నీటితో నిండుగా పులిచింతల ప్రాజెక్టు జలాశయం
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు.
2004 అక్టోబరులో భూమిపూజ
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు.
గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు
అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే.
2019 నుంచి వరుణ కటాక్షం
2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు.
ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
Comments
Please login to add a commentAdd a comment