న్యూఢిల్లీ : పొరుగుదేశం నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో సరిహద్దు రాష్ట్రాలు బిహార్, అసోంలలో వరదనీరు పోటెత్తుతోంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు ఆయా రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల కారణంగా బిహార్‌లో 33 మంది, అసోంలో 17 మంది మరణించినట్టు సమాచారం. బిహార్‌లోని 12 జిల్లాల్లోని 25 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న లక్షా 25 వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిచాయి.
భారీ వర్షాలు, వరదలతో అసోంలోని బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 4620 గ్రామాలు నీటమునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షా 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసోంలో వరద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్షించారు. భారీ వరదల కారణంగా అసోం అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment