నల‍్లమల ఘాట్‌లో లారీ బోల్తా
Published Thu, Feb 23 2017 1:50 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
మహానంది: కర‍్నూలు జిల్లాలోని నల‍్లమల ఘాట్ రోడ్డులో ఇనుప రాడ్‌ల లోడుతో వెళుతున‍్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనతో ఈ మార‍్గంలో రాకపోకలు ఆగిపోయాయి. నంద్యాల-గిద‍్దలూరు మార‍్గంలో నల‍్లమల ఘాట్ రోడ్డులో గురువారం మధ్యాహ‍్నం లారీ బోల్తా పడింది. లారీ గుంటూరు నుంచి నంద్యాలకు వెళుతోందని తెలుస‍్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఈ ఘాట్‌రోడ్డులో రాకపోకలు ఆగిపోయాయి. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి బయలుదేరారు. లారీని పక‍్కకు తప్పించి రాకపోకలను పునరుద‍్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement