ghat road
-
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
తిరుమల: ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
సాక్షి, తిరుమల: తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపైన బండ రాళ్లు పడటంతో జేసీబీ సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి వద్ద భారీ వర్షాలకు కొండచరియలు రోడ్డుమీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జేసీబీ సాయంతో ఘాట్ రోడ్ సిబ్బంది బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
పవన్ తిరుమల పర్యటనలో ఓవరాక్షన్.. భక్తుల ఇబ్బందులు
సాక్షి, తిరుపతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు హడావిడితో అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలనూ ఆపేశారు. దీంతో చాలాసేపు భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందిమంగళవారం పవన్ పర్యటన నేపథ్యంలో.. తిరుమల వెళ్లే ఘాట్ రోడ్‌లోని వాహనాలను అధికారులు నిలిపివేశారు. సుమారు అరగంటకు పైగా ఆపేయడంతో భక్తులు అసహనానికి లోనయ్యారు. పవన్ వెళ్లిన చాలా సేపటి తర్వాత వాహనాలను అనుమతించారు. ‘‘గతంలో ఎందరు నేతలు వచ్చినా.. ఇలాంటి అనుభవం మాత్రం ఎదుర్కొలేదు’’ అని కొందరు భక్తులు అంటున్నారు.ఇక లడ్డూ వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్.. రేపు తిరుమలలో దానిని విరమించే అవకాశం ఉంది. ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో పవన్ పాల్గొంటారు. కోర్టు వ్యాఖ్యలపై.. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ పరిణామంపై పవన్ స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు. తనకు ఉన్న సమాచారం మేరకే సుప్రీం కోర్టు అలా వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ఎక్కువ మాట్లాడను అని అన్నారు.ఇదీ చదవండి: బాబు ఫోకస్ అంతా అక్కడే ఇక! -
మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. టెంపో-మినీ లారీ ఢీ
సాక్షి, చిత్తూరు జిల్లా: బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్‌ను మినీ లారీ ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారి దిగువకు టెంపో దూసుకుపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను బంగారు పాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కర్ణాటక రాష్ట్రం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా మొగిలి ఘాట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్‌లో స్పీడ్ బ్రేకర్స్ వద్ద మీనీ లారీ బలంగా ఢీ కొట్టింది.ఈ నెల 13 న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో మొగిలి ఘాట్ రోడ్డులో హైవే ప్రమాదాలు నివారణకు వేసిన స్పీడ్ బ్రేకర్స్‌పై వేగంగా వెళ్లడంతో ఈ రోజు మరో ప్రమాదం సంభవించింది. -
చిత్తూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కనుమ రహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: విజయవాడలాగే.. ఏలూరు వరదలు మ్యాన్ మేడ్! -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షల సడలింపు
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు. వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిఆలయ సమీపంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి విమానం మరోమారి వెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30, 8.15 గంటల సమయంలో విమానాలు ఆలయం పైభాగాన సమీపంలో వెళ్లాయి. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. అయితే తరచూ తిరుమల పైభాగంలో పలు విమానాలు వెళుతున్నాయి. ప్రస్తుతం విమానాలు తిరుమలపై వెళ్లడంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. -
విమర్శలకు భయపడం.. భక్తుల భద్రతే ముఖ్యం: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండు నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని తెలిపారు. నడక దారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. విమర్శలకు భయపడమని, చిత్తశుద్ధితో భక్తులకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి టీటీడీ చైర్మన్ భూమన చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చిరుత కొనసాతుందని పేర్కొన్నారు. రాత్రి పన్నెండు.. ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని, తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని భూమన అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, ఈ కారణంగానే నేడు అయిదో చిరుతను పట్టుకున్నట్లు చెప్పారుజ నడక దారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించాలని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా తమ ఎన్నో అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని విమర్శించారు. కర్రలు ఇస్తామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలు దొరికాయని, అంతకు ముందు ఒక చిరుత బోనులో చిక్కిందని గుర్తు చేశారు. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో తెలియజేసేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని చైర్మన్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని తెలిపారు. విమర్శలకు, జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి లేదని విమర్శకులను హెచ్చరించారు. కాగా తిరుమలలో కాలిబాటన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా మరో చిరుతపులిని బంధించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. వేకువజామున 12 నుంచి 1 గంట మధ్యలో బోన్లో చిక్కుకున్నట్లు అటవీశాఖ అధికారుల చెప్పారు. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారం గుర్తించిన అధికారులు పట్టుకోవడానికి బోన్ పెట్టగా.. నేడు చిక్కుకుంది. దానిని ఎస్వీ జూపార్క్ తరలించారు. -
తిరుమల కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు
తిరుమల: ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు చేపట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత నడక దారిలో భక్తులను అనుమతించకూడదని నిర్ణయించింది. అదే విధంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. మధ్యాహ్నం 2 గంటల తరువాత చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులను నడక దారిలో అనుమతించరు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్లో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్దలకు మాత్రమే అలిపిరి కాలినడక మార్గంలో అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు వైపు కాలినడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దలను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. శనివారం నుంచి రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల తరువాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం నడక మార్గం, ఘాట్ రోడ్లలో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ చిరుతలు పెరిగినట్టు అటవీ అధికారులకు సమాచారం అందుతోంది. శనివారం కూడా నడక మార్గం, ఘాట్ రోడ్లలోని చిరుతల సంచారం గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలు, గాలి గోపురం నుంచి ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించారు. రెండో ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో భక్తులను అప్రమత్తం చేశారు. 13టీఎమ్ఎల్50: నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిన్నారులకు ట్యాగ్లు వేస్తున్న పోలీసులు చిన్నారుల రక్షణకు ట్యాగ్లు అలిపిరి నుంచి తిరుమల నడక దారిలోని అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెర గడం, దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు రక్షణ చర్యలను చేపట్టారు. ఆదివారం నుంచి అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు ట్యాగ్లు వేస్తున్నారు. ట్యాగ్లు వేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోయినా సులభంగా కనిపెట్టేందుకు వీలవుతుంది. ట్యాగ్‌పై చిన్నారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ నమోదు చేసి ఉంటాయి. -
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌పై రాకపోకలు బంద్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భక్తుల రాకపోకలను నిలుపుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండపై ఉన్న రాళ్లు మెత్తబడటంతో మంగళవారం రాత్రి కొండపై నుంచి చిన్నపాటి రాళ్లు ఘాట్ రోడ్‌పై జారి పడ్డాయి. కొండ చరియలు విరిగి కింద పడకుండా ఘాట్ రోడ్లో కొండ చుట్టూ మెష్ ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలుగా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో దర్భముళ్ల భ్రమరాంబ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుమల రెండో ఘాట్ లో రోడ్డు ప్రమాదం
-
ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: టీటీడీ ఈవో
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ రోడ్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరు సుందర తిరుమల-శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి. 'ఇందుకోసం జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. టీటీడీ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. 'తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. తద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాము. టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీ లోని అన్ని విభాగాల ఆధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజుల్లో 15,441 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 13,351 మంది కార్పొరేషన్ సిబ్బంది, 6 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, పోలీస్, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక దార్లలో పారిశుద్ధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మే 13వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణగారు సైతం తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు' అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదీ చదవండి:అధైర్యపడొద్దు..అండగా ఉంటాం 'తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశాము. ట్యాక్సీ డ్రైవర్లు, వాహనదార్లు డ్రైవింగ్ చేసే సమయంలో టీటీడీ నిర్ణయించిన వేగం మేరకే నిదానంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో , ఓవర్ టేక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి' అని ఈవో ధర్మారెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించింది. ఈ భూమిలో దాత, రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించనున్నారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు భక్తులు పాల్గొంటారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మే 31వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 3 నుండి 8వ తేదీ వరకు టీటీడీ నిర్వహిస్తోంది. 8వ తేదీ జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదీ చదవండి:శరవేగంగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం శ్రీ పద్మావతి హృదయాలయంలో 20నెలల వ్యవధిలోనే 1450 మంది చిన్నారులకు ఉచితంగా గుండె అపరేషన్లు నిర్వహించారు . క్లిష్టమైన గుండె అపరేషన్లు కూడా ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ స్కీంల కింద, ప్రాణదానం ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మూడు గుండెమార్పిడి ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 'టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ఐటి విభాగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోస పోవద్దు' అని ఈవో ధర్మారెడ్డి భక్తులను కోరారు. మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 23.38 లక్షలుకాగా, హుండీ కానుకలు రూ.109.99 కోట్లు ఆదాయం లభించింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ఒక కోటి 6 లక్షలు కాగా, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 56.30 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11 లక్షలు. ఇదీ చదవండి:మేనిఫెస్టో చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే కాగితం: కొమ్మినేని -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బస్సు బోల్తా
సాక్షి, తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే బస్సులో ఇద్దరూ ప్రయాణికులు మాత్రమే తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నారు.. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరూ ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో విధులు ముగించుకుని తిరుపతికి ప్రయాణమైన ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ బస్సులో ఉండడంతో వెంటనే స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు వచ్చారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. బస్సును తొలగించి, ట్రాఫిక్ని పోలీసులు క్రమబద్ధీకరించారు. చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’ -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల: ఘాట్ రోడ్డులో కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సాక్షి, తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో రెండో మలుపు వద్ద ఆగిఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. -
యాదాద్రి మూడో ఘాట్ రోడ్డులో రాకపోకలు
యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డును మరమ్మతుల కోసం మూసివేయడంతో.. అధికారులు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను మూడో ఘా ట్‌రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. కొండపైకి వెళ్లే రోడ్డు మధ్యలో ట్రాఫిక్ పోలీసులు సూచిక బో ర్డులను ఏర్పాటు చేశారు. రెండో ఘాట్ రోడ్డు ను కూడా మరమ్మతుల కోసం ఇప్పటికే మూ సివేశారు. దీంతో ఒకే మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
10 నుంచి తిరుమల రెండో ఘాట్ రోడ్డు సిద్ధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత నెలలో పెనుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న తిరుమల ఎగువ(రెండో) ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పదో తేదీకల్లా ఘాట్ రోడ్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్లలో తిరుమలలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ ఒకటో తేదీ తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద పెట్టున కొండ చరియలు విరిగిపడి నాలుగు చోట్ల ఎగువ ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం ఆ రోడ్డులో రాకపోకలను నిలిపేసి యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. లింక్ రోడ్డును తెరచి తిరుమలకు వెళ్లే వాహనాలను ఆ రోడ్డు మీదుగా మళ్లించింది. మరోవైపు నిరంతరాయంగా పునర్నిర్మాణ పనులను చేపట్టింది. 12, 14, 15, 16 కి.మీ. వద్ద దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునర్నిర్మాణ పనులను తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న ఆఫ్కాన్ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే ఆ సంస్థ సైడ్ వాల్స్ నిర్మాణాలను పూర్తి చేసింది. కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న చోట రాక్ బోల్ట్ టెక్నాలజీతో చేపట్టిన మెష్‌ల నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ నెల 10న రెండో ఘాట్ రోడ్డును తిరిగి వినియోగంలో తెస్తామని టీటీడీ ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో చెప్పారు. -
నెలాఖరులోపు ఘాట్‌రోడ్డు మరమ్మతులు పూర్తి
తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని, వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలను చైర్మన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షానికి పెద్ద బండరాళ్లు పడినా స్వామివారి దయవల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. పడిన బండరాళ్లను పూర్తిస్థాయిలో తొలగించామని, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఘాట్ రోడ్డులో 7, 8, 9, 14, 15 కిలోమీటర్ల వద్ద త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ నిపుణుల సహకారంతో ఘాట్ రోడ్డులో బండరాళ్లు పడే ఇతర ప్రాంతాలను సైతం గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పనులన్నింటినీ ఈ నెలాఖరుకు పూర్తి చేసి రెండో ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చైర్మన్ వెంట టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, వీజీవో బాలిరెడ్డి, ఈఈ సురేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ రమణ తదితరులు ఉన్నారు. -
కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
తిరుమల: భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత వర్సిటీ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది. ల్యాండ్‌స్లైడ్స్ నిపుణులు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకుని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు. అమృత వర్సిటీ స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్, టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
తిరుమల ఘాట్ రోడ్లలో కొండచరియల పరిశీలన
తిరుమల: ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, రెండో ఘాట్ రోడ్లో కొండచరియలను ఢిల్లీ ఐఐటీ నిపుణులు కేఎస్ రావు, చెన్నై ఐఐటీ నిపుణులు శ్రీ ప్రసాద్, టీటీడీ పూర్వపు చీఫ్ ఇంజనీర్, సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి బృందం గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. కేఎస్ రావు మాట్లాడుతూ .. ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఘాట్ రోడ్లకు ఇరువైపులా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి బండరాళ్లకు ఫెన్సింగ్, రాక్ బోల్టింగ్, షాట్ క్రీటింగ్, బ్రస్ట్ వాల్స్ ఏర్పాటు చేసిందన్నారు. శేషాచల కొండల్లో, ఘాట్ రోడ్లలో వర్షపు నీరు నిలువకుండా వెళ్లడానికి అదనపు కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు. ప్రస్తుతానికి రెండో ఘాట్ రోడ్డులో అక్కడక్కడా మరమ్మతులు చేసి లింక్ రోడ్డు ద్వారా మోకాళ్ల మెట్టు చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు చేరుకోవచ్చన్నారు. రెండు, మూడు రోజుల్లో టీటీడీకి సమగ్ర నివేదిక అందజేస్తామని తెలియజేశారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తిరుమల నడకదారిలో విరిగిపడ్డ కొండచరియలు
సాక్షి, తిరుపతి: గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది. చదవండి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్టు మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. టన్నుల బరువున్న కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడానికి కష్టతరంగా మారింది. మరోపక్క ఘాట్ రోడ్డులో కూడా అనేక ప్రాంతాలలో కొండచరియలు పడిపోవడంతో వీటిని తొలగించే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. మరిన్ని రోజులు నడకదారులను టీటీడీ మూసివేయనుంది. తిరుమల ఘాట్‌రోడ్డులో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. -
తిరుమలలో భారీ వర్షాలు.. రెండు ఘాట్‌రోడ్లు మూసివేత
-
తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడిన భారీ వృక్షాలు
-
యాదాద్రిలో యాలీ పిల్లర్లపై వైకుంఠ ద్వారం
యాదగిరిగుట్ట: ప్రపంచస్థాయి పుణ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదం కలిగించే విధంగా వైటీడీఏ అధికారులు, శిల్పులు కృషి చేస్తున్నారు. యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తులు మొదటగా పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద మొక్కులు చెల్లించుకొని మెట్ల మార్గాన, ఘాట్ రోడ్డు గుండా కొండకు చేరుకునేవారు. అయితే రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతన వైకుంఠ ద్వారాన్ని తొలగించిన అధికారులు.. నూతనంగా ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని (వైకుంఠద్వారం) అద్భుతంగా నిర్మించారు. ఈ ద్వారానికి రెండు వైపులా మెట్లు నిర్మించి భక్తులు కొండపైకి కాలినడకన వెళ్లేందుకు వీలు కల్పించారు. యాలీ పిల్లర్లపై వైకుంఠ ద్వారాన్ని నిర్మించడం భక్తులను ఆకట్టుకుంటోంది. యాలీ పిల్లర్లపై భాగంలో సింహాలు, పిల్లర్లకు ఐరావతాలు, నృసింహుడి అవతారాలను తీర్చిదిద్దారు. వీటితో పాటు శంకు, చక్ర, నామాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం) ఆకట్టుకుంటున్న యాదాద్రి పచ్చందాలు ఓ వైపు ఆధ్యాత్మిక రూపాలు.. మరోవైపు పచ్చని పచ్చందాలతో యాదాద్రీశుడి సన్నిధి అద్భుతంగా ముస్తాబవుతోంది. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ అధికారులు పూల మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయానికి దక్షిణ దిశలో కొండ దిగువ భాగంలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా వివిధ రకాల మొక్కలతో లాన్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులు నడిచే విధంగా స్టోన్ ఫ్లోరింగ్ వేశారు. వీటి మధ్యలో సైతం గ్రీనరీ ఏర్పాటు చేయడంతో అద్భుంతంగా కనిపిస్తుంది. -
యాదాద్రి: రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
-
రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండా చరియలు
-
తిరుమలలో రెండుచోట్ల చిరుత సంచారం.. భక్తుల హడల్
సాక్షి, తిరుపతి: తిరుమలలో చిరుత పులుల సంచారం మరోసారి కలకలం రేపింది. శుక్రవారం రెండవ ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం దాటాక వాహనానికి అడ్డంగా చిరుత పరుగులు తీసింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురైయ్యారు. ఘాట్ రోడ్డులో అందాలను తమ సెల్ ఫోన్ చిత్రీకరిస్తూ ఉండగా హఠాత్తుగా చిరుత కనిపించింది. వెంటనే సెల్ పోన్ ఆఫ్ చేసి వాహనానికి అద్దాలు మూసి అక్కడ నుండి వెళ్లిపోయారు భక్తులు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాహన దారులను అప్రమత్తం చేశారు. అలాగే తిరుమలలోని సన్నిధానం అతిథిగృహం వద్ద వేకువజామున చిరుత హల్చల్ చేసింది. సన్నిధానం వద్ద గల రెస్టారెంట్ సమీపంలోని పందులను వేటాడేందుకు చిరుత వచ్చింది. అయితే చిరుత రాకను గుర్తించిన రెస్టారెంట్ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా సన్నిధానం అతిధి గృహం వద్ద తరచూ చిరుత సంచరిస్తున్నట్టు భక్తులు, టీటీడీ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సన్నిధానం అతిథిగృహం వద్ద కనిపించిన చిరుతే.. ఘాట్ రోడ్డులోదా? లేక రెండూ వేర్వేరా అనేది తెలియాల్సి ఉంది. -
రాయిని తొలచి.. రావి ఆకుగా మార్చి..
యాదగిరిగుట్ట: ఎక్కడ చూసినా ఆహా.. అనిపించే అందాలు. ఆహ్లాదాన్ని కలిగించే ఆకుపచ్చని మొక్కలు.. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు.. రంగురంగుల పూల మొక్కలతో కనువిందు చేసే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, చుట్టు పక్కల పరిసరాలను వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కొండకు వెళ్లే మార్గంలోని రెండో ఘాట్ రోడ్డు కింది భాగంలో, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఆనుకొని ఉన్న భారీ రాయిని తొలచి దానిని రావి ఆకు మాదిరిగా మార్చారు. ఎకరం పైగా స్థలంలో ఉన్న ఈ రాయిని 27 గుంటల్లో తొలచి దాని చుట్టూ భారీ రావి ఆకుగా తీర్చిదిద్దారు. ఈ రావి ఆకు ఆకారంలో పూణె నుంచి తీసుకొచ్చిన గులాబీ, తెలుపు రంగులో ఉన్న సుమారు 12వేల పూల మొక్కలు నాటుతున్నారు. చుట్టు ఆకు మాదిరిగా ఉన్న డిజైన్‌లో గ్రీనరీతో కూడిన లాన్ ఏర్పాటు చేయనున్నారు. చదవండి: కరోనా ‘వల’కు చిక్కొద్దు..! కుర్రారంలో కాలాముఖ దేవాలయం -
విశాఖ ఏజెన్సీ ఘాట్ రోడ్డులో దుండగుల హల్చల్
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధి ధారాలమ్మ ఘాట్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దుండగులు అరాచకం సృష్టించారు. ఆలయం సమీపంలోని రెండో మలుపు వద్ద దారి కాచి, అటుగా వచ్చిన కార్లపై దాడి చేసి బంగారం, నగదు, సెల్ ఫోన్లు దోచుకున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ అందించిన వివరాలు.. మంగళవారం రాత్రి పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు సీలేరులో సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి రాత్రి 9 గంటలకు తిరిగి చింతపల్లికి కారులో వెళుతున్నారు. ధారాపురం ఘాట్‌రోడ్డు వద్ద రాత్రి 11.30గంటల సమయంలో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు వచ్చి కారును అడ్డగించారు. అనుమానం వచ్చి వేగంగా వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఆయన తప్పించుకుని వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో పాల్వంచ నుంచి సీలేరు మీదుగా లంబసింగికి కారులో ఐదుగురు వెళుతుండగా.. నాటు తుపాకులు, కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు దోచుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన కారు అద్దాలు అది జరిగిన మరో అరగంటలో సీలేరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యాపారి.. భార్య ఈశ్వరమ్మతో కలిసి కారులో వెళ్తుండగా ఐదుగురు వచ్చి.. తాము పోలీసులమని, తనిఖీలు చేయాలని చెప్పారు. కారు అద్దాలు దించేలోగా ఇద్దరి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసులను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. వెనుక నుంచి బస్సు వస్తుండటంతో దుండగులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారంతా ఒడిశాకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమల నడకదారి,ఘాట్ రోడ్డు మూసివేత
-
‘ఘాట్’ గా స్పందనేదీ..?
సాక్షి, రాజంపేట: అదిగో అల్లదిగో అంటూ శ్రీవారిని స్మరిస్తూ .. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితా పితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట ఇది. మూడవ ఘాట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా తెరపైకి వచ్చినా నాటి ప్రభుత్వాలు, టీటీడీ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ బాట అభివృద్ధి అటకెక్కింది. శ్రీ వేంకటేశ్వరస్వామిపై 32వేల సంకీర్తనార్చనలు చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన మార్గాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని విస్మరిస్తూ వస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ దారిలో తిరుమలకు నడిచి వెళుతున్న భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. మార్గం తీరు ఇలా.. కడప–రేణిగుంట జాతీయర రహదారిలో కుక్కలదొడ్డి నుంచి తుంబరతీర్థం మీదుగా తిరుమలకు అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొండకు వెళ్లేందుకు మూడురోజులు పడుతుంది. కుక్కలదొడి సమీపంలోని మామండూరు మీదుగా అటవీ మార్గం నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన మార్గంలో కొంచెం అటు ఇటుగా తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులుతిరుమలకు చేరుకుంటున్నారు. ఒక్క రాజంపేట ప్రాంతంలో నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం అనుకూలం. కొండపైన అన్నమయ్య పార్వేట మండపం వద్ద పాపవినాశనం రోడ్డులో దగ్గరలో ఈ దారి కలుస్తుంది. కాలిబాటలో పాడుబడిన సత్రం శేషాచలం అటవీ ప్రాంతంలో.. అన్నమయ్య కాలిబాట పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతంలో సాగుతుంది. ప్రకృతి రమణీయ, కమనీయ దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ మార్గంలో రోడ్డు వేస్తే తిరుమలకు చేరుకునే భక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులున్నాయి. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధిచేస్తే తిరుమలకు రానుపోను 44 నుంచి 48 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇప్పుడున్న మార్గం ద్వారా 51కిలోమీటర్ల దూరం పడుతోంది. అదే మామండూరు నుంచి తిరుమల మార్గంలో అయితే 23 కిలోమీటర్లే అవుతుంది. దశాబ్ధాలుగా అతీగతీలేదు అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధిని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కుక్కల దొడి లేదా మామండూరు నుంచి తిరుమలకుమార్గం వేస్తే తిరుపతి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన చిత్తూరు జిల్లా వాసుల్లో నెలకొంది. తిరుమల దగ్గర అంశాన్ని అటవీ సంరక్షణ పేరుతో అడ్డుకుంటున్నటులగా ఆరోపణలున్నాయి. అందువల్లే అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయంలోపూర్తి నిర్లక్ష్యవైఖరి కనిపిస్తోంది. కాలిబాట స్వరూపం మామండూరు–బాలపల్లె మధ్య స్వామి పాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతవరణంతో పూర్వం భక్తులు కాలిబాట కొండకు చేరుకుంటుంది. అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటల, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 17వ సారి ఆకేపాటి తిరుమల మహాపాదయాత్ర వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తిరుమల మహాపాదయాత్రను 17వ సారి చేపట్టనున్నారు. ఈనెల 13న శుక్రవారం వేలాది మందితో తిరుమల పాదయాత్ర ప్రారంభించనున్నారు. అదేరోజున ఆకేపాడు లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు. కంకణధారణ, హోమం, భజనలు, అన్నదాన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఆకేపాడు ఆలయాల సముదాయం నుంచి మధ్యాహ్నం 2గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేషనల్హైవే మీదుగా రాజంపేట, రైల్వేకోడూరుకు చేరుకొని అక్కడి నుంచి అటవీమార్గం(మామండూరు)లో తిరుమల చేరుతుంది. గోవిందమాలలు ధరంచి తిరుమలకు కాలిబాటన వెళుతున్న భక్తులు(ఫైల్) అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలి అన్నమయ్య నడిచివెళ్లి శ్రీవారిని దర్శించుకున్న కాలిబాటను పునరుద్ధరించాలని భక్తులతోపాటు తాను దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నాం. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఈ కాలిబాట అభివృద్ధికి బీజం పడింది. అయితే ఆయన మరణాంతరం కాలిబాట అభివృద్ధి అంశం అటకెక్కింది. 17వసారి పాదయాత్రగా ఈ మార్గం గుండా తిరుమల వెళుతున్నాను. భక్తులు పాల్గొని పాదయాత్రను జయప్రదంచేయాలి. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట అన్నమయ్య బాటలో వెళ్లడం మహాభాగ్యం పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే మూడవ ఘాట్‌గా ఉపయోగపడుతుంది. తెలంగాణ, సీమవాసులకు దగ్గరగా ఉంటుంది. ఈ మార్గం అభివృద్ధిపై ఆకేపాటితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు డైరెక్టర్ అటవీప్రాంతం: శేషాచలం తొలినడక:అన్నమాచార్యుడు చరిత్ర: వెయ్యేళ్లు దూరం: 23 కిలోమీటర్లు కాలిబాట ప్రారంభం: మామండూరు–బాలపల్లె మధ్య -
శ్రీశైలం డ్యామ్ చూడటానికి వెళ్తున్నారా?
