
తిరువనంతపురం: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ సహా తొమ్మిది జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పెరియార్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటం.. కొచ్చి విమానశ్రయం సమీపంలోని కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో.. విమానాశ్రయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుంచి విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారీ వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతాధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పెంచడం కోసం మరిన్ని కేంద్ర బలగాలను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాడు. మలప్పురం జిల్లా నిలంబురి గ్రామంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు తప్పిపోయాయి. సహాయక బృందాలు ఈ రోజు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment