారు. గెలిచాక ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా ఆ పథకాన్ని ఆయన దిగ్విజయంగా అమలు పరిచారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తాననీ, విద్యుత్ బకాయిలను దాదాపు రూ.12 వందల కోట్ల మేరకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచాక తన మొదటి సంతకం ద్వారా ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆ తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టి, అమలు పరిచిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ పథకాలను ఆయన అమలు పరచటానికి మునుపు ఆ తర్వాత కూడా ప్రపంచ బ్యాంకు సరళీకృత ఆర్థిక విధానాల, ప్రైవేటీకరణ విధానాల నేపథ్యంలో ప్రభుత్వం క్రమంగా తన ఉనికిని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దేశీయ కార్పొరేట్ రంగం ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే దశ కూడా వైఎస్‌కు మునుపు మనకు స్పష్టంగా కనిపించేది. వ్యవసాయం పండుగ వ్యవసాయ రంగమే కాదు. సాగునీటి రంగం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన కాలమది. ఈ నేపథ్యంలో వైఎస్ ప్రజలపట్ల తనకున్న అనురక్తిని కోల్పోకుండా వారి అభివృద్ధి కోసం తన సొంత పార్టీలోని అధిష్టానాన్ని ఒప్పించారు. మరోవైపున స్థానిక నాయకులు, సంప్రదాయ ఆలోచనా విధానాలను నమ్మే ఆర్థిక రంగ పండితుల పలుకుబడి నుండి బయటపడి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ‘వ్యవసాయం పండుగ’ అనే వైఎస్ నినాదం, చంద్రబాబు గారి ‘వ్యవసాయం దండుగ’అనే ప్రచారానికి ప్రత్యామ్నాయంగా నిలిచి రైతాంగంలో కొత్త ఆశలు రేపింది. భగీరథ యత్నం రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల్లోని నీటిని నిల్వ చేసి క్రమబద్ధీకరించి గ్రామీణప్రాంతాల పురోభివృద్ధికై తెలుగునాట 83 సేద్యపు నీటి ప్రాజెక్టుల ద్వారా జలయజ్ఞం పథకాన్ని ప్రారంభించారు. జలయజ్ఞంపై ఎల్లో మీడియా అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ దుమారం సృష్టించాలని ప్రయత్నించింది. ప్రతి ప్రాజెక్టు దగ్గర బహిరంగ చర్చలు నిర్వహించి ఆ ప్రచారంలోని డొల్లతనాన్ని వైఎస్ ఆనాడు ఎండగట్టారు. నేటికి కూడా వైఎస్ వ్యతిరేకులు ప్రత్యేకించి చంద్రబాబు, రామోజీ బృందం అదే అవినీతి ఆరోపణలు కొనసాగిస్తున్నారు. జలయజ్ఞం పథకాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పథకంగా చంద్రబాబు చెబుతున్నారు. ఈ పథకాలన్నీ తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్, చంద్రబాబు శంకుస్థాపనలు చేసినవే. హంద్రీనీవా కావచ్చు.. తెలంగాణకు నెట్టెంపాడు కావచ్చు,. అవి ఎత్తిపోతల పథకాలే. వైఎస్ వాటిని అమలు పరిచారు. ఆ పథకాల ద్వారా తెలంగాణకు, రాయలసీమకు కృష్ణా జలాలు తరలిరావడాన్ని చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు? నేడు వంద కోట్లు హంద్రీనీవాకు కేటాయించడంలో బాబు ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా మనకు అర్థమవుతోంది. తన పాలనలో ఏలేరు కుంభకోణం, పీఏబీఆర్, వేమన, చిత్రావతి, రిజర్వాయర్ ప్రాజెక్టుల్లో తెలుగుగంగ వెలుగోడు రిజర్వాయర్ హౌక్ రిజర్వాయర్ల నిర్మాణాల్లో ఆయన పాలనలో జరిగిన అవినీ తి గురించి ఏం మాట్లాడతారు...? జలయజ్ఞంపై విమర్శలు చేయడం చంద్రబాబు సేద్యపు నీటి రంగం పట్ల అతనికి వున్న ఆజ్ఞానాన్ని ప్రదర్శించడం కాకపోతే మరేమిటీ..? పవిత్ర జలయజ్ఞం జలయజ్ఞంతోపాటు ఏ ప్రాజెక్టులూ ఆగ మేఘాల మీద చేపట్టినవి కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా, గోదావరి బ్యారేజీలు, పోచంపాడు ప్రాజెక్టు వంటి అనేక ప్రాజెక్టులు సంవత్సరాల పాటు నిర్మాణంలో కొనసాగినవే. ప్రాజెక్టులపై పెట్టుబడి తక్షణ ఫలితాలు ఇవ్వాలని కోరుకోవడమే అజ్ఞానం. వైఎస్ జలయజ్ఞం పథకం కృష్ణా, గోదావరి బ్యారేజీల్లాగ శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లాగ కలకాలం నిలిచిఉంటుంది. అంతేకాని అది ఇంకుడు గుంతలు, వాటర్‌షెడ్ పథకాల వంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది పురాతన కాలంలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం లాంటి పవిత్రమైన పథకం. వైఎస్ తాను చేసిన ఎన్నికల వాగ్దానాలు కాకుండా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ, ఉచిత వివాహాలు, ఇందిరమ్మ ఇళ్లు, లాంటివి ఎన్నో కొత్త పథకాలు అమలు పరిచారు. నేడు వైఎస్‌ను రేయింబవళ్లు ఆడిపోసుకుంటున్న చంద్రబాబు తాను చేసిన రూ. లక్ష రెండు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ గురించి ఏమి చెబుతారు? అన్ని రకాల రైతన్నల అప్పులు, డ్వాక్రా మహిళా రుణాలు అప్పులు, చేనేత రుణాలు రద్దు చేస్తానని మరెన్నో ఉచిత హామీలు ఇచ్చిన చంద్రబాబుకు వైఎస్‌ను విమర్శించే అర్హత ఉందా..? జగన్ మోహన్‌రెడ్డి, చంద్రబాబు రుణమాఫీ గురించి అసెంబ్లీలో చర్చను లేవనెత్తుతారని తను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు సంధిస్తారని తెలిసి అసెంబ్లీ మోహం చాటేయడం కన్నా, పలాయనవాదం కన్నా మరికొటి ఏదైనా ఉందా..? వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు ఆరోగ్యకరమైన రీతిలో అసెంబ్లీలో సమాధానాలు ఇచ్చేధైర్యాన్ని బాబు ప్రదర్శించలేకపోతున్నారు. ఆ లోటు తీరేదెన్నడు? నేడు దేశంలో స్పష్టంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పెట్టుబడిదారీ వర్గాలకు బహటంగా తమ తలుపులు తెరవడం మనం గమనిస్తున్నాము. కార్పొరేట్రంగాలకు ఎర్రతీవాచీ పరచడం మనం చూస్తున్నాము. వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని చివరకు రక్షణ రంగంలో సైతం విదేశీ పెట్టుబడులకు ఎర్రతీవాచీ పరచడం ఎంత వరకు స్వదేశీయ పాలనకు నిదర్శనంగా ఉండగలదో.. ప్రజలు తీవ్రంగా ఆలోచించాలి. విద్యా రంగంలో ప్రైవేటీకరణకు శరవేగంతో పథకాలు రూపొందించబడుతున్నాయి. రైతులకు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, సాగునీటి రంగానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగాన్ని బలహీన పరిచి కార్పొరేట్ సంస్థలకు జాతి వనరులను తాకట్టుపెట్టే ఆందోళనకర పరిస్థితి మనం చూస్తున్నాము. అంతా విదేశీ పెట్టుబడులు, విదేశీ విధానాల పలుకుబడి మన పాలనా రంగంలో ప్రభుత్వంలో జోక్యం ద్వారా జరుగుతూ ఉంటే ఇక మనది అనే పాలనకు ప్రత్యేకించి భారతీయ ప్రజాస్వామ్యానికి అర్థం ఏమి ఉంది? నిజంగా జాతిని, ఈ రాష్ట్రాన్ని కలవరపరుస్తున్న పరిస్థితులు ఇవే. ఇటువంటి పాలనను, విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించి, ప్రభు త్వ రంగ సంస్థలన్నీ బలోపేతం చేసి వైఎస్ చేసిన పాలన ఈ రోజు జాతికి అవసరం. వ్యవసాయం సేద్యపు నీటి రంగం, విద్యుత్ రంగం, విద్యా రంగం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో నూతన స్థాయికి తీసుకెళ్లిన ఖ్యాతి వైఎస్‌దే..! వైఎస్‌కు ఆయన ఆచరణకు, ఆలోచనలకు మరణం లేదు. నేడు సంక్షోభ పరిస్థితుల్లో వైఎస్ ఆలోచనలు ప్రజలను వెంటాడుతున్నాయి. వాటిని సజీవంగా నిలపడానికి, ఆయన పథకాల కొనసాగింపునకు జగన్మోహన్రెడ్డి నాయకత్వాన వైఎస్సార్ పార్టీ కృషి చేస్తోంది. ఆయన రాజకీయాల్ని కొనసాగించే వారసత్వానికి వైఎస్ వర్ధంతి సందర్భంగా జేజేలు...! వైఎస్‌కు జోహారులు. (వ్యాసకర్త కదలిక ఎడిటర్) -
భూతంలా జలయజ్ఞం!
హైదరాబాద్: జలయజ్ఞాన్ని భూతంలా చూపించి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే సాగునీటి రంగంపై శ్వేతపత్రం రూపొందించడానికి కసరత్తు కొనసాగిస్తోంది. శ్వేతపత్రం రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మీద నిందలు మోపే విధంగా శ్వేతపత్రాన్ని రూపొందించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగింపు దశలో ఉన్న పులిచింతల, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ వంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉన్నా వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఫలితాలు అందుతాయి. అలాంటి ప్రాజెక్టుల పనుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం జలయజ్ఞాన్ని భూతంలా చూపించాలని తాపత్రయపడుతోంది. ఇదే తపన ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చూపిస్తే వేలాది ఎకరాలకు నీరు అందేది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా పైసా ఇవ్వని విషయం తెలిసిందే. అయితే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇదే జలయజ్ఞంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై అధికారుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
సాగునీరు లేక రైతన్నలు..
సాగునీరు ఉండి వినియోగించుకునే అవకాశం లేక రైతన్నలు..తాగునీరు లేక జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. రైతు పక్షపాతిని అని చెప్పుకునే ప్రభుత్వానికి రైతుల అవస్థలు పట్టకపోవడం విశేషం. దీంతో రైతులు పొలాల అమ్మకాల బాట పట్టారు. అలాగే ప్రతిఇంటికీ తాగునీరు సక్రమంగా అందిస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం గొప్పలు..ఆచరణలో కానరాకపోవడంతో గొంతెండి పోతున్న ప్రజలు దాహం తీర్చుకోవడానికి మంచినీటి కొనుగోలు బాట పట్టారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు తయారైంది జిల్లాలోని సాగునీటి పరిస్థితి. సముద్రంలోకి వృథాగా పోతున్న నదీ జలాల్లో సుమారు 16టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకునే సౌకర్యం లేకుండా పోయింది.జలయజ్ఞం కింద ఒకేసారి నాలుగు భారీ ప్రాజెక్టులను జిల్లాలో చేపట్టి అపర భగీరథుడిగా నిలిచిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులకు తూట్లు పొడిచింది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు సాగునీటి చింత తీరడం లేదు. దీంతో రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములను రియల్ ఎస్టేట్లకు విక్రయించుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారు. తోటపల్లిపై గంపెడాశలు జిల్లాలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో తోటపల్లి అతి ముఖ్యమైనది. లక్షా 20వేల ఎకరాల ఆదనపు ఆయకట్టు కోసం చేపట్టిన తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ ఒక ప్రహసనంగా మారింది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నంతసేపు చకాచకా సాగిన పనులు ఆయన మరణాంతరం పడకేశాయి. నిధుల విడుదలలో సర్కారు నిర్లిప్తంగా వ్యవహరించడంతో పనులు నిలిపివేసి కాంట్రాక్టర్ పలాయనం చిత్తగించారు. నేటికి 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 40 కిలోమీటర్ల పొడవునా చేపట్టిన కాలువల తవ్వకం జరగాలి. కాలువను నాలుగవ, 32వ, 40వ కిలోమీటర్ల వద్ద అనుసంధానించాలి. లైనింగ్ పనులు పూర్తిచేయాలి. ఈ పనులు పూర్తయితే 35వేల ఎకరాలకు అదనంగా సాగునీరందించడానికి అవకాశం ఉంది. జంఝావతి జంఝాటం నలభై ఏళ్ల కల సాకారం కావడం లేదు. 24,640ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో ప్రతిపాదించి న ఈ ప్రాజెక్టు అసలు పూర్తవుతుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఒడిశా ప్రభుత్వంతో నెలకొన్న వైరమే దీనికి కారణం. వివాదాన్ని పక్క న పెట్టి సుమారు 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఆస్ట్రియా పరిజ్ఞానంతో రూ.5కోట్ల వ్యయంతో రబ్బర్‌డ్యామ్ ప్రాజెక్టు నిర్మించి కాసింత ఉపశమనం కలిగించారు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు పరితపించారు. ఇంతలో వైఎస్ మరణించడంతో, తర్వాత పట్టించుకునే వారు లేకపోయారు. ఇప్పుడైనా ఒడిశాతో సంప్రదింపులు చేసి జంఝావతికి మోక్షం కల్గిస్తారో లేదో చూడాలి. సాగుతున్న తారకరామతీర్థ సాగర్ పనులు వైఎస్సార్ ఎంతో సదుద్దేశంతో చేపట్టిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులను ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని నత్తనడకన సాగుతున్నాయి. ఏదో ఒక వివాదంతో ఎప్పటికప్పుడు పనులు నిలిచిపోవడమే తప్ప వేగవంతమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. నేటికి 25శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తయినా ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, ఎడారిలా మారిపోతున్న పంట పొలాలు రియల్ ఎస్టేట్ కింద విక్రయాలు జరిగిపోవడంతో కొన్నాళ్లకు సాగు భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. శివారు భూములకందని పెద్దగెడ్డ 12 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు పెద్దగెడ్డ ప్రాజెక్టు పూర్తయినా శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. వైఎస్ హయాంలో జరిగిన పనులు తప్ప మిగిలిన కాలువల్లో పూడిక తీత తొలగింపు పను లు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రధాన కాలువల్లో తూముల వద్ద షట్టర్లు అమర్చడం వంటివి జరగలేదు. వీటిపై పాలకులు దృష్టి సారించడం లేదు. వెంగళరాయ తదితర ప్రాజెక్టులది అదే పరిస్థితి వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి అదనపు ఆయకట్టు కు సాగునీరందించేందుకు పనులు జరగాలి. 24,700 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా పూడిక తొలగింపు,లైనింగ్ పనులు జరగకపోవడంతో బొబ్బిలి, సీతానగరం మండలాలకు సాగునీరు అందడం లేదు. ఆండ్ర ఆధునికీకరణ పనులు చేపడితే ఆయకట్టుకు సాగునీరందించేందుకు అవకాశం ఉంది. అలాగే వట్టిగెడ్డ ప్రాజెక్టు కాలువల్లో లోపాలు సవరించాలి. సైపూన్లు నిర్మించేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అదేవిధంగా ఆండ్ర ప్రాజెక్టు ఆధునికీకరణ, పెదంకలాం, ఏడొంపులగెడ్డ, మంగళగెడ్డ ప్రాజెక్టులకు నిధులు అవసరం ఉంది. కానీ వాటిపై మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దీంతో వనరులున్నా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి నెల కొంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలోనైనా జిల్లాలోని ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందేమో అన్న ఆశలో జిల్లా రైతులున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి. -
రాజన్న యజ్ఞం .. జలాసురులతో విఘ్నం
సాకారం కాని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భారీ ప్రాజెక్టును పట్టించుకోని కిరణ్ ప్రభుత్వం కేటాయించినా మంజూరు కాని నిధులు నర్సీపట్నం, న్యూస్‌లైన్: రైతే దేశానికి వెన్నెముక... కర్షకులు సుభిక్షంగా ఉంటేనే అందరికీ మేలు జరుగుతుం ది... అనేవారు వైఎస్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జలయజ్ఞం చేపట్టి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశా రు. ఆయన దివంగతులయ్యాక రైతును విస్మరించిన ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రాజెక్టును పక్కనపెట్టడంతో మూడు జిల్లాల రైతులు వరుణ దేవుడి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు పాలనలో.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రైతును నిర్లక్ష్యం చేశారు. రైతు అభివృద్ధిని పక్కనపెట్టి వ్యవసాయం దండగంటూ ప్రసంగాలిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఉత్తరాంధ్రలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు సైతం కృషి చేయలేదు. గతంలో ఏర్పాటు చేసిన మేజర్, మైనర్ నీటివనరులను సైతం నిర్లక్ష్యం చేసి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు విషయాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయడంతో ప్రతి ఏటా నష్టపోతూ అప్పులపాలయ్యారు. వైఎస్సార్ హయాంలో.. ఇలాంటి పరిస్థితుల్లో మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చి జలయజ్ఞం ప్రారంభించి, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2008లో సుజల స్రవంతి ప్రాజెక్టుకు నర్సీపట్నంలో తొలి అడుగు పడింది. ఆ రోజున వైఎస్సార్ ప్రాజెక్టును ప్రకటించి 2009 జనవరి 2న పరిపాలన ఆమోదంతో ప్రత్యేక జీవో విడుదల చేశారు. ఈ ప్రాజెక్టునకు రూ. 7,214.10 కోట్లు ఖర్చు కానున్నట్టు అంచనా వేశారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది సుజల స్రవంతి ఉద్దేశం. మూడు జిల్లాల్లో 1037 గ్రామాల్లోని 32 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. విశాఖ జిల్లాలోని రావికమతం, కె.కోటపాడు, విజయనగరం జిల్లాలో వేపాడ, బొండపల్లి ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి మెట్ట భూములకు సాగునీరు అందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. వీటి నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను కేటాయించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు విశాఖ నగరంలోని పరిశ్రమలకు 4.74 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని భావించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే మూడు జిల్లాల్లో 12.32 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని నిర్ధారించారు. మహానేత మరణంతో నిర్లక్ష్యం రాజన్న బతికి వుంటే ఈసరికే ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరేవి. ఏటా సముద్రం పాలవుతున్న 400 టీఎంసీల గోదావరి జలాలు సద్వినియోగమయ్యేవి. ఈ వృధా నీటిని మళ్లిస్తే బీడు భూముల్లో సిరులు పండించుకోవచ్చని భావించి ఈ పథకానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆయన దివంగతుడయ్యాక ప్రాజెక్టు నిర్మాణంపై కిరణ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడు దఫాలుగా రూ. 50 కోట్లు, రూ. 70 కోట్లు, రూ.10 కోట్లు కేటాయించినా, నిధుల మంజూరును పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇదేకాకుండా ప్రాజెక్టునే రద్దు చేస్తామని 2013 బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపిందంటే దీనిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. అప్పట్లో కాగ్ నివేదిక సైతం ఈ విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా విమర్శించింది. సాగు భూములు సస్యశ్యామలం అవుతాయని కలలుగన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను ప్రస్తుత పాలకులు అడియాసలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల అమల్లోకి వచ్చిన ఈపీసీ విధానంలో ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఈ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పనులు ప్రారంభిస్తామంటూ డాంబికాలు పలుకుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ కలలు నెరవేరుతాయని రైతులు ఆశిస్తున్నారు. -
కొత్త ప్రభుత్వంలోనే రియల్టీ పరుగులు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆరేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నిర్మాణ రంగానికి మరో ఆరు నెలల పాటు కష్టాలు తప్పవు. ఎన్నికల తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ ఏర్పడే కొత్త ప్రభుత్వ పాలసీలతోనే నిర్మాణ రంగం మళ్లీ పరుగులు పెడుతుందని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ధీమా వ్యక్తం చేసింది. క్రెడాయ్ హైదరాబాద్ 3 రోజుల ప్రాపర్టీ షో శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పోటీని ఎదుర్కొని మరీ హైదరాబాద్‌కు ఓఆర్ఆర్, మెట్రో, మాస్టర్‌ప్లాన్, ఐటీఐఆర్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చాం. ఇక నాయకులుగా మా పనైపోయింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇకపై బిల్డర్లపైనే ఉందన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ ఏర్పడే కొత్త ప్రభుత్వం నిర్మాణ రంగానికి పూర్తి సహకారాన్నందిస్తుందని హామీ ఇచ్చారు. చార్మినార్, సైబర్టవర్స్ లాగే అంతర్జాతీయ స్థాయిలో గేమ్ పార్క్ రూపుదిద్దుకోనుందన్నారు. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పన్ను రాయితీలు వంటి ఎన్నో సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. అదే సమయంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోనూ పెట్టుబడులకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. విభజన వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది మండలాలు, గ్రామాలే. ఎందుకంటే ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. హైటెక్‌సిటీ నిర్మించక ముందు ఇక్కడ చ.గ. రూ.250గా ఉండేది. కానీ ఇప్పుడక్కడ చ.గ. రూ.40 వేల నుంచి లక్ష వరకూ ఉందంటే ఎంతలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి మాట్లాడుతూ.. ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాల్లోని మధ్య తరగతి ప్రజలు కూడా హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇష్టపడుతున్నారన్నారు. ధరలు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. విద్య, వైద్యం, జీవన భృతి వంటి అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం, ఓఆర్ఆర్, మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి అదనపు సౌకర్యాలని వివరించారు. రూ.1.75 కోట్ల పెట్టుబడితో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోలో 150 మంది డెవలపర్లు వంద స్టాళ్లలో 200లకు పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల వారూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ అధినేత రవీందర్‌రెడ్డి, గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి, పీబీఈఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు ఆలస్యం కారణంగా ప్రాపర్టీ షో ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో క్రెడాయ్ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రాపర్టీ షో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. పొన్నాల లక్ష్మయ్య మినహా ఆహ్వాన పత్రికలో ఉన్న ముఖ్య అతిథులెవ్వరూ హాజరుకాలేదు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మంత్రులు మహీధర్‌రెడ్డి, ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. మంత్రి దానం నాగేందర్ కార్యక్రమం ప్రారంభం కాకముందే వచ్చి వెళ్లారు. -
జలయజ్ఞంలో 500 కోట్లు హాంఫట్
వారంతా జలయజ్ఞం కాంట్రాక్టర్లు... లెక్క ప్రకారం వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించారు. కానీ... ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ఆ మొత్తం చూస్తుండగానే తిరిగి కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా రూ.500 కోట్లు ఇలా వెనక్కు మళ్లాయి. ‘ఇదో కుంభకోణం... బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా దీనిపై చర్యలు లేవు. డబ్బులు పొందిన వారిలో అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు, పలువురు నేతలకు చెందిన కంపెనీలున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయటంలో విఫలమవుతున్న కిరణ్ ప్రభుత్వం.... కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూర్చటంలో మాత్రం ఎనలేని ఉత్సాహం చూపుతోంది. ప్రభుత్వ పెద్దలు చకచకా పావులు కదిపి గుట్టుగా గూడుపుఠాణి నడుపుతున్నారు. జలయజ్ఞం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అప్పటి వాణిజ్య పన్నుల శాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో పన్ను చెల్లించారు. కానీ ఆ తర్వాత వాటిని తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గతంలో ఎప్పుడో ఓ కేసు విషయంలో వచ్చిన కోర్టు తీర్పును ఆధారం చేసుకుని ఈ పన్నును తిరిగి పొందేందుకు ప్రభుత్వ పెద్దలతో సమాలోచనలు జరిపారు. ఓ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్న అధికారి ఒకరు చక్రం తిప్పారు. ఇంకేముంది.. బడా కాంట్రాక్టర్లు చెల్లించిన పన్ను తిరిగి వారి జేబుల్లోకి వెళ్లడం ప్రారంభమైంది. గడచిన రెండేళ్ల కాలంలో దశలవారీగా రూ.500 కోట్లు వారికి చేరిపోయాయి. కొన్ని కంపెనీలకు ఐదారు దఫాలుగా కూడా చెల్లించారు. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. అయితే పన్ను డబ్బులు తిరిగి పొందలేకపోయిన కొందరు కాంట్రాక్టర్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆ విభాగం ... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా జరిగిన ఈ వ్యవ హారం అక్రమమని తేల్చి ఇదో కుంభకోణమేనంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు కూడా చేసింది. ఆ నివేదిక ఆరునెలల క్రితమే అందినా ప్రభుత్వం దాన్ని తొక్కి పెట్టింది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ‘ఈ వ్యవహారం దర్యాప్తులో ఉన్నందున వివరాలు ఇవ్వలేము’ అంటూ అధికారులు దాన్ని బయటపెట్టడం లేదు. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా వసూలు చేసే టీడీఎస్‌ను... ఆ తర్వాత వారు చెల్లించాల్సిన పన్నును బేరీజు వేసుకుని, టీడీఎస్ కంటే పన్ను మొత్తం తక్కువగా ఉన్న సందర్భాల్లోనే ఇలా వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందంటూ అధికారులు ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారు. వెరసి పన్ను మొత్తం వెనక్కు ఇవ్వటంలో అక్రమాలు జరగలేదని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. పన్ను మదింపులో లాఘవం ప్రదర్శించటం ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో తప్పులు జరగలేదని తే ల్చే ప్రయత్నం ఇప్పటికే మొదలైందని సమాచారం. విజిలెన్స్ విచారణ సరిగా జరగలేదని పేర్కొంటూ మరో విచారణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది మరో దారుణం..: చాలా సందర్భాల్లో వ్యాట్ చెల్లించేప్పుడు వ్యాపారులు అధికారుల వాదనతో విభేదిస్తుంటారు. పెద్దమొత్తంలో పన్ను చెల్లించాల్సిన పరిస్థితుల్లో కొందరు వాణిజ్య పన్నుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి తీర్పు వ్యతిరేకంగా వస్తే, తీర్పు వచ్చిన 180 రోజుల్లో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేయాల్సి ఉంటుంది. గడువు దాటితే హైకోర్టు కేసును డిస్మిస్ చేస్తుంది. గత మూడునాలుగేళ్లలో 185 కేసులకు సంబంధించి ఇలా ప్రభుత్వం గడువు లోపు హైకోర్టును ఆశ్రయించటంలో విఫలమైంది. ఆలస్యంగా రావటంతో ఆ కేసులను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫలితంగా ఆ కేసులకు సంబంధించి భారీ మొత్తంలో ఆదాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ కోల్పోయింది. ఈ మొత్తం దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇంత దారుణమా...: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటు ప్రభుత్వం లోనివారు.. అటు కాంట్రాక్టర్లు తలచుకుంటే గుట్టు చప్పుడు కాకుండా కుంభకోణాలు జరిగిపోతాయనటానికి వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన అక్రమాలే నిదర్శనమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది. జలయజ్ఞం కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా రూ.500 కోట్ల పన్ను మొత్తాన్ని తిరిగి చెల్లించటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాణిజ్య పన్నుల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సకాలంలో హైకోర్టును ఆశ్రయించకుండా దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవడం దారుణమని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించి తాము సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా అధికారులు వివరాలు అందించటం లేదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రావు చెలికాని, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు తెలిపారు. రూ.500 కోట్ల కుంభకోణంపై పూర్తయిన విజిలెన్స్ విచారణ వివరాలను కూడా బయటకు పొక్కనీయటం లేదని ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పుపై సకాలంలో హైకోర్టును ఆశ్రయించని కారణంగా ఐటీసీ లిమిటెడ్ అన్న సంస్థ ఒక్కటే రూ.84.33 కోట్ల లబ్ధి పొందిందంటే మిగతా కేసుల్లో ఆ మొత్తం ఎంతుంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై నేటినుంచి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఐదేళ్ల క్రితం మంజూరు చేసి, ఇప్పటికీ పనులు మొదలుపెట్టని ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేసి వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాటు నిర్మాణాలు చివరిదశలో ఉన్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి వీలుగా ప్రభుత్వం ఈ నెల 6, 7వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ర్ట సాగునీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో జరిగే ఈ సమావేశానికి శాఖ ముఖ్యకార్యదర్శులు, ఈఎన్సీలు, సీఈలు హాజరుకానున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఖరారు చేశారు. దీని నిర్మాణ పనులు ఇంకా మొదలుకాలేదు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం కూడా పక్కకు పడిపోయింది. ఐదేళ్ల క్రితమే దీని నిర్మాణానికి అనుమతి ఇచ్చినా ఇప్పటికీ టెండర్లను కూడా ఖరారు చేయలేదు. ఇక కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎల్లంపల్లి, దేవాదుల, పులిచింతల వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు. ప్రాజెక్టులు పూర్తికాక ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 3,500 టీఎంసీల నీరు సముద్రంపాలయింది. అలాగే కృష్టా నీటిని కూడా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి పరిస్థితిని శుక్రవారం నుంచి జరిగే సమావేశాల్లో సమీక్షించనున్నారు. -
జలయజ్ఞానికి గండి కొట్టారు : వై.ఎస్.విజయమ్మ
సాక్షి, గుంటూరు: జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేసి రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరియాలని పరితపించిన వైఎస్సార్ ఆలోచనలకు కాంగ్రెస్ గండి కొట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విభజన నిర్ణయంతో సాగునీటి ప్రాజెక్టులను వివాదాల్లోకి లాగి నిర్లక్ష్యం ముంపులోకి నెట్టి రైతులపై కక్ష సాధిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. కోస్తా ప్రాంతంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా, ఫ్లోరైడ్ పీడిత, కరువుతాడిత జిల్లాగా పేరొందిన ప్రకాశం జిల్లాను కాంగ్రెస్ నిలువునా ముంచుతోందని మండిపడ్డారు. 2004లో అధికారంలోకి రాగానే వై.ఎస్.రాజశేఖరరెడ్డి గుండ్లకమ్మ పనుల్ని వేగవంతం చేసి పూల సుబ్బయ్య వెలిగొండ భారీ సాగునీటి పథకంతో పాటు పాలేరు ప్రాజెక్టు, కొరిసిపాడు ఎత్తిపోతల పథకం, శ్రీరామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 14.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. కానీ.. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసి రైతుల్ని ఏటా నిండా ముంచుతోందని ఆమె మండిపడ్డారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ పాటికి పూర్తయి ఉంటే అత్యధిక గ్రామాల ప్రజలు కరువు, ఫ్లోరైడ్ బారి నుంచి బయటపడేవారని విజయమ్మ పేర్కొన్నారు. కృష్ణానదిలో మిగులు, వరద నీటిని మళ్ళించే విధంగా వెలిగొండ ప్రాజెక్టు చేపట్టాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్ అధికారం చేపట్టగానే 14 టీఎంసీల నీటిని మొదటి దశలో వినియోగించుకునేలా పనులు చేపట్టారని.. రూ. 4,785 కోట్ల పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసి ఏడు ప్యాకేజీల కింద పనులు చేపట్టారని గుర్తుచేశారు. మొత్తం 44 టీఎంసీల కృష్ణా వరద నీటిని వాడుకోవటం ద్వారా ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని వైఎస్ భావించారని, కానీ ప్రకాశం జిల్లాకు జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యం ముంపులో మునిగిపోయిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నీరు వృథాగా పోతోంది.. ఆయకట్టు ఎండుతోంది వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న అవాంతరాల్ని అధిగమించటానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపటం లేదని విజయమ్మ తప్పుపట్టారు. టన్నెల్ నుంచి నీరు ఫీడర్ చానల్లోకి వస్తుండటంతో చానళ్ల నిర్మాణం సాగటం లేదని, ఫీడర్ చానెల్ నిర్మాణానికి మట్టి లభించకపోవటంతో స్ట్రక్చర్ల నిర్మాణం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఏటా కృష్ణానదిలో శ్రీశైలం నుంచి వరద నీరు వృథాగా కిందకు ప్రవహిస్తున్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొరిసిపాడు ఎత్తిపోతల పథకానికి గ్రహణం ఎర్రం చినపోలిరెడ్డి కొరిసిపాడు ఎత్తిపోతల పథకాన్ని రూ. 177 కోట్లతో వైఎస్ మంజూరు చేసినా ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించటానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదని విజయమ్మ ఎండగట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.33 టీఎంసీల నీటిని వినియోగించుకోవటం ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుందని చెప్పారు. ఈ పథకానికి భూ సేకరణ ప్రధాన అవరోధంగా పరిణమించిందని.. తూర్పుపాలెం గ్రామం లో ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాన్ని అమలు చేయాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నా పట్టించుకోవటం లేదని.. దీంతో కొరిసిపాడు జలాశయంలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికిఆ రెండు పార్టీలే కారణం : కొడాలి నాని ధ్వజం గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం కాంగ్రెస్, దాని తోక పార్టీ టీడీపీలేనని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. జననేత జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేయటానికి రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబునాయుడు ప్రజల ముందుకు వస్తే అంతిమయాత్ర చేసి హైదరాబాదు పంపాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర టీడీపీ నాయకులకు సిగ్గు ఎగ్గు ఉంటే 2008లో టీడీపీ ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే వరకు చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరినీ ప్రజలు క్షమించరు: వంగవీటి రాధా టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలను ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరగటం మానాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో లేఖ ఇచ్చి నేడు సీమాంధ్రకు ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలని కోరటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగులుతారన్నారు. -
పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ
గుంటూరు/మేళ్లచెరువు, న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల సాకారమైంది. జలయజ్ఞంలో భాగంగా రాష్ర్టంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని పులిచింతలలో నిర్మించారు. ఎగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో బుధవారం అక్కడ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరిగింది. నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టుకు బిగించిన 18 గేట్లలో 14 క్రస్ట్‌గేట్లను ఎత్తి 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద క్రస్ట్ లెవల్ పైనుంచి దాదాపు 15 అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి ప్లాంటులోకి వరద నీరు చేరి, పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది. కాగా, గేట్ల పైభాగంలో మెకానికల్ పనులకు ఆటంకం లేకపోవడంతో గేట్ల బిగింపు, వెల్డింగ్ పనులను మరింత ముమ్మరం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాజెక్టును ప్రారంభించాలని నెల రోజుల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో గడిచిన ఇరవై రోజులుగా ప్రాజెక్టు చివరి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. క్రస్ట్‌గేట్లు 24 బిగించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 18 గేట్లు బిగించారు. మిగతా ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయి. ముంపు గ్రామాలను తాకిన నీరు ఇదిలా ఉండగా పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న ముంపు గ్రామాల శివార్లకు వరదనీరు చేరింది. ఇటు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం, అటు నల్గొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని గ్రామాలు కేతవరం, బోధనం, చిట్యాల, గొల్లపేట, కోళ్లూరు, చింత్రియాల, అడ్లూ రు, కృష్ణాపురం, వెల్లటూరు వరదనీటి బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులు వీఆర్వోలకు ప్రత్యేక విధులను కేటాయించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. -
‘ప్రాణహిత-చేవెళ్ల’పై సర్కార్ నిర్లక్ష్యం
జలయజ్ఞంలో భాగంగా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర పోషించే భూసేకరణ విభాగం సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తం సిద్దిపేటలో 2012 జూన్‌లో మూడో యూనిట్ ఆఫీసును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలోని కరీంనగర్ రోడ్డుకు సమీపంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో దీనిని నెలకొల్పారు. ఈ ప్రాంతంలో అలైన్మెంట్ ప్రకారం భూమిని సేకరించడం ఈ కార్యాలయం ముఖ్యవిధి. అలాగే నిర్వాసితులైన భూ యజమానులకు డబ్బుల చెల్లింపుల వ్యవహారం కూడా ఈ కార్యాలయమే చూస్తుంది. ఇందుకు స్థానిక కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగాలి. క్షేత్రస్థాయిలో ఎంతో అవసరమైన ఇక్కడి భూసేకరణ యూనిట్పట్ల ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఈ కార్యాలయంలో ప్రస్తుతం మున్న పోస్టుల ఖాళీలే నిదర్శనం. ఖాళీల చిట్టా ఇది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు విభాగం-3లో ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లకుగాను ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ముగ్గురు ఆర్ఐలు ఉండాల్సి ఉంటే..ఒక్కరికే పరిమితం చేశారు. సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురికి గాను ఒక్కరూ లేరు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఐదుకు ఐదూ ఖాళీగానే ఉన్నాయి. నలుగురు సర్వేయర్లకు ఒక్కరూ లేరు. ఎనిమిది మంది చైన్మెన్లకు ఒక్క పోస్టయినా భర్తీ కాలేదు. ల్యాండ్ రికార్డు, డ్రాఫ్ట్‌మెన్ లేరు. ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. అందులోనూ ఇద్దరిని హైదరాబాద్ తార్నాక స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటేషన్ మీద పంపించారు. ప్రస్తుతం మిగిలిన ముగ్గురితోనే పని నడిపిస్తున్నారు. మూలిగే నక్కపై... అసలే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఈ కార్యాలయానికి అధిపతి అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) జి.నర్సింహులు గత జులై 31న రిటైరయ్యారు. సిద్దిపేటలో ఆఫీసు స్థాపనతోనే ఇక్కడికి వచ్చిన ఆయన ఏడాదిపాటు విధులు నిర్వర్తించారు. నర్సింహులు ఉద్యోగ విరమణ నేపథ్యంలో కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) ప్రత్యేక ఉప కలెక్టరు ఐలయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) ఇస్తూ తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల భూసేకరణ కార్యాలయలానికి బాసుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది కావాలి.