heavy rain fall
-
జడివానతో జల దిగ్బంధంలో తిరుపతి నగరం.. ఇళ్లలోకి వరద నీరు (ఫొటోలు)
-
తమిళనాడు, కర్ణాటకలో జడివానకు ప్రజలు అతలాకుతలం (ఫొటోలు)
-
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
ఉత్తర భారతాన్ని వదలని వానలు
డెహ్రాడూన్: రుతుపవనాలు మొదలైంది మొదలు దేశవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణాదిన వరుణుడు కాస్త కనికరించినా ఉత్తరాదిన మాత్రం ఇప్పటికీ అలజడి సృష్టిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీలో రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజులకు రోజలు జనం ఎటూ కదలడానికి లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వర్షాల ఉధృతి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా తాకింది. ఆ రాష్ట్రంలో వరణుడు మరోసారి సృష్టించిన బీభత్సానికి ఎటు చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహానికి తెగిపోయిన వంతెనలు, కూలిపోయిన ఇళ్ళే దర్శనమిస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాల తాకిడికి గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్దాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 19 మంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేశామని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు రావొద్దంటూ ప్రకటనలు జారీ చేశామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది! -
హైదరాబాద్‌లో పిడుగుపాటు.. తృటిలో తప్పించుకున్న యువకుడు
హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. నిముషాల వ్యవధిలో మొత్తం నగరమంతా నీట మునిగింది. పెద్ద పెద్ద ఉరుములతో కురిసిన వానకు నగరం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ నీరు చేరింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రాజేంద్ర నగర్లో పిడుగు పడిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో వీర విహారం చేస్తోంది. అదృష్టవశాత్తు ఒక వ్యక్తి పిడుగుపాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు. వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎట్టకేలకు వర్షం తెరపినివ్వడంతో నగర వాసులు ఎవరి పనులకు వారు ఉపక్రమించారు. అంతలోనే మళ్లీ మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పెద్ద ఉరుములతో, ఎరువులతో కురిసిన వర్షానికి నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారులైతే గంటల పాటు హోరువానలో తడుస్తూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. వర్షానికి హైదరాబాద్ వీధులన్నీ జలమయమయ్యాయి. రాజేంద్ర నగర్లో ఒక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు అందరీ విస్మయానికి గురిచేసింది. వీడియోలో ఒకవ్యక్తి ఒక ఇంటి నుండి మరో నాట్లొకి వెళ్తున్నాడు. అతను అలా రోడ్డు దాటి ఇంటిలోకి వెళ్ళగానే పెద్ద పిడుగుపడింది. ఏ వీడియో చోసిన వారు అదృష్టవశాత్తు అతను ఆ పిడుగుపాటు నుండి తప్పించుకున్నాడు. లేదంటే ఘోరం జరిగి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. #HyderabadRains A massive lightening struck on a luckily empty street in Attapur in #Hyderabad during the mad downpour last night. The guy who was seen walking missed it by a whisker. Luckily no one was hurt, some electronics reportedly damaged! #StaySafeHyderabad pic.twitter.com/B9VMs1uvfV — Revathi (@revathitweets) July 25, 2023 ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
గుజరాత్ వరదల్లో కొట్టుకుపోయిన వందల సిలిండర్లు
గాంధీనగర్: గుజరాత్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రమంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా వర్ష ఉధృతి తగ్గకపోవడంతో ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక జునాగఢ్ జిల్లాలో అయితే భారీ సంఖ్యలో పార్కింగ్ కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక గ్యాస్ ఏజెన్సీ గోడౌన్లో నుండి వందలకొద్దీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అసలే ఆకాశాన్నంటిన ధర కారణంగా గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఒకపక్క సామాన్యుడి గోడు ఇలా ఉంటే మరోపక్క గుజరాత్ లో వర్షాల కారణంగా నవసరి పట్టణం జునాతనా ప్రాంతంలో ఉన్న జుమ్రు గ్యాస్ ఏజెన్సీ నుండి వందల కొద్దీ సిలిండర్లు వరదలో కొట్టుకుపోతూ కనిపించాయి. ఈ వీడియోని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనికి విశేష స్పందన లభించింది. మిగతా వారి సంగతెలా ఉన్నా కానీ సామాన్యులు మాత్రం సిలిండర్లు వరద ప్రవాహంలో పోతుంటే వాటి విలువ తెలిస్తే అంత నిర్లక్ష్యంగా వాటిని కొట్టుకుపోనిచ్చేవారు కాదని వాపోతున్నారు. Flood like situation in Navsari city Gas cylinders of Jhumru Gas Agency in Junathana area were also washed away in water#GujaratRain #navsari pic.twitter.com/Uk2gUvAFOg — Ishani Parikh (@ishaniparikh) July 22, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది? -
దంచికొడుతున్న వానలు.. భయపెడుతున్న హుస్సేన్ సాగర్!
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, హైదరాబాద్‌లో కూడా భారీ కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ► కొద్ది గంటల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ వర్షం మొదలైంది. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్ సాగర్‌లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ► కాగా, తాజాగా హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 513 మీటర్లకు చేరుకుంది. ఇక, హుస్సేన్ సాగర్ పూర్తి సామర్థ్యం 515 మీటర్లు. Secretariat road inundated after heavy rains batter #Hyderabad. Waterlogging was reported in most parts of the city even as the downpour continues. Video: Gandhi #DeccanChronicle.#HyderabadRains#HyderabadRoads pic.twitter.com/QSwHLnEfLT — Deccan Chronicle (@DeccanChronicle) July 20, 2023 ► వరదల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ► గాజుల రామారంలో కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ల వద్ద కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. Near live. #Hyderabad #Rains #HyderabadRains please be careful, avoid travel as much as possible @DeccanChronicle pic.twitter.com/iQbYRL8f1T — Sriram Karri (@oratorgreat) July 20, 2023 ► భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. క్షేత్రస్థాయిలో 157 మొబైల్ బృందాలు, 242 స్టాటిస్టికల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయనున్నారు. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట యంత్రాలతో నీటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. #HyderabadRains Welcome to Pragathi Nagar Lake. pic.twitter.com/UxxShiTCdw — Vudatha Nagaraju (@Pnagaraj77) July 20, 2023 Terrible traffic across #Hyderabad city including at Madhapur & Hi-tech city after incessant rains. #HyderabadRains pic.twitter.com/AvHzqMhi2U — Sowmith Yakkati (@sowmith7) July 20, 2023 ► మరోవైపు.. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రస్తుత నీటి మట్టం 1784.20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్తాయి నీటి మట్టం 1790 అడుగులు. Present Situation Of Serilingampally(Lingampally railway bridge).. NO MLA ,No Corporator Inspecting Besides.. 8000 thousand Crores Of Funds Used For the Development of Serilingampally ..but There is No Basic Infrastructure To Move a Rain Water.. #HyderabadRains pic.twitter.com/M7kXj7wrYQ — Ravi Kumar Yadav 🇮🇳 (@Raviyadav_bjp) July 20, 2023 ► ఇక, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్లు మొరాయిస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 11 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 693.4 అడుగులుగా ఉంది. ఇది కూడా చదవండి: దంచికొట్టిన వాన.. జనం హైరానా -
పాకిస్థాన్‌లో భారీ వర్షం...రోడ్లన్ని జలమయం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం అల్లకల్లోలం సృష్టించింది. వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బేగంపేట, కోఠి, సికింద్రాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాలైన లింగంపల్లి, పటాన్చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. -
ప్రపంచాన్ని ప్రకృతి పగబట్టిందా?
ఆసియా దేశాలు అల్లాడి పోతున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు విరుచుకుపడుతున్నాయి. భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా వంటి దేశాలు ఆ వరదల్లో కకావికలమవుతున్నాయి.ఇంకో వైపు విపరీతమైన వేడిగాలులు జీవనదులను ఆవిరి చేసి నీళ్లను మాయం చేసి భూమి అంతటా బీటలు తీసి కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఆసియా వెలవెల బోతోంది. ఆ వానలూ మంచివి కావు. ఈ కాటకాలూ మంచివికావు. మనిషి మంచిగా లేకపోవడం వల్లనే ఈ విపత్తులు దాడులు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని శపిస్తున్నాయి. హఠాత్తుగా కుంభవృష్టి పడుతోంది. హైదరాబాద్ ఒక్కటే కాదు.. బెంగళూరు, చెన్నై, ముంబైతో సహా చాలా ప్రాంతాలు ఒక్క రోజులోనే నీట మునుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం దిక్కుతోచని పరిస్థితి తెస్తోంది. మన దేశంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కుంభవృష్ఠి వర్షాలతో ఉధృతమైన వరదలతో కకావికలమైపోతున్నాయి. లక్షలాది మంది వరదల కారణంగా నిరాశ్రయులవుతున్నారు. ఈ వానలు ఎన్నడూ చూడలేదురోయ్ దేవుడా అని జనం మబ్బులవైపు చూసి ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు. అసోంలో బ్రహ్మపుత్ర నది విజృంభణతో వేలాది మంది వరదల్లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు. మేఘాలు ఒక్కసారిగా విరిగిపోయినట్లు నీటి సంచులు పేలిపోయినట్లు ఒక్క ఉదుటన కుంభవృష్ఠి వానలు పడిపోతున్నాయి. నిముషాల్లోనే అవి జల ప్రళయంలోకి జనాన్ని నెట్టేస్తున్నాయి. ఈ మాయదారి వానలే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నూ వణికించేస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని సిల్హెట్ ప్రాంతంలో 122 సంవత్సరాల్లో ఎన్నడే లేనంతగా భారీ వర్షాలు పడ్డంతో కొన్ని తరాల జనం చూడనంతటి వరదలు ముంచెత్తాయి. చుట్టూరా వరద నీరే. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి. ఒక్క బంగ్లాదేశ్ లోనే 40 లక్షల మంది వరదల తాకిడికి అల్లాడిపోయారు. అందులో 16లక్షల మంది చిన్నారులు ఉండడం గమనార్హం. బంగ్లాదేశ్ దేశంలో 75 శాతం భూభాగం సముద్ర మట్టంతో ఇంచుమించు సమానంగా ఉంటుంది. మరో రెండు దశాబ్ధాల్లో మూడొంతులకు పైగా బంగ్లాదేశ్ సముద్రగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన దాయాది దేశం పాకిస్థాన్ లో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది.పాకిస్థాన్ లో 2010లీ వచ్చిన వరదలే బీభత్సమైనవని అనుకుంటే ఈ సారి అంతకు మించి వర్షాలు కుమ్మేశాయి. ఎనిమిది వారాల పాటు అంటే 50 రోజుల పాటు ఏకధాటిగా కుంభవృష్ఠి వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రతీ చోటా వరదలు ముంచెత్తాయి. దేశంలో 150 జిల్లాలుంటే ఏకంగా 110 జిల్లాలను వరదలు ముంచేశాయి. మూడు కోట్ల 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయిదు లక్షల వరకు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా జిల్లాల్లో మనుషులు ఉండడానికి అనువైన ఇల్లు ఒక్కటంటే ఒక్కటికూడా మిగల్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి సర్వనాశనం అయిపోయింది. వరదల తెచ్చిన సంక్షోభంతో ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగిపోయింది. ఆహార కొరత.. దయనీయంగా పరిస్థితి కోట్లాది మందిని ఆహార కొరత వేధిస్తోంది. పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో భారత దేశం నుండి కూరగాయలు,ఇతర ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ ఆలోచిస్తోంది. ఇటు భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ అడగడమే ఆలస్యంగా భారీ ఎత్తున సాయం అందించడానికి సర్వ సన్నద్ధంతో ఉంది. వరదల పాపమా అని 15 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని ప్రాధమిక అంచనా. ఆసియాలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన చైనా కూడా భారీ వర్షాలు, వరదల తాకిడికి కుదేలైపోయింది. వాయువ్య చైనాలో భీకర వర్షాలు దండెత్తాయి. వర్షాలు, వరదల తీవ్రతతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు మూత పడ్డాయి. వీటిలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మూత పడ్డంతో తీవ్రమైన విద్యుత్ కొరత కూడా చైనాను వేధిస్తోంది. క్వింఘాయ్ ప్రావిన్స్ లో వర్షాలు విశ్వరూపమే ప్రదర్శించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు వరదల తీవ్రతకు పెద్ద ఎత్తున రోడ్లు కల్వర్టులు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కొట్టుకుపోయాయి. నైరుతి చైనా ప్రాంతంలో లక్షలాది మందికి విద్యుత్ సరఫరా లేదు. దాంతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. 2021లో వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతటి వానలతో చైనా వణికిపోయింది. ఆ వర్షాల ప్రభావంతో గత ఏడాది వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. దాన్నుంచి కోలుకోక ముందే ఇపుడీ వర్షాలు విరుచుకు పడ్డంతో ఈ ఏడాది కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది. ఇది చైనా ఆర్దిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే అవకాశాలున్నాయి. చైనా నుండి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే దేశాలపైనా ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఒక పక్క అతివృష్ణి మరో పక్క అనావృష్ఠి. చూస్తూ ఉండగానే మేఘాలు బద్దలై కుంభవృష్టి వానలు. ఆ వెంటనే అందరినీ ముంచెత్తే వరదలు. మరో పక్క భరించలేని వేడి గాలులు. తట్టుకోలేని కరకు కరవు కాటకాలు. దేన్నీ భరించే పరిస్థితి లేదు. దేన్నీ సహించే ఓపిక లేదు. బతుకులు రోజు రోజుకీ దుర్భరం అయిపోతున్నాయి. ఈ విపరీత ధోరణులకు కారణం వాతావరణంలోని అనూహ్య మార్పులే అంటున్నారు వాతావరణ శాస్త్ర వేత్తలు. ఏళ్ల తరబడి మనుషులు వహిస్తోన్న నిర్లక్ష్యమే ఇపుడు శాపంగా మారిందంటున్నారు వారు. అడ్డగోలుగా అడవులు నరికివేయడం.. అడ్డూ అదుపూ లేకుండా పరిశ్రమలు పెట్టి కాలుష్యాన్ని వెదజల్లేయడం.. పరిమితులకు మించి కర్బన ఉద్గారాలు ఉత్పత్తి చేయడం పచ్చటి ప్రకృతికి నిర్దాక్షిణ్యంగా పొగ బెట్టేయడం వంటి పాపాలు ఏళ్ల తరబడి చేసుకుపోవడం వల్లనే ప్రకృతి గాయపడిందంటున్నారు పర్యావరణ వేత్తలు. ఆ గాయాలతోనే మనిషిపై ప్రకృతి పగబట్టి ఉంటుందని వారు అంటున్నారు. ప్రకృతికి కోపం వస్తే దాన్ని అడ్డుకోవడానికి కానీ తట్టుకోవడానికి కానీ మనిషికి ఉన్న శక్తి సరిపోదని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యూరప్ దేశాలు భగ భగ మండిపోతున్నాయని చదువుకున్నాం. బ్రిటన్, ఫ్రాన్స్,ఇటలీ,జర్మనీ,పోర్చుగల్,సెర్బియా వంటి దేశాల్లో జీవనదులు ఎండిపోతున్న విషాద ఘటనల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ సమస్య యూరప్ దేశాలకే కాదు ఆసియా దేశాల్లోనూ తిష్ఠ వేసుకుని కూర్చుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధం అవుతోందంటున్నారు మేథావులు. ఇది ప్రపంచ మంతా విస్తరించడం ఖాయం అంటున్నారు వారు. ఇంత జరుగుతోన్నా దేశాలు కానీ వాటి పాలకులు కానీ అక్కడి ప్రజలు కానీ గాఢ నిద్ర నుండి మేల్కొనకపోవడం వల్లనే సమస్య మరింత జటిలం అవుతోందని వారంటున్నారు. ఇది మును ముందు మరింత భయానక పరిణామాలకు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతోన్న చైనాను మరో వైపు వేడి గాలులు వెంబడించి దెబ్బతీస్తున్నాయంటున్నారు పర్యావరణ వేత్త భాస్కర రెడ్డి. దాని ప్రభావం చైనాపై చాలా తీవ్రంగానే ఉంది. వర్షాభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం..దాని వల్ల కర్మాగారాలు మూతపడ్డం దాని ఫలితంగా ఉత్పత్తులు పడిపోవడం.. అల్టిమేట్ గా ఆర్ధిక వ్యవస్థ చావు దెబ్బతినడం వంటి చెయిన్ రియాక్షన్స్ చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ విపత్తులు ..ఇవి తెచ్చే సమస్యలు రాత్రికి రాత్రే రాలేదు. కొన్ని ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలంతా కూడా మనుషులు చేస్తోన్న తప్పిదాల వల్ల పర్యావరణానికి ఎలా తూట్లు పడుతున్నాయో..వాటి కారణంగా రానున్న కాలంలో ఎంతటి విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రకృతి మానవాళిపై పగబట్టిందంటే దానర్ధం ఏంటి? ప్రకృతిని మనిషి ఇష్టారాజ్యంగా అణచివేస్తున్నాడనే అంటున్నారు మేథావులు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోకపోతే కొందరి తప్పిదాల వల్ల యావత్ ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. -
Bengaluru rains : కన్నడనాట వరుణ ప్రతాపం (ఫొటోలు)
-
రాష్ట్రమంతా వానలే.. వానలు
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న వాయవ్య – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా పరిసరాల్లో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది ఏర్పడినట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం సగటున 14.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 67.2 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 37.6, పార్వతీపురం మన్యంలో 31.4, అల్లూరి సీతారామరాజు 34, విశాఖ జిల్లాలో 32.5, అనకాపల్లి జిల్లాలో 21.7, కాకినాడ జిల్లాలో 13.4, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12.5, తూర్పుగోదావరి 20.9, పశ్చిమగోదావరి జిల్లాలో 17.1, ఏలూరు జిల్లాలో 15.4, కృష్ణాలో 19.8, ఎన్టీఆర్ జిల్లాలో 26.4, గుంటూరు జిల్లాలో 15, పల్నాడు జిల్లాలో 16.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 222 మిల్లీమీటర్ల (22 సెంటీమీటర్లు) వర్షం పడింది. గరివిడిలో 170.6, చీపురుపల్లిలో 123.6, శ్రీకాకుళం జిల్లా లావేరులో 123.2, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 122.6, తెర్లాంలో 102.6, గజపతినగరంలో 99.6, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 120.1, రణస్థలంలో 113.2, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 98.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. కాగా గుంటూరు జిల్లావ్యాప్తంగా గత మూడు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. వాహన చోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు, సిబ్బంది వర్షాలను సైతం లెక్కచేయకుండా వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా మొత్తం మీద సగటున 4.7 మి.మీ వర్షపాతం నమోదైంది. గోడ కూలి ఇద్దరు దుర్మరణం.. విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాంలో పెంకుటిల్లు గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డాల రాము పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య సాయి ధరణి, పిల్లలు హర్షిత్‌వర్మ, భవానీ, తల్లి లక్ష్మితో కలిసి శుక్రవారం రాత్రి భోజనం చేశాక నిద్రలోకి జారుకున్నారు. భారీ వర్షానికి తడిసిపోయిన ఇంటి గోడ శనివారం వేకువజామున వీరిపై ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో గోడపక్క నిద్రపోయిన లక్ష్మి (57), మనుమడు హర్షిత్‌వర్మ (5) దుర్మరణం చెందారు. మిగిలిన ముగ్గురు గాయపడ్డారు. వీరిని వైద్యసేవల కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ ఏజెన్సీలో కొండ వాగుల ఉధృతి.. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గుబ్బల మంగమ్మ గుడి దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ముందుజాగ్రత్త చర్యగా 1800 233 1077 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద 1.5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. గోదావరిలో నిలిచిన పర్యాటకం గోదావరికి వరద నీరు రావడంతో అధికారులు పర్యాటక బోట్లను నిలిపివేశారు. ఇప్పటికే తుపాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు రోజుల నుంచి గోదావరికి వరద నీరు పెరగడంతో పర్యాటక బోట్లను నిలిపివేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28.8 మీటర్ల మేర నీటిమట్టం ఉంది. అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూములు.. భారీ వర్షాల నేపథ్యంలో పలుచోట్ల వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. జిల్లాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యవసర సాయం, సమాచారం కోసం 1070, 18004250101, 08632377118 నంబర్లను సంప్రదించాలన్నారు. నదులు జలజల.. ఎడతెరిపిలేని వానలతో వాగులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ నీళ్లన్నీ చేరుతుండటంతో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకున్నాయి. తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఏ సమయంలోనైనా నీటిని విడుదల చేస్తామని, అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలుకానుంది. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వానలు పడుతుండటంతో అందులోనూ ప్రవాహాలు పెరిగాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి,శబరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ నీటి ఉధృతి పెరుగుతూ వచ్చింది. దీంతో బ్యారేజ్ నుంచి శనివారం సాయంత్రం 2,21,502 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 20.60 అడుగులు, కూనవరంలో 9.75 మీటర్లు, కుంటలో 4.71 మీటర్లు, పోలవరంలో 7.27 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 13.19 మీటర్ల నీటిమట్టం ఉంది. కాగా కృష్ణానదికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్దకు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో 14,700 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. ఇరిగేషన్ అధికారులు 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 14,700 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శనివారం అర్ధరాత్రి సమయానికి ప్రకాశం బ్యారేజ్‌కు వాగు వంకల నుంచి 40 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీంతో కృష్ణానది దిగువ ప్రాంతాల్లో లంక భూముల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏవైనా సాయం కావాల్సి వస్తే డిస్ట్రిక్ట్ 0863–2234014 నంబర్‌కు ఫోన్ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. మరోవైపు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, మున్నేరు, వైరా పొంగిపొర్లుతున్నాయి. కట్టలేరుకు వరద రావడంతో వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం దామూలూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. -
వర్ష బీభత్సం
అనకాపల్లి: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. అర్ధరాత్రి వేళ వర్ష బీభత్సం జిల్లాను అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి 12 గంటలు దాటాక గాలివాన మొదలైంది. కుంభవృష్టి కురిసింది. పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురిసింది గంటపాటే అయిన అధిక వర్షపాతం నమోదైంది. మునగపాకలో అత్యధికంగా 92.6 మిల్లీమీటర్లు, కశింకోటలో 90.2 మి.మీ. వర్షం పడింది. ఈదురుగాలుల బీభత్సానికి అనకాపల్లి, యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల పరిధిలో చెట్లు నేలకొరిగాయి. చోడవరంలో 15 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అనకాపల్లి, యలమంచిలి పరిధిలో అక్కడక్కడ విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు రాత్రంతా అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జి కింద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను లక్ష్మీదేవిపేట రైల్వేగేటు వైపు మళ్లించారు. పలు చోట్ల కూలిన చెట్లను ఆయా కాలనీల వారు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. బుచ్చెయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామంలో కోరుకొండ తాతయ్యలకు చెందిన పాడి గేదెపై తాటిచెట్టు విరిగి పడింది. వడ్డాది కస్పా, విజయరామరాజుపేట, మంగళాపురం, కుముదాంపేట, బంగారుమెట్ట తదితర గ్రామాల్లో రబీ వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. కోసిన వరి పనులు నీట మునిగిపోయాయి. పలు గ్రామాల్లో అరటి, మామిడి, అపరాలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధం గొలుగొండ: మండలంలో ఏఎల్‌పురం గ్రామానికి చెందిన కె.నాగరాజు ఇల్లు మంగళవారం అర్ధరాత్రి పిడుగుపాటుకు కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బుధవారం వీఆర్వో శ్రీధర్ వచ్చి బాధితులను పరామర్శించారు. రైతులకు నష్టం మునగపాక: ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. దీంతో రాత్రంతా అంధకారం నెలకొంది. ఆవ ప్రాంతంలో కోసిన వరి పనలు నీట మునిగిపోయాయి. అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. -
‘అసని’ తుపాను : ఏపీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు (ఫొటోలు)
-
నగరానికి వరుణుడి సైరన్!..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజామున గాలి దుమారంతో కూడిన భారీ వర్షం దడ పుట్టించింది. నగర అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వర్షాకాలంలోగా ముంపు ముప్పు తప్పించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించినప్పటికీ, చెప్పుకోదగిన స్థాయిలో పనులు జరగలేదు. దీంతో ముంపుముప్పు పొంచే ఉంది. గంటసేపు కురిసిన ఒక్కవానకే వాస్తవ పరిస్థితి కళ్లకు కట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. రోడ్లపై జనసంచారం లేని సమయం, సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా గండం గట్టెక్కినప్పటికీ, వర్షాకాలంలో తలెత్తనున్న అసలు సినిమాకు టీజర్ రిలీజ్ అయిందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వరద సమస్యలకు పరిష్కారం చూపే నాలాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్‌లోగా ఇరవై శాతమే పూర్తికాగలవని అధికారులే చెబుతుండటంతో ఈసారీ వాన కష్టాలు పునరావృతం కానున్నాయని తెలుస్తోంది. వర్షాలు కూడా తోడైతే పనులు జరిగే పరిస్థితే ఉండదు. ఈ నేపథ్యంలో, అధికారులు తక్షణ చర్యలకు సిద్ధం కావాల్సిన పరిస్థితిని ప్రకృతి హెచ్చరించింది. డీసిల్టింగ్ పనులు సైతం పూర్తికాకపోవడంతో వరద, డ్రైనేజీ కలగలసి పారిన చిత్రాలు కనిపించాయి. నాలాల పనులు పూర్తికానందున నీటినిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటన తోడిపోయాల్సిన చర్యలు తప్పని పరిస్థితి నెలకొంది. ముప్పు.. తప్పేదెప్పుడు? నగరంలో వాన కురిసిందంటే చాలు ప్రధాన రహదారులే చెరువులుగా మారే రంగమహల్ జంక్షన్, మైత్రీవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, ఆర్పీ రోడ్, ఆలుగడ్డబావి, కార్ఖానా మెయిన్‌రోడ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కేబీఆర్ పార్క్, మైలాన్షోరూమ్ (బంజారాహిల్స్), బయోలాజికల్ ఈ లిమిటెడ్,(రామ్‌నగర్), నిజాంకాలేజ్, ఖైరతాబాద్, అయోధ్య జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్తగా ఇతర ప్రదేశాలు నీటినిల్వ ప్రాంతాలుగా మారాయి. జరిగింది కొంతే.. జరగాల్సింది ఎంతో.. సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణ తదితర పనులు మొదలు పెట్టినా, పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లోని పనులే ఇందుకు నిదర్శనం. నాగమయ్యకుంట నాలా ఆధునికీకరణ పనులు 7 శాతం జరిగాయి. మోహిని చెరువు నుంచి మూసీ నది వరకు వరద కాల్వ పనులు 10 శాతం పూర్తయ్యాయి. యాప్రాల్‌లో నాగిరెడ్డిచెరువు–కాప్రాచెరువు వరదకాలువ పనులు 18 శాతం జరిగాయి. మన్సూరాబాద్ చిన్నచెరువు–బండ్లగూడ చెరువు పనులు 7 శాతం జరిగాయి. బండ్లగూడ చెరువు–నాగోల్ చెరువు పనులు 20 శాతం పూర్తయ్యాయి. నూరినగర్ –డెక్కన్ ప్యాలెస్ వరకు 14 శాతం జరిగాయి. జల్పల్లి ఫిరంగి నాలా– క్యూబా కాలనీ వరకు 3 శాతం మాత్రమే జరిగాయి. సాతం చెరువు నుంచి లంగర్‌హౌస్ (వయా మోతీ దర్వాజా) డ్రెయిన్ పనులు 10 శాతం జరిగాయి. నదీం కాలనీ నుంచి సాతం చెరువు వరకు పనులు 6 శాతం జరిగాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వీటికి అటూఇటూగా పనులు జరిగాయి. ఫిర్యాదులెన్నో.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్కు 48 ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు ఫిర్యాదులందగా తొలగించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇతర మాధ్యమాల ద్వారా నీటి నిల్వ లు, చెట్లు కూలిన ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ జోన్లో 71 ప్రాంతాల్లో, సికింద్రాబాద్ జోన్లో 54 ప్రాంతాల్లో, చార్మినార్ జోన్లో 35 ప్రాంతాల్లో నీటినిల్వలు తొలగించారు. ఖైరతాబాద్‌జోన్‌లో 42, సికింద్రాబాద్జోన్లో 7, చార్మి నార్ జోన్లో 3 కూలిన చెట్లను తొలగించారు. వర్షాల సమస్యలపై జీహెచ్ఎంసీ కంట్రోల్‌రూమ్ 04021111111 లేదా 04029555500 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ పేర్కొంది. -
రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: నేడు దేశంలో పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు వర్షపాతం ఉంటుంది. తర్వాత ఐదు రోజులలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఐతే ఈశాన్య భారతదేశంలో రెండు రోజులపాటు పొడిగా ఉంటుంది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. ఉత్తర భారతంలో మాత్రం జనవరి 5 నుంచి 7 మధ్య చలిగాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో పగటిపూట, అర్థరాత్రి సమయాల్లో దట్టంగా మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 5 నుండి 7 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో జనవరి 6, 7 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 2,3 రోజుల్లో చలిగాలుల కారణంగా పంజాబ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెల్పింది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
తమిళనాడుకు మరో తుపాను హెచ్చరిక! రానున్న 48 గంటల్లో..
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుపాను పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడు నవంబర్ 29 నాటికి మరో తుపాన్‌ను ఎదుర్కొనబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం.. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా. ஆழ்வார்பேட்டை பாரதிதாசன் சாலை மழை நீரால் மூழ்கியது. People.. be safe, drive carefully wherever you see the water as there are damaged roads as well. #ChennaiRains #chennaifloods #Rains #TamilNadu #NEWS #NewsBreak pic.twitter.com/gPuHgoMA7C — suwathy venugopal (@suwavenus) November 27, 2021 #Palar river witnessing the flow of more than 1 lakh cusecs of water #TamilNadu #Vellore #AP #Karnataka pic.twitter.com/nIlLu4nXSp — Shabbir Ahmed (@Ahmedshabbir20) November 21, 2021 అయితే, తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. Visual from West Mambalam, #Chennai#ChennaiRain @karthickselvaa @Stalin__SP @vedhavalli_13 @dharannniii #Tamilnadu pic.twitter.com/l4vC27lFoo — Tamilnadu Galatas (@tamilnadugalata) November 27, 2021 Beautiful weather at Beasant Nagar beach, Chennai #ChennaiRains2021 #TamilNadu #Chennai pic.twitter.com/Zqk23ZXA5P — Vidhu Trivedi 🇮🇳 (@vidhu0522) November 27, 2021 -
తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు.. కనివినీ ఎరుగని వరద
-
మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అండమాన్ సముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉంది, ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనాకేంద్రం ఆదివారం ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో చెన్నై నగరం మేఘావృతమై ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. కన్యాకుమారిపై తీవ్ర ప్రభావం.. గత 11 రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. 50 వేల ఇళ్లు నీటమునిగాయి. ఇంకా భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున కన్యాకుమారి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సేలం జిల్లాల్లోని మేట్టూరు డ్యామ్ నిండు కుండలా మారింది. కావేరి నది నీటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శనివారం రాత్రి 11.35 గంటలకు మేట్టూరు డ్యాం పూర్తి నీటి సామర్థ్యం (120 అడుగులు)కి చేరింది. ప్రజా పనుల శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 93.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తుండగా, 286 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కావేరినదీ పరివాహక ప్రాంతాల్లో.. కావేరి నది తీర ప్రాంతంలోని 12 జిల్లాలకు వరద ప్రమాదం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 90 శాతం పూర్తయినట్లు చెన్నై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 22 సబ్వేలలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అయితే వాస్తవానికి చెన్నైలోని 70 వీధుల్లో వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి లోగా వాటిని తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పీఎం సహాయాన్ని కోరుతా : సీఎం స్టాలిన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టం అంచనా నివేదిక అందిన తరువాత ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాసి సహాయాన్ని కోరనున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. పార్లమెంట్ సభ్యులను స్వయంగా పంపి వరద సహాయక చర్యల నిమిత్తం నిధులను కోరుతామని చెప్పారు. వరద సహాయక చర్యలను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమై పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. -
ఉధృతి తగ్గుముఖం
సాక్షి, అమరావతి/నెల్లూరు/చిత్తూరు/సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి. మిగిలిన చోట ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో 8 జలాశయాలు నిండటంతో గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలు çస్తంభించాయి. స్వర్ణముఖి నదిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 9 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సురుటుపల్లె ఆనకట్ట కుడివైపు దెబ్బతినడంతో పల్లపు ప్రాంతాల్లోని గ్రామాలు జలమయమయ్యాయి. సత్యవేడు మండలం ఊతుకోట, రాజులకండ్రిగ వద్ద ఉన్న వంతెన, నాగలాపురం మండలం టీపీకోట, ఓబులరాజుల కండ్రిగ వద్ద ఉన్న వంతెన, చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె వద్ద ఉన్న చెక్‌డ్యాంలు కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. స్వర్ణముఖి నది, నక్కలవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లను రాత్రి వేళ మూసివేస్తున్నట్లు టీటీడీ భద్రతా అధికారులు తెలిపారు. నది మధ్యలో బిక్కుబిక్కుమంటూ.. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి చెందిన రాజశేఖర్, లక్ష్మి దంపతులు ఏడాది బిడ్డతో కలిసి పందులను మేపేందుకు గురువా రం స్వర్ణముఖి తీరానికి వెళ్లారు. వరద ప్రవాహం చుట్టుముట్టడంతో నదిలోనే చిక్కుకుపోయారు. వారిని వైఎస్సార్సీపీ శ్రేణు లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం బయట కు తెచ్చారు. పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద చొక్కలింగం(45) ప్రమాదవశాత్తు కాలు జారి అరుణానదిలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేవీబీ పురం మండలం బంగారమ్మ కండ్రిగకు చెందిన లోకేష్ నదిలో దూకి చొక్కలింగంను కాపాడేందుకు ప్రయత్నించాడు. ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వీలు కాలేదు. ఇతని మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. లోకేష్ కూడా వరదలో కొట్టుకు పోతుండగా స్థానికులు కాపాడారు. రాకపోకలకు అంతరాయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాళంగినది, పాములకాలువలు ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. సూళ్లూరుపేట సమీపంలోని తారకేశ్వరా టెక్స్టైల్స్ కంపెనీ, విండ్ ఎనర్జీ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది కార్మికులు పాముల కాలువ వరదనీటిలో చిక్కుకుపోగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వెంకటగిరి మండలం పాళెంకోట గ్రామం కాజ్వే కొంత మేర వరదకు కొట్టుకుపోయింది. సోమశిల ఉగ్రరూపం సోమశిల తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఏడు గేట్ల నుంచి 74 వేల క్యూసెక్కుల నీటిని పెన్నాకు వదులుతున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెన్నా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో చిక్కుకుపోయిన 11 మంది మత్స్యకారుల్ని కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డు సిబ్బంది సురక్షితంగా తీరానికి చేర్చారు. ఈ నెల 9న చేపల వేటకు వెళ్లి మర పడవ చెడిపోవడంతో మైపాడు వద్ద వీరు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కూలిన స్తంభాలు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వందలాది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. బుగ్గవంక డ్యామ్ గేట్లు ఎత్తివేత వైఎస్సార్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడపలో బుగ్గవంక డ్యామ్ గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా నగరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఒంటిమిట్ట చెరువు అలుగు పారుతోంది. రాజంపేట మండలం భువనగిరిపల్లెకు, చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లె నాగిరెడ్డిపల్లెకు రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపురం వద్ద పొడదుర్తి పాపాఘ్ని నదిలో చిక్కుకున్న ఓ యువకుడిని, సిద్దవటం మండలం నేకనాపురానికి చెందిన పలువురిని అధికారులు కాపాడారు. పించా, వెలిగల్లు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. ఝరికోన ఉధృతంగా పారుతోంది. రాయచోటి ప్రాంతంలో సుద్దకోళ్ల వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుండుపల్లె, రాజంపేటలకు రాకపోకలు ఆగిపోయాయి. బుగ్గవంక సమీపంలోని శాస్త్రి నగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ వృద్ధురాలిని హోంగార్డు రమేష్ రక్షించాడు. -
తిరుమలలో భారీ వర్షాలు.. రెండు ఘాట్‌రోడ్లు మూసివేత
సాక్షి, తిరుమల: తిరుమలలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిషేదించారు. ఈ మేరకు టీటీడీ భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, తిరుమలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగిపడతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో భారీగా నీరు తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షాలకి నడకదారిలో భారీగా నీరు ప్రవహిస్తోంది. మెట్లపై నడవలేని పరిస్థితి ఉంది. నడకమార్గంలో భక్తులు పిట్టగోడపై నడుస్తున్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదవండి: (Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి) -
Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి
సాక్షి, చెన్నై: గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉంది. పలు విమాన సర్వీసుల రద్దు వర్షం, ఈదురు గాలులు కారణంగా విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు విమానాలను మళ్లించారు. తమిళనాడు ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి తమిళనాడులో 14 మంది మృతి చెందారు. చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. చదవండి: (తిరుపతి, తిరుమలలో భారీ వర్షం) -
తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
-
తిరుపతి, తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుపతిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులో వీస్తున్నాయి. తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో అధికారులు వాహన దారులను, స్థానికులను అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా పయనించి, గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, మధ్య చెన్నై సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం కుడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో.. భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం చిత్తూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నెల్లూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం పంపించామని తెలియజేశారు. శనివారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు సీఎం జగన్ నివాళి -
టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు
బెంగళూరు: చిన్నప్పుడు ఎప్పుడో పోలాల్లోనూ లేదా సరదాగానో ట్రాక్టర్లు ఎక్కి ఉంటాం. కానీ పరిస్థితి అనకూలించక లేక ఇతరత్రా కారణాలతోనో ఎక్కాలసి వస్తే ఎవరూ ఏం చేయలేం కదా ప్రస్తుతం అలాంటి పరిస్థితే బెంగుళూరు వాసులు ఎదుర్కొన్నారు. మాములుగా వర్షలు ఎక్కువగా పడితేనే రహదారుల బాగోక ఒక పక్క ట్రాఫిక్ ఏర్పడి మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనలవి కాదు. అలాంటిది మెట్రోనగరాల్లాంటి బెంగుళూరు నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ వర్షాల కారణంగా బెంగళూరు వాసులు విమానశ్రయం చేరుకోవడానికి ఎన్ని పాట్లు పడ్డారో చూడాండి (చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?) వివరాల్లోకెళ్లితే.....బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (కేఐఏ) వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. టాక్సీలు ప్రైవేట్ వాహనాలు, విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి. అయితే ప్రయాణికులు కూడా టెర్మినల్స్‌లోకి ప్రవేశించలేకపోతున్నారు. దీంతో ప్రజలు విమానాశ్రయం చేరుకోవటం అత్యంత అసాధ్యమైంది. ఈ క్రమంలో వేరుదారిలేక ప్రయాణికులంతా ట్రాక్టర్లను ఆశ్రయించక తప్పలేదు. ప్రయాణికులంతా ట్రాక్టర్లపై ప్రయాణిస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేశాయి. దీంతో ఎంతటి గొప్పోడైనా ప్రకృతి ముందు తలవంచక తప్పదు కదా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) -
TS: రోడ్లన్నీ జలదారులే
ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రుతు పవనాలు కూడా చురుగ్గా ఉండటం, ఈనెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో.. వానలు మరికొద్దిరోజులు కొనసాగవచ్చని వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్:రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వరంగల్ జిల్లా నడికుడలో ఏకంగా 38.8 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇంతస్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్ జిల్లా మల్యాలలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. ఈ రెండు చోట్ల మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనట్టు తెలిపింది. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం హన్మకొండలోని హంటర్ రోడ్డు జంక్షన్‌ను ముంచెత్తిన వరద జల దిగ్బంధంలో వరంగల్.. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగి భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం జంపన్నవాగు బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్‌లో ముంపు బాధితులను పునరావాస కేం ద్రాలకు తరలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వరద చేరడంతో పంతిని వద్ద ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో పంటలు నీటమునిగాయి. వేములవాడ శివారు లక్ష్మీపూర్‌కు చెందిన మూడు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు అన్ని చోట్లా బీభత్సమే.. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జోగిపేట అన్నసాగర్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు, జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ► నిజామాబాద్ నగరంలో పలు లోతట్టు కాలనీలు నీటమునిగాయి. దీంతో కంఠేశ్వర్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఆయా కాలనీల జనం ధర్నా చేశారు. ఉమ్మడి జిల్లా జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, సోయా, పసుపు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా సోయా పంటకు నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలేరు–సిద్దిపేట మార్గంలోని కొలనుపాక, రాజాపేట మండల కేంద్రం జల దిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలతో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ► నిర్మల్ జిల్లాలో గోదావరి నది, ఉప నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భైంసా పట్టణంలో 9 కాలనీలు నీటమునిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కుంటాల, పొచ్చర జలపాతాలు హోరెత్తుతున్నాయి. బోథ్ తహసీల్దార్ కార్యాలయం పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. పది మంది మృతి.. ఇద్దరు గల్లంతు ► సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి–గూడాటిపల్లి మధ్య వాగు దాటుతూ. పోతారం(జే) గ్రామానికి చెందిన రంగు కిష్టస్వామి (45) చనిపోయారు. ► సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాద్వార్‌కు చెందిన కోవూరి మహిపాల్ (35) మంగళవారం మధ్యాహ్నం కిరాణా సరుకులు తీసుకొని ఇంటికి వస్తుండగా.. గ్రామ శివార్లలోని కాజ్వే దాటుతూ వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. ► ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట బస్టాండ్‌లో అనాథ వ్యక్తి వానకు తడిసి, చలి తట్టుకోలేక మృతి చెందారు. కోరుట్లలో నీట మునిగిన ప్రకాశం రోడ్ ప్రాంతం ► జగిత్యాల జిల్లాలో వాన నలుగురిని బలితీసుకుంది. గొల్లపెల్లి మండలం మల్లన్నపేట వద్ద బైక్‌పై కాజ్వే దాటుతూ.. నందిపల్లెకు చెందిన ఎక్కలదేవి గంగమల్లు, ఆయన కుమారుడు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. మల్లాపూర్ మండలంలో ఇంట్లో మోటార్ వేద్దామని వెళ్లిన నేరెల్ల శ్రీను అనే వ్యక్తి.. వైర్లు తడిసి ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. గొల్లపల్లి మండలం బొంకూర్‌లో ఓ అంగన్వాడీ టీచర్ తడిసిన వైర్లను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి బలయ్యారు. ► సిరిసిల్ల పట్టణంలో వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నట్టు గుర్తించారు. వరద తాకిడికి మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయిన దృశ్యం ► కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో వానకు తడిసి ఇంటిగోడ కూలడంతో.. నిమ్మ నర్సవ్వ (35) అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే జిల్లా బాన్సువాడ మండలం కన్నయ్యతండాలో ఆశ్రద్ (38) అనే రైతు పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ► నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలో టెంబరేణి దగ్గర ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో చేపలవేటకు వెళ్లి గుమ్ముల నరేశ్ (36), కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్లో వాగు దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యారు. గర్భిణులకు వరద కష్టాలు ►ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త వెంకటగిరి– బిల్లుపాడు గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటగిరికి చెందిన కిన్నెర మమత పురిటినొప్పులతో బాధ పడుతుండగా.. వాగు ప్రవాహం నుంచే నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా..ఆడపిల్లకు జన్మనిచ్చింది. ► ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం చిన్నుమియ తండాకు చెందిన గర్భిణి గంగాబాయికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి 108 వచ్చే అవకాశం లేకపోవడంతో.. సమీపంలోని గుట్ట మీదుగా కిలోమీటర్ దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. -
కాలనీలు.. కన్నీళ్లు
సాక్షి, నెట్వర్క్: కుండపోత వానకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఏకధాటి వర్షం మహబూబ్‌నగర్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలను కకావిలకం చేసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, ఆయా కాలనీల్లోని ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వరద నీటిలో పడి ఇద్దరు కొట్టుకుపోగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మహబూబ్‌నగర్ పట్టణం రామయ్యబౌలిలో ఇళ్ల మధ్యే నిలిచిన వర్షపు నీరు పాలమూరు కకావికలం శనివారం అర్ధరాత్రి మొదలై.. ఆదివారం ఉదయం వరకు కురిసిన వానతో మహబూబ్‌నగర్ జిల్లా అల్లాడింది. ఒక్క మహబూబ్‌నగర్ పట్టణంలోనే 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగు పారడంతో దిగువన ఉన్న ఏడు కాలనీల్లోని ఇళ్లలోకి నడుము లోతున నీళ్లు చేరాయి. అర్ధరాత్రి వేళ నీటమునిగిన ఇళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పెద్దచెరువు అలుగు పారడంతో మినీ ట్యాంక్‌బండ్ మీదుగా రాకపోకలను అధికారులు నిలిపివేయించారు. అడ్డాకుల మండలంలోని వర్నె వద్ద మట్టిరోడ్డు వాగులో కొట్టుకుపోయింది. ఈ వర్షంతో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టమేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో అలుగు పారుతున్న పెద్దచెరువు ఉమ్మడి కరీంనగర్‌ను కుమ్మేసింది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీవర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోని శివారు కాలనీలు జలమయమయ్యాయి. కరీంనగర్‌లోని పలు కాలనీలు నీటమునగగా, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విపత్తుల బృందం రంగంలోకి దిగి డ్రైనేజీల్లో నిండిన నీటిని దారిమళ్లించింది. పద్మానగర్‌లోని వాల్‌మార్ట్ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిరిసిల్లలోని బీవైనగర్, అనంతనగర్‌లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. కొత్తచెరువు మత్తడి దూకడంతో ఆటోనగర్, శాంతినగర్, ఆసిఫ్‌పుర, రాళ్లబావి ప్రాంతాలు జలమయమయ్యాయి. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రహరీ కూలిపోయింది. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువమానేరు ఉధృతంగా మత్తడి పోస్తుండటంతో సిద్దిపేట–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొట్టుకుపోయిన ఇద్దరు.. వికారాబాద్ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లాలో సగటున 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట్ మండలంలో అత్యధికంగా 104.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగ్నా నదిలో వరద ఉధృతికి యువకుడు కొట్టుకుపోయాడు. ధారూరు మండలం దోర్నాల్కి చెందిన గోరయ్య (35) పీర్ల పండుగలో డప్పులు వాయించేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి వస్తున్న క్రమంలో నదిదాటుతూ కొట్టుకుపోయాడు. రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. కాగా, సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ శివారులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి ఝరాసంగం వైపు నుంచి రేజింతల్ వైపు బైక్‌పై వస్తున్న క్రమంలో కల్వర్టు దాటుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు హద్నూరు పోలీసులు చెప్పారు. జల దిగ్బంధంలో చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం జలమయమైంది. శనివారం రాత్రి కురిసిన వర్షంతో ఊర చెరువులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరి.. ఆదివారం ఉదయం నుంచి అలుగు పారింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, గాంధీపార్క్, సెల్లార్ దుకాణాలు, పలు కాలనీలను నీరు ముంచెత్తింది. పోలీస్ స్టేషన్లోకి సైతం నీరు చేరింది. బస్‌స్టేషన్, హాండ్లూమ్ మార్కెట్, గాంధీపార్క్, విద్యానగర్, శాంతినగర్, రాంనగర్, వినాయకనగర్ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా పడింది. చిన్నకొండూర్ రోడ్డు వరకు సర్వీస్ రహదారి వెంట వరద నీరు పోటెత్తింది. వరద సాఫీగా వెళ్లేందుకు అనువైన కాలువలు లేకపోవడం, సర్వీస్ రోడ్డు వెంట ఉన్న కాలువ సరిపోకపోవడంతో నీరు చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తింది. -
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రడూన్ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని గ్రహించి వంతెనపైకి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. చదవండి: Cricketer Rashid Khan: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం -
విజయవాడలో దంచికొట్టిన వాన.. అన్నదాతల్లో హర్షం
సాక్షి, కృష్ణా: విజయవాడలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వాన పడింది. విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, పెనమలూరు తదితర ప్రాంతాలలో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులగా పెరిగిన ఉష్ణోగ్రతలతో నాట్లు ఎండిపోయే సమయంలో వర్షాలు పడుతుండటం రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రోడ్లు సైతం జలమయమయ్యాయి. రోడ్లపై రెండు అడుగుల పైన ప్రవహిస్తున్న వరద నీటిలోనే వాహనదారులు ప్రయాణిస్తూ ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుప్రధాన రహదారులు చెరువులని తలపించాయి. ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, లబ్బీ పేట, మొగల్రాజపురం, రెవెన్యూ కాలనీ, కృష్ణలంక, రాణిగారితోట, సింగ్ నగర్, తదితర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రెవెన్యూ కాలనీలోని రోడ్లు ఈ భారీవర్షానికి పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలోని సెల్లార్లోకి వర్షపు నీరు చేరిపోయి వాహనాలు సైతం మునిగిపోయాయి. -
ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం.. ఉధృతంగా బంగారిగూడ వాగు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాన కారణంగా బంగారిగూడ వాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది. ఆదిలాబాద్-కుమ్రంభీం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవంటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బోథ్ మండలంలో భారీ వర్షాల కారణంగా నక్కల్వడా బిడ్జిపై నుంచి నీరు పొంగిపోరలుతోంది.దీంతో గ్రామల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానిక బోథ్ పోలీసులు ఆదేశించారు. -
గర్భిణులకు వాన కష్టాలు
అశ్వాపురం/నేరడిగొండ(బోథ్)/మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్‌లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. మంచంపై అంబులెన్స్ వరకు.. మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వరకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్ నవీన్ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్ దూరం లో ఉన్న అంబులెన్స్ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు. గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు -
నింగికి చిల్లు.. మునిగిన నిర్మల్.. సీఎం కేసీఆర్ ఆరా
నిర్మల్: అది మాములు వాన కాదు.. ఆకాశానికి చిల్లు పడిందా..? అన్నట్టుగా నిర్మల్ జిల్లావ్యాప్తంగా జడివాన కురిసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం దాకా కుండపోత పోసింది. నిర్మల్, భైంసా పట్టణాలు చెరువుల్లా మా రిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని 19 మండలాలకుగాను 18 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ (జి) మండలంలో ఏకంగా 24.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. చుట్టుముట్టిన నీళ్లు.. భారీగా వరదతో భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. దాంతో దిగువన ఉన్న ఆటోనగర్ ప్రాంతం జలదిగ్బంధమైంది. కాలనీవాసులను, అక్కడి ఓ ఫంక్షన్ హాల్లో బసచేసిన మంది పోలీసులను రెస్క్యూ టీమ్ గజ ఈతగాళ్లు, తెప్పలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్, జీఎన్ఆర్ కాలనీలు నీట మునిగాయి. స్థానికులు రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇళ్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. వీటితో పాటు మరికొన్ని కాలనీల్లోనూ వరద చేరింది. శివాజీచౌక్, బోయవాడ, ఇంద్రానగర్, శాస్త్రినగర్, నటరాజ్‌నగర్, ఈద్గాం ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు నిలిచాయి. ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారులు కూడా నీట మునగడంతో.. పట్టణమంతా చెరువును తలపించింది. మంజులాపూర్, బంగల్పేట్ చెరువులు ఉప్పొంగి భైంసా–నిర్మల్, ఆదిలాబాద్–నిర్మల్, మంచిర్యాల–నిర్మల్ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల మండలం పాతవెంకూరు, సారంగపూర్ మండలం వంజర్, సోన్ మండలం జాఫ్రాపూర్‌లలో కొందరు వరద నీటిలో చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలతో వారిని కాపాడారు. కడ్తాల్ వద్ద స్వర్ణ నది ఉధృతితో 44వ నంబర్ జాతీయ రహదారి నీట మునిగింది. దీంతో రాకపోకలను దారి మళ్లించారు. జీఎన్ఆర్ కాలనీలో బాధితులను రక్షిస్తున్న సహాయక బృందం రోడ్లపైనే చేపలు.. ఈతలు ►స్వర్ణ నది, మంజులాపూర్, బంగల్పేట్ చెరువుల వరదలో కొట్టుకొచ్చిన చేపలు.. నిర్మల్ పట్టణంలో నిలిచిన నీళ్లలో చేరాయి. పలువురు స్థానికులు వలలు, చీరలతో వాటిని పట్టుకున్నారు. ►నిర్మల్–ఆదిలాబాద్ మార్గంలో విశ్వనాథ్‌పేట్ వద్ద మొత్తం రోడ్డు మునిగిపోయింది. కొందరు యువకులు ఆ నీళ్లలో ఈతకొట్టారు. నిర్మల్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా జడివానతో మునిగిన నిర్మల్, భైంసాలతోపాటు జిల్లాలోని పరిస్థితిపై సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం ఆరా తీశారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్టు తెలిపారు. -
ముంబైని వీడని వర్షాలు
ముంబై సెంట్రల్: ముంబైలో సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, రోడ్డు రవాణతోపాటు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. నగరంలోని లోత ట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చొరబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హింద్మాతా, పరేల్, బైకుల్లా ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బాండూప్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌లో వాన నీరు చొచ్చుకు రావడంతో ముంబై లో పలు ప్రాంతాల్లో సోమవారం నీటి సరఫరా నిలిచిపోయింది. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి రాత్రి వరకు నీటి సరఫరా మళ్లీ పునరుద్దరించినప్పటికీ నల్లాల్లో మురికినీరు రావడంతో, తాగు నీటిని బాగా మరిగించి తాగాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు మురికినీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భీవండీలో కుంభవృష్టి.. : నిరంతరం కురుస్తున్న కుంభవృష్టి వల్ల భీవండీ నగరం లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈద్గాహ్, ఖాడీపార్, కారీవలి, ప్రధాన మార్కెట్ ప్రాంతం, తీన్ బత్తీ, బాజీ మార్కెట్ ప్రాంతాలలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తున నీరు నిలిచిపోయింది. షాపులు, నివాస స్థలాల్లోకి వరద నీ రు దూసుకొని వచ్చింది. పలు ప్రాంతాల్లో అధికారులు జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 5 రోజుల పాటు భారీవర్ష సూచన.. ముంబైలో రాబోయే మరో 5 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, కొంకణ్ ప్రాంతంలో, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరాఠ్వాడా, విదర్భలోని పలు ప్రాంతాల్లో యెల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. రానున్న 48 గంటల్లో ముంబై, పరిసర నగరాల్లో కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాందివలిలో భారీ వర్షాలతో ఘటన సాక్షి ముంబై: కాందివలిలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పార్కింగ్‌లో సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. కాందివలిలోని ఠాకూర్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఠాకూర్ కాంప్లెక్స్ ప్రాంతంలోని బీఎంసీ పార్కింగులో రోజు మాదిరిగానే అనేక మంది వాహనాలను పార్కింగ్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా పార్కింగులో పెద్ద ఎత్తున నీరు చొరబడింది. దీంతో అక్కడ పార్కింగ్ చేసిన సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. -
జడిపించిన జడివాన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం తో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో పలు కాలనీలు జల మయమయ్యాయి. హైదరాబాద్‌లోని చార్మినార్, గన్‌ఫౌండ్రి, జూపార్క్ తదితర ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వాననీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఊర్కొండ మండలం గుడిగాన్‌పల్లి శివారులో కేఎల్ఐ కాల్వ తెగిపోయింది. చాలాచోట్ల వందలాది ఎకరాల పంటచేలల్లో వర్షపునీరు నిలిచిపోయింది. కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్నసంగమేశ్వర ఆలయం సమీపంలోకి నీళ్లు చేరాయి. ♦నిజామాబాద్ పట్టణంతోపాటు మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలో లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి వర్షపునీరు చేరింది. ♦సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో గంటపాటు కురిసిన వానలకు రహదారులు జలమయమయ్యాయి. వరుస వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకుంది. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మట్టి మిద్దె కూలి మహిళ మృతి రాజోళి (అలంపూర్): మట్టిమిద్దె కూ లి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని చిన్నధన్వాడకు చెం దిన బోయ సరస్వతమ్మ (50), కృష్ణ య్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆషాఢమాసం కావడంతో చిన్నకూతురు నాలుగు రోజుల క్రితమే పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం అర్ధరాత్రి ఇల్లు కూలింది. నిద్రిస్తున్న సరస్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. కొడుకు ఆరుబయట నిద్రించడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సంఘటనస్థలాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ పరిశీలించారు. -
ఉత్తర కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రకు రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
Telangana: తడిచె.. మొలకెత్తే..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ఈ ఏడాది దిగుబడి బాగుందన్న రైతుల సంతోషాన్ని అకాల వర్షాలు, రవాణా కష్టాలు ఆవిరి చేస్తున్నా యి. నెల రోజులుగా తరచూ కురుస్తున్న వానలతో ఇబ్బందులు నెలకొన్నాయి. ధాన్యం తడిసి రంగు మారిందని, మొలకెత్తిందని, తేమ ఎక్కువ ఉందంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు పెడ్తున్న కొర్రీలతో రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ధాన్యం తూకం వేసినా.. దానిని మిల్లులకు తరలించేందుకు లారీలు లేక మరో సమస్య ఎదురవుతోంది. కొనుగోళ్లు లేక, కొన్నా మిల్లులకు తరలించలేక.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. కాంటాలు వేసిన తర్వాత కూడా బస్తాలు మిల్లుకు చేరితేనే రైతులు ధాన్యం అమ్మినట్టు రశీదులిస్తున్నారు. అప్పటిదాకా రైతులదే బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు పడుతున్నారు. 20 లక్షల టన్నులు ఆరుబయటే.. రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు ఎక్కువగా జరిగింది. సుమారు కోటీ 30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 80 లక్షల టన్నుల మేర సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 76 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయని, అంచనా వేసుకున్న 80 లక్షల టన్నులకన్నా మరో 5లక్షల టన్నులు అధికంగా రావొచ్చని ఇటీవల పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కానీ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. ఇంకా 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం కల్లాల్లో, సేకరణ కేంద్రాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వరి సాగు ఆలస్యంగా మొదలైన ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, గద్వాల, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో ధాన్యం భారీగా ఉంది. నెల రోజుల నుంచి పడిగాపులే.. ఎకరం వరి వేశాను. 30 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఎండలో బాగా ఆరబెట్టి నెల రోజుల కింద కొనుగోలు కేంద్రానికి తెచి్చన. వానలకు నాలుగుసార్లు తడిసిపోయాయి. ప్రతిసారీ ఆరబెట్టుకుంటూ వచ్చిన, వారం కింద ధాన్యాన్ని కాంటా వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. అధికారులను అడిగితే లారీలు రావట్లేదని చెప్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరేదాకా మా బాధ్యతే అంటున్నారు. కొద్దిరోజులుగా వానలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ చూసుకోవాల్సి వస్తోంది. – కాలసాని వెంకటరెడ్డి, రైతు, కురవి, మహబూబాబాద్ జిల్లా ఎక్కడ చూసినా అదే పరిస్థితి.. ►ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి మొత్తం 306 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. నాలుగున్నర లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 2 వరకు కూడా 3,17,520 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇంకా భారీగా ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలన్నర రోజులు అవుతున్నా.. తూకం వేయక, వేసినా మిల్లులకు తరలించక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ►మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఈ నెల 2వ తేదీ నాటికి 42 వేల బస్తాల ధాన్యంరాగా.. 32,588 బస్తాలు కాంటా అయింది. ఇందులో 19,315 బస్తాలు మాత్రమే మిల్లులకు పంపగలిగారు. అంటే తూకం వేసిన ధాన్యమే 13,273 బస్తాలు ఉండగా.. తూకం వేయనిది మరో 9,500 బస్తాల వరకు ఉంటుం దని అధికారులే చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నామ శ్రీను. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామం. మూడెకరాల్లో వరి వేస్తే 200 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్‌లోనే గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ధాన్యం రాశిపై పట్టా కప్పి పెట్టాడు. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ‘‘ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసింది. కొంత మేర మొలకలు వచ్చింది. గురువారం మళ్లీ తడిసిపోయింది. ఇప్పుడీ ధాన్యాన్ని కొంటారా లేదా తెలియడం లేదు. వానాకాలం సీజన్ మొదలైంది. వ్యవసాయ పనులు చేసుకోవాలి. ధాన్యం అమ్మితే తప్ప పెట్టుబడికి డబ్బులు లేవు. త్వరగా ధాన్యం కొంటే మా కష్టాలు తీరు తాయి..’’ అని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వానలకు తడవడంతో ధాన్యం బస్తాల నుంచి వచ్చిన మొలకలివి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన రైతు కాటం రమేశ్.. 45 రోజుల కింద మండల కేంద్రం లోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. 10 రోజుల కింద 150 బస్తాలు తూకం వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో ధాన్యం తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసినా మిల్లులకు తరలించేదాకా రైతులదే బాధ్యత అని చెప్పారు. మిల్లులు మొలకెత్తిన ధాన్యం తీసుకుంటారా లేదా అన్నది అనుమానమేనని.. ఎంత తరుగు తీస్తారో అర్థం కావడం లేదని రమేశ్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటోలోని రైతు బత్తుల బాలయ్య. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్షి్మపురం. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 224 బస్తాల ధాన్యం తూకం వేసి నెలన్నర దాటింది. మిల్లుకు తరలించడానికి లారీలు రాకపోవడంతో రోజూ ధాన్యం వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. వానలకు ధాన్యం తడుస్తోంది. చీడపీడల నుంచి కాపాడుకున్న పంట చివరకు ఇలా ఆగమవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాన.. దెబ్బకొట్టింది వాన పడిన ప్రతిసారీ ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో నీళ్లు నిలుస్తుండటంతో.. ధాన్యం రాశుల అడుగున మొలకలు వస్తున్నాయి. ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉంటోంది. తేమ శాతం తగ్గేందుకు ధాన్యాన్ని ఆరబెడితే.. మళ్లీ వానలు కురిసి తడిసిపోతోంది. మార్కెట్.. కడుపుకొట్టింది రైతులు ధాన్యాన్ని తీసుకెళ్తే తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందని చెప్తూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రోజులకు రోజులు అక్కడే ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ తూకం వేసినా మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వేధిస్తోంది. లారీ దొరికి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లినా తేమ, రంగు, తాలు అంటూ కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. తీసుకుంటే.. బస్తాకు కిలో నుంచి మూడు కిలోల దాకా కోత పెడుతున్నారు. చివరికి.. మట్టి మిగిలింది వానలకు కొట్టుకుపోయి, ఆరబెట్టి ఎత్తినప్పుడల్లా కొంత ధాన్యం పోతోంది. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో ఏదో ఓ కారణం చెప్పి కోత పెడుతుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఇంతా జరిగి సొమ్ము చేతికొచ్చేసరికి జాప్యం జరుగుతోంది. ఆలోగా పెట్టుబడికోసం చేసిన అప్పులపై మిత్తీలు పెరిగిపోతున్నాయి. చివరికి రైతుకు మట్టే మిగులుతోంది. ఇన్నితిప్పలు ఎప్పుడూ పడలే... నాలుగెకరాల్లో వరి వేసిన. కోతలు అయినంక నెలన్నర కిందనే ఊరిలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచి్చన. 15 రోజుల కిందనే కాంటా వేశారు. లారీలు లేవని మిల్లుకు పంపడం లేదు. వానలతో ధాన్యం తడిచిపోతూనే ఉంది. బస్తాల్లో కింది నుంచి మొలకెత్తుతోంది. ధాన్యం మిల్లుకు చేరితేనే కొనుగోలు చేసినట్టు రసీదు ఇస్తున్నరు. ఇట్లా మిల్లుకు వెళ్తే ఒక్కో బస్తాకు ఎంత తరుగు తీస్తారో. ఇన్ని తిప్పలు ఎప్పుడూ పడలే.. – ఈర్ల కాటయ్య, ముత్యాలగూడెం, ఖమ్మం జిల్లా ఎన్నడూ లేనంతగా ధాన్యం కొన్నాం.. ఈసారి ధాన్యం కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులైతే.. ఇప్పటికే 76 లక్షల టన్నులు సేకరించాం. లక్ష్యానికి మించి 85 లక్షల టన్నుల వరకు సేకరించేందుకూ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ. వెయ్యి కోట్ల రుణం కోసం బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఎన్నడూ లేనట్టు రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నాం. – మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇండోనేషియాలో భారీ వరదలు
-
ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి
జకార్తా: తూర్పు ఇండోనేషియాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 44 మంది మృతి చెందారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారని విపత్తు సహాయ సంస్థ తెలిపింది. ఇంకా చాలా మంది తప్పిపోయినట్లు పేర్కొంది. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత లామెనెలే గ్రామంలోని అనేక ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. అయితే, ఈ శిథిలాల కింద 38 మృతదేహాలను, ఐదుగురు గాయపడిన వారిని గుర్తించినట్లు స్థానిక విపత్తు సంస్థ అధిపతి లెన్ని ఓలా తెలిపారు. ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో 40 ఇళ్ళు ధ్వంసమవడంతో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా ఇళ్ళ మునిగిపోవడంతో వారి ఇళ్లను విడిచిపెట్టి వందలాది మంది పారిపోయారు. ఇండోనేషియాలో ప్రతి సంవత్సరం కాలానుగుణ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా అనేక ద్విపాల సమూహం ఇక్కడ మిలియన్ల మంది ప్రజలు పర్వత ప్రాంతాలలో లేదా సారవంతమైన వరద మైదానాల సమీపంలో నివసిస్తున్నారు. వరదల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: బంగ్లాదేశ్‌లో 7 రోజుల లాక్డౌన్ సచిన్‌వాజే కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
తిరుమలలో కుండపోత వర్షం
సాక్షి, చిత్తూరు: తిరుమలలో గత రెండు రోజుకుగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం పడుతోంది. కుండపోతగా కురుస్తున్న ఈ వర్షంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆగకుండా కురుస్తోన్న వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు వానలో తడిసిపోతున్నారు. అకాలవర్షం కారణంగా తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఏడుకొండలు తడిచి ముద్దువుతున్నాయి. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డు 54వ మలుపు వద్ద భారీ కొండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు భారీ కొండరాళ్లను తొలగించారు. రాత్రి సమయంలో వాహనాలకు అనుమతి లేకపోవడంతో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ, ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు మాత్రం మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. ఎడతెరిపిలేని ఈ వర్షాలకు ఎటువైపు నుంచి హఠాత్తుగా కొండచరియలు విరిగిపడుతాయో తెలియని ఆందోళన పరిస్థితి నెలకొంది. రెండవ ఘాట్‌రోడ్డులో కూడా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరొపక్క వర్షం కాస్త తగ్గుముఖం పడితే పొగమంచు తిరుమల గిరులు దుప్పటిలా అలుముకుంటోంది. -
సిటీలో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్‌లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్ ,మలక్‌పేట, కోఠీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, కర్నూలు, అనంతపురానికి భారీ వర్షం పడనున్నట్లు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వదలని వాన గడచిన 24 గంటల్లో బొండపల్లి, కారంచేడులో 8 సెం.మీ., డెంకాడలో 7, గుడివాడ, కుక్కునూరులో 6, పాలకోడేరులో 5, చిత్తూరు, అనకాపల్లి, పోలవరం, రేపల్లె, నర్సీపట్నం, గజపతినగరంలో 5, పాలసముద్రం, పుంగనూరు, నగరి, నూజివీడు, నెల్లిమర్ల, విజయనగరం, వరరామచంద్రాపురం, కూనవరం, తుని, రాజమండ్రి, పొదిలి, గుంటూరు, చింతపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
భారీ వర్షాలు, వరదలు.. ఆదుకోండి
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలో జన జీవితం అస్తవ్యస్తమైందని,తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.2,250 కోట్ల ఆర్థిక సహాయం చేయాలన్నారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, నష్టం గురించి వివరిస్తూ శనివారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా నదికి వరద పోటు – బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది. – ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేశాం. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాం. – భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది. – వరుసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. – ఈ వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు.. కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వరద సహాయ కార్యక్రమాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ 14 మంది చనిపోయారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి మీ చేయూత ఎంతో అవసరం. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటికే కోవిడ్–19 వల్ల ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరం. -
భారీ వర్షం: పులిచింతల బ్యాక్‌వాటర్‌తో ముంపు
సాక్షి, నల్గొండ: ఎడతెరపి లేని వర్షంతో ఉమ్మడి నల్గొండ జిల్లా తడిసి ముద్దయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు జిల్లా అంతటా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లడం, చెరువులు అలుగుపడి పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. కూలిన ట్రాన్స్ఫార్మరర్ మరోవైపు మూసీనది ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ ప్రభావంతో భువనగిరి-నల్గొండ రహాదారిపై ఎక్కడిక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పక్కన పార్క్ చేసిన చిన్న చిన్న వాహనాలతో పాటు భారీ లారీలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. అదృష్టవాత్తు వాహన డ్రైవర్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో వరంగల్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం.. భారీ వర్షంతో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూర్యాపేటలోని శ్రీరామ్‌నగర్, మానసనగర్, అంజనాపురి కాలనీ, బాలాజీనగర్, ఆర్కే గార్డెన్, ఎన్టీఆర్ కాలనీ, కుడకుడ, ఇందిరమ్మ కాలనీ, చింతల చెరువు, అదనపు 60ఫీట్ల రోడ్డు ప్రాంతాలను వర్షం ముంచెత్తి వరద చేరింది. కాలనీల్లో కూడా నీరు చేరుతుండడంతో మున్సిపల్ యంత్రాంగం జేసీబీలతో గండ్లు కొట్టించింది. కోదాడ మండలం రెడ్లకుంట, అనంతగిరి మండలం శాంతినగర్‌లో రోడ్లవెంట చెట్టుకూలడంతో పోలీసులు తొలగించారు. కోదాడ పట్టణంలో భవానినగర్, శ్రీమన్నారాయణ కాలనీ,మాతానగర్, షిర్డీనగర్ కాలనీల్లోని ఇళ్ల చుట్టూ నీరు చేరింది. అలాగే మునగాల, నడిగూడెం మండల కేంద్రాల్లో కూడా వర్షపు నీళ్లు నిలిచాయి. ఇంకా ఒకటి, రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలెవరూ లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని జిల్లా అధికారులు సూచనలు చేశారు. రోడ్లపై వాగులు ప్రవహించే చోట పోలీస్ యంత్రాంగం ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా రాకపోకలను నిలిపింది. పులిచింతల బ్యాక్‌వాటర్‌తో ముంపు.. కృష్ణానది ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో పులిచింతల నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పై నుంచి వస్తున్న వరదతో చింతలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు బ్యాక్ వాటర్ ముంపులో పడ్డాయి. వరి, పత్తి చేనులు సుమారు 1500 ఎకరాలు నీటిలో మునిగాయి. చింతలపాలెం మండలంలోని ఎర్రవాగు, బుగ్గమాదారం, వజినేపల్లి వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని 6 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తుంగతుర్తి మండలలోని సంగెం, వెలుగుపల్లి గ్రామాల వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరి మున్సిపాటిటీ కేంద్రంలో తొర్రూరు రోడ్డువైపు ఉన్న పెద్దచెట్టుకూలి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం సంగెం వద్ద రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నాగారం మండలంలో ఒక ఇల్లు కూలింది. ఎడతెరిపిలేని వర్షం యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిన్నటి నుండి వర్షం కురుస్తుంది. వర్షానికి రోడ్లులు అన్ని జలమయమయ్యాయి. నియోజకవర్గం వ్యాప్తంగా చెరువులు,కుంటల్లో జల కళ సంతరించుకుంది. వాగులు అన్ని నీటి ప్రవాహం తో కనిపిస్తున్నాయి. పలు చోట్ల వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో రోడ్డు పై నుండి నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆలేరు పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీ వార్డులు జలమయం అయ్యాయి కురుస్తున్న వర్షానికి రోడ్లు అన్ని జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో రాజపేట పట్టణ కేంద్రంలో రోడ్డు చెరువును తలపిస్తుంది. రోడ్డు పై వర్షం నీరు అధికంగా ప్రవహిస్తుండటం తో రాకపోకలకు అంతరాయం కలగకుండా దారి మళ్లిస్తున్నారు. యాదగిరిగుట్ట నుండి తుర్కపల్లి ఈసీఎల్ కు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు దత్తాయ పల్లి వెంకటాపురం మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరద ప్రవాహంతో కొట్టుకుపోవడంతో తుర్కపల్లి యాదగిరిగుట్ట మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి. -
హైదరాబాదీలను హడలెత్తిస్తున్న వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, సరూర్ నగర్, కర్మన్‌ఘాట్, కొత్తపేట్, మీర్పేట్, కీసర, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, నేరేడ్మెట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. (ఉసురు తీసిన నాలా) అనేకచోట్ల ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలుచోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఇప్పటివరకూ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు 38 ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్,కూకట్ పల్లి జోన్లులో అధికంగా వర్షం అవకాశం ఉండటంతో సిబ్బంది మరింత అలెర్ట్ గా ఉండాలని లోకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. -
భారీ వర్షాలతో ఉద్ధృతంగా కృష్ణమ్మ పరవళ్లు
-
ఏపీలో హోరెత్తిన వాన
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కూడా వర్షం జోరుగా కురిసింది. రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరుచేరింది. రాష్ట్రంలోని 19,494 హెక్టార్లలో పంటలపై వర్ష ప్రభావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చేలల్లోని నీటిని బయటకు పంపితే పంటలకు పెద్దగా నష్టం ఉండదని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 24 గంటల్లో 31.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పాములపాడులో రికార్డు స్థాయిలో 184.6 మి.మీ వర్షం కురిసింది. కుందూ నది, కొత్తపల్లి మండలంలోని ఎద్దులేటి వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈసెట్, ఇతర పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ప్రమాదకర రీతిలో పుట్టిలో ప్రయాణించి వాగు దాటి వెళ్లా్లల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలో పంట బెట్టకు వచ్చిన ప్రాంతాలకు ఈ వానలు పనికి వస్తాయని చెబుతున్నారు. జిల్లాలో సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 136.3 మి.మీ వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజే 48.9 మి.మీ వర్షపాతం నమోదైంది. పెన్నా, కుందూ నదులు, సగిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇసుక వంక పోటెత్తడంతో జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 300 చెరువులు పూర్తిగా నిండాయి. గుంటూరు జిల్లాలోని కొండవీటివాగు, పొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు హైవేపైకి చేరడంతో దాచేపల్లిలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలో సగటున 50.70 మి.మీ. వర్షం కురిసింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నందిగామ, వీరుళ్లపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరదతో పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. దీంతో ఏలూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విజయనగరం జిల్లాలో, ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్లో, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షాలు పంటలకు బాగా మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో దగదర్తి మండలంలో తప్ప మరెక్కడా పంటపై వర్ష ప్రభావంలేదు. వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. గోదావరి, డెల్టాలో వరి పొలాలు చిరుపొట్ట దశలో ఉంటే తక్షణమే నీళ్లు బయటకు పోయేలా పిల్ల కాల్వలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తక్షణమే నత్రజనితో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని బూస్టర్ డోస్‌గా వేయాలని, పంటలో జింకు లోపం ఉంటే రెండు దఫాలుగా జింక్ సల్ఫేట్‌ను పిచికారీ చేయాలని చెప్పారు. ఉధృతంగా కృష్ణమ్మ సాక్షి,విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలకు.. తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,25,082 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో క్రస్ట్ గేట్లను తెరచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది క్రస్ట్ గేట్లను తెరవటం ఇది నాలుగోసారి. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాలతోపాటు హంద్రీ నది నుంచి శ్రీశైలానికి జలాలు వచ్చి చేరుతున్నాయి. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మొత్తంగా 2,54,526 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.80 అడుగుల్లో 214.36 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌లోకి 2,14,082 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరింది. అంతే స్థాయిలో వరద జలాలను స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలోకి 2,30,541 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,32,404 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.దీనికి తోడు ప్రకాశం బ్యారేజీలోకి 2,70,822 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి 2,24,931 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలోనూ పెరిగిన ప్రవాహం: ఛతీస్‌గఢ్, ఒడిశా, వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,10,427 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగిలిన 2,07,341 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. పోటెత్తిన పెన్నా: వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పెన్నా, దాని ఉప నదులు పోటెత్తాయి. దాంతో గండికోట, మైలవరం ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. సోమశిల ప్రాజెక్టులోకి 47,491 క్యూసెక్కులు చేరుతుండటంతో సోమశిలో నీటి నిల్వ 61 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే సోమశిల నిండిపోతుంది. -
కరువుదీరా వానలు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 44 శాతం ఎక్కువ వర్షాలు కురిసినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 575.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 44 శాతం అధికంగా 826.9 మిల్లీమీటర్లు కురిసింది. గతేడాది ఇప్పటి వరకు నమోదైన వర్షపాతంతో పోలిస్తే ఇది 57 శాతం ఎక్కువ. జిల్లాల వారీగా పరిశీలిస్తే 25 చోట్ల అధికంగా వర్షాలు కురవగా, 8 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 17.11 శాతం చొప్పున తక్కువ వర్షం కురిసింది. అయితే సాధారణం కంటే 19 శాతం వరకు తక్కువ నమోదైనా వాతా వరణ శాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతంగానే గుర్తిస్తారు. దీంతో ఈ ఏడాది వానా కాలంలో ఏ జిల్లా లోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాలుగు ప్రస్తుత జిల్లాల్లో సాధారణం కంటే దాదాపు 100 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. మరో రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలి పింది. పశ్చిమ మధ్యప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు రాజస్తాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడతాయని వివరించింది. సాధారణంతో పోలిస్తే తక్కువ వర్షాలు (మి.మీ.) కురిసిన 5 జిల్లాలు: జిల్లా సాధారణం కురిసింది తేడా (%) నిర్మల్ 771.5 640.7 –17 ఆదిలాబాద్ 837.8 747 –11 నిజామాబాద్ 699.4 701.8 0 జగిత్యాల 705 707 0 కొమురంభీం 846.3 866.3 2 -
గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధీలో భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహా నగరంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు. (కోస్తాకు నేడు వర్ష సూచన) బంగాళాఖాతంలో ఈ నెల 24న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి ననుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్భన్, కామారెడ్డి జిల్లాలోని ఒకంట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్య సూచనలు ఉన్నట్లు తెలిపింది. కాగా బుధవారం రాష్ట్రంలో 1.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
కోస్తాకు నేడు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్ వైపు కదులుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర–దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ 0.9 కిమీ ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో గరివిడిలో 4 సెంమీ, పూసపాటిరేగ, కళింగపట్నం, భీమిలి, అమలాపురంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. -
వరదలపై అధికారులను అప్రమత్తం చేసిన హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన మూడు సంఘటనలపై మంత్రి హరీశ్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. చిన్నకోడూర్ మండలం దర్గాపల్లి వాగులో కొట్టుకుపోయిన కారు సంఘటనపై అధికారులను అలర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే రక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం వాగులో కొట్టుకుపోయిన కారులో ఉన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను కాపాడేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులందరు సంఘటనస్థలం వద్దే ఉండి, అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. (18 వేల ఎకరాల్లో పంట నష్టం) రెండు రోజుల కిందట బస్వాపూర్ వాగులో కొట్టుకుపోయిన లారీ డ్రైవర్ గాలింపు చర్యలపై, అదేవిధంగా రాఘవపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఆదివారం మాటీండ్ల గ్రామంలో చెక్ డ్యామ్‌లో కొట్టుకుపోయిన సంఘటనపై ఎప్పటికప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. నిరంతరం రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.(సైదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం) -
సైదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వరదలో బైక్‌తో సహా ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు కాపాడారు. సైదాపూర్-జాగిర్ పల్లి మధ్య చెరువు మత్తడి దూకడంతో లెవెల్లో ఉన్న కల్వర్టు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ఇద్దరు యువకులు కల్వర్టు దాటే ప్రయత్నం చేయగా జారి వరదనీటిలో బైక్‌తో సహా పడిపోయారు. అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారులు గమనించి వెంటనే వారిని కాపాడారు. తాడు సహాయంతో బయటికి లాగారు. బైక్‌తో సహా ఒడ్డుకు లాగిన మత్స్యకారులు ప్రమాదానికి గురైన యువకులను ఎక్కడివారు అని అడిగితే సమాధానం చెప్పకుండా బైక్‌పై పారిపోయారు. ఎక్కడి వారు ఎవరు ఆ యువకులు అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ సమయస్పూర్తితో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. -
18 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, కరీంనగర్ : ప్రాథమిక అంచనా ప్రకారం కరీంనగర్ జిల్లాలో వర్షం వరదలతో 18 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. వర్షం వరదలతో కరీంనగర్లో జలమయమైన లోతట్టు ప్రాంతాలను, లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ) వరద పరిస్థితిని మేయర్ సునీల్ రావు, కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమీషనర్ క్రాంతితో కలిసి మంత్రి గంగుల పరిశీలించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని జేసీబీల సహాయంతో యుద్దప్రాతిపదికన బయటకు పంపించే చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు జిల్లా కేంద్రంలోనే ఉంటూ వర్షం, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. (మోరంచ వాగులో చిక్కుకున్న కార్మికులు) 24 టీఎంసీల సామర్థ్యంగల ఎల్ఎండీలో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉందని మంత్రి అన్నారు. ఎల్ఎండీ పరివాహక ప్రాంతమైన మోయతుమ్మెద వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని తెలిపారు. మిడ్ మానేరులో 25 టీఎంసీలకు గానూ 20 టీఎంసీల నీరు నిల్వ ఉందని, మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండితే వరద దిగువకు ఎల్ఎండీకి వదిలే అవకాశం ఉందని దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారని తెలిపారు. కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇండ్ల మధ్యలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. -
మోరంచ వాగులో చిక్కుకున్న కార్మికులు
జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లికి సమీపంలో ఉన్న మోరంచ వాగులో బ్రిడ్జ్ నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. గుడాడుపల్లి(ఎస్ యం), కొత్తపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు, ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మోరంచ వాగులో ఇరుక్కుపోయారు. (వరదల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి) వరద ఉధృతి పెరుగుతుండటంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. కూలీలను రక్షించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, సహాయం కోసం రెస్క్యూ టీమ్‌ను పంపించాలని కోరారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. -
దయచేసి వరద నీటిలోకి రావొద్దు..
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు సహకరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు. వరదల సమయంలో.. వరదనీటిలోకి ప్రవేశించవద్దు. మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి. విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి. ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆ ప్రదేశం లొ కనిపించే విదంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి. వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి. తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి. వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి. (చదవండి: 19న మరో అల్ప పీడనం: వాతావరణ శాఖ) వరదల తరువాత.. మీ పిల్లలను నీటిలోకి గాని మరియు వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి. దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి. అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు. విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు తీగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాల ను నిశితంగా పరిశీలించండి . వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు. మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి. వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి. నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి. నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు. మీరు ఖాళీ చేయవలసి వస్తే.. మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి. టాయిలెట్ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి. మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలు లను తీసుకొని వెళ్ళండి. లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి. అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి. -
దంచికొడుతున్న వానలు
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలు నీటమునగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాండూరు పట్టణంలోని తాండూరు–హైదరాబాద్ రోడ్డు మార్గం చెరువును తలపించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 7 సెంటీమీటర్లు, కోరుట్ల మండలం అల్లాపూర్, మెట్‌పల్లిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శుక్రవారం కూడా ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గద్వాల జిల్లాలో అధిక వర్షపాతం.. ఈ సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 35 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ తేదీల మధ్య సాధారణంగా రాష్ట్రం లో 297.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా, ఇప్పటివరకు ఏకంగా 401.2 మిల్లీమీటర్లు రికార్డు అయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 134 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇదే అధికమని పేర్కొంది. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడ 166.5 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. 390.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 206 మిల్లీమీటర్లకుగాను 127 శాతం అధికంగా 467.4 మిల్లీమీటర్లు నమోదైంది. మొత్తంగా 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాలో సాధారణ వర్షపాతం రికార్డయి నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. రాజధానిలో ఎడతెరిపిలేని వాన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తింది. నగరంలో సరాసరిన 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. -
బెజవాడలో కుండపోత వర్షం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వర్షపు నీటితో కొన్ని చోట్ల వాగులు పొంగడంతో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో కుండపోతగా కురుస్తున్న వానకి రహదారులు జలమయమై చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. వన్ టౌన్, పాళీక్లినిక్ రోడ్డు, నక్కల రోడ్డు, గణపతిరావు రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మిటెంపుల్ వీధి, నైజం గేట్ సెంటర్ రోడ్డు ఇతర ప్రాంతాలు నీట మునిగాయి.రోడ్లపై మోకాలు లోతు వర్షపు నీళ్లు రావటంతో వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. వన్ టౌన్ ప్రాంతంలోని రోటరీ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
గాలి, వాన బీభత్సం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా కొన్ని చోట్ల కొంత మేర పంట నష్టం వాటిల్లింది. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. విశాఖ జిల్లాలో ఇద్దరు మృతి విశాఖ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. అటు ఏజెన్సీ ప్రాంతంలోనూ భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఇళ్ల మీద విరిగిపడడంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. రెంటచింతలలో గరిష్ట ఉష్ణోగ్రత 43.1 డిగ్రీలు గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 43.1 కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రెంటచింతలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. విజయవాడలో శనివారం రాత్రి భారీగా వర్షం కురుస్తున్న దృశ్యం పొలాల్లో 35 మేకలు మృతి ► కడప, అనంతపురం జిల్లాల్లో గాలి, వాన భీభత్సం కారణంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ లైన్లు, పోల్స్ దెబ్బతిన్నాయి. ► చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. తిరుమలలో వర్షం కురిసి ఆలయం ముందు నీరు నిలిచింది. ► విజయనగరం జిల్లాలో ఎస్.కోట, సాలూరు నియోజకవర్గాల్లో వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి, మొక్క జొన్న పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. జిల్లాలో రెండు సెంటీ మీటర్ల వర్షం పడిందని అంచనా. పాచిపెంట మండలంలో పిడుగు పడి అరకుకు చెందిన ఒక మహిళ మృతి చెందింది. ► శ్రీకాకుళం జిల్లాలో కురుసిన అకాల వర్షం, పిడుగుల కారణంగా జలుమూరు మండలం హుస్సేనుపురం సమీపంలోని తంపర పొలాల్లో 35 మేకలు మృత్యువాత పడ్డాయి. ► తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మూడేళ్ల చిన్నారి మడదా శ్రీధరి పిడుగుపాటు కారణంగా మరణించింది. మూడ్రోజుల పాటు ఉత్తరాంధ్రకు వర్షాలు సాక్షి, విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా దక్షిణ తమిళనాడు, తూర్పు మధ్యప్రదేశ్, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి ఈనెల 27 వరకూ గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కోస్తాంధ్రతో పాటు, ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
కడగండ్లు మిగిల్చిన అకాల వర్షం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ► సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం అపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం ది. రాజాపేట మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా తు ర్కపల్లి మండలంలో మామిడి తోటలతో పాటు వరికి తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్æ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. కోతకు వచ్చి న వరి పంట 2,963 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైంది. నిమ్మ, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలపాలైంది. చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైంది. అలాగే వింజమూరు, వర్కాల గ్రామాల్లో వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలమూరులో భారీ నష్టం.. : మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల, రాజాపూర్, మహబూబ్‌నగర్ రూరల్, బాలానగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. వనపర్తి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొత్తకోట, వనపర్తి, పెద్దమందడి మం డలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాల ను అంచనా వేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మం డలంలోని ఖానాపూర్, పంచలింగాల, కర్ని, రుద్రసముద్రం, కాట్రెవ్‌పల్లి, మక్తల్ గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నేల వాలింది. నర్వ మండలం కొత్తపల్లి, జక్కన్నపల్లి, రాయికోడ్, నర్వ, యాంకి గ్రామాల్లో వడ్లు రాలిపోగా.. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా చింతరేవుల, నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వానతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా అత్యధికంగా బొల్లారంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యాంప్ ఆఫీస్‌పై పిడుగు.. దేవరకొండ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్æ ప్రహరీపై గురువారం పిడుగుపడింది. పిడుగుపాటుకు క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్ ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి భోజనం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పోటెత్తుతున్న కృష్ణా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో కృష్ణా నది మళ్లీ పోటెత్తుతోంది. గత పది రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు 1.60 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండటంతో వచి్చన నీటిని వచి్చనట్లుగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 1.82 లక్షల క్యూసెక్కులను నదిలో వదులుతుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. 76,468 క్యూసెక్కుల వరద వస్తుండగా 86,166 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇది మంగళవారానికి జూరాల, శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోకి 44 వేలు, శ్రీశైలంలోకి 57,012, సాగర్‌లోకి 48,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డు లు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయినీ నదులు ఉప్పొంగడంతో బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్, జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో 2009–10లో 1,218 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం ఏకంగా 1,420 టీఎంసీల మేర వరద వచి్చంది. ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం సైతం 130 టీఎంసీలను దాటింది. ఇక జూరాలకు 2010–11లో గరిష్టంగా 787 టీఎంసీల వరద రాగా ఆ మార్కును ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ ఏకంగా 1,190 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్‌కు సైతం ఈ ఏడాది 968 టీఎంసీల మేర వరద రాగా, అది ఇంకా కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుల కింది ఆయకట్టుతో పాటు వీటిపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కనిష్టంగా 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలోనూ నీరందించే అవకాశం ఏర్పడింది. అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా నది పరీవాహకం, దాని ఉప నదుల పరిధిలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. శ్రీశైలానికి భారీ వరద పోటెత్తవచ్చని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు సూచించింది. -
భారీ వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు దేశ వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు అనే సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 70 శాతం వర్షపాతం, వ్యవసాయం నైరుతి రుతుపవనాల మీద ఆధారపడింది. అయితే ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవిస్తుంది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర కూడా విలవిల్లాడుతుంది. భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా 95మంది చనిపోగా.. కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 42 మంది చనిపోయారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని కేరళ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో సుమారు 80మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బనసురసాగర్ ఆనకట్ట గేట్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పత్రికా సమావేశంలో తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వరదల కారణంగా కొచ్చి విమానాశ్రయాన్ని ఆదివారం వరకూ మూసి వేస్తున్న ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారీ వరదలు.. కొచ్చి ఎయిర్‌పోర్టు మూసివేత
తిరువనంతపురం: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ సహా తొమ్మిది జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పెరియార్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటం.. కొచ్చి విమానశ్రయం సమీపంలోని కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో.. విమానాశ్రయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుంచి విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారీ వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతాధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పెంచడం కోసం మరిన్ని కేంద్ర బలగాలను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాడు. మలప్పురం జిల్లా నిలంబురి గ్రామంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు తప్పిపోయాయి. సహాయక బృందాలు ఈ రోజు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. -
వరద బీభత్సం.. 50 మంది మృతి..!
న్యూఢిల్లీ : పొరుగుదేశం నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో సరిహద్దు రాష్ట్రాలు బిహార్, అసోంలలో వరదనీరు పోటెత్తుతోంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు ఆయా రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల కారణంగా బిహార్‌లో 33 మంది, అసోంలో 17 మంది మరణించినట్టు సమాచారం. బిహార్‌లోని 12 జిల్లాల్లోని 25 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న లక్షా 25 వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిచాయి. భారీ వర్షాలు, వరదలతో అసోంలోని బ్రహ్మపుత్ర, సుబాన్సిరి, ధన్సిరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 4620 గ్రామాలు నీటమునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షా 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసోంలో వరద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్షించారు. భారీ వరదల కారణంగా అసోం అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. -
దూకుడు పెంచిన ‘ఫొని’
సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను మరింత దూకుడు పెంచింది. అతి తీవ్ర తుపాను నుంచి పెను తుపానుగా మారి ఒడిశా వైపు దూసుకుపోతోంది. గంటకు 6–12 కిలోమీటర్ల వేగంతో సోమవారం వరకు పయనిం చిన ‘ఫొని’ మంగళవారం రెట్టింపు వేగంతో (22 కి.మీలు) కదులుతోంది. విశాఖకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 510 కి.మీ.ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 730 కిలోమీటర్ల దూరంలోనూ మంగళవారం రాత్రి కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోంది. వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ పెను తుపాను బుధవారం ఉదయానికి మలుపు (రికర్వ్) తిరిగి ఉత్తర ఈశాన్య దిశ వైపు పయనించనుంది. క్రమంగా అదే దిశలో కదులుతూ ఒడిశాలోని గోపాల్పూర్–చాంద్‌బాలీల మధ్య దక్షిణ పూరీకి సమీపంలో మూడో తేదీ మధ్యాహ్నం పెను తుపానుగానే తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. అనంతరం క్రమంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించి బంగ్లాదేశ్‌లో మే 5న వాయుగుండంగా బలహీనపడనుందని వివరించింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల తీరాలకు ఆనుకుని గంటకు 165–195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల ఉధృతి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 60, శుక్ర, శనివారాల్లో 85–115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రానున్న మూడు రోజులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో గంటకు 170–200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయి. కాగా, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో అతిభారీ వర్షాలు (20 సెం.మీలకు పైగా) కురవనున్నాయి. తుపాను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. పెను తుపాను ఏకంగా నాలుగు రోజుల పాటు (ఈనెల 3 వరకు) కొనసాగుతుండడంవల్ల నష్ట తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ముప్పు! ఫొని పెను తుపాను ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపనుందని ఐఎండీ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఈ రెండు జిల్లాల్లో పెనుగాలుల ఉధృతితో పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 4 వరకు తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వివరించింది. అల్లకల్లోలంగా సముద్రం పెను తుపాను ప్రభావంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారుతుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తమ బోట్లను సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఐఎండీ సూచించింది. మరోవైపు.. పెను తుపాను తీవ్రత దృష్ట్యా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడలో 4, గంగవరం పోర్టులో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. -
అకాల వర్షం..పంటకు నష్టం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ.. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులతో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులకు మామిడి, జీడిమామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలు చోట్ల కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్క జొన్న పంట తడిసి ముద్దయ్యింది. ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిడదవోలు–బ్రాహ్మణగూడెం రహదారిలో తాటిచెట్టు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాగల్లులో ఐదు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలగా..కొవ్వూరు మండలంలోని పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆరికిరేవుల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఈదురు గాలులకు నేలకూలింది. కృష్ణా జిల్లాలో.. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జాతీయ రహదారి పక్కనే చెట్లు కూలిపడ్డాయి. నందిగామ శివారు అనాసాగరంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మామిడికాయలు రాలిపోయాయి. దాళ్వా రైతులు ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మైలవరం, మచిలీపట్నంలో కొద్ది పాటి వర్షం పడింది. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ, మాచర్ల, రెంటచింతల, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. పల్నాడు ప్రాంతంలో కల్లాల్లో మిర్చి ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. మాచర్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పాలకొండలో వడగళ్ల వాన.. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వడగళ్ల వాన కురిసింది. కాగా, ఇప్పటి వరకు మండుటెండలతో విలవిల్లాడిన జనాలు ఈ వర్షంతో కొంతమేర ఊరట చెందారు. -
పొంగిన మూసీ: రాకపోకలు బంద్
-
పొంగిన మూసీ: రాకపోకలు బంద్
సాక్షి, భువనగిరి: హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భాగ్య నగరంలోని వరద నీరంతా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆ నీరంతా రంగారెడ్డి జిల్లా మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వస్తుంది. దీంతో మూసీ నదిపై ఉన్న పలు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటి ఉధృతితో మునిగిపోయాయి. సమీప గ్రామాలకు రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. పోచంపల్లి, బీబీనగర్, రుద్రవెల్లి, వలిగొండ, అమ్మనబోలు ప్రాంతాల్లో కల్వర్టులపై నుంచి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అలాగే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు కాగా ఇప్పటికే 643.80 అడుగులకు వరద నీరు చేరింది. ఆరు గేట్లను మూడు అడగుల మేరకు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బయటకు రాలేని ప్రజలు మేడ్చల్ జిల్లా ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని ఎన్.ఎం.డి.సి కాలనీ, షిరిడి నగర్, మల్కాజిగిరిలోని పటేల్ నగర్, దుర్గానగర్, వసంతపురి కాలనీ, మౌలాలిలోని ఆర్టీసి కాలనీలో రోడ్లపై నీటి ప్రవాహం తగ్గినా ఎన్ఎండీసీ కాలనీ, షిరిడి నగర్లో నాలా నిండి వర్షపు నీరు ఇళ్ళలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ఈస్ట్ అనంద్‌బాగ్ లో నాలా పొంగుతున్న, లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. -
వర్షాలతో నీటములిగిన కాకినాడ!