సాక్షి, శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ శివక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భారీగా తరలివచ్చిన సందర్శకులు, యాత్రికులతో పోటెత్తింది. వరుసగా మూడు రోజులపాటు సెలవు రావడంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 30 అడుగుల పైకెత్తడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను తిలకించడానికి తెలంగాణ ప్రాంతం నుంచి భారీసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఆనకట్ట మీదుగా శ్రీశైలం చేరుకోవడానికి వేలాది వాహనాలు రావడంతో ఘాట్ రోడ్డులో సుమారు 43 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి 2 గంటలకు శ్రీశైలం చేరుకున్నారు. ఫర్హాబాద్ నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అనేకమంది హైదరాబాద్‌కు వెనుదిరిగారు. మిగిలిన వారు శ్రీశైలం చేరుకున్నా మల్లన్న దర్శనానికి నిరీక్షణ తప్పలేదు. శ్రీశైలంలోని ప్రధాన వీధులు, అంతర్గత రహదారులు సైతం భక్తులు, వాహనాలతో కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి ఏడు గంటలకు పైగా సమయం పట్టింది. ప్రత్యేక, అతి శీఘ్రదర్శనాలకు నాలుగు గంటలు పట్టింది. బ్రేక్ దర్శనానికి సైతం రెండు గంటలపాటు క్యూలో వేచి ఉండక తప్పలేదు. శ్రావణ మాసంలో ఒకే రోజున లక్షన్నరకు పైగా భక్తులు శ్రీశైలం రావడం ఇదే ప్రథమమని ఆలయ ఉద్యోగులు తెలిపారు. (చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జలకళాంధ్ర..) శ్రీశైలం డ్యామ్ దగ్గర సందర్శకుల సందడి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విస్తరణకు విస్ఫోటం
సాక్షి, సింహాచలం(పెందుర్తి) : కొండపై కొలువైన వరాహ నారసింహ స్వామిని చేరాలంటే ఘాట్ రోడ్డు ప్రధాన మార్గమన్నది తెలిసిందే. మెట్ల మార్గం నడకదారి మాత్రమే కావడంతో వాహనాలకు ఉన్న ఏకైక మార్గం ఘాట్ రోడ్డు ఒక్కటే. ఇంత కీలకమైన మార్గంలో ఒక్క చోట మాత్రం వాహన చోదకులు బెంబేలెత్తే పరిస్థితి ఉంది. అతి ప్రమాదకరంగా ఉన్న మలుపు (అదే వ్యూ పాయింట్ కూడా) వద్ద వాహన చోదకులు దేవుడిపైనే భారం వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరికి వెళ్లేందుకు ఐదు కిలోమీటర్ల పొడవుండే సింహగిరి ఘాట్‌రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద వాహనాలు మలుపు తీసుకోవడం ఓ సమస్యగా ఉండేది. ఈప్రాంతంలో ఒక పక్క పెద్ద రాతి కొండ, మరొక పక్క లోతైన లోయ ఉండడంతో ఈరెండింటి మధ్య గల ఇరుకైన మార్గంలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ముప్పు భయం సంగతి అటుంచితే.. ఒకేసారి ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇక్కడ తప్పించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఈప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. 60 ఏళ్ల మార్గం సింహగిరికి వెళ్లేందుకు 1959 వరకు రోడ్డు మార్గం లేదు. మెట్లమార్గంలోనే భక్తులు వెళ్లి వస్తూండేవారు. ఆలయంలో విధులు నిర్వర్తించే పూజారులు, ఇతర ఉద్యోగులు సైతం ఈమార్గంలోనే వెళ్లి వచ్చేవారు. దీంతో దేవస్థానం అప్పటి అనువంశిక ధర్మకర్త పీవీజీ రాజు ఘాట్‌రోడ్డు వేయాలని సంకల్పించారు. అప్పటి ఈవో డీఎల్ఎన్రాజు తోడ్పడ్డారు. దీంతో 1959 లోనే ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అప్పటి మద్రాస్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన నాగేశ్వర్ అయ్యర్‌తో ఘాట్ రోడ్డు ప్రణాళిక రూపొందించారు. కొండను, చెట్లను తుప్పలను తొలగించి మార్గాన్ని సిద్ధం చేశారు. అనంతరం తారు రోడ్డు పనులను గోపాలపట్నానికి చెందిన సదరం అప్పలనాయుడు అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. ఇలా నాలుగేళ్లలోనే దాదాపు 1963లో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఐదు కిలోమీటర్లు ఉండే ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ నానాటికీ పెరుగుతూ ఉండడంతో రెండేళ్ల కిందట ఇక్కడి మహాత్మా జ్యోతీబా పూలే గురుకుల పాఠశాలవైపు నుంచి రెండో ఘాట్‌రోడ్‌ను దేవస్థానం అధికారులు నిర్మించారు. కానీ ఘాట్‌రోడ్డు మలుపు వద్ద మాత్రం ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. దీంతో కొండను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. నానాటికీ జటిలం పదేళ్ల నుంచి సింహగిరికి భక్తుల సంఖ్య పెరుగుతూ రావడంతో దానికి అనుగుణంగా ఘాట్‌రోడ్డులో వెళ్లే వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఐదేళ్ల వ్యవధిలో భక్తుల సంఖ్య, వాహనాల సంఖ్య మరింతగా పెరిగింది. సింహగిరిపై జరిగే ప్రముఖ ఉత్సవాలైన చందనోత్సవం, ముక్కోటి ఏకాదశి, వార్షిక కల్యాణోత్సవం, గిరిప్రదక్షిణ ఉత్సవం రోజుల్లో మలుపు వద్ద గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. చందనోత్సవం రోజుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు మలుపు వరకు విస్తరిస్తున్నాయి. దాంతో వారి మధ్య నుంచి బస్సులు నడిపించడం మరీ దుర్లభంగా మారుతోంది. ఈ పరిణామం భక్తులను మరింతగా భయపెడుతోంది. అంతే కాక స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రముఖుల వాహనాలు కూడా ఈప్రాంతంలో ఇరుక్కుపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలుపు వద్ద రోడ్డు విస్తరణకు దేవస్థానం ఎంతో కాలంగా కసరత్తు చేస్తోంది. ఎన్నోసార్లు తెరపైకి.. మలుపు దగ్గర నెలకొన్న క్లిష్ట పరిస్థితిని నిశితంగా పరిశీలించిన దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సీపీ మహేష్‌చంద్ర లడ్డా మలుపు వద్ద కొండలో కొంత భాగాన్ని తొలగించడం ఒక్కటే శరణ్యమని గతంలో భావించారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. నిజానికి 2008 లోనే తొలిసారిగా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ అది కార్యరూపం ధరించలేదు. అప్పటి నుంచి అనేకసార్లు ప్రణాళిక తెరపైకి రావడం, కనుమరుగు కావడం ఆనవాయితీగా జరిగేది. అవసరమైన అనుమతులపై సందిగ్థత నెలకొనడంతో ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు పదకొండేళ్ల తర్వాత ఇప్పుడు పనులు మొదలయ్యాయి. రెండు దశల్లో ప్రణాళిక ప్రమాదకర మలుపు వద్ద కొండను రెండు దశల్లో తొలగించి విస్తరించాలని సింహాచల దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో దాదాపు 75 మీటర్ల పొడవు, సుమారు పది అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు మేర కొండను తొలగించాలని నిర్ణయించారు. ఇటీవల పనుల నిమిత్తం టెండర్లు పిలిచారు. లైసెన్స్ బ్లాస్టర్గా నమోదైన వై.వి.కన్స్ట్రక్షన్స్(విశాఖపట్నం)కు పనులను అప్పగించాలని, ఇందుకు రూ. 10 లక్షలు వెచ్చించాలని అప్పగించారు. పనులకు అనుమతివ్వాలని నగర పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టారు. అన్ని అనుమతులూ రావడంతో గడిచిన శుక్రవారం నుంచి కొండను తొలగించే పనులు చేపట్టారు. రోజూ 150 క్యూబిక్ మీటర్ల మేర రాళ్ల తొలగింపు మలుపు వద్ద కొండను రోజుకి 150 క్యూబిక్ మీటర్ల మేర తొలగిస్తున్నారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా అంతకన్నా ఎక్కువ తొలగించకూడదని నిర్ణయించారు. మలుపు వద్ద లోయకు ఒక వైపు మెట్ల మార్గం ఉండడం ఒక కారణమైతే.. ఎక్కువ పరిమాణంలో కొండను తొలగిస్తే ఉదయం భక్తుల దర్శన సమయానికి రాళ్లను క్లియర్ చేయలేని పరిస్థితి ఉండడం రెండో కారణం. రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి బ్లాస్టింగ్ పనులు చేపడుతున్నారు. విస్ఫోటం తర్వాత ఘాట్ రోడ్డుపై పడే కొండ రాళ్లను వెంటనే తొలగిస్తున్నారు. ఈపనుల దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచే ఘాట్ రోడ్డు లోను, మెట్లమార్గంలో భక్తులను, లేదా వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి ఏడు గంటలకే దర్శనాలు నిలిపివేస్తున్నారు. బాంబ్ బ్లాస్టింగ్ జరిగే సమయంలో టోల్గేట్ల ప్రవేశం వద్ద, మెట్ల మార్గం వద్ద సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతున్నారు. బ్లాస్టింగ్ చేసే సమయం ముందు మైకుల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈనెల 10 వరకు బ్లాస్టింగ్ పనులు జరగనున్నాయి. ‘నియంత్రిత’ విస్ఫోటం కొండకు ముక్కలు చేసేందుకు బాంబులు పేల్చాలని నిర్ణయించి ఇందుకు కంట్రోల్ బ్లాస్టింగ్ సిస్టంను అనుసరించడానికి వ్యూహం సిద్ధం చేశారు. ఈ పద్ధతిని సెకెండరీ కంట్రోల్ బ్లాస్టింగ్ లేదా జాకీ హోల్స్ బ్లాస్టింగ్ అని కూడా అంటారు. రాతి స్థితిని బట్టి తొలగించాల్సిన కొండకు డ్రిల్లింగ్ యంత్రంతో ఎనిమిది అడుగుల లోతుకు రంధ్రాలు చేసి బాంబ్ స్టిక్స్‌ను అమరుస్తున్నారు. రంధ్రాల్లో 25 సెంమీ లావు, 10 సెంమీ పొడవు ఉండే బాంబులను అమరుస్తున్నారు. ఎంతమేర కొండని తొలగించాలో దానికి సరిపడా బాంబులను అమరుస్తున్నారు. విస్ఫోటం కారణంగా రాళ్లు భారీ ఎత్తున కిందికి తుళ్లకుండా, ఎగరకుండా ఒక్కొక్కటి 1200 కిలోల బరువు ఉండే నాలుగు టైర్ మ్యాట్లను క్రేన్ సాయంతో కొండపై వేస్తున్నారు. దాదాపు రెండు వందల మీటర్ల దూరం వరకు వైర్లు లాగి మైనింగ్ మెగ్గరు బాక్స్ సాయంతో కొండని పేల్చుతున్నారు. దీని వల్ల 10 మీటర్ల లోపు లేదా దాని కన్నా తక్కువ పరిధిలోనే రాళ్లు పడతాయని ప్రస్తుతం పనులు చేస్తున్న లైసెన్స్డ్ బాంబ్ బ్లాస్టర్ టి.ప్రసాద్ తెలిపారు. ప్రమాద మలుపు వద్ద విస్తరణ జరిగే ప్రదేశానికి ఒక వైపు ఉన్న లోయ భాగంలోనే మెట్ల మార్గం ఉండటంతో అటు రాళ్లు ఎగిరిపడే ప్రమాదం ఉందని, అందుకే కంట్రోల్ బ్లాస్టింగ్ సిస్టంను ఉపయోగిస్తున్నామని తెలిపారు. కొండకి వైర్లు అమరుస్తున్న బాంబ్ బ్లాస్టర్స్ -
ఈ ప్రయాణం ప్రమాదకరం
సాక్షి, భాకరాపేట : తిరుపతి–బళ్లారి జాతీయ రహదారి మార్గంలోని భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తే వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఒకప్పడు తిరుపతి–బళ్లారి రహదారి మార్గం ఎన్‌హెచ్ 205 నుంచి ప్రస్తుతం ఎన్‌హెచ్ 7గా మారింది. అంటే ఈ రహదారి మార్గంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కన్యాకుమారి–వారణాసికి వెళ్లే వాహనాలు సైతం ఈ రహదారిని ఎంచుకోవడంతో మరింత రద్దీ పెరిగింది. అందుకు తగువిధంగా జాతీయ రహదారుల శాఖ రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులు, సిగ్నల్స్, రహదారిపై రాత్రి పూట దిశను చూపించే రేడియం సిగ్నల్స్ అమర్చినారు. అలాగే భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాద మలుపులు సూచికలతో సరిపెట్టారు. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గినా ..ప్రమాదం సంభవిస్తే మాత్రం ప్రాణాలు హరీ అనాల్సిందే. భాకరాపేట ఘాట్ రోడ్డు 10 కిలోమీటర్లు దూరం వస్తుంది. ఇందులో ప్రధాన మలుపులు 12 ఉన్నాయి. అందులో లోయలతో కూడిన మలుపులు 4 ఉన్నాయి. ఈ నాలుగు ములుపుల వద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాపాయం తప్పదు. మృత్యుమలుపుల వద్ద ప్రమాద సూచికలు పెట్టారు. ఇవి ప్రమాదాలను ఆపలేక పోతున్నాయి. ఇక్కడ కచ్చితంగా భారీ గేజ్‌తో కూడిన రెయిలింగ్, పిట్ట గోడలు నిర్మించాలని వాహనదారులు, డ్రైవర్లు కోరుతున్నారు. నాలుగు రోజులు క్రితం జరిగిన ప్రమాదంలో లోయలో పడ్డ వాహనాన్ని బయటకు తీసుకు రావడానికి వీలుకాక ఇబ్బంది పడుతున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం
-
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమలు రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కొండను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, టీటీడీ సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆశ్విని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఇంత 'ఘాట్' నిర్లక్ష్యమా..
