వేషం కట్టి దొరికాడు..చితక్కొట్టి సాగనంపారు
హైదరాబాద్ :
సులువుగా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ఓ యువకుడు హిజ్రా వేషం కట్టాడు. దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలోని దుకాణాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండగా.. అసలైన హిజ్రాలకు పట్టుబడ్డాడు. కోపోద్రిక్తులైన వారు నకిలీ హిజ్రాను పట్టుకుని చెప్పులతో చితకొట్టారు.
అతడి ఒంటిపై ఉన్న దుస్తులను చింపి బండారం బయట పెట్టారు. దీంతో వేషం కట్టిన సదరు యువకుడు మరెప్పుడూ ఇలాంటి పని చేయనని కాళ్లావేళ్లా పడ్డా వదిలి పెట్టలేదు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ హిజ్రాల నుంచి ఆ యువకుడిని తప్పించి అక్కడి వెళ్లిపోవాలని ఆదేశించడంతో యువకుడు కాళ్లకు బుద్ధి చెప్పాడు.