
దివ్య అన్వేషిత పిలుపుతో ముందుకొచ్చిన నెటిజన్లు
హిమాయత్ నగర్: కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఫేస్‌బుక్ సెలబ్రిటీ, దిల్‌షుక్‌నగర్ వాసి కొమ్మరాజు దివ్య అన్వేషిత ఇచ్చిన పిలుపునకు అనేకమంది స్పందించారు. సుమారు గంటన్నర్ర పాటు ఆమె ఫేస్‌బుక్ లైవ్ షో నిర్వహించింది. రూపాయి నుంచి మీ శక్తి మేరకు ఎంతైనా సాయం చేయోచ్చని కోరిందిం. స్పందించిన నెటిజన్లు పేటీఎం ద్వారా రూ.10 నుంచి రూ.20వేల చొప్పున తోచినంత నగదును ట్రాన్స్‌ఫర్ చేశారు. సుమారు రూ.5లక్షలు దివ్య అన్వేషిత ఫేస్‌బుక్ లైవ్‌ద్వారా కేరళకు సాయం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment