- మృతులు తమిళనాడులోని తిరువళ్లూరువాసులు
సాక్షి, తిరుమల
తిరుమల నుండి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (47), ఆయన సతీమణి లక్ష్మీ (42) ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మంగళవారం అదే వాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 11.25 గంటలకు మార్గంలోని 35వ మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గోవిందరాజు, లక్ష్మి కింద పడి గాయపడ్డారు. దాంతోపాటు వారిపై బస్సు వేగంగా ఎక్కింది. దీంతో లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గోవిందరాజు మృతిచెందారు. మృతదేహాలను మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటన స్థలిని తిరుమల ఏఎస్‌పి త్రిమూర్తులు, ఎస్‌ఐ తులసీరామ్ సందర్శించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రైవేట్ వాహనాల తరహాలోనే వేగంగా వెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తిరుమల ఘాట్‌లో ప్రమాదం ఇద్దరి మృతి
Published Tue, Aug 16 2016 7:36 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement