సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన మూడు సంఘటనలపై మంత్రి హరీశ్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. చిన్నకోడూర్ మండలం దర్గాపల్లి వాగులో కొట్టుకుపోయిన కారు సంఘటనపై అధికారులను అలర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే రక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం వాగులో కొట్టుకుపోయిన కారులో ఉన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను కాపాడేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులందరు సంఘటనస్థలం వద్దే ఉండి, అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. (18 వేల ఎకరాల్లో పంట నష్టం)
రెండు రోజుల కిందట బస్వాపూర్ వాగులో కొట్టుకుపోయిన లారీ డ్రైవర్ గాలింపు చర్యలపై, అదేవిధంగా రాఘవపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఆదివారం మాటీండ్ల గ్రామంలో చెక్ డ్యామ్‌లో కొట్టుకుపోయిన సంఘటనపై ఎప్పటికప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. నిరంతరం రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.(సైదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment