
సాక్షి, చిత్తూరు జిల్లా: బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్‌ను మినీ లారీ ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారి దిగువకు టెంపో దూసుకుపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను బంగారు పాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటక రాష్ట్రం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా మొగిలి ఘాట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్‌లో స్పీడ్ బ్రేకర్స్ వద్ద మీనీ లారీ బలంగా ఢీ కొట్టింది.

ఈ నెల 13 న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో మొగిలి ఘాట్ రోడ్డులో హైవే ప్రమాదాలు నివారణకు వేసిన స్పీడ్ బ్రేకర్స్‌పై వేగంగా వెళ్లడంతో ఈ రోజు మరో ప్రమాదం సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment