సాక్షి, తిరుమల: తిరుమలలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్‌లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్‌లలో రాకపోకలు నిషేదించారు. ఈ మేరకు టీటీడీ భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, తిరుమలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగిపడతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.
నడకదారిలో భారీగా నీరు
తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షాలకి నడకదారిలో భారీగా నీరు ప్రవహిస్తోంది. మెట్లపై నడవలేని పరిస్థితి ఉంది. నడకమార్గంలో భక్తులు పిట్టగోడపై నడుస్తున్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చదవండి: (Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment