
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాన కారణంగా బంగారిగూడ వాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది. ఆదిలాబాద్-కుమ్రంభీం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవంటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుకు రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బోథ్ మండలంలో భారీ వర్షాల కారణంగా నక్కల్వడా బిడ్జిపై నుంచి నీరు పొంగిపోరలుతోంది.దీంతో గ్రామల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానిక బోథ్ పోలీసులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment