
తిరుమల ఘాట్‌లో విరిగిన కొండచరియలు
సాక్షి,తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా ఆదివారం రాయలసీమలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుమలలో రెండు రోజులుగా వర్షం కుస్తుండడంతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 7.20గంటల ప్రాంతంలో చివరి మలుపు వద్ద సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బండరాళ్లు రోడ్డుపై పడిపోవడంతో ఘాట్‌రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది కూలీల సహాయంతో రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.