- డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు
- 48 మంది ప్రయాణికులు సురక్షితం
ఘాట్‌రోడ్‌లో బస్సు బ్రేకులు ఫెయిల్
Published Sun, Nov 13 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
చింతూరు, మారేడుమిల్లి :
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 48 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చింతూరు– మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో శనివారం రాత్రి ఏడింటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం డిపోకు చెందిన బస్సు రాజమండ్రి నుంచి ఎగువసీలేరు వెళుతోంది. ఘాట్‌రోడ్‌లోని టైగర్ క్యాంపు సమీపంలోకి రాగానే ఆ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపే క్రమంలో కొండను తాకించాడు. దీంతో బస్సు అదుపు తప్పి 20 అడుగుల లోతులోగల వాగులో పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా బస్సు ముందుభాగం వాగులో తగిలి నిలిచిపోవడంతో తామంతా సురక్షితంగా బయట పడినట్టు ప్రయాణికులు తెలిపారు. మారేడుమిల్లి సీఐ అంకబాబు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement