
సాక్షి, తిరుమల: తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపైన బండ రాళ్లు పడటంతో జేసీబీ సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు.
వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి వద్ద భారీ వర్షాలకు కొండచరియలు రోడ్డుమీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జేసీబీ సాయంతో ఘాట్ రోడ్ సిబ్బంది బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