-
కుండపోత..!
జిల్లాలో జోరుగా వర్షాలు జలమయమైన లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిన రహదారులు రైతుల్లో హర్షాతిరేకాలు వరినాట్లకు సిద్ధమైన రైతాంగం నిజామాబాద్ వ్యవసాయం : జిల్లాలో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు మోర్తాడ్, కమ్మర్పల్లి మినహ అన్ని మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ అర్బన్‌లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురి సింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కురిసిన భారీ వర్షానికి బస్టాండ్, రైల్వే స్టేషన్, కంఠేశ్వర్, చంద్రశేఖర్ కాలనీ, ఆటోనగర్, నాగారం, ఇంద్రపూర్, వినాయక్‌నగర్, ఎల్లమ్మగుట్ట చౌరస్తానుంచి దేవి థియేటర్ రోడ్లతోపాటు ప్రధాన రోడ్లు, లోతట్టు వీధులన్నీ జలమయమయ్యూ రుు. జిల్లావ్యాప్తంగా సగటున ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వరి నాట్లకు చివరి అవకాశం ఈ వర్షం వరి సాగుకు ఊతమందించింది. జిల్లాలో మొన్నటి వరకు వర్షాలు కురవకపోవడంతో వరి వేసేందుకు రైతులు ముందుకు రాలేదు. ప్రస్తుతం మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యూరు. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్ల మేర వరి సాగు చేస్తారని అంచ నా. ప్రస్తుతం 40వేల హెక్టార్లలో వరిసాగు చేపట్టారు. నాట్లు వేసేం దుకు చివరి అవకాశం కావడంతో మరో 50 వేల హెక్టార్లలో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 15 వరకు వేసిన నార్లు ఉంటే పంట బాగా పండుతుందని, అది కూడా చిన్న రకాలు పంట వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలకు జీవం ఖరీఫ్ సీజను ప్రారంభం సమయంలో కురిసిన కొద్దిపాటి జల్లులకు రైతులు సాగు చేసిన ఆరుతడి పంటలు నీరు లేక వాడిపోయి, ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దాదాపు కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. మొక్కలు బతకవనే స్థితిలో ఉన్న సమయంలో వర్షాలు కురిసి వాటికి ప్రాణం పోసినట్లయింది. జిల్లాలో ఇప్పటి వరకు 1.27 లక్షల హెక్టార్లలో సోయా, 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 16వేల హెక్టార్లలో పత్తి, 20 వేల హెక్టార్లలో పెసర, మినుము, కంది ఇతర పప్పు ధాన్యాలు సాగు చేశారు. ప్రస్తుతం ఇవి బోరు కింద పం టలే అయినప్పటికీ... భూగర్భ జలాలు లేక అవి అంతంతమాత్రం గానే నీటిని అందించాయి. ప్రస్తు తం మూడు రోజు లుగా వర్షాలు భారీగా కురవడంతో ఆరుతడి పంటలకు ప్రా ణం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధ్వంసమైన ఇళ్లు నగరంలోని కురిసిన భారీ వర్షానికి కసాబ్‌గల్లిలోని అం కర్ లక్ష్మిబాయికి చెందిర పెంకుటిళ్లు కూలిపోయింది. కోజాకాలనీలని నాలుగు ఇళ్లు, బర్కత్‌పురలోని రెండు ఇళ్లు, నాగారంలోని రెండు ఇళ్లు వర్షానికి దెబ్బతిన్నాయి. -
నాటుకున్న ఆశలు
ఇన్నాళ్లూ వర్షాభావం.. తీరా రెండు చినుకులు పడ్డాయనుకుంటే కొద్ది ప్రాంతాలపై పక్షపాతం.. ఇదీ మెతకుసీమపై ప్రకృతి శీతకన్ను. మొత్తానికి మూడు రోజులుగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడుతున్న వానలతో పంటలు కోలుకున్నాయి. ఆరుతడి పంటలు ప్రాణం పోసుకున్నాయి. మెట్ట ప్రాంత రైతులు ఊరట చెందుతున్నారు. వరి పంటకు అనుకూలమైన వర్షం కురవకపోయినా అంతే ప్రధాన పంటగా భావించే పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, పెసర పంటలకు ఈ వర్షం మేలు కలిగించే అవకాశం ఉంది. జోగిపేట, మెదక్, దుబ్బాక, నారాయణఖేడ్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది. ఈ వానలతో కొత్త ఆశలు మొలకెత్తడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు నాట్లు వేసుకుంటున్నారు. మొక్కజొన్నకు మందులు కొడుతున్నారు. ముమ్మరంగా దుక్కులు.. నాట్లు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పొలాల మడిక ట్లపై భారీగా నీరు చేరడంతో బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు దున్నకాలు, నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నచోట్ల నాట్లు వేసే పనుల్లో మునిగారు. కొద్ది రోజులు ఇలాగే మోస్తరు వానలు పడినా ఇప్పటికే వేసిన పంటలైనా దక్కుతాయని, భూగర్భ జలాలు పెరిగి వచ్చే రబీకి మేలు కలుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణం పోసుకుంటున్న పంటలు జిల్లాలో రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్‌పై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. అటువంటి తరుణంలో కురిసిన వానలతో రైతులతో పాటు పంటలకూ ప్రాణం లేచొచ్చింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు చెప్పుకోదగిన స్థాయిలో కోలుకున్నాయి. అయితే, అడపాదడపా భారీ వర్షాలు పడితేనే ఈ పంటలు నిలుస్తాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, పత్తి పంటలకు తడుల మందం వస్తున్నాయి. దీంతో రైతులు ఎరువులు, మందుల కొనుగోళ్లపై పడ్డారు. వరి నాట్లు కోసం మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వాడిపోతూ పీడల బారిన పడిన పత్తికి మందులు కొట్టే పనులూ ముమ్మరమయ్యాయి. - జోగిపేట/వెల్దుర్తి/కౌడిపల్లి/ చిన్నకోడూరు పొద్దుతిరుగుడు మేలు ప్రస్తుత వర్షాల తరుణంలో పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు. ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలకు ఈ వర్షం చాలా మేలు చేస్తుంది. ఇదే వర్షం 15 రోజుల ముందు పడి ఉంటే వరినాట్లు పడి.. మొలక దశలో ఉండేది. - శ్రీలత, జోగిపేట వ్యవసాయాధికారిణి -
హైదరాబాద్‌లో జలమయమైన రోడ్లు
-
చి‘వరి’కి తప్పని చినుకు దెబ్బ
దేవీపట్నంమండలం ఇందుకూరుపేటలో ధాన్యం బస్తాలను నీటిలో నుంచి బయటకు తెచ్చుకుంటున్న రైతులు అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీతోపాటు, మెట్టలోని తుని, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం, మండపేటలతోపాటు కోనసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న సామాన్యులు వర్షంతో సేదతీరినా.. అకాలంగా విరుచుకుపడ్డ చినుకులు వరి, మామిడి, జీడిమామిడి రైతులను నష్టపరిచాయి. మెట్టలోని కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల్లో మామిడి, జీడి మామిడి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో పది రోజులు ఉంటే కోతలు దాదాపు పూర్తయ్యేవి. ఈ సమయంలో కురిసిన వర్షం వల్ల పక్వానికి వచ్చిన మామిడి, జీడిమామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఈ ఏడాది దిగుబడి పడిపోయిందని, ఆశపడ్డ లాభాలు రాకపోయినా.. వచ్చిదానితోనే తృప్తి పడదామనుకుంటే.. అకాలవర్షం మరికొంత దెబ్బ తీసిందని రైతులు వాపోతున్నారు. వర్షం కురిసినా.. దానికి ఈదురుగాలులు తోడు కాపోవడం కొంతలో కొంత నయమని, అదే జరిగితే కుదేలైపోయే వారమని అంటున్నారు. ఆశలు రాల్చిన ‘1010’ వంగడం గోదావరి డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు ప్రాజెక్టుల పరిధిలో రబీ సాగు ఆలస్యమైన శివారు ప్రాంతాల్లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోనున్నారు. మెట్టతోపాటు, డెల్టాలో రబీ వరి కోతలు 80 శాతం పూర్తయినా.. సాగు ఆలస్యంగా ఆరంభించిన అమలాపురం, ముమ్మిడివరం, కరప, పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట సబ్ డివిజన్లలో సుమారు 70 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాలేదు. మరో 50 వేల ఎకరాల్లో పంట పనల మీద, పొలం గట్ల మీద రాశులుగా ఉంది. వర్షానికి పనలు, రాశులు తడవడంతో రైతులకు ఎంతోకొంత నష్టం తప్పదు. రబీలో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా 1010 సన్నరకాలు సాగు చేశారు. కోతలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ రకం పైరులో కొద్దిపాటి గాలి, వర్షానికే కంకుల నుంచి ధాన్యం నేల రాలుతుంటుంది. రోజంతా అడపాదడపా పెద్దపెద్ద జడులు పడిన చోట ధాన్యం రాలుడు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. కాగా ‘ఒక్కరోజు కురిసిన వర్షం వల్ల పెద్దగా నష్టం ఉండదు. వర్షాలు ఇలాగే కొనసాగి పనల మీద ఉన్న చేలు ముంపుబారిన పడితే మాత్రం నష్టం తీవ్రత పెరుగుతుంది’ అని అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షానికి తడిసిన పనలను, ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలని రైతులకు సూచించారు. -
వర్ష విలయంలో.. నీట మునిగిన పైర్లు
* రాష్ట్రంలో నాలుగు రోజులుగా వాన బీభత్సం * 12 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పైర్లు * కళింగపట్నంలో 32 సెం.మీ., ఒంగోలులో 31 సెం.మీ. వర్షపాతం * 12 మంది మృతి, చెరువులకు గండ్లు .. ఊళ్లకు రాకపోకలు బంద్ * మరిన్ని చెరువులకు ప్రమాదం.. భయం గుప్పిట్లో స్థానికులు * హైదరాబాద్‌లో మునిగిన లోతట్టు ప్రాంతాలు * హైదరాబాద్‌లో మునిగిపోయిన లోతట్టుప్రాంతాలు.. ట్రాఫిక్ ఇక్కట్లు * నల్లగొండ, కరీంనగర్, అనంతపురం తదితర జిల్లాల్లో వడగండ్ల వానతో భారీ నష్టం సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో ఆదిలోనే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, ఈశాన్య రుతుపవనాలు బలోపేతం కావడంతో గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో కోస్తా, తెలంగాణ, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనావాస ప్రాంతాలు నీటి మడుగులను తలపిస్తున్నాయి. చెరువులు, కాల్వలకు గండ్లు పడి రహదారులు చెరువుల్లా మారాయి. పలు గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొన్ని చోట్ల బస్సులు, లారీలు సైతం వరద ఉధృతిలో కొట్టుకుపోగా.. స్థానికులు, అధికారుల తక్షణ స్పందనతో బాధితులు బతికి బయటపడ్డారు. గురువారం అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 32 సెం.మీ., ప్రకాశం జిల్లా ఒంగోలులో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వాగులు, వంకలు రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంశధార, బాహుదా నదుల వరదతో శ్రీకాకుళం జిల్లాలో రైలు మార్గంపై నీరు చేరింది. వర్షాలతో గుంటూరు జిల్లా కోటప్పకొండ ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వర్షాలవల్ల ట్రాఫిక్ స్తంభించింది. నల్లగొండ, కరీంనగర్, అనంతపురం తదితర జిల్లాల్లోనూ వడగండ్ల వానతో నష్టం వాటిల్లింది. జనజీవనం అస్తవ్యస్తం: కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వర్షాలతో వాగుల్లో కొట్టుకుపోవడం, ఇళ్ల గోడలు కూలిపోవడం లాంటి కారణాలవల్ల 12 మంది మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో వాగులో కొట్టుకుపోయి నలుగురు, హైదరాబాద్‌లో ఇంటిగోడ కూలిపోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు. గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు వర్షాలవల్ల చనిపోయారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. గురువారం ఉదయానికి హైదరాబాద్‌కు అందిన ప్రాథమిక అధికారిక సమాచారం ప్రకారం 1,884 ఇళ్లు కూలిపోయాయి. ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం... వానలకు పాక్షికంగాగాని, పూర్తిగా గాని కూలిన ఇళ్లు 8477 దాకా ఉన్నాయి. పొలాల్లో నీరు ఉండటంతో కూరగాయలు కోయలేకపోతున్నారు. మార్కెట్లో ఆకుకూరలు, కూరగాయలు కొరత ఏర్పడింది. కూరగాయల ధరలు భగ్గుమని పెరిగాయి. వివిధ జిల్లాల్లో కిలో టమోటాలు రూ.50 పలుకుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడింది. మొన్నటి వరకూ కిలో రూ. 20 ఉన్న బెండ ఇప్పుడు రూ. 30 అమ్ముతున్నారు. నీటమునిగిన పంటలు... ఎడతెరపిలేని కుండపోత వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 20 - 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండటంతో పంట చేలు నీటితో నిండిన చెరువులను తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లో కోతకొచ్చిన, పెరికి వోదెలు వేసిన వేరుశనగ నీటిలో నానుతోంది. కోతకొచ్చిన, కోసి కళ్లాల్లో, మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన పత్తి పూర్తిగా నానిపోయింది. ఇలా నానిపోయిన పత్తి, వేరుశెనగ ఇక ఎందుకూ పనికిరాదని రైతులు కుంగిపోతున్నారు. కోత దశకు వచ్చిన వరి, మొక్కజొన్న, కంది పంటలు నేలవాలిపోయి నీటిలో నానుతున్నాయి. వేరుశెనగ, వరి, కంది, మొక్కజొన్న పైర్లతో వెంటనే నీరు ఇంకిపోకపోతే మొలకలు వస్తాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 6.25 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని గురువారం ఉదయం వరకూ అధికారికంగా అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం ఇందుకు రెట్టింపు ఉంటుందని రైతులు అంటున్నారు. గుంటూరు, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన పత్తి బస్తాలు తడిసి ముద్దకావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. రాజధానిలో మోకాళ్లలోతు వరదనీరు వర్షాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద 3.4 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్ ప్రాంతంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. గోడ కూలి ముగ్గురి మృతి.. జీవనోపాధికి హైదరాబాద్‌కు వచ్చిన ఒక కుటుంబంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తీవ్రమైన విషాదాన్ని నింపింది. విజయనగర్ కాలనీ, కోటమ్మబస్తీలో ప్రభుత్వ బీఈడీ కళాశాల గోడను ఆనుకుని చిన్న పూరి గుడిసెలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినగోతూరి మావుళ్లు (30) కుటుంబం నివసిస్తోంది. గురువారం ఉదయం ఆ గోడ కూలి పోవడంతో మావుళ్లు తల్లి పార్వతి (55), భార్య లక్ష్మి (26), చిన్న కుమారుడు జనార్దన్ (5) ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబసభ్యుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు మతీన్ ముజదాది, పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్ రెహ్మాన్, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ తదితరులు పరామర్శించారు. -
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
సాక్షి, హైదరాబాద్, విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్లు, బస్సు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పట్టాల మీదుగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను దక్షిణ మధ్య ైరె ల్వే రద్దు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద వరద ఉద్ధృతి అతి ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లా జాదూపూడి-ఇచ్చాపురం మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం వర్షపు నీరు 2 మీటర్లకు పైగా రావడంతో హౌరా వైపు నుంచి రావల్సిన పలు రైళ్లను నాగపూర్, బలార్ష, వరంగల్ మీదుగా విజయవాడకు నడిపారు. రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు: భువనేశ్వర్-విశాఖపట్టణం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లను గురువారం రద్దయ్యాయి. హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంతపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-జగదల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లను అంగుల్, విశాఖపట్నంల మీదుగా మళ్లించారు. త్రివేండ్రం-గువాహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-న్యూ జల్పాయ్గురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం, టిట్లాఘర్ జంక్షన్ల మీదుగా మళ్లించారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కొచువేలి-గువాహతి ప్రత్యేక రైలు, యశ్వంత్‌పూర్-షాలిమార్ ప్రత్యేక రైలు, పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్, హైరా-చెన్నై, షాలీమార్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్, భాగల్పూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, గువాహతి-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లను ఖరగ్‌పూర్, టాటానగర్, బల్లార్షా, వరంగల్ మీదుగా మళ్లించారు. షాలీమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌లను వరంగల్ మీదుగా మళ్లించారు. వర్షపాత వివరాలు (సెంటీ మీటర్లలో) కళింగపట్నం : 32 ఒంగోలు : 31 అచ్చంపేట : 22 కాకినాడ, టెక్కలి : 20 దర్శి : 18 పత్తిపాడు : 15 అద్దంకి, మందస : 14 పిడుగురాళ్ల, పలాస, దేవరకొండ : 13 బాపట్ల, భీమిలి, ఇచ్చాపురం, మాచర్ల : 12 సోంపేట, విజయనగరం, అవనిగడ్డ : 11 విశాఖపట్నం, పాతపట్నం, సీతారాంపురం,కల్వకుర్తి, చేవెళ్ల : 10 అనకాపల్లి : 9 రణస్థలం, పాలకొండ, సత్తెనపల్లి, గజపతినగరం, ఆత్మకూరు(కర్నూలు జిల్లా), నాగర్‌కర్నూలు, సుల్తానాబాద్ : 8 తెర్లాం, చీపురుపల్లి, గుంటూరు, కోడేరు, మచిలీపట్నం, గుత్తి, కొల్లాపూర్, మెదక్ : 7 ఎస్‌కోట, తెనాలి, గుడివాడ, భీమవరం, ఎర్రగొండపాలెం, లక్కిరెడ్డిపాలెం,రామన్నపేట, సూర్యాపేట, ఇబ్రహీంపట్నం, పరకాల : 6 5 సెం.మీ. లోపు వర్షపాతం మంగళగిరి, రెంటచింతల, నర్సాపురం, కందుకూరు, విజయవాడ, కుంబం, వీరఘట్టం, ఉదయగిరి, అచ్చంపేట, పొదిలి, రేపల్లె, బొబ్బిలి, చోడవరం, పత్తికొండ, కదిరి, పోరుమామిళ్ళ, ఏటూరునాగారం, పార్వతీపురం, వింజమూరు, నర్సీపట్నం, సిరిసిల్ల, తుని, రాజమండ్రి, యలమంచిలి, అరకు, కొమరాడ, నూజివీడు, ఔకు, మడకశిర, బద్వేలు, ఎమ్మిగనూరు, తాండూరు, దుబ్బాక, బాన్సువాడ, రామగుండం, వెంకటాపురం, మహబూబ్‌నగర్. -
బాధితులకు వైఎస్సార్సీపీ ఆపన్న హస్తం
సాక్షి, గుంటూరు, ఒంగోలు: గుంటూరు జిల్లాలో జలవిలయానికి నష్టపోయిన బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు ఆదుకున్నారు. జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), సీజీసీ సభ్యుడు జంగాకృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి బాధితులను పరామర్శించారు. నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులకు ఆర్థిక సాయం, అన్నదానం చేశారు. బాపట్ల మండలం దగ్గుమల్లివారిపాలెంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో పార్టీ పట్టణ కన్వీనర్ దగ్గుమల్లి ధర్మారావు 2 రోజులుగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఒంగోలులోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముంపు కాలనీల్లో ప్రజలకు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. -
చెన్నై, తిరువళ్లూరులో విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, దిండుగల్, తేని, విరుదనగర్, తిరుచ్చి, పుదుకోట్టై, నాగపట్నం, తంజావూరు, కోయంబత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరుల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. చెన్నై, తిరువళ్లూరులో పాఠశాలలు, కళాశాలకు నేడు సెలవు ప్రకటించారు. రేపటి వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. -
తడిసి ముద్దయిన శ్రీకాకుళం జిల్లా
పై-లీన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లు కనిష్ఠంగా 10 సెంటీమీటర్లతో మొదలుపెట్టి, గరిష్ఠంగా 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గడిచిన 24 గంటల్లో.. ఇచ్ఛాపురంలో 20 సెంటీమీటర్లు, కవిటిలో 15.4 సెం.మీ, కంచిలి 14.7సెం.మీ, కోటబొమ్మాళి 10.8, సోంపేటలో 10.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సంతబొమ్మాళి, గార, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, రణస్థలం మండలాల్లో ఈ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. -
పగలు భగభగ.. సాయంత్రం చిటపట
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: వాతావరణం నాడీ అంతుచిక్కడం లేదు. పగలంతా భగభగ మండే ఎండ.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతలోనే వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. సాయంత్రం అవుతుండగానే ఆకాశమంతా మబ్బులు కమ్ముకుంటూ చిటపట చినుకులతో వరుణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ విచిత్ర పరిస్థితులను అటుంచితే.. వరుణుడు కరుణ రైతులకు ఒకింత మేలు చేకూరుస్తోంది. మంగళవారం రాత్రి 13 మండలాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆళ్లగడ్డలో 79 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా మిడుతూరులో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 126 మి.మీ కాగా.. మొదటి 11 రోజులకే 122.6 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. జూన్ నెలలో 13 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో 11 శాతం, ఆగస్టులో 1 శాతం అధిక వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల వరి, మొక్కజొన్న.. ఇతర పంటలు భారీగా నీట మునిగాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షం పంటలకు మేలు చేసినా.. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందేనని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జూన్ నెల మొదటి పక్షంలో వేసిన వేరుశెనగ పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. మరో పది రోజుల్లో పెరకడానికి రైతులు సిద్ధమవుతున్నారు. అయితే వర్షాలు తెరిపివ్వకపోతే భూమిలోని కాయలు తిరిగి మొలకెత్తే ప్రమాదం లేకపోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలులో భారీ వర్షం: నగరంలో బుధవారం భారీ వర్షం కురవడంతో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. మురుగునీటి కాల్వలు పొంగి పొర్లాయి. ఈ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పలు ఉత్పత్తులు నీట మునగడంతో రైతులకు నష్టం వాటిల్లింది. వెల్దుర్తి, డోన్, కల్లూరు తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. -
పొన్నాలకు తీరక..!
సాక్షి, కరీంనగర్ : జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తీరిక దొరకడం లేదు. అత్యంత కీలకమైన జిల్లా సమీక్ష మండలి సమావేశానికి పదినెలల తరువాత సమయం ఇచ్చినా.. చివరి నిమిషంలో మళ్లీ చేతులెత్తేశారు. శనివారం జరగాల్సిన డీఆర్సీ సమావేశం వాయిదా వేయించారు. తద్వారా గత ఇన్చార్జి మంత్రుల జాబితాలో పొన్నాల కూడా చేరిపోయారు. ఈయనకు ముందు జూపల్లి కృష్ణారావు, ముఖేష్‌గౌడ్ ఈ బాధ్యత నిర్వర్తించారు. వారి హయాంలో డీఆర్సీ సమావేశాల ఊసే కనిపించలేదు. లక్ష్మయ్య బాధ్యత తీసుకున్న వెంటనే అక్టోబర్ 30న సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో యంత్రాంగానికి సూచనలు ఇవ్వడంతోపాటు అధికారులకు సరైన దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించిన డీఆర్సీ ఇన్చార్జి మంత్రుల నిరాసక్తతతో నీరుగారిపోతోందని విపక్షసభ్యులు మండిపడ్డారు. ఆ సమయంలో ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని చెప్పిన పొన్నాల.. రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపికగా సమావేశంలో పాల్గొన్నారు. దీంతో క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతాయని అందరూ భావించారు. ఆ తర్వాత పదినెలలైనా ఆయన జిల్లా వైపు తొంగిచూడకపోవడంతో పాత ఇన్చార్జులకు ఈయన భిన్నం కాద ని తేలిపోయింది. సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగిందనుకుంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా సమావేశం వాయిదా వేయడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం నెలల తరబడి నిర్వహించకపోవడంతో ప్రగతిపై ప్రభావం చూపుతోంది. నీరుగారిన ప్రజాప్రతినిధుల ఆశలు జిల్లా సమస్యలపైకి ప్రభుత్వ దృష్టిని మళ్లించాలని వివిధ పార్టీల శాసనసభ్యులు భావించారు. ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన హామీలు పొంద డం ద్వారా ప్రజలు, రైతులకు భరోసా కల్పించాలని ఆశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. పంటనష్టం భారీగా ఉంది. మంథని డివిజన్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. గురువారం కూడా భారీ వర్షం నష్టాన్ని మరింత పెంచింది. మధ్య మానేరు ముంపు భాధితుల సమస్య చాలాకాలంగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. అవసరాల మేరకు యూరియా అందుబాటులో లేక రైతులు జిల్లావ్యాప్తంగా ఆందోళన బాట పడుతున్నారు. అధికారులు కొరతను తీరుస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చడం లేదు. విద్యుత్ కొరత తీవ్రం గా వేధిస్తోంది. లోవోల్టేజీ, అప్రకటిత కోతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో అమలులో అనేక లోటుపాట్లు బయటపడుతున్నాయి. బంగారుతల్లి పథకంపై లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. చాలాచోట్ల సీజనల్ వ్యాధులతో పల్లెలు మంచం పట్టాయి. వీటన్నింటిపై చర్చిం చి ప్రజలకు అండగా నిలిచేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించాలని విపక్షా లు ఆశించాయి. తీరా సమయానికి సమావేశం వాయిదా పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల నుంచి దాడి తప్పదని భావిం చే వాయిదా వేయించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఆర్సీ వాయిదా : సీపీవో శనివారం జరగాల్సిన డీఆర్సీ సమావేశం అని వార్య కారణాలతో వాయిదా పడిందని ముఖ్య ప్రణాళిక అధికారి పి.సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు. -
ముంచెత్తిన జడి
పాలమూరు/అచ్చంపేట, న్యూస్‌లైన్: పాలమూరును జడివాన ముంచెత్తింది. గురువారం అర్ధరాతి నుంచి జిల్లాలో భారీ వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రో జంతా ముసురుపట్టి ఉండటంతో జన జీవనం స్తంభించిపోయింది. మహబూబ్‌నగర్‌కు సమీపంలోని హస్నాపూర్ వాగులో నీటి ఉధృతి పె రగడంతో బొంతల మాసమ్మ అనే మహిళ గ ల్లంతైనట్లు తెలుస్తోంది. కోయిలకొండ మం డలం సూరారం వాగు, దేవరకద్ర మండలం బండర్‌పల్లి వాగుల్లోకి నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలో నమోదైన వర్షపాతం ఖిల్లాఘనపూర్ మండలంలో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కాగా..వీపనగండ్లలో 96.2 మి.మీ, వనపర్తి 92.0, మహబూబ్‌నగర్ 90.4, పాన్‌గల్ 87.2, పెద్దకొత్తపల్లి 87.0, కొల్లాపూర్ 73.0, హ న్వాడ 71.2, పెద్దమందడి 70.0, పెబ్బేరు 68.0, కొందుర్గు 67.4, నవాబుపేట 64.4, కొ త్తకోట 64.0, భూత్పూర్ 61.0, లింగాల 60.0, నాగర్‌కర్నూల్ 59.8, అడ్డాకుల 57.4, చిన్నచిం తకుంట 55.0, ఆత్మకూర్, అచ్చంపేట 52.0, బల్మూర్ 49.0, కోయిలకొండ 45.2, ధన్వాడ 45.0, గోపాల్పేట 44.0, కొడంగల్ 43.0, బిజి నేపల్లి 41.6, బాలానగర్ 40.2, మిడ్జిల్, అలంపూర్, అమ్రాబాద్ 40.0, నారాయణపేట 38.0, కల్వకుర్తి, తలకొండపల్లి, దేవరకద్ర 36.0, మానవపాడు 35.0, కోడేరు, మాడ్గుల 32.0, గద్వాల 30.8, ఇటిక్యాల మండలాల్లో 30.2 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. తెగిపోయిన చంద్రవాగు బ్రిడ్జిరోడ్డు నల్లమలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలోని అచ్చంపేట సమీపంలో ని చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అచ్చంపేట మండలం బొల్గట్‌పల్లి స్టేజీ వద్ద చంద్రవాగు ప్రవాహానికి తాత్కాలికంగా ని ర్మించిన కల్వర్టు మరోసారి తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో అచ్చం పేట నుంచి శ్రీశైలం, అమ్రాబాద్ మార్గంలో వె ళ్లే అన్ని వాహనాలను నడింపల్లి, హాజీపూర్, బ్రాహ్మణపల్లి మీదుగా మన్ననూర్ వైపు నడిపిస్తున్నారు. కాగా, జూన్6న కురిసిన భారీవర్షాని కి చంద్రవాగు కల్వర్టుకోతకు గురైంది. అప్పట్లో తాత్కలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు కోతకు గు రికావడంతో మూడురోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కురిసిన వర్షానికి అదే పరిస్థితి పునరావృతమైంది. కల్వర్టు స్థానం లో తాత్కాలిక రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడంతో శ్రీశైలం- అచ్చంపేట మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వర్షాలు తగ్గితే గాని పునరుద్ధర ణ పనులు చేపట్టే అవకాశం లేదని అచ్చంపేట ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ చంద్రశేఖర్ తెలిపారు. జల దిగ్బంధంలో ముక్కిడిగుండం కొల్లాపూర్ రూరల్: భారీ వర్షానికి మండలంలో ని ముకిడిగుండం, నార్లాపూర్ గ్రామాల మధ్యనున్న పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముకిడిగుం డానికి మరోవైపు ఉన్న ఉడుముల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముకిడిగుం డానికి రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాల కు వెళ్లేందుకు ఉపాధ్యాయులు, గ్రామంనుంచి విద్యార్థులు, ప్రజలు కొల్లాపూర్ వచ్చేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షానికి రూ.2కోట్ల నష్టం - డీఆర్వో రాంకిషన్ వెల్లడి కల్టెరేట్ : జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి రూ.2 కోట్ల నష్టంవాటిల్లిందని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. నష్టం అంచనాపై శుక్రవారం ఆయన మండల తహశీల్దార్లలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ..మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ డివిజన్ల ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని 19 మండలాల్లో 501 ఇళ్లు దెబ్బతిన్నాయి. నారాయణపేట్ డివిజన్ పరిధిలో 226 ఇళ్లకు నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్ డివిజన్లో 419 ఇళ్లు దెబ్బతిన్నాయి. వనపర్తి డివిజన్ పరిధిలో 169 ఇళ్లు కూలిపోయాయి. అలాగే ఈ డివిజన్లో 42ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. రెండు మూడురోజుల్లో పరిహారం వర్షానికి నష్టపోయిన వారందరికీ రెండు మూడు రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. నష్టం జరిగిన గ్రామాలకు తహశీల్దార్ సంబంధిత వీఆర్వోలతో కలిసి స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. అర్హులకు సంబంధించిన నివేదిక మా త్రమే పంపించాలని, మంజూరైన పరిహారాన్ని వారికే అందజేయాలని సూచించారు. దెబ్బతి న్న ఇళ్ల ఫొటోలతో సహా వివరాలను శనివారం లోగా పంపాలన్నారు. చెరువు, కుంటలు నిండి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లయితే నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.