గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన | Meteorological Department: Heavy Rain Forecast For Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

Published Thu, Aug 27 2020 1:14 PM | Last Updated on Thu, Aug 27 2020 1:16 PM

Meteorological Department: Heavy Rain Forecast For Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధీలో భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహా నగరంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధం చేశారు. (కోస్తాకు నేడు వర్ష సూచన)

బంగాళాఖాతంలో ఈ నెల 24న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి ననుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ ఆర్భన్‌, కామారెడ్డి జిల్లాలోని ఒకంట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్య సూచనలు ఉన్నట్లు తెలిపింది. కాగా బుధవారం రాష్ట్రంలో 1.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement