సాక్షి, తిరుపతి: గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది.
చదవండి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్టు మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. టన్నుల బరువున్న కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడానికి కష్టతరంగా మారింది. మరోపక్క ఘాట్ రోడ్డులో కూడా అనేక ప్రాంతాలలో కొండచరియలు పడిపోవడంతో వీటిని తొలగించే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. మరిన్ని రోజులు నడకదారులను టీటీడీ మూసివేయనుంది. తిరుమల ఘాట్‌రోడ్డులో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment