
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్‌లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్ ,మలక్‌పేట, కోఠీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, కర్నూలు, అనంతపురానికి భారీ వర్షం పడనున్నట్లు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment