ఈ ప్రయాణం ప్రమాదకరం | The Ghat Road Becomming Terror For Motorists In Tirupati Ballary Highway | Sakshi
Sakshi News home page

ఈ ప్రయాణం ప్రమాదకరం

Published Tue, Jun 11 2019 9:37 AM | Last Updated on Tue, Jun 11 2019 9:38 AM

The Ghat Road Becomming Terror For Motorists In Tirupati Ballary Highway - Sakshi

సాక్షి, భాకరాపేట : తిరుపతి–బళ్లారి జాతీయ రహదారి మార్గంలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డు వస్తే వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఒకప్పడు తిరుపతి–బళ్లారి రహదారి మార్గం ఎన్‌హెచ్‌ 205 నుంచి ప్రస్తుతం ఎన్‌హెచ్‌ 7గా మారింది. అంటే ఈ రహదారి మార్గంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కన్యాకుమారి–వారణాసికి వెళ్లే వాహనాలు సైతం ఈ రహదారిని ఎంచుకోవడంతో మరింత రద్దీ పెరిగింది.

అందుకు తగువిధంగా జాతీయ రహదారుల శాఖ రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులు, సిగ్నల్స్, రహదారిపై రాత్రి పూట దిశను చూపించే రేడియం సిగ్నల్స్‌ అమర్చినారు. అలాగే భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ప్రమాద మలుపులు సూచికలతో సరిపెట్టారు. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గినా ..ప్రమాదం సంభవిస్తే మాత్రం ప్రాణాలు హరీ అనాల్సిందే. భాకరాపేట ఘాట్‌ రోడ్డు 10 కిలోమీటర్లు దూరం వస్తుంది. ఇందులో ప్రధాన మలుపులు 12 ఉన్నాయి. అందులో లోయలతో కూడిన మలుపులు 4 ఉన్నాయి.

ఈ నాలుగు ములుపుల వద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాపాయం తప్పదు. మృత్యుమలుపుల వద్ద ప్రమాద సూచికలు పెట్టారు. ఇవి ప్రమాదాలను ఆపలేక పోతున్నాయి. ఇక్కడ కచ్చితంగా భారీ గేజ్‌తో కూడిన రెయిలింగ్, పిట్ట గోడలు నిర్మించాలని వాహనదారులు, డ్రైవర్లు కోరుతున్నారు. నాలుగు రోజులు క్రితం జరిగిన ప్రమాదంలో లోయలో పడ్డ వాహనాన్ని బయటకు తీసుకు రావడానికి వీలుకాక ఇబ్బంది పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement