Govindaraja
-
Tirupati : తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
‘నా వాదన వినండి’
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడిగా తన నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉందని.. అందువల్ల తన వాదనలు వినకుండా ఆ పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరుతూ గోవిందరాజ దీక్షితులు హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్లు దాటిన అర్చకులను టీటీడీ అధికారులు ఇటీవల పదవీ విరమణ చేయించారని, ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకుడిగా తన నియామకాన్ని సవాలు చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన నరసింహ దీక్షితులు తనపై పిటిషన్ దాఖలు చేస్తారని, అందువల్ల తన వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. -
తిరుమల ఘాట్లో ప్రమాదం ఇద్దరి మృతి
- మృతులు తమిళనాడులోని తిరువళ్లూరువాసులు సాక్షి, తిరుమల తిరుమల నుండి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (47), ఆయన సతీమణి లక్ష్మీ (42) ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మంగళవారం అదే వాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 11.25 గంటలకు మార్గంలోని 35వ మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గోవిందరాజు, లక్ష్మి కింద పడి గాయపడ్డారు. దాంతోపాటు వారిపై బస్సు వేగంగా ఎక్కింది. దీంతో లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గోవిందరాజు మృతిచెందారు. మృతదేహాలను మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటన స్థలిని తిరుమల ఏఎస్పి త్రిమూర్తులు, ఎస్ఐ తులసీరామ్ సందర్శించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రైవేట్ వాహనాల తరహాలోనే వేగంగా వెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. -
గోవిందరాజు పై పంది దాడి
ఉప్పలగుప్తం : పంది దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉప్పలగుప్తానికి చెందిన కేతా గోవిందరాజు బుధవారం గ్రామంలోని శ్మశానవాటిక వైపు కాలినడకన వెళుతుండగా, అదే ప్రాంతంలో సంచరిస్తున్న పంది అతడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన గోవిందరాజుకు స్థానికులు ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.