తిరుమల ఘాట్ రోడ్డులోకొండచరియల ముప్పుపైఇంజినీర్లు స్పందిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.తిరుపతి నుంచి తిరుమలకువెళ్లే రెండో ఘాట్‌లో ఏటా కొండ చరియలు కూలుతున్నా ఇంజినీర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మార్గంలో ప్రత్యామ్నాయం కల్పించాలని రెండేళ్లకు ముందు టీటీడీ నిర్ణయించింది. మొదటి, రెండోఘాట్ రోడ్ల్లకు అనుసంధానమైన లింక్‌రోడ్డు మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల వరకు నాలుగులేన్లుగా విస్తరణకు నోచుకోలేదు. మరోవైపు మొదటి ఘాట్‌రోడ్డు కూడా ప్రమాదంఅంచులోకి చేరుతోంది. సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డుపై ఇంజినీర్లు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు 1973లో 16 కిలోమీటర్ల నిడివిలో రెండో ఘాట్‌రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో రెండేళ్లుగా ఏడు కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు తరచూ కొండ చరియలు కూలుతున్నాయి. అలిపిరి నుంచి 12వ కిలోమీటరు హరిణి విశ్రాంతి షెడ్డు వరకు, అక్కడినుంచి 13వ కిలోమీటరు లింక్‌రోడ్డు వరకు, ఆ తర్వాత నుంచి 16వ కిలోమీటరు తిరుమల వరకు మూడు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో లింకురోడ్డు నుంచి తిరుమల వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. భవిష్యత్‌లో ఈ రోడ్డు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది. వర్షాకాలం వచ్చిందంటే కొండ రాళ్లు కూలుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడ చైన్‌లింక్ ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయం లింకురోడ్డు మాత్రమే.. రెండో ఘాట్ రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డు మోకాళ్ల పర్వతం వరకు అనుసంధానంగా లింక్‌రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు టీటీడీకి ప్రత్యామ్నాయంగా ఉంది. మూడేళ్లకు ముందు రెండోఘాట్‌లోని 5వ కిలోమీటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడిన కొండ చరియలతో 20 రోజుల పాటు రెండో ఘాట్‌రోడ్డులోని ఐదు మలుపులు మూసివేశారు. ప్రత్యామ్నాయంగా వాహనాలను లింక్‌రోడ్డు మీదుగా తిరుమలకు అనుమతించారు. అరగంటపాటు అటుఇటుగా ఆపేసి పంపటం వల్ల రెండు వైపులా వెళ్లే భక్తులకు ట్రాఫిక్ జామ్‌తోపాటు రైళ్లు, విమాన ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రమాదపుటంచుల్లో అవ్వాచ్చారి కోన కొండ.. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డును 1945 ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించారు. ఈ మార్గంలో మోకాళ్ల పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 1.5 కిలోమీటర్లు ఉంది. ఇది అతిప్రమాదకరం. ఈ మార్గంలో గతేడాది బ్రహ్మోత్సవాల వేళ భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన మరింత తీవ్ర స్థాయిలో జరిగి ఉంటే మొదటి ఘాట్‌రోడ్డును మూసివేయక తప్పని పరిస్థితి. అలాంటి సందర్భంలో టీటీడీకి ప్రత్యామ్నాయం లింక్‌రోడ్డు మాత్రమే వెసులుబాటు ఉండేది. కానీ లింక్‌రోడ్డు విస్తరణలో ఇంజనీర్లు చొరవ చూపటం లేదనే విమర్శ ఉంది. మొదటి ఘాట్‌లో నిటారుగా ఉండే ఈ అవ్వాచ్చారికోన కొండ మీద నుంచి బండరాళ్లు భవిష్యత్‌లో మరిన్ని కూలే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు తేల్చారు. భవిష్యత్‌లో అలాంటి ఘటనలు జరిగితే ఈ లింక్‌రోడ్డు ద్వారా భక్తులను తిరపతికి తరలించే అవకాశం ఉంది. మోకాళ్ల పర్వతం టు తిరుమలకు నాలుగులేన్ల విస్తరణ సాగేనా? మోకాళ్ల పర్వతం నుంచి తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వరకు ఉండే రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించేందుకు రెండున్నరయేళ్లకు ముందు టీటీడీ పచ్చజెండా ఊపింది. మూడు కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రోడ్డు మార్గాన్ని రాకపోకలకు వీలుగా నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే గడ్డు పరిస్థితులకు ప్రత్యామ్నాయం చేయాలని సంకల్పించారు. నాలుగులేన్ల రోడ్డు విస్తరణపై సర్వే చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదు. గతేడాది ఈఓగా వచ్చిన అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు పనులు వేగవంతం చేయాలని ఆదేశించినా ఇంజినీర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మేలుకోవడం టీటీడీ ఇంజినీర్లకు అలవాటైపోయిందన్న విమర్శలున్నాయి. -
తిరుమలలో పుర్రె కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో పుర్రె కనిపించడం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్డులోని జింకల పార్కు సమీపంలో పుర్రె, ఎముకలు భక్తుల కంటపడ్డాయి. దీంతో భక్తులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం భక్తులతో ఉండే ఘాట్ రోడ్డులో ఈ పుర్రె ఎలా వచ్చిందో అని తెలియడం లేదు. భక్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆ నాలుగు ప్రాంతాలు ప్రమాదకరం
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. రెండవ ఘాట్ రోడ్డులో నాలుగు ప్రమాద ప్రాంతాలను గుర్తించిన ఐఐటీ నిపుణులు దీనిపై టీటీడీకి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా ప్రమాద ప్రాంతాలలో కొండచరియలపై కొమ్మలను టీటీడీ సిబ్బంది తొలగించారు. కూలడానికి సిద్దంగా ఉన్న కొండచరియలను కూడా ముందుగా తొలగించారు. -
ఘాటు.. నిర్లక్ష్యంతో చేటు
ఘాట్‌రోడ్డు పనుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా నిపుణులు సూచించిన వాటిని తక్షణమే అమలులోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. కానీ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనుల విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. సాక్షి, తిరుమల: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా ఉంది తిరుమల ఘాట్ రోడ్డు అభివృద్ధి çపరిస్థితి. మొదటి, రెండో ఘాట్రోడ్లకు అనుసంధానంగా ఉండే లింక్ రోడ్డును మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల వరకు నాలుగు లేన్లుగా విస్తరించాలని రెండేళ్లకు ముందే నిర్ణయించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రెండో ఘాట్ రోడ్డులో తరచూ కొండచరియలు కూలుతున్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలు ముం దుకు కదలటం లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల దూరం ఉన్న రెండో ఘాట్‌రోడ్డు ప్రమాద స్థితికి చేరుకుంటోంది. కొంతకాలంగా తరచూ ఈ ఘాట్ రోడ్డులో కొండచరియలు కూలుతూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలకు మరింత ఎక్కువ స్థాయిలో కొండచరియలు కూలాయి. ఏడో కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు ఎక్కువ మోతాదులో కూలుతున్నాయి. భవిష్యత్‌లో ఈ రోడ్డు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణుల బృందం తేల్చింది. ప్రత్యామ్నాయ లింకు రోడ్డును పట్టించుకోని టీటీడీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డు మోకాళ్ల పర్వతం వరకు అనుసంధానంగా లింక్‌రోడ్డు ఉంది. విపత్కర పరిస్థితుల్లో ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయితే ఈ రోడ్డు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంది. రెండేళ్లకు ముందు రెండో ఘాట్‌లోని 15వ కిలోమీటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడిన కొండ చరియల వల్ల 20 రోజులపాటు రెండో ఘాట్‌రోడ్డులోని ఐదు మలుపులు మూసేశారు. ప్రత్యామ్నాయంగా వాహనాలను లింక్‌రోడ్డు మీదుగా తిరుమలకు అనుమతించారు. అరగంటపాటు అటుఇటుగా ఆపేసి పంపటం వల్ల రెండు వైపులా భక్తుల రాకపోకలు ఆగిపోవడమేగాక రైళ్లు, విమాన ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నిపుణుల సూచన బేఖాతరు మొదటి, రెండో ఘాట్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్డు నుంచి తిరుమల వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని రోడ్డును నాల్గు లేన్లు విస్తరించాలని గతంలో నిపుణులు సూచించారు. దీనికోసం ప్రముఖ నిర్మాణం సంస్థలతో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లు పిలిచారు. వివిధ కారణాలతో టెండర్లు తెరుచుకోలేదు. మరోసారి టెండర్లు పిలిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ టెండర్ దాఖలు చేసింది. అయితే, ఆ టెండరు ఫైల్ ఇంకా తెరుచుకోలేదు. సుమారు రెండు నెలలు గడచినా ఆ ఫైలుకు మోక్షం రాలేదు. సంబంధిత ఇంజినీరింగ్ అధికా రుల నిర్లక్ష్యం కారణంగానే ఆగిందని సమాచారం. దీంతో అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రమాదం అంచుల్లో అవ్వాచ్చారి కోన కొండ తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డు 1945, ఏప్రిల్ 10వ తేదీ ప్రారంభించారు. ఈ మార్గంలో మోకాళ్ల పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 1.5 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం అతి ప్రమాదకరమైనది. ఈ మార్గంలో తొలిసారి ఈ నెల 13వ తేదీ భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో గంటన్నరపాటు వాహనాలు స్తంభించాయి. మరింత తీవ్ర స్థాయిలో కొండచరియలు విరిగిపడితే మొదటి ఘాట్‌రోడ్డు మూసివేయక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు లింక్ రోడ్డు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గమవుతుంది. నిటారుగా ఉండే ఈ అవ్వాచ్చారికోన కొండ మీద నుంచి బండరాళ్లు భవిష్యత్‌లో మరిన్ని కూలే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు తేల్చారు. -
దసరాలోపు దుర్గమ్మ ఘాట్ రోడ్డు
విజయవాడ: దసరాలోపు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కనకదుర్గ ఆలయ చైర్మన్ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని మాడపాటి సత్రంలో దుర్గగుడి తొలి పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కనకదుర్గమ్మ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. దసరా ఏర్పాట్లపై పాలకమండలి సమావేశంలో చర్చించింది. దసరాను ప్రభుత్వ పండుగగా ప్రకటించినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదన్నారు. దసరాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో చర్చించిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని, దాదాపు రూ.10 కోట్లు అడుగుతున్నట్లు, 70 వేల మంది దుర్గమ్మ దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు వారు వివరించారు. దుర్గమ్మకు సోలార్ వెలుగుల కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. -
ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
పెద్దదోర్నాల : ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న వారిని చూసి విధికి కన్నుకుట్టింది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. పెద్ద దోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కర్నాటక వాసులు దుర్మరణం చెందగా మరో 18 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా దొంగర్గావ్ ప్రాంతానికి చెందిన దాదాపు 22 మంది తుఫాన్ వాహనంలో మల్లన్న దర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా పెద్ద దోర్నాల మండలం చింతల మూలమలుపు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న కర్నాటక రాష్ట్రం బళ్లారి డిపోకుచెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బుధవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలోని విజయ్‌కుమార్ (40) సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడగా, మరో ఇద్దరు మహిళలు రాజేశ్వరి శ్రీదేవి(45), నాగం (45)లు పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 18 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకరిద్దరు మాత్రం గాయాలు లేకుండా బయటపడ్డారు. ఘాట్‌లో స్తంభించిన ట్రాఫిక్.. ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవటంతో ఘాట్ రోడ్డులో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న సమాచారం ఎస్ఐ నాగరాజు సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ, భాగ్యశ్రీ, అనసూయ, కస్తూరిబాయి, నీలం, జగదేవి, గౌరమ్మ, అంబిక, సురేఖ, ఈశ్వర్‌ఆదే, సంగీత, గురుబాయి, అరుణ, తుఫాన్ డ్రైవర్ ఉమేష్‌లతో పాటు చిన్నారులు హర్ష, స్వరూప్, శివకుమార్, బస్సు డ్రైవర్ లక్ష్మీనారాయణలను 108 వాహనంతో పాటు, తన జీప్‌లో పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో పాటు ప్రయాణికుల సహకారంతో సంఘటనా స్థలంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి వాహనాల రాక పోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్డీవో చంద్రశేఖరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాంబాబులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించారు. రోదనలతో హోరెత్తిన నల్లమల.. బుధవారం శ్రీశైలం ఘాట్రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల రోదనలతో నల్లమల అటవీ ప్రాంతం హోరెత్తింది. ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలో సుమారు 22 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తుపాన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినటంతో పాటు ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో గాయపడిన వారిని కొద్దిసేపటి వరకు ఎటు తరలించలేని పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలంలోనే ఆర్తనాదాలు చేస్తున్న వారికి కొందరు ప్రయాణికులు సపర్యలు చేశారు. ఎస్ఐ నాగరాజు 108 వాహనంతో చేరుకుని గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం వైద్యశాలలో ప్రథమ చికిత్సలు అనంతరం తీవ్రంగా గాయపడిన వారందరినీ కర్నూలుకు తరలించారు. -
నల్లమల ఘాట్‌లో లారీ బోల్తా
మహానంది: కర్నూలు జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఇనుప రాడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనతో ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. నంద్యాల-గిద్దలూరు మార్గంలో నల్లమల ఘాట్ రోడ్డులో గురువారం మధ్యాహ్నం లారీ బోల్తా పడింది. లారీ గుంటూరు నుంచి నంద్యాలకు వెళుతోందని తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఈ ఘాట్‌రోడ్డులో రాకపోకలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 30 వ మలుపు వద్ద ఒక బైక్ డివైడర్‌ను ఢీకొంది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని రూయా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. -
ఘాట్‌రోడ్డులో ప్రమాదం: 14 మందికి గాయాలు
చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. లంబసింగి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఓ ఆటో గురువారం బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి త రలించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం
తిరుమల: తిరుమల కొండపై అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్‌రోడ్డు 25 వ మలుపు సమీపంలో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. -
ఘాట్రోడ్లో బస్సు బ్రేకులు ఫెయిల్
డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు 48 మంది ప్రయాణికులు సురక్షితం చింతూరు, మారేడుమిల్లి : డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 48 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చింతూరు– మారేడుమిల్లి ఘాట్రోడ్లో శనివారం రాత్రి ఏడింటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం డిపోకు చెందిన బస్సు రాజమండ్రి నుంచి ఎగువసీలేరు వెళుతోంది. ఘాట్‌రోడ్‌లోని టైగర్ క్యాంపు సమీపంలోకి రాగానే ఆ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపే క్రమంలో కొండను తాకించాడు. దీంతో బస్సు అదుపు తప్పి 20 అడుగుల లోతులోగల వాగులో పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా బస్సు ముందుభాగం వాగులో తగిలి నిలిచిపోవడంతో తామంతా సురక్షితంగా బయట పడినట్టు ప్రయాణికులు తెలిపారు. మారేడుమిల్లి సీఐ అంకబాబు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
ఘాట్‌రోడ్డులో కారు బోల్తా..
తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. వారికి తీవ్ర గాయాలు కాలేదు. దీంతో ఘాట్‌రోడ్డులో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గురైన వారు చైన్నై నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు తెలిసింది. -
కొండపైకి సొంత వాహనాలకు నో!
ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ నియంత్రణకు దుర్గగుడి అధికారులు చర్యలు చేపట్టారు. వీఐపీలు, సొంత వాహనాలపై కొండపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓం టర్నింగ్ వద్ద పలు మార్లు ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్లపై కొండపైకి వచ్చే వారి కోసం దేవస్థానం టోల్‌గేటు వద్ద రూ. 300 టికెటు కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వారిని కొండపైకి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. భక్తులు తమ వాహనాలను కెనాల్ రోడ్డు, కమాండ్ కంట్రోల్ రూమ్ , హెడ్ వాటర్ వర్కు్స పరిసరాలలో నిలుపుకుని టోల్‌గేటుకు చేరుతున్నారు. టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో టికెట్లు కొనుగోలు చేసి ప్రత్యేక వాహనంపై కొండపైకి చేరుకున్నారు. లడ్డు ఇవ్వలేదని ఫిర్యాదులు శనివారం ఉదయం 10–30 గంటల వరకు రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించకపోవడంతో టెంపుల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవో సీసీకి చేరవేయగా, టికెట్‌తో పాటు లడ్డు అందజేయాలని సంబం«ధిత అధికారులను ఆదేశించారు. -
కొండగుట్టు ఘాట్‌రోడ్డులో పోలీస్ వ్యాన్ బోల్తా
-ఆర్ఎస్ఐతో పాటు డ్రైవర్‌కు గాయాలు మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఘాట్‌రోడ్డులో సోమవారం తెల్లవారుజామున పోలీస్‌వ్యాన్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆర్ఎస్సైతో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఉదయం 4 గంటల సమయంలో 22 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు కొండగట్టుకు వ్యాన్‌లో వెళ్తున్నారు. ఘాట్‌పై కొంత దూరం వెళ్లగానే డీజిల్ అయిపోవడంతో వ్యాన్ ఆగిపోయింది. దీంతో వ్యాన్‌లోని కానిస్టేబుళ్లు దిగారు. డ్రైవ ర్, ఆర్ఎస్సై పుండరీకం అందులోనే ఉండి.. డీజిల్ కోసం వ్యాన్‌ను కిందికి దింపేదుకు యత్నించారు. ఈ క్రమంలో బ్రేకులు పడక వ్యాన్ అదుపుతప్పి.. చిన్న లోయలోకి పడిపోయింది. ధ్వంసం కాగా.. డ్రైవర్ చంద్రశేఖర్, ఆర్ఎస్సై పుండరీకం స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అనంతశర్మ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డు రెండవ మలుపు వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులోని 13 కిలోమీటరు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి.. బైక్ పైవెళ్తున్న వాహనదారులు కిందపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘాట్‌రోడ్డులో బోల్తాకొట్టిన లారీ..
వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా.. కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు-నంద్యాల రహదారిలోని ఘాట్‌రోడ్డులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఘాట్‌రోడ్డులోని మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో లారీ డ్రవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా.. లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి క్రేన్ సాయంతో లారీని తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. -
యాదాద్రి ఘాట్‌రోడ్డుపై ధర్నా
యాదగిరికొండ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దేవస్థానం వర్తక సంఘం అధ్యక్షుడిపై చేయి చేసుకున్న హోంగార్డుపై చర్య తీసుకోవాలని కోరుతూ వర్తకసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గంటసేపు దేవస్థానం ఎదుట బైఠాయించారు. అమెరికా పర్యటన ముగించుకుని దేవస్థానం ఈఓ గీతారెడ్డి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను స్నేహపూర్వకంగా కలవడానికి వర్తకసంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య కొండపైకి వెళ్తుండగా విధుల్లో ఉన్న హోంగార్డు అర్వపల్లి అడ్డుకున్నాడని తెలిపారు. హోంగార్డు దురుసుగా ప్రవర్తించి చేయి కూడా చేసుకున్నాడని ఆరోపించారు. విషయాన్ని తెలుసుకున్న దుకాణదారులు సంఘటన స్థలానికి చేరుకుని అర్వపల్లిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, దేవస్థానం ఈఓ గీతారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కర్రె వెంకటయ్యపై చేయి చేసుకున్న హోంగార్డుపై విచారణ జరుపుతామని, విచారణ పూర్తయ్యే వరకు అతన్ని విధుల్లోకి తీసుకోమని, తప్పు అని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం హోంగార్డుపై వర్తకసంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వర్తకసంఘం సభ్యులు కొన్న రమేష్, శివకుమార్, మిట్ట వెంకటయ్య, కర్రె వీరయ్య, బాలరాజు పాల్గొన్నారు. -
తిరుమల ఘాట్‌లో ప్రమాదం ఇద్దరి మృతి
- మృతులు తమిళనాడులోని తిరువళ్లూరువాసులు సాక్షి, తిరుమల తిరుమల నుండి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (47), ఆయన సతీమణి లక్ష్మీ (42) ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మంగళవారం అదే వాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 11.25 గంటలకు మార్గంలోని 35వ మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గోవిందరాజు, లక్ష్మి కింద పడి గాయపడ్డారు. దాంతోపాటు వారిపై బస్సు వేగంగా ఎక్కింది. దీంతో లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గోవిందరాజు మృతిచెందారు. మృతదేహాలను మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటన స్థలిని తిరుమల ఏఎస్పి త్రిమూర్తులు, ఎస్ఐ తులసీరామ్ సందర్శించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రైవేట్ వాహనాల తరహాలోనే వేగంగా వెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ కారు అక్కగారి గుడి వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. కారు ముందు భాగం మాత్రం స్వల్పంగా దెబ్బతింది. -
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని 10 వ మలుపు వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బోలెరో వాహనం వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు. -
తిరుమల ఘాట్‌లో ప్రమాదం..
- ఇద్దరికి గాయాలు తిరుమల తిరుమల రెండ వ ఘాట్ రోడ్డులో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. మూడో కిలోమీటర్ వద్ద ఓ బైక్ అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో వేగంగా వెళుతున్న టెంపో వాహనం రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
దుర్గ గుడి ఘాట్‌రోడ్డు మూసివేత
విజయవాడ: ఇంద్రకీలాద్రి ఆధునికీకరణ పనుల్లో భాగంగా భక్తులు కొండపైకి చేరుకునే ఘాట్‌రోడ్డును అధికారులు సోమవారం మూసివేశారు. ఇప్పటికే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని భవాని దీక్ష మండపం పరిపాలన విభాగం భవనాలను పూర్తిగా తొలగించారు. సోమవారం నుంచి ఘాట్‌రోడ్డును మూసివేసిన అధికారులు భక్తులను మహా మండపం మీదుగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కొండపైన అన్నదాన భవనాన్ని కూడా తరలించిన అధికారులు శృంగేరి పీఠంలో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించారు. -
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం
పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలో శనివారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు, ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొనగా పది మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీశైలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ మలుపు వద్ద గురువారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి మృతి
తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు. -
దుర్గగుడికి మరో ఘాట్ రోడ్డు
⇒ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఘాట్‌రోడ్డు మొదటి మలుపు వరకు.. ⇒భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి వాసులకు ఉపయుక్తం ⇒ దుర్గాఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ⇒ ర్యాంపు నిర్మాణం పూర్తయితే కొండ మీదకు మూడు మార్గాలు దుర్గగుడి వద్ద మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేశారు. అర్జునవీధిలో ర్యాంపు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డు మధ్య నుంచి మరో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు దుర్గాఘాట్, మరోవైపు ఇంద్రకీలాద్రి మధ్య రోడ్డు తక్కువగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. గొల్లపూడి, భవానీపురం, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు దుర్గాఘాట్ వరకూ వచ్చి ఘాట్‌రోడ్డులోకి ప్రవేశించకుండా కుమ్మరిపాలెం సెంటర్ వద్ద నుంచే నేరుగా కొండ మీదకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్ణయించారు. సర్వే షురూ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న మొదటి మలుపు, ఓం టర్నింగ్ వరకూ ఒక ఘాట్‌రోడ్డు ఏర్పాటుచేస్తే దుర్గాఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చేవారు ఆ ఘాట్‌రోడ్డు నుంచి వస్తారు. వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజీవైపు నుంచి వచ్చే వాహనాలు ప్రస్తుతం ఉన్న పాత ఘాట్‌రోడ్డులో నుంచే వస్తాయి. రెండు ఘాట్‌రోడ్లు మొదటి మలుపు వద్ద కలుస్తాయి. దీనిపై ఇటీవల దేవస్థానం అధికారులు సర్వే చేయగా, సుమారు 265 మీటర్ల ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేయాలని అంచనా వేశారు. కమిషనర్ అనుమతులు లభించాకే.. రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటు అనేది ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. వాస్తుతో పాటు ఎంత ఖర్చవుతుంది?, బాధితులకు ఎంతమేర నష్టపరిహారం ఇవ్వాలి?.. తదితర అంశాలపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. వీటిపై పూర్తిగా ఒక స్పష్టత వచ్చిన తరువాత, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తీసుకున్నాక ప్రారంభిస్తామని ఇంజినీరింగ్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ర్యాంపు పూర్తయితే.. అర్జున వీధి విస్తరణతో పాటు మల్లికార్జున మహామండపం మొదటి అంతస్తుకు ర్యాంపు నిర్మిస్తున్నారు. అలాగే, అర్జున వీధి విస్తరణ పూర్తయిన తరువాత మల్లికార్జున మహామండపానికి హైస్పీడ్ లిప్టులు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డుకు కొత్తగా నిర్మించే రోడ్డుతో పాటు అర్జున వీధిలో ర్యాంపు నిర్మాణం పూర్తయితే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. నివాసాల తొలగింపునకు సర్వే గతంలో కనకదుర్గా ప్లైఓవర్ కోసం హెడ్ వాటర్‌వర్క్స్ ఎదురుగా ఉన్న కొన్ని ఇళ్లు తొలగించారు. ఇప్పుడు రెండో ఘాట్‌రోడ్డు పేరుతో మరో 170 ఇళ్లను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్లైఓవర్ పై నుంచి చూస్తే కేవలం ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు తప్ప ఇళ్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగిస్తున్నారనే అపోహ కూడా ఇళ్ల యజమానుల్లో ఉంది. ఈ ఇళ్ల తొలగింపునకు సర్వేను రెవెన్యూ విభాగం అధికారులు రెండు రోజులుగా చేపడుతున్నారు. కాగా, గతంలో ఇంద్రకీలాద్రిపై తొలగించిన ఇళ్లకు ఇచ్చిన నష్టపరిహారం మాదిరిగానే తమకూ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. -
బ్రేకులు ఫెయిల్, చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
విశాఖ జిల్లా చింతపల్లి-నర్సీపట్నం ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు మృతి
తిరుమల శేషాచలం అడవుల్లోని జంతువులు తరచూ రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్నాయి. ఆదివారం ఒక జింక మృతిచెందగా సోమవారం ఉదయం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో అరుదైన పునుగు (అడవి పిల్లిజాతి) మృత్యువాత పడింది. భారతదేశంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో తప్ప మరెక్కడా కనిపించని అరుదైన జాతిగా పునుగు రికార్డుల్లోకి చేరింది. అలాంటి జాతి జంతువు వేంకటేశుడు కొలువైన తిరుమల శేషాచల కొండల్లో కనిపించడం విశేషం. తన సేవ కోసమే అన్నట్టుగా పునుగును తాను కొలువైన సప్తగిరుల్లోనే ఆవాసం కల్పించినట్టుగా పౌరాణిక కథనం. అదే సత్సంకల్పంతో 'పునుగుగిన్నె సేవ' పేరుతో శ్రీవారికి పునుగు నుంచి వచ్చే తైలాన్ని వాడటం సంప్రదాయంగా వస్తోంది. ఇలాంటి అరుదైన జాతులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటంపై శ్రీవారి భక్తుల్లోనూ, ప్రకృతి ప్రేమికుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. -
తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల ఘాట్‌రోడ్డులో మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్‌రోడ్డు ఆరో మలుపు వద్ద మారుతీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యానులో ఉన్న ఒక యువతికి గాయాలయ్యాయి. ఆమెను రుయా ఆస్పత్రికి తరలించారు. -
వాహనం ఢీకొని జింక మృతి
తిరుమల ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఓ జింకను బలితీసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డులో శనివారం ఉదయం తీవ్ర గాయాలతో ఓ జింక మృతి చెంది ఉండగా గుర్తించారు. రక్షణ కంచెను దాటుకుని రోడ్డుపైకి రావడంతో ప్రమాదం బారిన పడి ఉంటుందని భావిస్తున్నారు. -
తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు?
తిరుమలకు ఇప్పటికే ఉన్న రెండు ఘాట్ రోడ్లకు తోడు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ తలపెట్టింది. దీనిపై సాధ్యాసాథ్యాలను నిర్ణయించాల్సిందిగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో వైద్య సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. పాలక మండలి సమావేశంలో అనేక అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని రూ100 కోట్లతో అభివృద్ధి చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తొలి విడతగా..రూ.20కోట్లు మంజూరు చేయనున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీమ్ లో శ్రీవారి నగలు ఉంచాలని నిర్ణయించారు. వడ్డీ ఎక్కువగా వచ్చే పక్షంలో ఈ పథకం ఉపయోగించుకోవాలని పాలక మండలి భావిస్తోంది. కోటీ ఆరు లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారి పట్టువస్త్రాలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏకాదశి గందరగోళం.. కాగా.. వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి పాలకమండలి సమావేశంలో పాలక మండలి, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకాదశి పాసుల వ్యవహారం ఇరు వర్గాల మధ్య బేదాభిప్రాయాలకు కారణమని తెలుస్తోంది. ఏకాదశికి కోరినన్ని పాసులు ఇవ్వాలని పాలక మండలి సభ్యులు డిమాండ్ చేశారు. కాగా.. దీనిపై అధికారాలు స్పందించలేదు. దీంతో పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. -
రెండో ఘాట్‌లో కూలిన కొండ చరియలు
తిరుమల : తిరుమలలో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం ప్రారంభమైన వర్షం మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆది, సోమవారాల్లో దఫదఫాలుగా కురిసిన వర్షం మంగళవారం మాత్రం ప్రభావం పెంచింది. దీనివల్ల తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో 11, 12, 14 కిలోమీటర్ల ప్రాంతాల్లో కొండ చరియలు కూలి రోడ్డు మీద పడ్డాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించారు. వర్షాలపై టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఐదు జలాశయాల నుంచి నీరు విడుదల గతవారం కురిసిన వర్షాలకే తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనంతో పాటు జంట ప్రాజెక్టులైన కుమారధార, పసుపుధార ప్రాజెక్టులు నిండాయి. అధికారులు ముందు జాగ్రత్తగా డ్యాముల నుంచి నీటిని కిందికి వదిలిపెట్టారు. తాజాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో డ్యాముల్లోకి చేరుతున్న నీటి శాతం మేరకు మంగళవారం కిందికి వదిలిపెట్టారు. ఇదే పరిస్థితి తిరుపతిలోని కల్యాణీ డ్యాంలో కూడా ఉంది. -
తిరుమల ఘాట్ రోడ్డులో పనులు ప్రారంభం
తిరుమల : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో 15వ కిలోమీటరు భాష్యకార్ల సన్నిధి వద్ద మంగళవారం ‘భూమి’ అనే ఇంజనీరింగ్ సంస్థ పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యేక యంత్రాలు తెప్పించారు. ముందుగా అమర్చిన పైపుల ద్వారా గ్రౌటింగ్, యాంకరింగ్ పద్దతుల్లో పనులు ప్రారంభించారు. సుమారు 360కిపైగా బొరియలు వేసి అందులో సిమెంట్‌ను గ్రౌట్ పద్దతుల్లో పగుళ్లను పూడుస్తారు. తర్వాత గోడ మొత్తాన్ని యాంకరింగ్ పద్ధతిలో పూర్తిస్థాయిలో పటిష్టత చేకూరుస్తారు. ఈ పనులు సుమారు నెలరోజులపాటు సాగే అవకాశం ఉంది. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పనులు కొనసాగించేలా టీటీడీ ఇంజనీర్లు ఏర్పాట్లు చేశారు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
-
మూడో ఘాట్ రోడ్డు నిర్మించే యోచనలో టీటీడి ?
-
డేంజర్‌గా మారుతున్న ఘాట్‌రోడ్డు
-
చిత్తూరులో భారీ వర్షాలు - ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల్లో ఇప్పటి వరకూ ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతైయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 50 కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులకు జల కళ వచ్చింది. జిల్లాలో ఉన్న 940 చెరువులు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. బహుదా, ఆర్మియా, తుంబా ప్రాజక్టులు జలంతో కళకళలాడాయి. మల్లమడుగు, పింఛా, పూలకంటారావు పేట ప్రాజక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గార్గేయ నదిలో మంగళవారం కొట్టుకు పోయిన తండ్రీ, కూతురుల మృత దేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నది దిగువ ప్రాంతంలో కూతురు మృత దేహం గాలింపు బృందాలకు లభించింది. కాగా.. తండ్రి మునిస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తిరుమల లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు లోని ట్రాఫిక్ ను లింక్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. కాగా.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలు, జలపాతాలు నీటితో కళకళ లాడుతున్నాయి. ఆకాశ గంగ, గోగర్భం, పాప వినాశనానికి జలకళ వచ్చింది. కుమార ధార, పసుపు ధార డ్యాముల్లో 80 శాతం మేర నీరు చేరింది. ఇప్పటి వరకూ జలాశయాల్లో వచ్చి చేరిన సరిగా వినియోగిస్తే.. మరో రెండేళ్ల పాటు తిరుమలకు నీటి కష్టాలు తీరినట్టే నని అధికారులు అభిప్రాయపడ్డారు. -
విరిగిపడుతున్న కొండచరియలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, నడకదారిన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పట్టనుంది. మరోపక్క, కుండపోత వర్షాల కారణంగా తిరుమలలో వర్షపు నీరు వరదలా పారుతుంది. తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ఆ రోడ్డులో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియల కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ వైపు వర్షం మరోవైపు కొండచరియల కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తిరుమల కొండకు మూడో ఘాట్?
♦ పరిశీలనలో అన్నమయ్య పురాతన మార్గం ♦ అలిపిరి నుంచి మరో కొత్త రోడ్డుకూ టీటీడీ యోచన సాక్షి, తిరుమల: రెండో ఘాట్‌లో కొండ చరియలు కూలుతున్న నేపథ్యంలో తిరుమల కొండకు మూడో ఘాట్ నిర్మించాలని టీటీడీ యోచిస్తోంది. నాడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివచ్చిన మామండూరు పురాతన మార్గాన్ని దీనికోసం పరిశీ లిస్తోంది. అలిపిరి నుంచి మరో కొత్త రోడ్డు నిర్మాణంపైనా యోచిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాల కల్పించే దిశగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ప్రమాదపు అంచుల్లో రెండో ఘాట్ రోడ్డు తిరుమల శేషాచల కొండలు 250 కోట్ల సంవత్సరాలకు ముందు ఆవిర్భవించినట్టు భౌగోళిక శాస్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తోంది. 1944, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు (తిరుమల నుంచి తిరుపతికి)ను, 1973లో రెండో ఘాట్ రోడ్డు (తిరుపతి నుంచి తిరుమలకు)ను నిర్మించారు. మొదటి ఘాట్ లో కొండలు చరియలు కూలే అవకాశాలు తక్కువ. 16 కిలోమీటర్లు నిడివిగల రెండో ఘాట్ రోడ్డులో మాత్రం 7వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో భారీ కొండలే కూలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం టీటీడీ పూనుకుంది. పరిశీలనలో అన్నమయ్య పురాతన మార్గం ఆరు శతాబ్దాలకు ముందు తాళ్లపాక అన్నమాచార్యులు వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని తాళ్లపాక నుంచి తిరుమలకు వచ్చారని చరిత్ర. ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గంగా పిలుస్తున్నారు. మామండూరు నుంచి సుమారు 16 కిలోమీటర్లు మధ్యలో కొండలు లేకుండానే తిరుమలకు చేరుకునేలా కచ్చారోడ్డు ఉంది. దీన్ని ఆధునీకరించి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మించాలన్న డిమాండ్ కూడా ఉంది. రెండోఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారడం, అన్నమయ్య మార్గాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ మార్గాన్ని టీటీడీ పరిశీలిస్తోంది. అవరోధాల మధ్య అన్నమయ్య మార్గం మామండూరు నుంచి తిరుమల పొలిమేరలకు వచ్చే వరకు అటవీ ప్రాంతమంతా రిజర్వు ఫారెస్ట్. అరుదైన వృక్ష, జంతువులు ఎక్కువగా ఈ శేషాచల పరిధిలోనే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కేంద్రం శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించి రక్షిస్తోంది. ఈ చట్టం కింద కట్టెపుల్లను కూడా తొలగించేందుకు నిబంధనలు అంగీకరించవు. తిరుమల, తిరుపతితో మాత్రమే ముడిపడిన దేవస్థానం తిరుపతి మార్గాన్ని కాదని మామండూరు ప్రాంతానికి కొత్త రోడ్డు మార్గం విస్తరణకు ఇక్కడి స్థానికులు అంగీకరించే పరిస్థితులు తక్కువ . ఇలాంటి పరిస్థితుల మధ్య పురాతన అన్నమయ్య మార్గం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకమే. అలిపిరి నుంచి కొత్త రోడ్డుకు యోచన 7 నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే అవకాశాలున్న రెండో ఘాట్ రోడ్డు కింద భాగంలోనే కొత్త రోడ్డు నిర్మించే అంశం కూడా పరిశీలనలో ఉంది. అలిపిరి నుంచి వినాయకస్వామి ఆలయం, జూపార్క్ మీదుగా హరిణి దాటుకుని 12వ కిలోమీటరు వరకు కొండల మధ్య కాకుండా నేల మీదే కొత్త రోడ్డు నిర్మించి లింక్ రోడ్డుకు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల కొంతవరకు ప్రమాదాలను అరిక ట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కూడా టీటీడీ పరిశీలిస్తోంది. -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
తిరుమల : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో 16వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు పడగా, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వాటిని తొలగించారు. రాళ్లు పడే సమయంలో వాహనాలేవీ ఆ ప్రదేశంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గత కొన్ని రోజులుగా వర్షాలకు ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడుతున్న విషయం తెలిసిందే. -
మళ్లీ కూలిన కొండచరియలు
తిరుమల: తిరుమలలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం ఉదయం రెండవ ఘాట్‌రోడ్డు లోని 14 వ కిలోమీటర్ వద్ద కొండచరియలు భారీగా కూలిపడుతున్నాయి. బండరాళ్లు, మట్టిపెళ్లలు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. టీటీడీ ఇంజినీరింగ్ సిబ్బంది 14వ కిలోమీటర్ వద్ద తొలగింపు చర్యలు చేపట్టారు. కాగా, ఘాట్ లో ఆదివారం కూడా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. గత మంగళవారం నుంచి రోజూ ఏడో కిలోమీటరు నుంచి 16 వ కిలోమీటరు వరకు భారీగా బండరాళ్లు పడుతున్నాయి. ఏ సమయంలో ఏ రాయి కూలుతుందోనని ఇటు ప్రయాణికులు, అటు ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు
తిరుమల : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో 16వ కిలోమీటర్ వద్ద ఆదివారం ఉదయం కొండచరియలు కూలి రోడ్డుపై పడ్డాయి. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నాలుగు పెద్ద బండరాళ్లతో పాటు మట్టిగడ్డలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే వెళ్లి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు
తిరుమల (చిత్తూరు జిల్లా) : శనివారం మధ్యాహ్నం తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో 8వ కిలోమీటరు వద్ద పెద్ద కొండ చరియలు కూలిపోయాయి. రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాలు ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన రెండవ ఘాట్ రోడ్డుకు వెళ్లి రోడ్డుపై అడ్డంగా ఉన్న రాళ్లు, మట్టిని తొలగిస్తున్నారు. -
శ్రీశైలంలో చిరుత సంచారం
శ్రీశైలమహాక్షేత్రానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద చిరుతపులి కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. శ్రీశైలం ప్రాజక్టు కాలనీ నుంచి శ్రీశైలానికి వస్తుండగా.. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ముఖద్వారం సమీపంలో చిరుత ఘాట్ రోడ్డు దాటుతూ కనిపించిందని తెలిపారు. తాము భయపడి టూ వీలర్ ఆపేశామని తెలిపారు. వెంటనే దేవస్థానం, అటవీ అధికారులకు సమాచారం అందించామని వివరించారు. కాగా ఇటీవలే క్షేత్రపరిధిలోని మేకల బండ చెంచుగూడెం సమీపంలో పెంపుడు మేకలపై చిరుతలు దాడి చేసి గాయపరిచిన విషయం తెల్సిందే. సున్నిపెంట నుంచి శ్రీశైలం క్షేత్రానికి టూ వీలర్‌పై వచ్చే వారు, వెళ్లేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని దేవస్థానం మైకుల ద్వారా ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. కాగా అటవీ అధికారుల కృషితో నల్లమల అభయారణ్యంలో జంతువుల సంతతి పెరిగింది. వీటితో పాటు.. చిరుతల సంఖ్య కూడా పెరిగినట్లు సమాచారం. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
జోరువాన
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జడి వాన కురిసింది. వర్షాభావంతో అల్లాడుతున్న రైతాంగానికి ఈ వర్షం ఊరట కలిగింది. ఈ ఏడాది ఇక వర్షాలు రావు.. అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో వరుణుడు కరుణించాడు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కనీసం ఈ పాటి వర్షం కూడా కురవకుంటే రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండేది. చిత్తూరు (అర్బన్) : జిల్లాలో ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం అంద రినీ కలచివేసింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.57 లక్షల హెక్లార్లలో వేరుశెనగ పంట నీళ్లు లేకుండా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. మూడు రోజులుగా జిల్లాలోని చౌడేపల్లె, ఎస్ఆర్.పురం మండలాల్లో కొన్ని గ్రామాలు మినహా ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్ని వర్గాల నుంచి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే చేతికందే పరిస్థితిలో ఉన్న లక్ష హెక్లార్లలోని వేరుశెనగ పంటకు తాజాగా కురుస్తున్న వర్షాలు ఎంతో మేలును చేకూర్చనుంది. దిగుబడి తగ్గినా మొత్తం పంటలో వచ్చే కాయలు రైతులకు కాస్త ఆర్థిక పరిపుష్టిని కలిగించనుంది. అలాగే మామిడి కోత పూర్తయిన నేపథ్యంలో చెట్ల మనుగడకు ఇప్పుడు పడుతున్న వర్షాలు బతుకునిస్తున్నాయి. ఒకేసారి కుండపోతగా కాకుండా ఓ మోస్తరుగా పడుతున్న వర్షాలు భూమిలో నీళ్లను ఇంకేలా చేస్తున్నాయి. అపాయకర పరిస్థితుల్లో ఉన్న భూగర్భ జలమట్టం పెరుగుతాయనే ఆశలు కలుగుతున్నాయి. శుక్రవారం బంగారుపాళెంలో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దాదాపు రెండేళ్ల తరువాత ఈ తరహా వర్షపాతం నమోదయింది. అన్ని పంటలకూ అనుకూలం... జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రస్తుతం ఉన్న పంటలతో పాటు సాగుచేయనున్న పంటలకు సైతం అనుకూలంగా మారింది. ఉద్యానవన పంటలకు ఈ పాటి వర్షాలు పంటల ఆయుష్షును పెంచనుంది. అలాగే చెరకు, కూరగాయలు వేయడానికి అనుకూల పరిస్థితులను కల్పించినట్లయింది. దీంతో పాటు ప్రత్యామ్నాయ పంటలైన జొన్నలు, కందులు, ఉద్దులు, పెసలు, ఉలవలు, అనప పంటల్ని సైతం ఈపాటి వర్షానికి విత్తుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రజలకు, రైతులకు ఊపిరి పోసినట్లయింది. తిరుమలలో భారీ వర్షం సాక్షి, తిరుమల : తిరుమలలో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు గంటలపాటు వర్షం కురిసింది. ఆలయ ప్రాంతం వర్షపు నీటితో నిండింది. భక్తులు తడుస్తూ వెళ్లడం కని పించింది. వర్షం వల్ల రెండో ఘాట్‌రోడ్డు లో చివరి ఐదు మలుపుల్లో అక్కడక్కడా కొండచరియలు విరిగిపడ్డాయి. -
యాత్రికుల గుండెల్లో రాయి
కూలుతున్న బండరాళ్లు.. పట్టించుకోని టీటీడీ అధికారులు నిపుణుల హెచ్చరికలను గాలికి వదిలిన వైనం భయపడుతున్న ప్రయాణికులు తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం యాత్రికులను భయపెడుతోంది. పెద్దపెద్ద బండరాళ్లు పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు ముందస్తుగా హెచ్చరించినా టీటీడీ ఇంజినీర్ల చెవికి ఎక్కలేదు. ఫలితంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. రెండో ఘాట్‌లో ప్రమాద సంకేతాలు.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో తరచూ బండరాళ్లు కూలుతున్నాయి. ఎనిమిదో కిలోమీటర తర్వాత నుంచి తిరుమలకు చేరే వరకు కొండ చరియలు విరి గిపడే అవకాశాలు ఉన్నా యి. చివరి ఐదు మలుపుల (హెయిర్‌పిన్ కర్వ్స్) వద్ద ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దశాబ్దం క్రితం త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగిపడటంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి తొలగించారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండ బొరియల్లోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె (ఫెన్సింగ్) నిర్మించారు. చివరి మలుపు వద్ద రెండేళ్ల క్రితం రాక్‌బౌల్టర్ ట్రాప్ (ఇనుప కంచె) నిర్మించారు. తద్వారా బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండటంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఎనిమిదో కిలోమీటర్ వద్ద గత ఏడాది డిసెంబరు 17వ తేదీన భారీ స్థాయిలో కొండరాళ్లు కూలాయి. తాజాగా దానికి వందమీటర్ల దూరంలోనే భారీ కొండచరియ కూలింది. హెచ్చరిక లు పట్టని ఉన్నతాధికారులు తిరుమల రెండో ఘాట్‌లో కొండ చరియలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని గత ఏడాది 20వ తేదీన ఐఐటీ ప్రొఫెసర్ నరసింహారావు టీటీడీని హెచ్చరించారు . ప్రమాద సంకేతాలు చూపే ప్రాంతాల్లోని బండరాళ్లను వెంటనే తొలగించాలని ఆయన సూచించారు. అధికారులు పట్టించుకోకపోగా కోట్లు ఖర్చుపెట్టి కొండలను కూల్చాల్సిన అవసరం ఏముందని కొట్టిపారేశారు. బండరాళ్లు కూలిన సందర్భాల్లో హడావుడి చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారు. నైరాశ్యంలో ఇంజినీరింగ్ విభాగం ఏడాది కాలంగా ఇంజినీరింగ్ శాఖలో నిర్లిప్తత చోటు చేసుకుంది. అవసరమైన పనుల అనుమతి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంతో ముడిపడిన పనులు తప్పిస్తే మిగిలిన వాటికి అనుమతుల రావడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఇటు ఇంజినీర్లలో, అటు కాంట్రాక్టర్లలో నైరాశ్యం ఆవహించిందని ప్రచారం సాగుతోంది. -
తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో కారు, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. -
భక్తుల ప్రాణాలకు భరోసా ఏదీ?
- అలిపిరి టోల్గేట్లో తనిఖీలు తూచ్ - లంచాల మత్తులో సెక్యూరిటీ సిబ్బంది - గాల్లో భక్తుల ప్రాణాలు - ‘ధవళేశ్వరం’ ఘటనే దీనికి నిదర్శనం అలిపిరి టోల్గేట్ సిబ్బంది వాహన తనిఖీలను గాలికొదిలేస్తున్నారు. లంచావతారమెత్తి భక్తుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. వాహనం ఫిట్టా.. ఫట్టా.. పట్టించుకోకుండానే లంచాలిస్తే రైట్..రైట్ చెప్పేస్తున్నారు. ఆ శ్రీనివాసుడి భక్తులకే శఠగోపం పెట్టేస్తున్నారు. ‘ధవళేశ్వరం’ ఘటనే దీనికి నిలువెత్తు నిదర్శనం.. తిరుపతి అర్బన్: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వాహనాల్లో వెళ్తుంటారు. టీటీడీ నిబంధనల ప్రకారం అలిపిరి టోల్గేట్ వద్దకు చేరుకునే ప్రతి వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఘాట్‌రోడ్డులోకి అనుమతివ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా వాహనం సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికుల సంఖ్య, వాహనం డ్రైవర్ స్థితిగతులు, డ్రైవింగ్ లెసైన్స్, వాహనం ఫిట్నెస్ వంటి అంశాలను కచ్చితంగా పరిశీలించాలి. కానీ అలిపిరి వద్ద పనిచేస్తున్న 80 శాతం సెక్యూరిటీ సిబ్బంది మామూళ్లకు అలవాటై తనిఖీలను గాలికొదిలేస్తున్నారు. కొందరు మద్యం మత్తులో తూగుతుండగా మరికొందరు తమకు ఇష్టం వచ్చిన వారి వాహనాలను ఏమాత్రం తనిఖీలు చేయకుండా ఘాట్‌లోకి అనుమతిస్తున్నారు. కనీసం గేట్పాస్ కూడా తీసుకోకుండా తిరుమల కొండ ఎక్కిస్తున్నారు. గాల్లో భక్తుల ప్రాణాలు తిరుమల కొండ అత్యంత ప్రమాదకర మలుపులు కలిగిన కొండ. వాహనాల ఫిట్నెస్తోపాటు డ్రైవర్లు ఎంతో అనుభవంతో చాకచక్యంగా వ్యవహరిస్తేగానీ కొండ ఎక్కడం కష్టం. భక్తులకు ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా టీటీడీ అలిపిరిలో టోల్గేట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాల్సి ఉంది. అయితే స్థానిక సిబ్బంది లంచాల మత్తులో వాహన తనిఖీలను గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా భక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసాయిపేటకుచెందిన 23 మంది భక్తులు తీర్థయాత్రల కోసమని ఈనెల 6న తమ సొంత వాహనం(తుఫాన్)లో బయలుదేరారు. భద్రాచలం, శ్రీశైలం ఆలయాలను దర్శించుకని ఈ నెల 7 తిరుమలకు బయలుదేరారు. సాధారణంగా ఈ వాహనంలో 13 మంది మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. కానీ ఓవర్ లోడ్డుతో శ్రీవారి దర్శనం కోసం అలిపిరి వద్దకు చేరారు. కానీ ఇక్కడి సిబ్బంది తనిఖీలు చేయకుండా లంచాలు తీసుకుని ఘట్రోడ్డులోకి అనుమతించారు. ఆపై ఈనెల 9న తిరుగు ప్రయాణంలో ఇదే పరిస్థితి. ఓవర్లోడ్డుతో వెళ్లడం.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి బోల్తా కొట్టింది. 22 మంది మృత్యువాత పడ్డారు. తనిఖీలు చేసి ఉంటే భక్తులు ఇతర వాహనాల్లో వెళ్లేవారని.. ప్రమాదం జరిగి ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగంలో మార్పులు వచ్చి యాత్రికుల ప్రాణాలకు భరోసా ఉండే చర్యలు తీసుకుంటారోలేదో చూడాల్సి ఉంది. -
తిరుమలలో కుంభవృష్టి
తిరుమల: తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి, ఆలయం వద్దనీరు నిలిచింది. వర్షంలో భక్తుల అవస్థలు పడ్డారు. రెండో ఘాట్‌రోడ్డులో చివరి 5 మలుపుల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఘాట్‌రోడ్డు సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు. శ్రీవారి సర్వదర్శనం క్యూలో తోపులాట: తిరుమలలో ఆదివారం సర్వ దర్శనం క్యూలో తోపులాట చోటుచేసుకుంది. చిన్నారులు, వృద్ధులు క్యూలో నలిగిపోయారు. ఇక్కడి సిబ్బందిలో సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని భక్తులు విమర్శిస్తున్నారు. రికార్డు స్థాయిలో దర్శనం: శనివారం రికార్డు స్థాయిలో 90వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం సర్వ దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు బయట కిలోమీటరు వరకు క్యూ కట్టారు. -
ఘాట్‌రోడ్డు పరిశీలించిన ప్రజాసంఘాల నేతలు
మావటూరు(పెనుకొండ): పెనుకొండ సమీపంలో షీప్ ఫారం సమీపంలోని పెనుకొండ -మడకశిర రహదారిలో ఇటీవల ఆర్టీసీ బస్ దుర్ఘటనకు గురైన ఘాట్ పరిసరాలను ప్రజాసంఘాల నాయకులు మంగళవారం పరిశీలించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బన్న, పౌరహక్కుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీరామమూర్తి, కులనిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యదర్శి నల్లప్ప, కోశాధికారి రాము ప్రమాద ఘాట్‌ను పరిశీలించారు. ఆర్టీసీ బస్సు ప్రమాదానికి ఎలా గురైందీ, కాంట్రాక్టర్‌ది ఏ మేరకు బాధ్యుడు, అధికారులు తీసుకున్న చర్యలు, డ్రైవర్ చేసిన పొరబాటు ఏమిటనే విషయాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మావటూరు గ్రామానికి చేరుకుని ప్రమాదం బారిన పడి మరణించిన విద్యార్థులు నరసింహ్మమూర్తి, అశోక్‌కుమార్, నరేంద్ర, గంగాధర్ ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. వారి కుటుంబ స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం కన్నీటి ధారలు ఆపడం ఎవరి తరం కాలేదు. దళితవాడలో బస్సు ప్రమాదంలో మరణించిన నరేంద్ర పెద్దమ్మను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఆమె రోదించిన తీరు చూసిన వారంతా కన్నీరు పెట్టారు. ఆమె గుండెలవిసేలా బాదుకోవడంతో విషాదం చూడలేక ప్రజాసంఘాల నేతలు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం నాయకులు నాగలూరు, బండపల్లి గ్రామాల్లో సైతం మరణించిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. -
ఏ రాయి కూలునో..!
