Ghat Roads
-
తిరుమల ఘాట్ రోడ్డుకు రక్షణ చర్యలు
-
సాఫీగా ప్రయాణం
-
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
-
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్
సాక్షి, తిరుమల: తిరుమలకి వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు ధ్వంసం అయింది. గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకి భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయం 5.40 గంటల ప్రాంతంలో భారీ సైజు టన్నుల కొద్ది బరువున్న రాయి పైనుంచి పడటంతో ఘాట్ రోడ్డు నాలుగు ప్రాంతాలలో భారీగా కోతకు గురయ్యింది. దీంతో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రెండవ ఘాట్ రోడ్లో పూర్తిగా వాహనాలు నిలిపివేయడంతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొదటి ఘాట్ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్ జెట్టి తెలిపారు. ఆ ప్రాంతాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ రెండవ ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 - 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్లోలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుమలలో భారీ వర్షాలు.. రెండు ఘాట్‌రోడ్లు మూసివేత
సాక్షి, తిరుమల: తిరుమలలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిషేదించారు. ఈ మేరకు టీటీడీ భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, తిరుమలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగిపడతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో భారీగా నీరు తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షాలకి నడకదారిలో భారీగా నీరు ప్రవహిస్తోంది. మెట్లపై నడవలేని పరిస్థితి ఉంది. నడకమార్గంలో భక్తులు పిట్టగోడపై నడుస్తున్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదవండి: (Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి) -
తిరుమల ఘాట్ రోడ్లలో వేగానికి కళ్లెం
భక్తుల భద్రతే లక్ష్యంగా ఫారెస్ట్ అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఘాట్ రోడ్లలో సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేయాలని సూచించారు. అలాగే రాత్రి ఏడు నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు నడకదారులు మూసివేయాలని ప్రతిపాదించారు. వాహనాల వేగానికీ కళ్లెం వేయాలని నిర్ణయించారు. మూడు రోజుల క్రితం భక్తులపై చిరుత దాడి నేపథ్యంలో ఈ ఆంక్షలను ప్రతిపాదించారు. దీనిపై టీటీడీ ఆచితూచి అడుగులేస్తోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. గత ఆదివారం రాత్రి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో తండ్రీ కూతురు స్కూటర్‌పై ప్రయాణిస్తుండగా తొమ్మిదో కిలోమీటరు వద్ద ఒక్కసారిగా తండ్రిపై చిరుత దాడి చేసింది. కుమార్తెపై దాడికి యత్నించింది. పది నిమిషాల తరువాత అదే దారిలో వచ్చిన భార్యాభర్తలపైనా దాడి చేసింది. అలాగే మరికొన్ని వాహనాలపై దాడికి ఉప్రకమించింది. సాక్షి, తిరుమల: సప్తగిరీశుని దర్శనార్థం దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. కాలినడకన కొందరు, రోడ్డు మార్గాన మరికొందరు కలియుగ వైకుంఠానికి చేరుకుంటుంటారు. వీరి భద్రతకు టీటీడీ, ఫారెస్ట్, విజిలెన్స్ పెద్ద పీట వేస్తోంది. ఇటీవల తిరుమలలో భక్తులపై చిరుత దాడి నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యింది. నడకదారుల్లో, ఘాట్ రోడ్లల్లో కొన్ని ఆంక్షలు విధించాలని ఫారెస్ట్ సూచించింది. దీనిపై టీటీడీ అధికారులు ఆచీతూచీ అడుగులేస్తున్నారు. భక్తుల భద్రతే లక్ష్యం భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ ఫారెస్ట్ అధికారులు అడుగులేస్తున్నారు. చిరుతదాడి నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఘాట్ రోడ్లలో ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను విజిలెన్స్, పోలీసు సిబ్బందికి అందించారు. ప్రతిపాదనలు ఇలా.. టీటీడీ విజిలెన్స్, అర్బన్ పోలీసుల ముందు అటవీశాఖ పలు ప్రతిపాదనలు ప్రతిపాదించింది. ఇందులో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్లలో అనుమతించరాదని ప్రతిపాదించింది. అలాగే నడక మార్గాలను రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సూచించింది. ఘాట్ రోడ్లలో వేగ నియంత్రణకూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఘాట్ రోడ్లలో వాహనాలు 20కి.మీ వేగాన్ని మించకుండా ప్రయాణం చేయాలని సూచించింది. సమీక్షలో టీటీడీ విజిలెన్స్ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, టీటీడీ ఫారెస్ట్ డీఎఫ్ఓ ఫణికుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారి, ఎఫ్ఆర్ఓ సుబ్బారాయుడు పాల్గొన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న టీటీడీ ఫారెస్ట్ అధికారుల సూచనల అమలుపై టీటీడీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. ఘాట్ రోడ్లలో ఆంక్షలను పరిశీలిస్తోంది. ముందుగా చిరుత పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిత్యం పెట్రోలింగ్, ఘాట్ రోడ్లకిరువైపులా వాహనాలను పార్కింగ్ చేయకుండా, పిట్టగోడ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫారెస్ట్, విజిలెన్స్ సూచనలు తక్షణం అమలు చేయలేమని, భక్తులను చైతన్యపరిచి వన్యమృగాల దాడుల నుంచి కాపాడాలని భావిస్తోంది. ఆంక్షలు విధిస్తే భక్తులకు ఇబ్బందే! భద్రత పేరున ఫారెస్ట్ అధికారుల సూచనలతో ఆంక్షలు విధిస్తే భక్తులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్విచక్రవాహనాల్లో స్థానికులే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారని, ఇప్పటికే వారికి వన్యమృగాల దాడి, రక్షణపై కొంత అవగాహన ఉందని అంటున్నారు. నడక మార్గాలు మూసివేస్తే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని, వేసవి, వర్షాలప్పుడు తిప్పలు తప్పవని చెబుతున్నారు. -
మనకేదీ రక్షణ
రెండేళ్ల క్రితం ఘాట్ రోడ్డు మీదుగా అనంతగిరి నుంచి కేరెళ్లికి వెళ్తున్న బస్సు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి. బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఘాట్‌లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఓ చెట్టును ఢీ కొట్డడంతో వేగం తగ్గి అక్కడే ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతగిరి (రంగారెడ్డి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. నిత్యం తాము రాకపోకలు సాగించే రూట్లో ఉన్న ఘాట్ రోడ్లను తలుచుకుని అభద్రతా భావానికి గురయ్యారు. వికారాబాద్ పట్టణానికి సమీపంలో అనంతగిరి వద్ద ఎత్తైన ఘాట్ రోడ్లు ఉన్నాయి. వీటి కింది లోయలు సుమారు 1,500 అడుగుల లోతులో ఉంటాయని అంచనా. ఇక్కడ ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకున్నారు. ఈ మధ్య కాలంలో అనంతగిరికి శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ దారిలో ఎత్తైన ఘాట్ రోడ్లు ఉన్నాయి. వీటికి రెండు మూడు చోట్ల మాత్రమే సైడ్‌వాల్స్, రక్షణ రాళ్లు ఉన్నాయి. అనేక చోట్ల ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. ఒకవేళ వాహనాలు అదుపుతప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. ఇప్పటికే పలు ట్యాంకర్లు, లారీలు ఇక్కడ బోల్తా పడ్డ ఘటనలు అనేకం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఘాట్ రోడ్డు మీదుగా అనంతగిరి నుంచి కేరెళ్లికి వెళ్తున్న బస్సు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి. ఎంతకీ అదుపు కాకపోవడంతో ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఘాట్ లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఓ చెట్టు ను ఢీకొట్డడంతో వేగం తగ్గి అక్కడే నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 3 నెలల క్రితం అనంతగిరి– కేరెళ్లి మొదటి ఘాట్‌లో ఏర్పాటు చేసిన సైడ్వాల్ను ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది. ఏమాత్రం స్పీడ్ ఉన్నా వాహనం లోయలో పడిపోయేదే. ఇక్కడ దెబ్బతిన్న సైడ్‌వాల్‌కు ఇప్పటికీ మరమ్మతు చేసిన పాపాన పోలేదు. 6 ఏళ్ల క్రితం ఈ ఘాట్ రోడ్డును కొంతమేర విస్తరించినప్పటికీ ఎలాంటి రక్షణ గోడలు నిర్మించలేదు. అనుకోని సంఘటన ఏదైనా అధిక ప్రాణనష్టం తప్పదని ప్రయాణికులు, జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘాట్ రోడ్లపై గతంలో ఆర్టీసీ బస్సులు ఎన్నోసార్లు ఆగిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయ అంచులవరకూ వెళ్లాయి. పలుమార్లు డ్రైవర్ల అప్రమత్తతతో పెను ప్రమాదాలే తప్పాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఘాట్రోడ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. -
శివయ్యా.. బతికించావయ్యా..!
దోమలపెంట(అచ్చంపేట) : శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు రాకపోవడం తో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. శివయ్యా.. బతికించావయ్యా.. అంటూ ప్రయాణికులు ఊపరిపి పీల్చుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ప్రాం తంలో కుండపోత వర్షం కురిసింది. ఆనకట్ట వద్ద శ్రీశైలం ఘాట్‌రోడ్డులో వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో రోడ్డు ప్రొటక్షనల్ కూలిపోయింది. దీంతో కొండ చరియలు దిగువనున్న ఘాట్ రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. ఎస్పీఎఫ్ సేవలు భేష్ సమాచారం అందుకున్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రం రక్షణ బాధ్యతలు చూస్తున్న ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్) ఎస్ఐలు జి.శ్రీనివాస్, ఎం.రంగయ్య, సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అనంతరం బండరాళ్ల తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రసాద్, పాతాళగంగ అంజిలు సైతం స్పందించి టూరిజం పనులు చేస్తున్న ప్రొక్లయిన్తో రోడ్డుపై అడ్డంగా పడిన బండరాళ్లను తీయించారు. వీటిని తీయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వస్తున్న వాహనాలన్నింటిని ఈగలపెంట వద్దనున్న జెన్కో గ్రౌండ్లో పార్క్ చేయించారు. జరిగిన సంఘటనను తెలియపరచి కొండచరియలను తొలగించిన తర్వాత పంపించారు. మరోవైపు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలను భూగర్భ కేంద్రం పీఏటీ ప్రాంతం వద్ద నిలిపివేయించారు. రాళ్లను తొలగించిన అనంతరం నెమ్మదిగా ఘాట్‌నుంచి దాటించారు. అనంతరం భూగర్భ కేంద్రం చీఫ్ ఇంజినీర్ మంగేష్‌కుమార్ ఎస్పిఎఫ్ పోలీసులు పర్యాటకులు, భక్తులకు అందించిన సేవలను ప్రశంసించారు. ప్రమాదకరంగా రహదారి ఇదిలాఉండగా కొండచరియలు పడిన ప్రతి సారి రోడ్డుపైనున్న మరో రోడ్డులో కూలిపోయిన రోడ్డు ప్రొటక్షన్ వాల్ క్రమంగా పెద్దదవుతూనే ఉంది. దీంతో రాళ్లు ద్రొర్లుతూ వచ్చి దిగువ రోడ్డుపై పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆనకట్ట ఘాట్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఆర్అండ్బీ అధికారులు యుద్దప్రాతిపదికన స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆకలితో అలమటించిన ప్రయాణికులు ఇదిలాఉండగా అనుకోని విధంగా ట్రాఫిక్ జామ్ కావడంతో మూడు గంటలపాటు ప్రయాణికులు వాహనాల్లో ఇబ్బంది పడ్డారు. ఈగలపెంటలో పర్యాటకులు, భక్తులు వాహనాలు, ఆర్టీసి బస్సులను నిలిపివేయడంతో నిరీక్షించాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న హోటళ్లలో టీ, టిఫిన్ అయిపోవడంతో చాలామంది ఆకలితో అలమటించారు. తాగడానికి, సేద తీరడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండడంతో పర్యాటకులు ఇక్కట్ల పాలయ్యారు. -
తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం.
-
తిరుమలలో ప్రమాదకరంగా మారిన ఘాట్ రోడ్లు
-
బస్సెక్కాలంటేనే.. భయం భయం
12 లక్షల కి.మీ.లకు పైబడి తిరిగిన ఆర్టీసీ బస్సులు 30 శాతంపైనే ఘాట్‌రోడ్లు, మలుపులు... కానరాని హెచ్చరికలు డ్రైవర్స్ ఏకాగ్రతను దెబ్బతీస్తున్న టిమ్స్ ఓవర్ టైంల పేరుతో డబుల్ డ్యూటీలు.. ఒకప్పుడు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖమయం... సుఖవంతం అనేవారు. కానీ ఇప్పుడు గాలిలో దీపమవుతోంది. భయం..భయంగా సాగుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక వైపు కాలం చెల్లిన, కండిషన్ లేని బస్సులు..మరొక వైపు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రాణనష్టానికి దారితీస్తున్నది. అనంతపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమా కాదా అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. విశాఖపట్నం: జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ డిపోల పరిధిలో 1017 బస్సులున్నాయి. వీటిలో 650కు పైగా బస్సులు గ్రేటర్ విశాఖ పరిధిలోనే నడుస్తున్నాయి. ఈ బస్సులు ప్రతిరోజు 6.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. సుమారు లక్షన్నర నుంచి రెండులక్షల మంది వి ద్యార్థులే ఉంటారు. అత్యధిక గి రిజన జనాభా ఉన్న జిల్లా మన ది. ఏజెన్సీలోని పాడేరు, అరకు, చోడవరం, మాడుగుల తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ప్రతి ఏటా వెళ్లే లక్షలాదిమంది పర్యాటకుల్లో ఎక్కువమంది ఆశ్రయించేది ఆర్టీసీ బస్సులనే. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణ ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే... పనిఒత్తిడికి గురవుతున్న డ్రైవర్లు బస్సుల పరిస్థితి ఇలా ఉంటే డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గతంలో 8 గంటలు మాత్రమే పనిచేసే వీరు నేడు 10 నుంచి 12 గంటలు ఏకబికిన డ్రైవింగ్ చేస్తూనే ఉంటున్నారు. పైగా రెస్టాఫ్ డ్యూటీలు చేసే వారికి కూడా రెస్ట్ లేకుండా మర్నాడు మళ్లీ డ్యూటీ లు వేసేస్తున్నారు. ఉదాహరణకు గతంలో బెంగుళూరు డ్యూటీ ఐదు రోజులుండేది. దీన్ని నాలుగు రోజులకు కుదించేశారు. ఇక కాకినాడ నాన్ స్టాప్ సర్వీసు నడిపే డ్రైవర్లకు అసలు రెస్టే లేకుండా ఉం టుంది. ఇక ఓవర్ టైంలు.. డబుల్ డ్యూటీల తో డ్రైవర్లకు క్షణం తీరిక చేస్తున్నారు. వీటికితోడు కండక్టర్ల స్థానంలో టికె ట్ ఇష్యూ మిషన్స్ (టిమ్స్) ప్రవేశపెట్టడంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పక్క బస్సులు నడుపుతూనే టికెట్లు ఇచ్చుకోవడం, పైగా నిర్ణీత సమయంలోగా డిపోలకు చేరకుంటే క్రమశిక్షణ చర్యలకు గురికావల్సి వస్తుందనే భయంతో డ్రైవర్లు వలన డ్రైవింగ్‌పై ఏకాగ్రత పెట్టలేక ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. ఏ ప్ర మాదం జరిగినా బస్సుల కండిషన్, పని ఒత్తిడిని పక్కదారి పట్టించేందుకు ఈ నెపా న్ని డ్రైవర్లపై నెట్టడం పరిపాటిగా మారుతోం దని కార్మిక సంఘ నేతలు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు, స్కూల్ బస్సుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటున్నాయి. కాలం చెల్లిన వాటిని స్కూల్ బస్సులుగా నడుపుతున్న పలు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. గడిచిన 3 నెలల్లో 21 ప్రైవేటు, స్కూల్ బస్సులను సీజ్ చేయగా, కండిషన్ లేని మరో 30 బస్సులపైగా రవాణా శాఖ కేసులు నమోదు చేసింది. ఆర్టీసీ బస్సులన్నీ కండిషన్లోనే ఉన్నాయని, 12 లక్షల కి లోమీటర్ల పైబడి నడిచిన బస్సులను తొలగిస్తామని ఆర్టీసీ ఆర్ఎం జగదీష్‌బాబు తెలిపారు. ఒకప్పుడు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖమయం... సుఖవంతం అనేవారు. కానీ ఆ ప్రయాణం భయం..భయంగా సాగుతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఒక వైపు కాలం చెల్లిన, కండిషన్ లేని బస్సులు..మరొక వైపు రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రాణనష్టానికి దారితీస్తుంది. అనంతపురం జిల్లా జరిగిన బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమా కాదా అన్న అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. డొక్కు బస్సులతో చిక్కులు యలమంచిలి: అనంతపురం రోడ్డు ప్రమాదం నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల వల్ల ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ఊడిన బాడీరేకులు, కమాన్‌పట్టీలు, బస్సులో అడుగు భాగాన పడ్డ రంధ్రాలు... ఇలా ఒక్కో డిపోలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పదుల్లోనే ఉంది. ఇవి తరచూ మొరాయిస్తున్నాయి. అప్పుడప్పుడు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక్కో బస్సు 9 లక్షల కిలోమీటర్లు నడపాలి. ఇటీవల దీనిని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సు 12 లక్షల కిలోమీటర్లు నడపాలి. కాలపరిమితి పూర్తవగానే ఇలాంటి బస్సులను సంబంధిత ఆర్టీసీ వర్క్‌షాపునకు పంపాలి. అక్కడ ఇలాంటి కాలం చెల్లిన బస్సులను ధ్వంసం చేసి ఇంజిన్, ఇతర విడిభాగాలను విక్రయిస్తారు. వాటి స్థానంలో కొత్త బస్సులను డిపోలకు పంపిస్తారు. ఇపుడీ ప్రక్రియ ఏమాత్రం సజావుగా సాగడం లేదు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పల్లె వెలుగు, మెట్రో, పాసింజర్ బస్సులు అనేకసార్లు ఆగిపోయాయి. వీటికి మరమ్మతు చేపట్టేవరకు, లేదా వేరొక బస్సులోకి ప్రయాణికులను ఎక్కించే వరకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల యలమంచిలి బస్‌కాంప్లెక్స్‌లో విశాఖ - యలమంచిలి మెట్రో బస్సు ఆగిపోయింది. దీనికి మరమ్మతు పనులు చేపట్టినప్పటికీ స్థానికుల సహాయంతో గంటసేపు అటు ఇటు నెట్టితే తప్ప ఇంజన్ స్టార్ట్ కాలేదు. ఇక పల్లె వెలుగు బస్సుల సంగతి సరేసరి. అవి ఎప్పుడు ఆగిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. మూడేళ్లలో 37 ప్రమాదాలు ద్వారకానగర్: విశాఖ రీజియన్‌కు సంబంధించి మూడు సంవత్సరాలలో 37 ప్రమాదాలు జరిగాయి. సూపర్ డీలక్స్, డీలక్స్, లగ్జరీ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయని విశాఖపట్నం డిపో మేనేజర్ అల్లాడ గంగాధర్‌రావు తెలిపారు. అనంతపురం ప్రమాదం నేపథ్యంలో గురువారం ఆర్టీసీ అధికారులు బస్సుల భద్రతపై సమీక్ష నిర్వహించారు. వేగాన్ని పెంచకుండా పరిమిత హాల్ట్‌లతో ప్రయాణికులను సకాలంలో గమ్యాలకు చేర్చాలన్నది అధికారుల సరికొత్త వ్యూహం. దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ సర్వీసులన్నింటి వేగాన్ని గంటకు వంద కిలోమీటర్లకు నియంత్రించారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వేగం కంటే భద్రతకే అధిక ప్రాధాన్యతమిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జరిగిన ప్రమాదాలివీ... ఏడాదిన్నర క్రితం అరకు నుంచి విశాఖపట్నం వచ్చే డీలక్స్ బస్సు ఘాట్ రోడ్డు నుంచి కిందపడి ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. గత ఏడాది హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి లోనైంది. పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోల్లో ఎక్కువగా పాడైపోయిన డొక్కు బస్సులను లోతట్టు ప్రాంతాలకు మాత్రమే పరిమితం చే స్తున్నారు. దీంతో అవి బయలు దేరిన వేళా విశేషం బాగుంటే సక్రమంగా తిరిగి వస్తాయి...