![Heavy Rain Floods Bengaluru Airpot Passengers Take Tractor - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/12/Car.jpg.webp?itok=hHGchZNi)
బెంగళూరు: చిన్నప్పుడు ఎప్పుడో పోలాల్లోనూ లేదా సరదాగానో ట్రాక్టర్లు ఎక్కి ఉంటాం. కానీ పరిస్థితి అనకూలించక లేక ఇతరత్రా కారణాలతోనో ఎక్కాలసి వస్తే ఎవరూ ఏం చేయలేం కదా ప్రస్తుతం అలాంటి పరిస్థితే బెంగుళూరు వాసులు ఎదుర్కొన్నారు. మాములుగా వర్షలు ఎక్కువగా పడితేనే రహదారుల బాగోక ఒక పక్క ట్రాఫిక్ ఏర్పడి మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనలవి కాదు. అలాంటిది మెట్రోనగరాల్లాంటి బెంగుళూరు నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ వర్షాల కారణంగా బెంగళూరు వాసులు విమానశ్రయం చేరుకోవడానికి ఎన్ని పాట్లు పడ్డారో చూడాండి
(చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?)
వివరాల్లోకెళ్లితే.....బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (కేఐఏ) వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. టాక్సీలు ప్రైవేట్ వాహనాలు, విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి. అయితే ప్రయాణికులు కూడా టెర్మినల్స్‌లోకి ప్రవేశించలేకపోతున్నారు. దీంతో ప్రజలు విమానాశ్రయం చేరుకోవటం అత్యంత అసాధ్యమైంది. ఈ క్రమంలో వేరుదారిలేక ప్రయాణికులంతా ట్రాక్టర్‌లను ఆశ్రయించక తప్పలేదు. ప్రయాణికులంతా ట్రాక్టర్లపై ప్రయాణిస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. దీంతో ఎంతటి గొప్పోడైనా ప్రకృతి ముందు తలవంచక తప్పదు కదా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!)
Comments
Please login to add a commentAdd a comment