తిరుపతి నుంచి తిరుమలకు వాహనాల్లో వెళ్లే ప్రయాణికుల గుండెలు అరచేత పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో రెండో ఘాట్‌రోడ్డులో భారీ కొండ చరియలు విరగిపడుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా 50 టన్నుల కొండ కూలింది. సాక్షి, తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సుమారు ఇరవై ప్రాంతా ల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత నుంచి తిరుమలకు చేరే వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ చివరి ఐదు మలుపులు (హెయిర్ పిన్ కర్వ్స్) వద్ద చాలా ప్రాంతాల్లో కొండ చరియలు కూలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడడంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగించారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండ బొరియల్లోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె (ఫెన్సింగ్) నిర్మించారు. చివరి మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడడంతో రెండేళ్లకు ముందు అక్కడ రాక్‌బౌల్టర్ ట్రాప్ (ఇనుప కంచె) నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండడంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండడం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొండరాళ్లు కూలే ఘటనల్లో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రతాపరంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడుతున్న రెండో ఘాట్‌రోడ్డులో వాహనదారులు, ద్విచక్రాలపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని అవ్వాచ్చారి కోన ఎగువ ప్రాంతం, కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు మాత్రమే కొండచరియలు అడపా దడపా విరిగి పడుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ పరిస్థితులు లేవని ఇంజినీర్లు చెబుతున్నారు. కూలుతున్న బండరాళ్లపైటీటీడీ అప్రమత్తం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులో ఆదివారం కూడా కొండచరియలు కూలాయి. శుక్రవారం అర్ధరాత్రి 50 టన్నుల కొండ కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డి ఆదేశాలతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామకృష్ణ, డెప్యూటీ ఇంజినీర్ సురేంద్రరెడ్డి అప్రమత్తంగా ఉంటున్నారు. కూలిన ప్రాంతంలో మరమ్మతు పనులు, కొత్త రివిట్మెంట్ (గోడ) నిర్మాణం చేపట్టారు. ప్రతి రెండు గంటలకు ఘాట్‌రోడ్డు మొబైల్‌పార్టీ వాహనాల్లో ఇంజినీరింగ్ సిబ్బందిని పంపించి పడిన రాళ్లను తొలగించారు. దీంతో మొదటి, రెండో ఘాట్‌రోడ్లలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. దీనికితోడు టీటీడీ విజిలెన్స్ విభాగం ఏవీఎస్వోలు కూర్మారావు, వెంక టాద్రి కూడా కొండ చరియలు కూలినట్టు సమాచారం అందితే అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. -
దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత
-
మరో రెండు నెలలు రాకపోకలు బంద్
రంపచోడవరం, న్యూస్‌లైన్ : ఖమ్మం- తూర్పుగోదావరి మధ్య మారేడుమిల్లి వద్ద ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేస్తుండడంతో 40 రోజులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలో ఉన్న గిరిజనులు వాహనాలు తిరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై ఛత్తీస్‌గఢ్ - ఆంధ్రప్రదేశ్ మధ్య లారీలపై వస్తువుల రవాణా అవుతాయి. ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో పశ్చిమ గోదావరి మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాహనదారులు అన్నారు. జగ్దల్పూర్-రాజమండ్రి మధ్య బస్సు రాకపోకలు నిలిపివేశారు. ఘాట్ రోడ్డులో అడ్డుగా బండరాళ్లను ఉంచడంతో ద్విచక్ర వాహనాలు కూడా తిరిగే అవకాశం లేదు. మరో పది రోజుల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తామని భద్రాచలం డివిజన్ రోడ్డు భవనాలు శాఖ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ఐదు కిలోమీటర్లు మేర కొండ చరియలను బాంబు బ్లాస్టింగ్ చేసి రోడ్డు, రక్షణగోడ నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు నెలలు అవసరమని అధికారులు చెబుతున్నారు. గిరిజనులకు తప్పని ఇక్కట్లు వై.రామవరం ఎగువ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాలకు జీకే వీధి మీదుగా కాకరపాడు జంక్షన్ నుంచి రాజవొమ్మంగి మీదుగా రంపచోడవరం చేరుకోవాల్సి వస్తోందని గిరిజనులు అన్నారు. అక్కడ జిల్లా పరిధిలో దాదాపు 40 గ్రామాలు ఉంటాయి. గత నెలలో వారికి రేషన్ బియ్యం నర్సీపట్నం మీదుగా పంపించడంతో ఖర్చులు తడిసి మోపిడయ్యాయని జీసీసీ అధికారులు తెలిపారు. వచ్చే నెల రేషన్ సరుకులు ఎలా పంపుతారో తెలియని పరిస్థితి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రయాణానికి ఇబ్బందులు ఎదురొంటున్నట్టు గిరిజనులు తెలిపారు. సమస్యలు అధికారులు తెలిపేందుకు రంపచోడవరం ఐటీడీఏ వద్దకు వెళ్లేందుకు కూడా దూరాభారం పెరిగిందని వారన్నారు. -
నేడు తిరుమలకు వాహనాల బంద్
సాక్షి, తిరుపతి: ఏపీ ఎన్జీవోల సంఘం పిలుపు మేరకు మంగళవారం రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డును కూడా అడ్డుకోనున్నారు. తిరుమలకు వాహనాల రాకపోకలు ఉండవు. ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని నిర్వాహకులు తెలి పారు. తిరుమలకు 38 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆగస్టు 13వ తేదీన వాహనాల రాకపోకల బంద్ నిర్వహించారు. మరోసారి గత నెల 23, 24 తేదీల్లో తిరుమలకు వాహనాలను నిలిపివేయాలని ప్రయత్నించినా, టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు. ఏపీ ఎన్జీవోలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రహదారులను దిగ్బంధించనున్నారు. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును కూడా దిగ్బంధించనున్నారు. రెండు రోజులుగా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ తిరుమల రహదారిని దిగ్బంధం చేయక తప్పడం లేదని, సమైక్య సెగ ఢిల్లీని తాకాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని ఎన్జీవోల సంఘం నాయకులు తెలిపారు. ఎటువంటి ఒత్తిడికీ లొంగేది లేదు : ఆర్డీవో రామచంద్రారెడ్డి తిరుమల రహదారిని మంగళవారం కచ్చితం గా దిగ్బంధిస్తామని, ఇందులో ఎవరి ఒత్తిళ్లకూ లొంగే ప్రసక్తే లేదని తిరుపతి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు, ఆర్డీవో రామచంద్రారెడ్డి తెలిపారు. టాక్సీలు, ఇతర వాహనాల య జమానులు కూడా తమకు సహకరిస్తున్నారని అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము చేస్తున్న రహదారుల దిగ్బంధానికి మద్దతుగా సినిమా థియేటర్లు, వస్త్ర దుకాణాలు, పెట్రోలు బంక్‌లు, హోటళ్ల యజమానులు సహకరిస్తూ, తమ దుకాణాలను మూసివేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 24 గంటలపాటు రహదారులను దిగ్బంధిం చాల్సి ఉందని ఉందన్నారు. తిరుమలకు ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల వరకు దిగ్బంధం చేస్తామని ఆయన వివరించారు. -
ఘాట్ రోడ్డులో రాకపోకలు బంద్
చింతూరు (ఖమ్మం), న్యూస్‌లైన్ : మరమ్మతులు చేసేందుకు చింతూరు - మారేడుమిల్లి ఘాట్రోడ్లో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. సోమవారం ఘాట్రోడ్లో పలుచోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భధ్రాచలం ఆర్అండ్బీ పరిధిలో గల ఈ ఘాట్ రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ఓ ప్రాంతంలో రిటైనింగ్‌వాల్ (రక్షణ గోడ) కూలిపోగా పలుచోట్ల కొండ చెరియలు విరిగిపడ్డాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని భావించారు. నెల రోజుల పాటు ఈ మరమ్మతులు కొనసాగనున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆర్అండ్బీ ఎస్సీ ఘాట్‌రోడ్‌ను పరిశీలించి మరమ్మతులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ రహదారిలో అన్నిరకాల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రహదారిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డిపోలతో పాటు, పోలీసు అధికారులకు, రెవెన్యూ, ఐటీడీఏ అధికారులకు లేఖలు రాశారు. ఘాట్రోడ్లో మరమ్మతుల నిమిత్తం వాహనాల రాకపోకలు నిలిపివేయాల్సిందిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఆర్అండ్బీ ఈఈ వెంకటి తెలిపారు.15 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణం ఇక దూరాభారమే ఓ వైపు ఇప్పటికే సీమాంధ్రలో బంద్ వాతావరణంతో బస్సులు సరిగా నడవక ఇబ్బందులు పడుతున్న భద్రాచలం డివిజన్ ప్రజలపై ఘాట్‌రోడ్ బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. భద్రాచలం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపారులతో పాటు పొరుగునే వున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలనుంచి నిత్యం అనేకమంది వివిధ పనుల నిమిత్తం రాజమండ్రి వెళుతుంటారు. దీంతోపాటు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వందలాది సరుకు రవాణా లారీలు ఈ ఘాట్రోడ్లోనే ప్రయాణిస్తుంటాయి. మరోవైపు కాకినాడ, రాజమండ్రి, గోకవరం, జగ్దల్పూర్ డిపోలకు చెందిన బస్సులు నిత్యం ఈ ఘాట్‌రోడ్ ద్వారానే భద్రాచలం, జగ్దల్పూర్ ప్రయాణిస్తుంటాయి. రహదారి మూసివేయడంతో ప్రయాణికులతో పాటు లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఇరుకుగా ఉండే ఘాట్‌రోడ్‌కు ఎక్కడా డైవర్షన్‌కు అవకాశం లేకపోవడంతో ఈ రహదారిలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. ఘాట్‌రోడ్ బంద్‌తో రాజమండ్రి వైపు నుంచి చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, మోతుగూడెం, డొంకరాయి, సీలేరు, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల వైపునకు వెళ్లే రవాణా లారీలతో పాటు బస్సులు రాజమండ్రి నుంచి వయా కుక్కునూరు మీదుగా భద్రాచలం వచ్చి అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి రాజమండ్రి వెళ్లాలన్నా వయా భద్రాచలం, కుక్కునూరు మీదుగానే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చింతూరు నుంచి రాజమండ్రికి 130 కి.మీ దూరంకాగా 4 గంటల ప్రయాణం, రూ 105 బస్సు చార్జీ. ప్రస్తుతం ఘాట్‌రోడ్ బంద్‌తో చింతూరు నుంచి భద్రాచలం 65 కిలోమీటర్లు అక్కడి నుంచి రాజమండ్రి సుమారుగా 200 కి.మీ. మొత్తం కలిపి 265 కి.మీల దూరం కాగా 135 కి.మీ అధికంగా, 5 గంటలు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. బస్సు చార్జీ సైతం రెట్టింపుకంటే అధికమవుతోంది. అటు సీమాంధ్ర.. ఇటు ఘాట్‌రోడ్డు బంద్ మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనుండగా ఇదే తరుణంలో ఘాట్‌రోడ్డులో అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోనుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడనున్నారు. ఘాట్రోడ్లో కార్లు, ఆటోలకు కూడా అనుమతి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం తప్పనిసరైన వారి గతేంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. కార్లు, ఆటోలలో భద్రాచలం మీదుగా వెళ్లాలనుకున్నా మన జిల్లాలోని అశ్వారావుపేట దాటగానే పశ్చిమగోదావరి జిల్లా సరిహద్లుల్లో సమైక్యవాదులు వాహనాలను నిలిపివేసే ఆస్కారముండడంతో ఇటునుంచి వెళ్లే ప్రయాణికులు మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నారు. -
‘కొండ’ దిగనున్న కష్టాలు
భువనగిరి, న్యూస్‌లైన్: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట రెండో ఘాట్ రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.26.6 కోట్లను మంజూరు చేసింది. సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఘాట్‌రోడ్డు పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. ఒక్కోరోజు భక్తుల సంఖ్య లక్ష వరకు ఉంటుంది. భక్తులు కొండపైకి చేరుకోవడానికి మూడు మెట్ల మార్గాలు, ఒక ఘాట్‌రోడ్డు మార్గం ఉంది. నృసింహ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఒక మెట్ల మార్గాన్ని అధికారులు మూసివేశారు. రోజురోజుకూ భక్తుల రద్దీతో పాటు వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో పాటు సెలవు రోజులు, పుణ్య దినాలు, ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీని తట్టుకోవడానికి ప్రధానంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. పోలీసులకు, అధికార యంత్రాంగానికి, భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తున్న ఘాట్ రోడ్డు సమస్య పరిష్కారానికి ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. డబుల్ రోడ్డుగా.. కొండపైకి ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. దీన్ని కొండపై నుంచి భక్తులు కిందికి రావడానికి ఉపయోగిస్తారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం రెడ్డి సత్రం వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 100 మీటర్ల ఘాట్ రోడ్డును కొండ వెనక భాగం నుంచి నిర్మిస్తారు. దీనిని అలా పున్నమి గెస్ట్‌హౌస్ పక్కగా ఏర్పాటు చేసి ప్రస్తు తం ఉన్న రోడ్డుకు కలుపుతారు. అదే విధంగా ఆలేరు వైపు నుంచి వచ్చే భక్తుల కోసం యాదగిరిపల్లి గోశాల ద్వారా అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేస్తారు. ఇది హరిత భవన్ నుంచి రెండవ కమాన్ వద్ద రెండవ ఘాట్‌రోడ్డు కొండపైన కలుస్తుంది. దీని పొడవు సుమారు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. కొండ వెనక భాగంలో స్వాగత తోరణం వద్ద విశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం రోడ్డును డబుల్‌రోడ్డుగా ఏర్పాటు చేస్తారు. మెట్ల దారి పాదాల వద్ద మరో జంక్షన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూస్తారు. త్వరలో పనులు ప్రారంభం : వసంత, ఆర్అండ్బీ ఈఈ రెండవ ఘాట్‌రోడ్డు పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. ప్రత్యేక దినాల్లో కొండపైకి 20 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డును నిర్మిస్తాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకోవడానికి రెండవ ఘాట్‌రోడ్డును పూర్తి చేస్తాం. భక్తుల ఇబ్బందులు తొలగించడానికే.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం రూ.26.6 కోట్లు మంజూరు చేసింది. గతంలో నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు నిధులు మంజూరు చేయించాను. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను నా హయాంలో పరిష్కరించడం ఆనందంగా ఉంది. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే నిధులు మంజూరు చేయించగలిగా. - బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే, ఆలేరు రెండో ఘాట్ రోడ్డు రావడం సంతోషం రెండో ఘాట్ రోడ్డు మంజూరు కావడం ఆనందించదగ్గ విషయం. గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పడుతున్న కష్టాలు తీరినట్లే. శని, ఆదివారాల్లో వాహనాల ట్రాఫిక్ సమస్య ఈ ఘాట్‌రోడ్డుతో తీరనుంది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు కృతజ్ఞతలు. - రమేష్‌బాబు, తెలంగాణ దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్