Hussain Sagar Water To Reach Maximum Level In Wake Of Heavy Rains In Hyderabad - Sakshi
Sakshi News home page

Hussain Sagar Flood Water: దంచికొడుతున్న వానలు.. హుస్సేన్‌ సాగర్‌ నీటి మట్టం అలర్ట్‌!

Published Fri, Jul 21 2023 11:55 AM | Last Updated on Fri, Jul 21 2023 1:07 PM

Hussain Sagar Water To Reach Maximum Level In Wake Of Heavy Rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, హైదరాబాద్‌లో కూడా భారీ కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

కొద్ది గంటల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ వర్షం మొదలైంది. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్‌ సాగర్‌లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. 

► కాగా, తాజాగా హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 513 మీటర్లకు చేరుకుంది. ఇక, హుస్సేన్‌ సాగర్‌ పూర్తి సామర్థ్యం 515 మీటర్లు.  

 వరదల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. 

 గాజుల రామారంలో కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్‌మెంట్‌ల వద్ద కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. 

► భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్‌ అయ్యింది. క్షేత్రస్థాయిలో 157 మొబైల్‌ బృందాలు, 242 స్టాటిస్టికల్‌ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయనున్నారు. 339 వాటర్‌ లాగింగ్‌ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట యంత్రాలతో నీటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు.

► మరోవైపు.. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఉస్మాన్‌ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రస్తుత నీటి మట్టం 1784.20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్తాయి నీటి మట్టం 1790 అడుగులు. 

► ఇక, నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌ డేంజర్‌ జోన్‌లో ఉంది. కడెం ప్రాజెక్ట్‌ ఆరు గేట్లు మొరాయిస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌ నుంచి 11 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 693.4 అడుగులుగా ఉంది. 

ఇది  కూడా చదవండి: దంచికొట్టిన వాన.. జనం హైరానా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement