ప్రకాశం జిల్లా గిద్దలూరు-నంద్యాల రహదారిలోని ఘాట్‌రోడ్డులో లారీ బోల్తా కొట్టింది.
వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా.. కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు-నంద్యాల రహదారిలోని ఘాట్‌రోడ్డులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఘాట్‌రోడ్డులోని మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో లారీ డ్రవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా.. లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి క్రేన్ సాయంతో లారీని తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.