
హైదరాబాద్: భాగ్యనగరంలో ఒకేరోజు మిశ్రమ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భానుడు ప్రతాపం చూపగా.... ఆ తర్వాత ఒకేసారి ఆకాశం మేఘావృతమై వరుణ దేవుడు విశ్వరూపం ప్రదర్శించాడు.

భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. గురువారం గంటన్నర పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర జీవనం కకావికలమైంది.

ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడింది. అత్యధికంగా పాతబస్తీ బహదూర్‌పురాలోని జూపార్క్ వద్ద 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లోని నివాసాల్లో వరద నీరు వచ్చి చేరింది.
















