కోట్‌పల్లికి వరద నీరు | overflow flood water to Kotpalli | Sakshi
Sakshi News home page

కోట్‌పల్లికి వరద నీరు

Published Thu, Jul 21 2016 7:53 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

కోట్‌పల్లికి వరద నీరు - Sakshi

కోట్‌పల్లికి వరద నీరు

ప్రాజెక్టులోకి 16.5 అడుగుల మేర నీరు చేరిక

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం మరో రెండు అడుగుల నీటి మట్టం పెరిగింది. మూడు రోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 16.5 అడుగుల వరకు నీరు చేరింది. ఈ ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 24 అడుగులు. మరో 7.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. రెండు సంవత్సరం క్రితం 20 అడుగుల మేర నీరు చేరింది. ఈ తర్వాత ఇదే గరిష్ట నీటి మట్టం. రోజురోజుకు ప్రాజెక్టులోకి నీరు వస్తుండంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement