పాలమూరు/అచ్చంపేట, న్యూస్‌లైన్: పాలమూరును జడివాన ముంచెత్తింది. గురువారం అర్ధరాతి నుంచి జిల్లాలో భారీ వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రో జంతా ముసురుపట్టి ఉండటంతో జన జీవనం స్తంభించిపోయింది. మహబూబ్‌నగర్‌కు సమీపంలోని హస్నాపూర్ వాగులో నీటి ఉధృతి పె రగడంతో బొంతల మాసమ్మ అనే మహిళ గ ల్లంతైనట్లు తెలుస్తోంది. కోయిలకొండ మం డలం సూరారం వాగు, దేవరకద్ర మండలం బండర్‌పల్లి వాగుల్లోకి నీటి ప్రవాహం పెరిగింది.
జిల్లాలో నమోదైన వర్షపాతం
ఖిల్లాఘనపూర్ మండలంలో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కాగా..వీపనగండ్లలో 96.2 మి.మీ, వనపర్తి 92.0, మహబూబ్‌నగర్ 90.4, పాన్‌గల్ 87.2, పెద్దకొత్తపల్లి 87.0, కొల్లాపూర్ 73.0, హ న్వాడ 71.2, పెద్దమందడి 70.0, పెబ్బేరు 68.0, కొందుర్గు 67.4, నవాబుపేట 64.4, కొ త్తకోట 64.0, భూత్పూర్ 61.0, లింగాల 60.0, నాగర్‌కర్నూల్ 59.8, అడ్డాకుల 57.4, చిన్నచిం తకుంట 55.0, ఆత్మకూర్, అచ్చంపేట 52.0, బల్మూర్ 49.0, కోయిలకొండ 45.2, ధన్వాడ 45.0, గోపాల్‌పేట 44.0, కొడంగల్ 43.0, బిజి నేపల్లి 41.6, బాలానగర్ 40.2, మిడ్జిల్, అలంపూర్, అమ్రాబాద్ 40.0, నారాయణపేట 38.0, కల్వకుర్తి, తలకొండపల్లి, దేవరకద్ర 36.0, మానవపాడు 35.0, కోడేరు, మాడ్గుల 32.0, గద్వాల 30.8, ఇటిక్యాల మండలాల్లో 30.2 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
తెగిపోయిన చంద్రవాగు బ్రిడ్జిరోడ్డు
నల్లమలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలోని అచ్చంపేట సమీపంలో ని చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అచ్చంపేట మండలం బొల్గట్‌పల్లి స్టేజీ వద్ద చంద్రవాగు ప్రవాహానికి తాత్కాలికంగా ని ర్మించిన కల్వర్టు మరోసారి తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో అచ్చం పేట నుంచి శ్రీశైలం, అమ్రాబాద్ మార్గంలో వె ళ్లే అన్ని వాహనాలను నడింపల్లి, హాజీపూర్, బ్రాహ్మణపల్లి మీదుగా మన్ననూర్ వైపు నడిపిస్తున్నారు. కాగా, జూన్6న కురిసిన భారీవర్షాని కి చంద్రవాగు కల్వర్టుకోతకు గురైంది. అప్పట్లో తాత్కలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు కోతకు గు రికావడంతో మూడురోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కురిసిన వర్షానికి అదే పరిస్థితి పునరావృతమైంది. కల్వర్టు స్థానం లో తాత్కాలిక రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడంతో శ్రీశైలం- అచ్చంపేట మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వర్షాలు తగ్గితే గాని పునరుద్ధర ణ పనులు చేపట్టే అవకాశం లేదని అచ్చంపేట ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ చంద్రశేఖర్ తెలిపారు.
జల దిగ్బంధంలో ముక్కిడిగుండం
కొల్లాపూర్ రూరల్: భారీ వర్షానికి మండలంలో ని ముకిడిగుండం, నార్లాపూర్ గ్రామాల మధ్యనున్న పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముకిడిగుం డానికి మరోవైపు ఉన్న ఉడుముల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముకిడిగుం డానికి రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాల కు వెళ్లేందుకు ఉపాధ్యాయులు, గ్రామంనుంచి విద్యార్థులు, ప్రజలు కొల్లాపూర్ వచ్చేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుండపోత వర్షానికి రూ.2కోట్ల నష్టం
- డీఆర్వో రాంకిషన్ వెల్లడి
కల్టెరేట్ : జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి రూ.2 కోట్ల నష్టంవాటిల్లిందని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. నష్టం అంచనాపై శుక్రవారం ఆయన మండల తహశీల్దార్లలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ..మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ డివిజన్ల ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని 19 మండలాల్లో 501 ఇళ్లు దెబ్బతిన్నాయి. నారాయణపేట్ డివిజన్ పరిధిలో 226 ఇళ్లకు నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్ డివిజన్‌లో 419 ఇళ్లు దెబ్బతిన్నాయి. వనపర్తి డివిజన్ పరిధిలో 169 ఇళ్లు కూలిపోయాయి. అలాగే ఈ డివిజన్‌లో 42ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.
రెండు మూడురోజుల్లో పరిహారం
వర్షానికి నష్టపోయిన వారందరికీ రెండు మూడు రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. నష్టం జరిగిన గ్రామాలకు తహశీల్దార్ సంబంధిత వీఆర్వోలతో కలిసి స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. అర్హులకు సంబంధించిన నివేదిక మా త్రమే పంపించాలని, మంజూరైన పరిహారాన్ని వారికే అందజేయాలని సూచించారు. దెబ్బతి న్న ఇళ్ల ఫొటోలతో సహా వివరాలను శనివారం లోగా పంపాలన్నారు. చెరువు, కుంటలు నిండి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లయితే నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ముంచెత్తిన జడి
Published Sat, Aug 17 2013 4:12 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement