Tirupati-Bellary
-
ఈ ప్రయాణం ప్రమాదకరం
సాక్షి, భాకరాపేట : తిరుపతి–బళ్లారి జాతీయ రహదారి మార్గంలోని భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తే వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఒకప్పడు తిరుపతి–బళ్లారి రహదారి మార్గం ఎన్హెచ్ 205 నుంచి ప్రస్తుతం ఎన్హెచ్ 7గా మారింది. అంటే ఈ రహదారి మార్గంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కన్యాకుమారి–వారణాసికి వెళ్లే వాహనాలు సైతం ఈ రహదారిని ఎంచుకోవడంతో మరింత రద్దీ పెరిగింది. అందుకు తగువిధంగా జాతీయ రహదారుల శాఖ రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులు, సిగ్నల్స్, రహదారిపై రాత్రి పూట దిశను చూపించే రేడియం సిగ్నల్స్ అమర్చినారు. అలాగే భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాద మలుపులు సూచికలతో సరిపెట్టారు. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గినా ..ప్రమాదం సంభవిస్తే మాత్రం ప్రాణాలు హరీ అనాల్సిందే. భాకరాపేట ఘాట్ రోడ్డు 10 కిలోమీటర్లు దూరం వస్తుంది. ఇందులో ప్రధాన మలుపులు 12 ఉన్నాయి. అందులో లోయలతో కూడిన మలుపులు 4 ఉన్నాయి. ఈ నాలుగు ములుపుల వద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాపాయం తప్పదు. మృత్యుమలుపుల వద్ద ప్రమాద సూచికలు పెట్టారు. ఇవి ప్రమాదాలను ఆపలేక పోతున్నాయి. ఇక్కడ కచ్చితంగా భారీ గేజ్తో కూడిన రెయిలింగ్, పిట్ట గోడలు నిర్మించాలని వాహనదారులు, డ్రైవర్లు కోరుతున్నారు. నాలుగు రోజులు క్రితం జరిగిన ప్రమాదంలో లోయలో పడ్డ వాహనాన్ని బయటకు తీసుకు రావడానికి వీలుకాక ఇబ్బంది పడుతున్నారు. -
రోడెక్కిన మురుగు..కోర్టుకూ ఎక్కింది
భాకరాపేట: తిరుపతి-బళ్లారి జాతీయు రహదారిపై నిలిచిన మురుగునీటి కథ కోర్టుకు ఎక్కింది. చిన్నగొట్టిగల్లు వుండలం పరిధిలోని టీ చట్టేవారిపాళెం పంచాయుతీలో 71 జాతీయు రహదారిపై చర్చి వద్ద మురుగునీరు నిలిచిపోవడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నారుు. ఇక్కడ కొద్దిపాటి వర్షానికే భారీగా మురుగునీరు చేరడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధ భరితంగా తయారై స్థానికులకు భారంగా తయారయింది. భాకరాపేట పంచాయుతీ పరిధిలో జాతీయు రహదారులు శాఖ వుురుగునీటి కాలువ నిర్మాణపు పనులు చేపట్టింది. భాకరాపేట గ్రావుంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు వద్ద నుంచి వుురుగునీటి కాలువను తీసుకొచ్చి టీ చట్టేవారిపాళెం పంచాయుతీలోకి వదిలారు. ఈ మురుగు నీరు ప్రస్తుతం టీచట్టేవారిపాళెం రెవెన్యూ గ్రావుంలోని చర్చి ముందు నిలిచి పోయూయి. చర్చి ముందు గతంలో కల్వర్టు ఉన్నా అది వర్షపు నీరు వెళ్లడానికే గాని, మురుగునీటి కోసం కాదనడం తో వివాదం మొదలైంది. పైగా చర్చివారు కల్వర్టు ను పూడ్చేయుడంతో వ్యవహారం వుుదిరి కోర్టుకు చేరింది. పీలేరు కోర్టు చర్చివారి వాదనలు, రెవెన్యూవారి వాదనలు విన్న తరువాత కోర్టు కమిషన్ వేసింది. అయితే శనివారం కోర్టు కమీషన్ వస్తుందని వుండల రెవెన్యూ అధికారులు ఎదురు చూశారు. మధ్యాహ్నం వరకు రాక పోవడంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. కనీసం కోర్టు తీర్పుతోనైనా మురుగునీటి కష్టం తప్పుతుందేమోనని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.