తిరుమల: తిరుమలలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం ఉదయం రెండవ ఘాట్‌రోడ్డు లోని 14 వ కిలోమీటర్ వద్ద కొండచరియలు భారీగా కూలిపడుతున్నాయి. బండరాళ్లు, మట్టిపెళ్లలు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. టీటీడీ ఇంజినీరింగ్ సిబ్బంది 14వ కిలోమీటర్ వద్ద తొలగింపు చర్యలు చేపట్టారు.
కాగా, ఘాట్ లో ఆదివారం కూడా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. గత మంగళవారం నుంచి రోజూ ఏడో కిలోమీటరు నుంచి 16 వ కిలోమీటరు వరకు భారీగా బండరాళ్లు పడుతున్నాయి. ఏ సమయంలో ఏ రాయి కూలుతుందోనని ఇటు ప్రయాణికులు, అటు ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు.