dilsuknagar
-
సిటీలో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్‌లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్ ,మలక్‌పేట, కోఠీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, కర్నూలు, అనంతపురానికి భారీ వర్షం పడనున్నట్లు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
సరూర్ నగర్ చెరువు నిండి కాలనీల్లో వరద
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం కురిసిన భారీ వర్షంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు సరూర్ నగర్ చెరువు నిండి సమీపంలోని కాలనీలకు వరద నీరు ప్రవహిస్తోంది. చెరువు నిండి దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలానగర్లో వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ కాలనీలన్నీ జలమయం అయ్యాయి. శనివారం నుంచి కరెంట్ లేక తాగడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్ వాసులు కిందికి దిగే పరిస్థితి కనిపించడం లేదు. నిత్యవసర సరుకులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు భయాందోలనలో బతుకుతున్నారు. వర్షం, వరద నీటితో దిల్సుఖనగర్ ప్రధాన రోడ్డు స్థబించి, ఎల్బీ నగర్, నల్గొండ నుంచి వచ్చే వాహనలు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం సమీప కాలనీల నుంచి వస్తున్న వరద నీరుతో ప్రధాన రహదారి జలదిగ్భందమవడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దిల్సుఖ్ నగర్‌లోని సెల్లార్లలో ఉన్న పలు వస్త్ర దుకాణాలన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో భారీ నష్డం వాటిల్లింది. దాదాపు 35 బట్టల దుకాణాలు నీటిలో మునిగాయని, అధికారులు మోటర్ల సాయంతో నీటిని తోడేస్తే కొంతలో కొంతైన బట్టలు చేతికి దక్కుతాయని లేదంటే పూర్తిగా నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనప్రియ, మీర్‌పేటలో రోడ్లు జలయమం అయ్యాయి. పెద్దచెరువు నిండటంతో పలు కాలనీలు నీటమునిగాయి. చెరువుకి గండిపడటంతో జనప్రియ కాలనీలోకి వరద నీరు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!
-
దిల్సుఖ్నగర్ భాగ్యనగర్ రెస్టారెంట్లో చోరి
-
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు నేటితో ఆరేళ్లు పూర్తి
-
ఫేస్బుక్ లైవ్‌తో కేరళకు రూ.5లక్షలు సాయం
హిమాయత్ నగర్: కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఫేస్బుక్ సెలబ్రిటీ, దిల్షుక్నగర్ వాసి కొమ్మరాజు దివ్య అన్వేషిత ఇచ్చిన పిలుపునకు అనేకమంది స్పందించారు. సుమారు గంటన్నర్ర పాటు ఆమె ఫేస్బుక్ లైవ్ షో నిర్వహించింది. రూపాయి నుంచి మీ శక్తి మేరకు ఎంతైనా సాయం చేయోచ్చని కోరిందిం. స్పందించిన నెటిజన్లు పేటీఎం ద్వారా రూ.10 నుంచి రూ.20వేల చొప్పున తోచినంత నగదును ట్రాన్స్ఫర్ చేశారు. సుమారు రూ.5లక్షలు దివ్య అన్వేషిత ఫేస్బుక్ లైవ్‌ద్వారా కేరళకు సాయం చేయడం గమనార్హం. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్లు..!
-
దిల్సుఖ్నగర్ పేలుళ్లకు నేటితో ఐదేళ్లు పూర్తి
-
వేషం కట్టి దొరికాడు..చితక్కొట్టి సాగనంపారు
హైదరాబాద్ : సులువుగా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ఓ యువకుడు హిజ్రా వేషం కట్టాడు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలోని దుకాణాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండగా.. అసలైన హిజ్రాలకు పట్టుబడ్డాడు. కోపోద్రిక్తులైన వారు నకిలీ హిజ్రాను పట్టుకుని చెప్పులతో చితకొట్టారు. అతడి ఒంటిపై ఉన్న దుస్తులను చింపి బండారం బయట పెట్టారు. దీంతో వేషం కట్టిన సదరు యువకుడు మరెప్పుడూ ఇలాంటి పని చేయనని కాళ్లావేళ్లా పడ్డా వదిలి పెట్టలేదు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ హిజ్రాల నుంచి ఆ యువకుడిని తప్పించి అక్కడి వెళ్లిపోవాలని ఆదేశించడంతో యువకుడు కాళ్లకు బుద్ధి చెప్పాడు. -
హైదరాబాద్ లో వర్షం
గత కొన్ని రోజులుగా ఎండ వేడితో తల్లడిల్లుతున్న జంటనగరాల ప్రజలకు ఆదివారం కొద్దిగా ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతంకావడంతో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గింది. బోడుప్పల్, ఉప్పల్, రామాంతాపూర్, హబ్సిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఇక దిల్షుక్నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్, శివారు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొద్ది రోజులుగా పెరిగిన ఎండలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న జనం.. ఒక్కసారిగా చిరుజల్లులతో పాటు పలుకరించిన చల్లటి గాలులతో వారాంతాన్ని ఆస్వాదిస్తున్నారు.