water level Increased
-
గోదావరి డేంజర్ లెవల్.. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, హెలికాప్టర్
సాక్షి, భద్రాచలం: దక్షిణ గంగ అయిన గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శనివారం తెల్లవారుజామున గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువకు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది తొలిసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చర్ల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచలం పట్టణంలోని మూడు కాలనీలకు చెందిన వారిని కూడా పునరావస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 8712682128ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్‌కు ఫొటోలు, లోకేషన్ పంపించి పోలీసుల సహయం పోందవచ్చని జిల్లా ఏస్పీ వినిత్ వెల్లడించారు. ఇక, పడవలు, బోట్లు , గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లను అధికారులు సిద్దం చేశారు. ఇదిలా ఉండగా.. గోదావరీ ఉధృతి, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ ప్రియాంక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58 నుంచి 60 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉంది. జిల్లావ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించాము. అత్యవసర పరిస్థితుల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్ అందుబాటులో ఉంచాం. గోదావరి 60 అడుగులు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రంగా సిద్ధంగా ఉంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలి అని సూచించారు. ఇది కూడా చదవండి: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో రాష్ట్రం అతలాకుతలం -
దంచికొడుతున్న వానలు.. భయపెడుతున్న హుస్సేన్ సాగర్!
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, హైదరాబాద్‌లో కూడా భారీ కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ► కొద్ది గంటల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ వర్షం మొదలైంది. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్ సాగర్‌లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ► కాగా, తాజాగా హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 513 మీటర్లకు చేరుకుంది. ఇక, హుస్సేన్ సాగర్ పూర్తి సామర్థ్యం 515 మీటర్లు. Secretariat road inundated after heavy rains batter #Hyderabad. Waterlogging was reported in most parts of the city even as the downpour continues. Video: Gandhi #DeccanChronicle.#HyderabadRains#HyderabadRoads pic.twitter.com/QSwHLnEfLT — Deccan Chronicle (@DeccanChronicle) July 20, 2023 ► వరదల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ► గాజుల రామారంలో కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ల వద్ద కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. Near live. #Hyderabad #Rains #HyderabadRains please be careful, avoid travel as much as possible @DeccanChronicle pic.twitter.com/iQbYRL8f1T — Sriram Karri (@oratorgreat) July 20, 2023 ► భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. క్షేత్రస్థాయిలో 157 మొబైల్ బృందాలు, 242 స్టాటిస్టికల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయనున్నారు. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట యంత్రాలతో నీటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. #HyderabadRains Welcome to Pragathi Nagar Lake. pic.twitter.com/UxxShiTCdw — Vudatha Nagaraju (@Pnagaraj77) July 20, 2023 Terrible traffic across #Hyderabad city including at Madhapur & Hi-tech city after incessant rains. #HyderabadRains pic.twitter.com/AvHzqMhi2U — Sowmith Yakkati (@sowmith7) July 20, 2023 ► మరోవైపు.. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రస్తుత నీటి మట్టం 1784.20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్తాయి నీటి మట్టం 1790 అడుగులు. Present Situation Of Serilingampally(Lingampally railway bridge).. NO MLA ,No Corporator Inspecting Besides.. 8000 thousand Crores Of Funds Used For the Development of Serilingampally ..but There is No Basic Infrastructure To Move a Rain Water.. #HyderabadRains pic.twitter.com/M7kXj7wrYQ — Ravi Kumar Yadav 🇮🇳 (@Raviyadav_bjp) July 20, 2023 ► ఇక, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్లు మొరాయిస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 11 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 693.4 అడుగులుగా ఉంది. ఇది కూడా చదవండి: దంచికొట్టిన వాన.. జనం హైరానా -
యమునా నది ఉగ్రరూపం.. ఢిల్లీ హై అలర్ట్..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. యమునా నది మహోగ్రం. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ప్రమాదకర స్థాయిని అధిగమించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB — ANI (@ANI) July 12, 2023 పదేళ్లలో ఇదే తొలిసారి యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. Delhi on high alert. Yamuna flowing above the danger mark. (@AnmolBali9/ @AkshayDongare_ )#Delhi #YamunaRiver #ITVideo pic.twitter.com/CZduuY2avD — IndiaToday (@IndiaToday) July 11, 2023 హిమాచల్‌లో జల విలయం మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్ చేసిన బైక్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. మూడు రోజుల్లో 31 మంది ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో కారణంగా చండీగఢ్-మనాలి, సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్‌లో చిక్కుకొన్న 300 మంది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద బాధితులతో కలిసి సీఎం భోజనం కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు. 15 వరకు స్కూల్స్ బంద్ న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. -
జలయజ్ఞ ఫలం.. ఉప్పొంగుతున్న పులిచింతల
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. 2004 అక్టోబరులో భూమిపూజ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే. 2019 నుంచి వరుణ కటాక్షం 2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు. ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -
ఎల్లంపల్లి ప్రాజెక్టు సగం ఖాళీ..!
సాక్షి, రామగుండం: ఎత్తిపోతలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా ఖాళీ అవుతుండడంతో ప్రస్తుతం నీటి సామర్థ్యం సగానికి చేరింది. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీలో ఉన్న నీటిని పార్వతీ (గోలివాడ–సుందిళ్ల) పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపింగ్ చేస్తారు. ఈ క్రమంలో గత నెల 31న పార్వతీ పంపుహౌస్ నుంచి ఒక మోటారు రన్ చేసి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోశారు. అప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో క్రమంగా ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో మోటార్లకు టెస్టింగ్ చేసే నిమిత్తం అరగంట పాటు రన్చేసి ఆఫ్ చేశారు. కాళేశ్వరం–ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు విజయవంతం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్–1 పూర్తయింది. సగానికి పడిపోయిన నీటి మట్టం.. గడిచిన వారం రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6లో భాగంగా ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్‌ను పంపింగ్ చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది. దీనికి తోడు ఎగువన భారీ వర్షాలు, వరదలు నిలిచిపోవడంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఇందులోని వాటర్ క్రమంగా రివర్స్ పంపింగ్ విధానం చేపడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వేంనూర్ నుంచి నంది మేడారం చెరువులోకి గ్రావిటీ ద్వారా వెళుతుంది. అక్కడ నాలుగు మోటార్లతో 3,500 క్యూసెక్కులు వరద కాల్వకు ఎత్తిపోయడంతో అవి మిడ్‌మానేర్‌కు చేరుతున్నాయి. మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేయడంతో లోయల్ మానేర్ డ్యాంలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం సగానికి పడిపోవడంతో పార్వతీ పంపుహౌస్ హెడ్ రెగ్యురేటర్, డెలివరీ సిస్టం వద్ద నీటి నిల్వలు కనుమరుగయ్యాయి. ఎల్లంపల్లి దిగువన ఇసుక తెప్పలు దర్శనమిస్తున్నాయి. వివిధ అవసరాలకు నీటి కేటాయింపులు.. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.915 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,502 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 11,137 క్యూసెక్కులుగా ఉంది. కాగా ప్రాజెక్టు నుంచి నీటి కేటాయింపుల్లో అబ్దుల్ కలాం సుజల స్రవంతి తాగునీటి సరఫరాకు 336 క్యూసెక్కులు (2.64 టీఎంసీలు), కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6కు 10,588 క్యూసెక్కులు (13.03 టీఎంసీలు), రామగుండం–పెద్దపల్లి నియోజకవర్గాల తాగునీటి అవసరాలకు 59 క్యూసెక్కులు, మంచిర్యాల జిల్లా మిషన్ భగీరథకు 25 క్యూసెక్కులు, వేంనూర్ పంపుహౌస్‌కు 0.13 టీఎంసీలు, ఎన్టీపీసీకి 0.57 టీఎంసీలు, సాధారణ నష్టం 129 క్యూసెక్కులుగా ఉంది. ఫలితంగా వరద నీటి మట్టం సగానికి పడిపోయింది. ఎత్తిపోతలు ప్రారంభించేనా..! కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో భాగంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీ, అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలకు అనుకూలంగా ఉండడంతో నీటిపారుదలశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కన్నెపల్లి బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, అక్కడి నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజీలోకి వరద నీటిని మళ్లిస్తారు. దీని సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టీఎంసీలున్నాయి. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీ మళ్ళిస్తారు. దీని సామర్థ్యం 8.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.24 టీఎంసీలు నిల్వ ఉంది. పార్వతీ పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం/నీటి నిల్వ సగానికి చేరడంతో ఎత్తిపోతలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు రన్ చేసేందుకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆదేశాలు రాలేదు పార్వతీ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభించాలనే విషయమై తమకు ఉన్నతాధికారుల నుంచి ఏలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు వెట్‌రన్ చేసి సిద్ధం చేశాం. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన మరుక్షణమే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభిస్తాం. – బండ విష్ణుప్రసాద్, ఈఈ, పార్వతీ బ్యారేజీ -
కోట్‌పల్లికి వరద నీరు
ప్రాజెక్టులోకి 16.5 అడుగుల మేర నీరు చేరిక ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం మరో రెండు అడుగుల నీటి మట్టం పెరిగింది. మూడు రోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 16.5 అడుగుల వరకు నీరు చేరింది. ఈ ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 24 అడుగులు. మరో 7.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. రెండు సంవత్సరం క్రితం 20 అడుగుల మేర నీరు చేరింది. ఈ తర్వాత ఇదే గరిష్ట నీటి మట్టం. రోజురోజుకు ప్రాజెక్టులోకి నీరు వస్తుండంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.