కొండపైకి సొంత వాహనాలకు నో!
ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ నియంత్రణకు దుర్గగుడి అధికారులు చర్యలు చేపట్టారు. వీఐపీలు, సొంత వాహనాలపై కొండపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓం టర్నింగ్ వద్ద పలు మార్లు ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్లపై కొండపైకి వచ్చే వారి కోసం దేవస్థానం టోల్‌గేటు వద్ద రూ. 300 టికెటు కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వారిని కొండపైకి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. భక్తులు తమ వాహనాలను కెనాల్ రోడ్డు, కమాండ్ కంట్రోల్ రూమ్ , హెడ్ వాటర్ వర్కు్స పరిసరాలలో నిలుపుకుని టోల్‌గేటుకు చేరుతున్నారు. టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌లో టికెట్లు కొనుగోలు చేసి ప్రత్యేక వాహనంపై కొండపైకి చేరుకున్నారు.
లడ్డు ఇవ్వలేదని ఫిర్యాదులు
శనివారం ఉదయం 10–30 గంటల వరకు రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించకపోవడంతో టెంపుల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవో సీసీకి చేరవేయగా, టికెట్‌తో పాటు లడ్డు అందజేయాలని సంబం«ధిత అధికారులను ఆదేశించారు.