లేకపోతే ఎక్కడ ఆగిపోతాయో ఎలాంటి ప్రమాదాలకు గురవుతాయో తెలియని పరిస్థితి. సిటీ పరిధిలో తిరిగే సాధారణ సిటీ బస్సుల్లో 45 శాతం కండిషన్ బాగులేనివే. వాల్తేరు, సింహాచలం, గాజువాక డిపోల్లో ఎక్కువగా ఉన్నాయి. ఘాట్ రోడ్డులో దేవుడే దిక్కు పాడేరు: ఏజెన్సీ రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రయాణం భయానకంగా మారింది. పాడేరు నుంచి సీలేరు వరకు పోయే రోడ్డులో కొక్కిరాపల్లి, జీకేవీధి నుంచి సీలేరు పోయే 50 కి.మీ రోడ్డు పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడలు కూడా ధ్వంసమవడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు పోయే ఘాట్ రోడ్డులో కూడా పలు చోట్ల రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. ఏసు ప్రభువు విగ్రహం ఉన్న మలుపు వద్ద రక్షణ గోడతోపాటు రోడ్డు కోతకు గురవడంతో ఏడాది నుంచి ఇక్కడ భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో సర్వీసు చేస్తున్న పాడేరు డిపోకు చెందిన 40 ఆర్టీసీ బస్సుల్లో 22 తరచు మరమ్మతులకు గురవుతున్నాయి. ఘాట్ రోడ్లపై 6 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో కొత్తబస్సులను రప్పించాలనే నిబంధనలను ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ బస్సులు నడవని ప్రధాన రోడ్లలో గిరిజనులంతా ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ప్రైవేటు జీపుల ఆపరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా 15 మంది ప్రయాణించాల్సిన జీపుల్లో 30 నుంచి 40 మంది వరకు ఎక్కించుకొంటున్నారు. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి -
భద్రత పై భక్తుల ఆందోళన
-
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ మంటలు
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ మంటలు చెలరేగాయి. శేషాచల అడవుల్లోని తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 35వ మలుపు సమీపంలోని చిట్టడుగు అటవీప్రాంతంలో మంటలు చెలరేగినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. గతంలో శ్రీవారి మెట్టుకు సమీపంలోని నారాయణ గిరి పర్వత శ్రేణుల్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
తిరుమల ఘాట్‌లో విరిగిన కొండచరియలు
సాక్షి,తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా ఆదివారం రాయలసీమలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుమలలో రెండు రోజులుగా వర్షం కుస్తుండడంతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 7.20గంటల ప్రాంతంలో చివరి మలుపు వద్ద సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బండరాళ్లు రోడ్డుపై పడిపోవడంతో ఘాట్‌రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది కూలీల సహాయంతో రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.